స్క్రీన్ ఫై అలుపెరగని హుషారు తో కనిపించే కుర్ర హీరో రామ్ కు మాత్రమే సొంతమైన కొలతలకందని ఎనర్జీ ఇప్పుడు టాక్ అఫ్ ది ఇండస్ట్రీ...! పొగరు, రోషం, అహంకారం వంటి విటమిన్స్ ఎంత ఎక్కువగా ఉంటే ఎనర్జీ అంత ఎక్కువగా ఉంటుందనేది ఒక నానుడు. దేవదాసు సినిమాలోనూ.. తరవాత అటువంటి లక్షణాలు కొన్ని రామ్ కనిపించాయి కూడా. కాని 'రెడీ' ఘన విజయం.. హీరోగా నిలబడాలంటే కావాల్సిన క్వాలిటిస్ ను అనుభవపూర్వకంగా అబ్బాయిగారికి నేర్పించినట్టుంది. ఫలితం పొగరు వగైరాలతో కూడిన ఎనర్జిని స్కీన్ వరుకే పరిమితం చేసి సహనం సహా మంచి లక్షణాలను రియల్ లైఫ్ లో అలవాటు చేసుకుని బాలన్సుడ్ గా కెరీర్ ను ముందుకురికిస్తున్నాడు ఈ చిచ్చర పిడుగు.
కధ ప్రకారం, పాత్రకనుగుణంగా సినిమాలలో కొన్ని వెదవ్వేషాలు వెయ్యాల్సి వస్తుంది. వాటిని చూసి ఎంజాయ్ చెయ్యండి అంతేకాని బయట అనుకరించవద్దు అని ఆకట్టుకునేలా చెబుతూ తనను ఫాలో అయ్యే యువత దారి తప్పి తనకు చెడ్డ పేరు తెప్పించకుండా జాగ్రత్తపడుతున్నాడు ఈ శక్తి మాన్. తాజాగా ఒంగోలు గిత్త సినిమాలో స్టైల్ గా సిగరెట్ తాగుతున్న తన ఫోటోను చూపించి 'సిగిరెట్ తాగేది పాత్ర కోసం.. దానిని మీకు అంటగట్టి కాన్సర్ తెప్పించటానికి కాదు' అని వెరైటిగా పంచ్ పేల్చి.. సున్నితంగా మెసేజ్ ను పాస్ చేశాడు. ఇలా అవకాశం మేర భాద్యత గల వ్యక్తిగా వ్యవహరిస్తూ ఆన్ స్క్రీనే కాదు ఆఫ్ స్క్రీన్ లో కూడా అభిమానులను సంపాయించుకుంటూ తన సెలబ్రిటీ హోదా స్థాయిని పెంచుకుంటున్నాడు రామ్.

No comments:
Post a Comment