Pages

Ads 468x60px

Text Widget

Recent Posts

Definition List

Download

Sunday, January 6, 2013

'పంజా' బాబు కొత్త సినిమా


'కర్మ' చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయి.. పవన్ కళ్యాణ్ పంజా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు విలక్షణ నటుడిగా తన ఉనికిని చాటిన అడివి శేష్ 'కిస్' అనే సినిమాతో మరోసారి తెలుగు తెరపై మెరవనున్నాడు. నటన ఫైనే కాకుండా దర్శకత్వం ఫై కూడా పట్టు సాదించిన శేష్ స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. 'కర్మ' చిత్రంతో థ్రిల్లర్ అనుభూతిని పంచిన శేష్ ఈ 'కిస్' చిత్రంలో రొమాంటిక్ కామెడీ ని రుచి చూపించనున్నాడు.

ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నా ఈ సినిమా అమెరికాలో చిత్రీకరణ జరుపుకుంటుంది. ప్రియ బెనర్జీ అనే కెనడాలో పుట్టిన బెంగాలీ అమ్మాయిని ఈ చిత్రంతో హీరోయిన్ గా పరిచయం చేస్తున్నాడు శేష్. ఈవిడకు అందాల పోటిలలో పాల్గొని మిస్ కెనడా టైటిల్ ను దక్కించుకున్న ఘనత కూడా ఉంది. ఇక పొతే ఈ సినిమాకు కిస్ అని ఎందుకు పేరు పెట్టటం జరిగిందంటే... కధ ప్రకారం హీరో,హీరోయిన్ లా ప్రేమ ఓ అందమైన ముద్దుతో మొదలవుతుందంటా అందుకు...! ఇప్పటికి ఇవి ఈ సినిమాకు సంబందించిన విశేషాలు... మరింత సమాచారం త్వరలోనే వెల్లడి కానుంది.         



No comments:

Post a Comment