నాయక్ కు సంబంధించి సూపర్ హిట్ టాక్ దావానంలా వ్యాపిస్తుంది. ఈ రోజు సాయంత్రం రామ్ చరణ్ కుటుంబసభ్యుల కోసం ప్రత్యేకంగా ఒక షో ప్రదర్శించారు. ఆ షో ను చూసిన కొందరు వ్యక్తులు చెబుతున్నా సమాచారం ప్రకారం నాయక్ ఈ సంక్రాంతి పండక్కి రుచికరమైన మాస్ మసాలా నాన్ వెజ్ ఫుల్ మీల్స్ అని తెలుస్తుంది.
సెన్సార్ తరవాత కూడా ఈ సినిమాకు సంబంధించి ఇదే టాక్ వినిపించింది. ఇలా మాంచి టాక్ సంపాయించుకున్నా నాయక్ రేపు రాష్ట్ర వ్యాప్తంగా రచ్చ చేయటం ఖాయం అన్నట్టుగానే తోస్తుంది. చరణ్ డాన్సులు, ఫైటులే సినిమాకు ప్రధాన ఆకర్షణగా చెబుతున్నారు. లైలా ఓ లైలా , హే...నాయక్ పాటల్లో చెర్రి డాన్సులు చితక్కోట్టేశాడాంటా..! ఫైట్స్ విషయానికి వస్తే ఇంటర్వెల్ బాంగ్ లోనూ.. క్లైమాక్స్ సహా రెండో సగంలో కొన్ని చోట్ల చెర్రి చేసిన విన్యాసాలు అదిరిపోయయంటా...!
ఆకలి మీద ఉన్న వినాయక్ వినోదమే ప్రధానంగా తన మార్క్ డైరెక్షన్ తో మాస్ సినిమాలా ఫార్ములా ప్రకారం ఆద్యంతం అలారించేలా నాయక్ ను తెరకెక్కించి ఫామ్ లోకి వచ్చాడంటా. వినాయక్ కు చోటా , గౌతంరాజు, తమన్ మంచి సహకారాన్ని అందించరని తెలుస్తుంది. కాజల్, అమల పాల్ కూడా కొత్తగా కనిపించారంటా.
చరణ్ కాకుండా సినిమాకు మరో హైలైట్ కామెడీగా చెబుతున్నారు. ఫస్ట్ హాఫ్ లో బ్రమ్మి, జె పి , యం యస్ చేసిన కామెడీ వీపరీతంగా నవ్విస్తుందంటా. ఫార్ములా ప్రకారం చూసుకుంటే పాటలు , ఫైటులు , కామెడీ సమపాళ్ళలో సూపర్ హిట్ సినిమాకు కావల్సినవిధంగానే ఉన్నట్టు అనిపిస్తున్నాయికానీ మొదటి టాక్ తప్పకుండా అభిమానుల నుండే ఉంటుంది కాబట్టి 100% నమ్మటానికి వీలు లేదు. అసలు సినిమాలో ఉన్నా సత్తా ఏమిటి అనేది రేపు ఉదయానికి తేలనుంది. అప్పటి వరకు ఆసక్తిని అపుకోవాల్సిందే తప్పదు.
.jpg)
No comments:
Post a Comment