సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఇచ్చిన కిక్ నుండి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాడు మహేష్. సినిమా తోలి వారం వసూళ్ళు ముఖ్యంగా అమెరిక కలక్షన్లు చూసి.. చేసిన సాహసం సఫలం అయ్యిందని సంతోషపడి ఆనందపారవశ్యంలో మునిగితేలుతున్నా మహేష్ రెండో వారం ముగియగానే.. వాస్తవాన్ని గ్రహించి ఒక్కసారే మేల్కొని సీతమ్మను ఒడ్దేక్కించే పనిలో పడ్డాడు.
వెంకటేష్, మహేష్ కలిసి నటిస్తే ఎలా ఉంటుందో చూడాలన్న ఆత్రుతతో మొదటి వారం విరగబడ్డ జనాలను చూసుకుని మినిమంలో మినిమంగా దూకుడు రేంజ్ ను ఊహించుకున్నా సీతమ్మ రూపకర్తలు ప్రచారాన్ని పెద్దగా పట్టించుకోకుండా సక్సెస్ పండగలు జరుపుకున్నారు. చివరికి టీవీ ప్రచారాన్ని కూడా రెడ్ లేబెల్, మ్యాజిక్ వంటి కార్పోరేట్ కంపెనీలకు కట్ట బెట్టి చేతులు దులుపుకున్నారు. యూనిట్ నుండి సినిమాకు పెద్దోడిగా భాద్యత తీసుకుని వెంకటేష్, ఆయనకు తోడుగా అంజలి మొదట్లో ఇంటర్వ్యూ లు అవ్వి ఇస్తా కొద్దిగా ప్రచారం చేశారు కాని మహేష్ మాత్రం విజయవాడలో అనుకోకుండా జరిగిన ప్రెస్ మీట్ మినహా సినిమా ప్రచారంలో పెద్దగా పాలుపంచుకోలేదు. దిల్ రాజు కూడా జనాల స్పందనను చూసి పెద్ద రేంజ్ పబ్లిసిటీ అవసరం లేదని నిర్ణయించుకున్నాడు.
కాని మూడో వారానికి వచ్చేప్పటికి పరిస్థితి తలక్రిందులైంది. మొదటి పది రోజులు ఫ్యామిలీ ఆడియన్స్ తో కిట కిటలాడినా దియేటర్లు ఇప్పుడు ప్రేక్షకులు రాక బోసి పోతున్నాయి. దీనికి ప్రధాన కారణం సినిమా లో మళ్లీ మళ్లీ చూడాలనిపించే అంశాలు లేకపోవటమే..! ఈ విషమస్థితిని ఆలస్యంగా గుర్తుపట్టిన చిత్ర యూనిట్ భ్రమలను విడిచిపెట్టి నష్టాల నుండి బయటపడటానికి హడావిడి ప్రయత్నాలు మొదలు పెట్టింది. అందుకు అత్యవసర చర్యగా మహేష్ బాబు ను రంగంలోకి దించారు. విజయంతో సంబంధం లేకుండా మంచి సినిమాలో నటించాను అన్న సంతృప్తిని మనస్పూర్తిగా ఎంజాయ్ చేస్తున్నా మహేష్ కూడా ప్రమాద తీవ్రతను గ్రహించి సినిమాను రక్షించటానికి పూనుకున్నాడు. అందులో భాగంగా ఇంటర్వ్యూ లా మీద ఇంటర్వ్యూ లు ఇచ్చేసి గత నాలుగు రోజులుగా మార్చి , మార్చి ఏదో ఒక టీవీ లో కనిపిస్తూనే ఉన్నాడు. కాకపోతే ఈ ప్రయత్నం పెద్దగా ఫలించినట్టు కనిపించటంలేదు. రాష్ట్రవ్యాప్తంగా ఈ వారం సినిమాకు వస్తున్నా కలక్షన్లను చూస్తుంటే.. ఈ సీతమ్మ కుటుంబ సభ్యులు చేతులు కాలాకా ఆకులు పట్టుకుంటున్నారేమో అనిపిస్తుంది.
పోటి తీవ్రతను ముందుగానే గుర్తుపట్టి పద్దతిగా మోతాదుకు మించి ప్రచారం చేసుకుని యుక్తితో సినిమాను లాభాలా బాట పట్టించారు నాయక్ రూపకర్తలు. వ్యాపార తెలివితేటల కంటే సెంటిమెంట్ కే ప్రాధాన్యత ఇచ్చిన దిల్ రాజు అండ్ కో అనూహ్యంగా సంకట పరిస్థితిని ఎదుర్కుంటున్నారు. కాకపోతే ఇదంతా పైకి కనిపించేదే... దిల్ రాజు వ్యాపార చతురత సినిమాకు లాభాలు తెప్పించలేకపోవచ్చు కాని నష్టాలను మాత్రం రానివ్వదు అని, అలానే మహేష్ బాబు లేట్ అండ్ లేటెస్ట్ ఇంటర్వ్యూ లు కూడా దిల్ రాజు వ్యూహంలో భాగమే అని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

No comments:
Post a Comment