Pages

Ads 468x60px

Text Widget

Recent Posts

Definition List

Download

Thursday, January 3, 2013

రవితేజ పాత వేషానికి పది సినిమాలు..!


 సినిమాలలోకొచ్చిన కొత్తలో మీడియంగా పెంచుకున్న గడ్డంతోనే కనిపిస్తూవచ్చిన రవితేజ హీరోగా మారిన తరవాతే షేవ్ చేసుకుని కనపడటం మొదలు పెట్టాడు. ఇడియట్ తోనే హిరో నుండి స్టార్ గా రూపుదాల్చినప్పటికి అడపాదడప గడ్డంతో కనిపించేవాడు. కానీ 2008 లో 'కిక్' సక్సెస్ తరవాత ఇప్పటివరకు రవి పది సినిమాలకు ఫైనే చేసినప్పటికీ ఏ  సినిమాలో కూడా గడ్డంతో కనిపించలేదు. అదేం చిత్రమో ఆ పది సినిమాలలో ఒక్క 'మిరపకాయ్' మినహా మిగత సినిమాలన్నీ రవితేజ స్టార్ హోదాను ప్రశ్నించినవే..! మరీ 'వీర' మొదలుకుని నిన్నటి 'సారోచ్చారు' వరకు లేటెస్ట్ గా చెప్పుకునే ఐదు సినిమాలైతే డిజాస్టర్ కు ఎక్కువగాను,  ఏవరేజ్ కు తక్కువగాను నడిచి ఏకంగా మాస్ మహారాజ కెరీర్ కే ఎసరు తెచ్చే పరిస్థితి కల్పించాయి. 

ఇలాంటి పరిస్థితిలో తన అండదండలతో దర్శకుడిగా అవకాశం దక్కించుకున్న 'డాన్ శీను' ఫేం గోపిని పెట్టుకుని రవితేజ మార్క్  'బలుపు'ను బాక్స్ ఆఫీసుకు చూపించటానికి సిద్దం అయ్యాడు రవి. టైటిల్ కు తగ్గట్టే తానూ కూడా ఊరా మాస్ అవతారంలో కనిపించటానికి మళ్లీ గడ్డంతో ప్రత్యక్షం అయ్యాడు. చివరిసారి 'నేనింతే' సినిమాలో గడ్డంతో కనిపించిన రవి పది సినిమాల తరవాత బలుపు కోసం గడ్డం పెంచాటన్ని రవితేజ సెంటిమెంట్ గా కొందరు భావిస్తుంటే... మరికొందరు ఈ గెటప్ సినిమాలో రవి ఓ రేంజ్ నాటుగాడిగా కనిపించనున్నాడు అన్నా విషయానికి సంకేతంగా భావిస్తున్నారు. ఈ భావనలలో కొంత సత్యం ఉన్నప్పటికీ అసలు నిజాలు తేలేది విడుదల తరవాత తెర మీదే..! అప్పటి వరకు ఎవరి ఇష్టానికి వాళ్ళు ఊహించుకోవచ్చు...!                       

No comments:

Post a Comment