కామెడీ బాయ్ గా మొదలు పెట్టి హీరోగా మారి కండల వీరుడిగా అవతారం ఎత్తిన సునీల్ ఇప్పుడు ప్లే బాయ్ అనిపించుకునే పనిలోపడ్డాడు. సినిమా సినిమాకి ఒక కొత్త విషయాన్నీ తనలో సృష్టించుకుంటూ పూర్తీ స్థాయి హీరోగా మారటానికి అంచలంచలా పరిణామా క్రమాన్ని కొనసాగిస్తున్నా సునీల్... మిస్టర్ పెళ్ళికొడుకు చిత్రంలో తనలో ఉన్న ప్లే బాయ్ లక్షణాలను ప్రదర్శించి లేడి ఫ్యాన్ బేస్ ను పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాడు.
సునీల్ కొత్త ప్రయత్నం ఎంత వరకు సఫలం అవుతుందో తెలియదు కాని ఈ ఫోటోలో చొక్కా లేకుండా బీచ్ సైడ్ నడుస్తూ బాలీవుడ్ హీరోలను తలపించేలా కనిపిస్తూ మిస్టర్ పెళ్ళికొడుకు సినిమాకు మాత్రం బోల్డంత ప్రచారాన్ని తీసుకువస్తున్నాడు. పూలరంగడు సినిమాకు ముందు సునీల్ సిక్స్ ప్యాక్ బాడీ గురించి ఎలా మాట్లాడుకున్నారో...అలానే ఈ కొత్త అవతారం గురించి కూడా ఫిలిం నగర్ లో వేడి వేడి చర్చలు జరుగుతున్నాయి. ఫైకి చెప్పుకోవటం లేదు కాని.. మాస్ ఇమేజ్ ముద్ర ఎటూ ఉంది, ఇక లవర్ బాయ్ వయసు దాటిపోయింది కాబట్టి తెలివిగా రొమాంటిక్ బాయ్ గా పాపులారిటి సంపాయించుకుంటే తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర కధానాయకుడిగా వెలిగిపోవచ్చానే ఉబలాటమే కనిపిస్తుంది సునీల్ విశ్రాంతి లేకుండా కష్టపడటం చూస్తుంటే...! ఇదే ఫ్లో తో ఈ భీమవరం బుల్లోడి ఎవ్వరం ముదురుతా పొతే త్వరలోనే మిగత టాలీవుడ్ హీరోలకు కంటి మీద కునుకు లేకుండా పోవటం ఖాయం.

No comments:
Post a Comment