పవిత్ర అని పేరుపెట్టుకుని పరమ పవిత్రంగా జనాలను రెచ్చగొడుతూ మహాజనానికి మరదలు పిల్లగా మనల్ని అలరించటానికి శ్రేయ సిద్దం అవుతుందని ఇంతకు మునుపే చెప్పుకున్నాం. ఈ వార్త తెలుసుకుని కుర్రోళ్ళు, కుర్ర మనసున్నా పెద్దోళ్ళు శ్రేయ బోల్డ్ తత్వాన్ని గుర్తుకు తెచ్చుకుని సినిమా మీద బోల్డన్ని ఆశలు పెట్టుకున్నారు. అలా ఆశపడ్డ బావలందరిని మరదలు పిల్ల అలరించే సమయం దగ్గర పడిందని కొన్ని సంకేతాలు తెలియజేస్తున్నాయి.
అందుకు మొదలుగా పవిత్ర సినిమాకు సంబందించిన తోలి చూపు ప్రచార చిత్రం ఈ రోజు మీడియాకు విడుదలై కుర్ర హృదయాలలో కలకలానికి కారణమైంది. కలర్ ఫుల్ గా కనిపిస్తున్నాఈ పోస్టర్ లో శ్రేయ కైపెక్కించేలా చూస్తూ కట్టిపడేస్తుంది. కొద్దిగా గతంలో కరీనాకపూర్ ప్రధాన పాత్ర పోషించగా హిందీలో వచ్చిన 'చామేలి' ని గుర్తుకు తెస్తున్నప్పటికి... కరీనా లో కనిపించని ప్రత్యేకతేదో.. ఇక్కడ శ్రేయలో కనిపిస్తుంది. అలానే 'ఎ బోల్డ్ అండ్ గోల్డ్ ఫిలిం' అనే కొటేషన్ ను పోస్టర్ కు చేర్చి విశాల హృదయులను, కళాత్మక సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులను కంబైండ్ గా కట్టి పడేశాడు దర్శకుడు జనార్ధన మహర్షి. మొత్తానికి తోలి చూపులో కళ్ళు కుట్టేలా ఆకర్షిస్తున్నా ఈ మరదలు పిల్ల తెర ఫై కి వచ్చాక జనాలను మెప్పిస్తుందో లేక అవార్డులకే పరిమితం అవుతుందో వేచి చూడాలి...!

No comments:
Post a Comment