Pages

Ads 468x60px

Text Widget

Recent Posts

Definition List

Download

Monday, January 7, 2013

బృందావనంలా అనిపిస్తున్నా మిర్చి



ఆడియో వేడుక తరవాత మిర్చి ఎలా ఉండబోతుంది అన్నా విషయం ఫై ఒక క్లారిటి దాదాపు వచ్చేసినట్టే...! సినిమాలో ప్రభాస్ పాత్ర ఎలా ఉంటుంది... మిగత పాత్రలు ఎలా ఉండొచ్చు అన్నా విషయం ఫై పాటల ప్రోమోస్ దియేటరికల్ ట్రైలర్ లో ఉన్న మేటర్ ను బట్టి వచ్చిన  స్పష్టమైన అంచన కొన్ని అనుమానాలకు తావిస్తుంది.

ట్రైలర్ లో  హీరో ఒక ఫ్రేం లో పోష్ గా కనిపిస్తూ జోష్ క్రియేట్ చేస్తుంటే, మరో ఫ్రేం లో విలేజ్ ను బ్యాక్ డ్రాప్ గా చేసుకుని హీరోయిన్ లతో సరసాలడుతూ.. విలన్లను తుక్కు రేగ్గోడుతున్నాడు. మొత్తంగా విటన్నిటిని కాలేసి చూస్తుంటే... అక్కడక్కడ యన్ టి అర్  'బృందావనం' చాయలు చూచాయగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా విలన్లు రియాక్ట్ అవుతున్నా విధానం, హీరోయిన్ ను ప్రభాస్ ఓదార్చే పద్దతి, చివర్లో ప్రభాస్ చెప్పిన పంచ్ డైలాగ్ కూడా బృందావనం లో యన్ టి అర్ ఏ పరిస్థితిలో 'రచ్చ..రచ్చ..' డైలాగ్ చెబుతాడో... అలాంటి వాతావరణలోనే చెప్పినట్టు అనిపిస్తుంది. ఇవి జస్ట్ పోలికలు మాత్రమే...! అసలు సంగతి ఏమిటనేది సినిమా విడుదల తరవాతే తెలుస్తుంది. 

కాని ఈ అనుమానానికి బలం చేకూర్చే విషయం ఏమిటంటే... మిర్చి దర్శకుడు శివకు మాటల రచయతగా మంచి పేరు తెచ్చిన చిత్రం బృందావనం. అందుకని ఆ సినిమా ఫై అతనికి వల్లమాలిని ప్రేమ ఉండటం సహజమే. దాంతో అతనికి తెలియకుండానే బృందావనం నుండి స్పూర్తి పొంది మిర్చి తాయారు చేసి ఉండొచ్చు... అని సందేహ పడటంలో అర్ధం ఉంటుంది. అలానే కనుక జరిగి ఉంటే మిర్చిని బృందావనం పార్ట్ 2 అనుకోవచ్చు.   

No comments:

Post a Comment