Pages

Ads 468x60px

Text Widget

Recent Posts

Definition List

Download

Monday, January 28, 2013

జబర్దస్త్ నాటుగాడిగా సిద్దార్ధ


పరబాషపరుడైనా లవర్ బాయ్ గా తెలుగు ప్రేక్షకుల ఆమోదం పొంది టాలీవుడ్ లో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరుచుకున్నా తమిళ తంబి సిద్దార్ధ, మాస్ హీరో అనిపించుకోవాలని ఒకటిరెండు ప్రయత్నాలు చేశాడుకాని సఫలం కాలేదు. తన బాడీ లాంగ్వేజ్ కు అవారా, పోకిరి, ఇడియట్ వంటి లక్షణాలు తెచ్చిపెట్టుకున్నట్టు ఉంటాయి కాబట్టి ఒకే మాటా ఫై నిలబడి తెలుగు ఆడియన్స్ సిద్ధూను మాస్ హీరోగా తిరస్కరించారు. దాంతో సిద్దు కూడా లైట్ తీసుకుని రొమాంటిక్ సినిమాలే చేసుకుంటూ వస్తున్నాడు. కానీ ఇప్పుడు నందిని రెడ్డి పుణ్యమా అని మాస్ హీరో అనిపించుకునే అవకాశం సిద్దార్థ కు మళ్లీ వచ్చినట్టు కనిపిస్తుంది.

కొన్ని గంటల ముందే బయటకు వచ్చిన సిద్దూ కొత్త సినిమా జబర్దస్త్ పోస్టర్స్, స్టిల్స్ లో అతను నాటు నారాయణలా కనిపిస్తున్నాడు. వెరైటి గెట్ అప్స్ తో తనలోని మాస్ కళకు సాద్యమైనంత గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేశాడని ఆ సినిమా ఫోటోలు సాక్షం చెబుతున్నాయి. అలానే టీజర్ అందిస్తున్న సమాచారం ప్రకారం ఒక్క పాటలోనే సిద్దు ఇలా కనిపిస్తాడేమో అనిపిస్తుంది. కాకపోతే అది హీరో ఇంట్రడక్షన్ సాంగ్ మాదిరిగా ఉంది... అంటే హీరో క్యారక్టర్ లో మాస్ జీన్స్ ఉన్నట్టే..! కాని ఈ సినిమా డైరెక్టర్ నందిని రొమాంటిక్ కామెడీలా స్పెషలిస్ట్ కదా.. మాస్ లా చూపిస్తూనే కామెడీ చేపించే అవకాశాలే ఎక్కువ. దీనిని బట్టి సిద్ధూ ఈ సినిమాలో  మాస్ కామెడిని జబర్దస్త్ గా పండించబోతున్నాడని అర్ధం చేసుకోవచ్చు. 

జబర్దస్త్ పాటలు  నిన్న ఏ విధమైన ఆడియో వేడుక జరుపుకోకుండానే కొన్ని టీవీ చానల్స్ సాక్షిగా మార్కెట్ లోకి విడుదల అయ్యాయి. తమన్ స్వరపరిచిన పాటలు క్యాచిగా ఉన్నాయి. సినిమా ఫిబ్రవరి రెండో సగంలో విడుదలయ్యే అవకాశం ఉంది.         


No comments:

Post a Comment