Pages

Ads 468x60px

Text Widget

Recent Posts

Definition List

Download

Saturday, January 5, 2013

నాయక్ ను కాపాడే ప్రయత్నంలో చిరు


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజా సంచలనం 'నాయక్'  మెగాస్టార్ నుండి ప్రశంశ పూర్వక మన్ననలు  దక్కించుకుంది. ఇదే ఈ సినిమాకు సంబంధించి ఫైనల్ స్టాంపింగ్ అనుకోవచ్చు. కాకపోతే ఈ విషయంలోనే ఓ ఆసక్తి కరమైన విషయం దాగుంది. అదేమంటే సెన్సార్  కార్యక్రమాలు పూర్తీ చేసుకుని 'ఎ' రేటింగ్ దక్కించుకున్నాడు నాయక్. అంటే సినిమాలో వయలెన్స్ కానివ్వండి.. వల్గారిటీ కానివ్వండి పరిమితికి మించి ఉన్నట్టే లెఖ్ఖ..! దాంతో ఈ సినిమా మాస్ ప్రేక్షకుల ఫ్రెండ్లీ అని ఇట్టే  అర్ధం అవుతుంది. ఈ విషయం తెలిసి మాస్ అభిమానులు ఆనందపడొచ్చు... కాని దీని ప్రభావం మిగత వర్గాలఫై పడకుండా చిరంజీవి చేసిన ప్రశంశల సహాయం తీసుకున్నారు నాయక్ రూపకర్తలు.

ఈ సినిమా  ఫై 'పెద్దలకు మాత్రమే' అనే ముద్ర పడకుండా  చాలా తెలివిగా నాయక్ గురించి చిరంజీవి స్పందించిన బైట్స్ జోడించి కొత్త ట్రైలర్ ను బయటకు వదిలారు. ఆ ట్రైలర్ వేదికగా సినిమాలో చరణ్ డాన్సెస్ గురించి, కామెడీ గురించి, మిగత అన్నిరకాల ఎమోషన్స్ గురించి చిరు ఎంత కమ్మగా చెప్పారంటే... జనవరి 9 రేపైతే బాగుండు అన్నంత ఉత్సాహం మనలో కలిగేంత బాగా ఊరించారు. ఇకపోతే చిరు గారి పుత్రవాత్సల్యమే కాకుండా సినిమాకు పనిచేసిన అన్ని విభాగాల నుండి సానుకూల స్పందననే దక్కించుకుంటున్నాడు నాయక్. పాటలు కూడా అంచనాలకు అనుగుణంగా సందడి చేస్తున్నాయి. ఇలా అన్నీ మంచి శాకునలతో భారి అంచనాలతో విడుదలకు సిద్దం అవుతున్నా నాయక్  కు 'ఎ' రేటింగ్ మచ్చగా మిగిలి పోకూడదని దర్శకనిర్మాతలు చిరును ప్రచారంలో భాగం చేయటం తెలివిగల పనే అనిపించుకుంటుంది.            


నాయక్ ఫై చిరు స్పందనను కింద వీడియో లో చూడండి.... 


No comments:

Post a Comment