నాయక్ సినిమా చూసిన తరవాత ఠాగూర్ సినిమాను వి వి వినాయక్ రూపొందించాడు అన్నా పెద్ద పోలిక మిహన మరే విషయం మనకు ఠాగూర్ ను జ్ఞప్తికితేదు. నిజంగా పోల్చాలి అనుకుంటే సింహాద్రి, కృష్ణ,శివాజీ (పోసాని చాక్లెట్ ఎపిసోడ్ శివాజీలో ఆఫీసు రూమ్ ను తలపిస్తుంది.) వగైరా చిత్రాలు గుర్తుకొస్తాయి కాని ఠాగూర్ ఎక్కడ తగిలినట్టు అనిపించదు. కాని చిత్రంగా నాయక్ రూపకర్తలు ఆ సినిమాను ఠాగూర్ తో పోలుస్తూ ఒక ట్రైలర్ బయటకు వదిలారు. పెద్దగా పట్టించుకోనవసరంలేని విషయాలను పోలుస్తూ ఆ ట్రైలర్ ను తక్కువ చేస్తున్నారు కాని అసలు పట్టించుకోవాల్సిన విషయాన్నీ గుర్తించటంలేదని విచారం వ్యక్తం చేస్తున్నారు కొందరు మేధావులు.
ఠాగూర్ లో హీరో లంచగొండితనం ఫై పెద్ద విప్లవమే చేస్తాడు. కానీ నాయక్ కు సంబంధించి 'రౌడియిజాన్ని రూపుమాపాలి.. మనం ఒకరికి సాయం చేస్తే వాళ్ళు మనకు సాయం చేస్తారు' వంటి నీతి వాఖ్యలు సినిమా విడుదలకు ముందు ప్రచారంలో భాగంగా వినిపించాయి కాని సినిమాలో స్పష్టంగా చూపించిన దాఖలాలు లేవు. అంటే అక్కడక్కడ వినపడే నాలుగు మంచి మాటలను పట్టుకుని ప్రేక్షకులు సహృద్భావంతో కావాల్సిన విధంగా సందేశాన్ని ఊహించుకోవచ్చు దానిని ఎవరు కాదనరు. అంతే కాని ఏదో మెసేజ్ ఇచ్చినట్టుగానే అనిపించదు నాయక్ లో...! అలాంటి సినిమాను తీసుకెళ్ళి ఠాగూర్ తో పోల్చి.. ఏదో చిన్న సినిమాల వాళ్ళు కలక్షన్ల కోసం చిరంజీవి ఫోటోలను వాడుకుంటున్నట్టు వాడుకునే ప్రయత్నం చేసి మెగా పవర్ స్టార్ స్థాయిని దిగజార్చారు అని కొన్ని గుసగుసలు వినపడుతున్నాయి.
మరికొంతమందేమో... తండ్రికి సంబందించిన అన్ని విషయాల మీద కొడుకుకు హక్కు ఉంటుందికాబట్టి ఏ రకంగా అయిన వాడుకోవచ్చు అని వాదిస్తున్నారు. వాళ్ళు అలా వాదిస్తూనే... ఆ పోల్చటంలో చిరంజీవి, చెర్రి డైలాగులు.. బ్రమ్మి, సునీల్ లా డాన్సుల విషయంగా కొంత తేడా ఉండొచ్చు కాని ఒక విషయం రెండు సినిమాలను ఒకేలా చూపిస్తుంది..దానిని గుర్తించటం లేదు అని భాద పడుతున్నారు. ఇంతకీ ఏమిటా విషయం అని అరా తీస్తే... 'నాయక్, ఠాగూర్ టైటిల్స్ డిజైన్ ను పక్క పక్క పెట్టి చూడండి... అచ్చు గుద్దినట్టు ఒకేలా లేవు ఇంతకంటే గొప్ప పోలిక ఏమి కావాలి..?' అని చంకలు గుద్దుకుంటున్నారు. నిజమే కదూ...! ఈ విషయంగా ఎవరికీ ఎటువంటి అనుమానాలు ఉండే అవకాశమే లేదు . మరీ ఈ విషయాన్నీ వి'నాయక్' కావాలని చేర్చాడో... అనుకోకుండా పెట్టాడో తెలియదు కాని ఇప్పుడు నాయక్ కు బాగానే ఉపయోగపడుతుంది.
నాయక్ ను ఠాగూర్ తో పోలుస్తూ వచ్చిన ట్రైలర్ ...

No comments:
Post a Comment