దేశ రాజధాని ఢిల్లీ లో సభ్య సమాజం సిగ్గుపడేలా నిర్భయ అనే ఆబాల ఫై జరిగిన అమనవియ్య దుశ్చర్యను దేశం మొత్తం ఏకతాటి ఫై కొచ్చి ముక్త కంఠం తో ఖండించింది. కానీ చాల వరకు ఆ ఖండనలలో ఆవేశం శాతమే ఎక్కువ కనిపించింది. ఎందుకంటే అందరు తక్షణ పరిష్కారాన్ని కోరుకుంటున్నారు. కానీ తక్షణ పరిష్కారం వ్యక్తిని శిక్షిస్తుంది కాని సమస్యను కాదు. సమస్యను నిర్ములించాలంటే ముందు మూలాలు వెదకాలి... అప్పుడే సమస్యను శాశ్వతంగా నిర్ములించగలం. సమస్య మూలాలను వెదికి సరిదిద్దే భాద్యత సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరి ఫైన ఉంది. ఈ కోణంలో ఆలోచిస్తూ అతి తక్కువ మంది తమ నిరసనలను తెలియజేశారు. ఆ కొద్ది మందిలో నటుడు సుబ్బరాజు ఉండటం ముదావాహం.
సుబ్బరాజు ఆ సంఘటన ఫై స్పందిస్తూ తన అభిప్రాయాన్ని చాలా చక్కగా వివరించాడు. నిజంగా మనందరికీ మనం నివసించే సమాజం బాగుండాలంటే అందరు చిత్తశుద్దితో చేయవలసిన పనులను ఎత్తి చూపాడు. సాక్షి పేపర్ వేదికగా సుబ్బరాజు స్పందించిన విధానం ఆలోచింప చేసేదిగా ఉంది. అతను చెప్పిన మాటలను చదివిన తరవాత 'సుబ్బరాజు.. బాగా చెప్పావ్..! ' అని అనకుండా ఉండలేం.! ట్రై చేయండి.

No comments:
Post a Comment