అల్లు వారబ్బాయి పరిగెత్తుకు వస్తున్నాడు... రెడీగా ఉండండి...! అల్లు వారి కుటుంబ గౌరవంతో పాటు మెగా ఫ్యామిలీ పరువును మరింత పటిష్ట పరచటానికి అరవింద్ గారబ్బాయి... అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్ అనే మరో కుర్రాడు కంకణం కట్టుకున్నడన్నా సంగతి మనందరికీ తెలిసిందే..! అతను ఆ భాద్యతను సమర్ధవంతంగా నిర్వర్తించటానికి కష్టపడి 'గౌరవం' అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడని కూడా అందరికి తెలుసు..! కాని ఇప్పుడే తెలిసిన విషయం ఏమిటంటే సినిమా షూటింగ్ పూర్తిచేసుకుని విడుదలకు సిద్దం అయినా సందర్భంగా ఈ చిత్రానికి సంబందించిన తీజర్ ను బయటకు తీసుకువచ్చి నాయక్ సినిమా ప్రొమోషన్ లో బిజీగా ఉన్నా మెగా అభిమానులకు సంక్రాంతి స్పెషల్ ట్రీట్ ఇచ్చారు.
ఈ టీజర్ తో అల్లు శిరీష్ తోలిసారి తన స్క్రీన్ ప్రెజెన్స్ ను తెలియజేసాడు. ఎత్తు కొద్దిగా తక్కువగా ఉన్నట్టు అనిపిస్తున్నాడు కాని దిట్టంగానే ఉన్నాడు. స్లో మోషన్ ఎఫెక్టో... పరిగెత్తలేక ఇబ్బందో... లేక దర్శకుడే అలా ఎక్స్ ప్రెషన్ ఇవ్వమన్నాడో తెలియదు కాని పరిగెత్తుతూ అతను చాలా ఇబ్బందిగా కనిపించాడు. కొత్తగా ఉంటుందని ట్రై చేశారేమో కాని ఫస్ట్ ఇంప్రెషన్ అంత బెస్ట్ గా అనిపించలేదు.
కాని సినిమాలో ఉన్నా విషయాన్నీ టీజర్ లో క్లుప్తంగా భలే తెలియజేశారు. 'ఎందాకా పోతవూ... స్నేహం కోసమూ... న్యాయం కోసమూ..' అంటూ హీరో ఇంటన్షన్ ను ప్రశ్నిస్తూ కధకు సంబంధించి మంచి హింట్ ఇచ్చారు. అలానే బ్యాక్ స్కోర్ గా వస్తున్నా తమన్ కంపోజ్ చేసిన పాట చాలా బాగుంది. పాటలో వినిపిస్తున్నా పదాలు స్పూర్తిదాయకంగా ఉన్నాయి. మొత్తంగా ఈ టీజర్ హీరో పరిచయం పరంగా నిరాశపరిచినా... సినిమాలో ఉన్నా కంటెంట్ పరంగా ఆసక్తి కలిగిస్తుంది.
గౌరవం ఫస్ట్ లుక్ తీజర్ :

No comments:
Post a Comment