బాహుబలి అనే పేరుతొ రాజమౌళి దర్శకత్వాన సమరయోధుడిగా అలరించటానికి సిద్దం అవుతున్నా యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ అంతకంటే ముందు పల్నాటి వీరుడిగా తెలుగు ప్రేక్షకులను పలకరించనున్నాడు. ఇంతవరకు యాక్షన్ బ్యాక్ డ్రాపే కాని ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ ను పెద్దగా పట్టించుకోని ఈ కుర్ర రెబెల్ తొలిసారి తన అభిమానులకు పల్నాటి పౌరుషాన్ని రుచి చూపించనున్నాడు.
వచ్చే నెల విడుదలకు రెడీ అయిన 'మిర్చి' లో ప్రభాస్ పల్నాటి బాలచంద్రుడి తరహా వీరత్వాన్ని ప్రదర్శించి ప్రేక్షకులను అలరించనున్నాడని సమాచారం. వివరాలు స్పష్టంగా లేవుకాని అందుతున్న సంకేతాల ప్రకారం మిర్చి కధ పల్నాడు నేపద్యంలో నడుస్తుందని.. అందులో భాగంగా వచ్చే యాక్షన్ సన్నివేశాలలో ప్రభాస్ రెచ్చిపోయడని తెలుస్తుంది. క్లాసు, మాసు ఛాయలతో మిళితమై పసందుగా రూపొందిన 2 ఇన్ 1 పాత్రలో... గుంటూరు 'మిర్చి' మాదిరిగా ప్రభాస్ ఘటెక్కిస్తాడని సినిమా రూపకర్తలు గొప్పగా చెబుతున్నారు. దీనికి తోడూ దేవి అందించిన పాటలు అప్పుడే సినిమాకు కావలసినంత కాకను తీసుకొచ్చాయి. ఇక సినిమా ఎలా ఉంటుంది అనేది ఫిబ్రవరి 7 న తేలనుంది.

No comments:
Post a Comment