కింగ్ నాగార్జున నటప్రస్థానాన్ని మొదలు పెట్టిన తరవాత 89 వ చిత్రం వరకు ఎటువంటి అననుకూల పరిస్థితులు ఎదుర్కోలేదు. కాని చినబాబు చైతుకు మాత్రం 6 వ చిత్రానికే చేదు అనుభవం ఎదురవటం ఒకింత అక్కినేని అభిమానులను నిరాశపరుస్తుంది. సినిమా షూటింగ్ దశలో ఆగిపోవటమో ... లేక విడుదల విషయంలో గందరగోళం వంటి పొరపాట్లు తాతగారి హయంలో జరిగుంటాయిగాని... నాన్నగారి జాగ్రత్త, ప్లానింగ్ కారణంగా డమరుకం వరకు ఎలాంటి ఇబ్బందులు కలగలేదు. కెరిర్ తోలి దశలోనే ఎదురైనా ఈ ఆటోనగర్ సూర్య (షూటింగ్ చివరి దశలో నిలిచిపోయిన) అనుభవం చైతుకు భవిష్యత్తులో బాగా ఉపయోగపడుతుంది అని శ్రేయోభిలాషులు అభిప్రాయపడుతున్నారు. మరో పక్క సమస్యకు సంబంధించి ఎవరి కోణంలో వాళ్ళు విశ్లేషణలు, వివరణలు ఇస్తున్నారు కాని సినిమా భవిష్యత్తు గురించి మాత్రం ఎవరు నోరు మెదపటం లేదు.
నాగచైతన్య పుట్టిన రోజు తరవాత ఆటోనగర్ సూర్య గురించి మాట్లాడుకోవటమే మానేశారు జనాలు. ఇప్పుడు ఆ సినిమా దర్శకుడు దేవా కట్టా కొంత ఉత్సాహాన్ని తెచ్చుకుని సినిమా పరిస్థితిని వివరించాడు. సినిమా ఆగిపోవటంతో తదుపరి చిత్రాన్ని నాని తో ప్రారంభిస్తున్నాడు అన్న వార్తకు స్పందిస్తూ ఆటోనగర్ సూర్య భవితవ్యం నిర్మాతల చేతిలోనే ఉందని చెప్పుకొచ్చాడు దేవా. రెండు పాటల చిత్రీకరణ, బ్యాక్ స్కోర్ మినహ సినిమా పూర్తయిందని.. నిర్మాతలు ఎప్పుడు రెడీ అంటే అప్పుడు అవి పూర్తవుతాయని వివరణ ఇచ్చాడు. బ్యాక్ స్కోర్ వరకు పర్వాలేదు కాని పాటలంటేనే బెంగ..! ఎందుకంటే ఈ సినిమాలో హీరోయిన్ సూపర్ బిజీ సమంతా .. ఆవిడా డేట్స్ సెట్ అవటం అంత తొందరగా తెమిలే విషయం కాదు. ఇలా అన్ని చూసుకుంటుంటే సినిమా ఈ వేసవికి కూడా రావటంలేదనే అర్ధంఅవుతుంది. నాగచైతన్య కూడా ఈ విషయాన్నే అర్ధం చేసుకుని ఎంచక్కా 'తడాఖ' , హలో బ్రదర్ రిమేక్ ల ఫై దృష్టి పెట్టాడు.
డమరుకం సినిమా కష్టాల నుండి బయటపడటానికి ఆ పరమేశ్వరుణ్ణి నమ్ముకుని ఎలాగో ఏరు దాటేశారు. ఇప్పుడు విజయవాడ నేపద్యంలో రూపొందిన ఆటోనగర్ సూర్య కోసం ఆ బెజవాడ దుర్గమ్మను వేడుకుంటే ఎమన్నా ఫలితం ఉంటుందేమో... నిర్మాతలు ప్రయత్నిస్తే బాగుంటుందని కొందరు మంచి మనసున్నోళ్ళు అభిప్రాయపడుతున్నారు.

No comments:
Post a Comment