రొటీన్ కధలతోను, రోడ్డకోట్టుడు కాంబినేషన్లతోను చావా చచ్చిపోయిన తెలుగు సినిమా గతిని, స్థితిని మార్చటానికి జరిగిన ప్రయత్నంగా తెలుగు సినిమా అభిమానులు భావిస్తున్నా 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినీ ప్రియుల నీరాజనాలు అందుకోవటానికి సంక్రాంతి కానుకగా ఈ వారం దియేటర్లకు వచ్చింది. బహుకధానాయకుల చిత్రం అనగానే 'కధ కుదరాలి.. అప్పుడు చూద్దాం ... ' అంటూ గత 25 సంవత్సరాలుగా తప్పించుకుని తిరుగుతున్నారు తెలుగు స్టార్ హీరోలు. ఆ ఒరవడికి పులిస్టాప్ పెడుతూ మహేష్, వెంకటేష్ తీసుకున్న నిర్ణయం అభినందనియ్యం.
ఈ సినిమా ఫలితం ఫై ప్రేక్షకులలోనే కాదు సినిమా వర్గాలలో కూడా బోలెడంత ఉత్సుకత నెలకొని ఉంది. ఈ సినిమా విజయం మరిన్ని కొత్తకధలకు , మల్టీ స్టారర్ చిత్రాలకు బలమైన పూనాది కానుంది. అంతే కాకుండా సాదించే విజయం స్థాయిని బట్టి తెలుగు చలన చిత్ర రూపకల్పన శైలిలో సరికొత్త మార్పులు సంభవించే అవకాశాన్ని కొట్టిపారేయ్యలెం. కొద్దిమందికే ప్రత్యక్షంగా లాభాలను తెచ్చిపెట్టే చిత్రంగా మాత్రమే కాకుండా పరోక్షంగా తెలుగు చలన చిత్ర భవిష్యత్తును మార్చగలిగేంత సత్తాను కలిగి ఉన్నా చిత్రంగా ఓ ప్రాధాన్యతను ఏర్పరుచుకుంది ఈ సినిమా. ఇదంతా ఒకేత్తైతే .. వెంకటేష్, మహేష్ లాంటి స్టార్ హీరోలిద్దరిని ఒకేసారి స్క్రీన్ ఫై చూస్తాం అన్నా విషయాన్నీ తలచుకునే పులకరించిపోయి ఎన్నో ఆశలతో ఒక సంవత్సర కాలంగా ఈ సినిమా కోసం వేచి చూస్తున్నారు తెలుగు వాళ్ళు. అంతలా తన్మయత్వంలో ఉన్నా యావత్ తెలుగు ప్రజానీకాన్ని ఈ 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ' ఏ విధంగా పరవశింపజేసిందో... మన సమీక్షలో చూద్దాం.
కధ :
పేరు పెట్టి పిలవరు కాని రేలంగి అని మాత్రమే సంబోదిస్తూ ఉంటారు.. ఆయన్ని (ప్రకాష్ రాజ్). ఆయనుండే ఊరు వరుకే కాదు ఆయనతో సాన్నిహిత్యం కలిగిన ప్రతి ఒక్కరు అభినందించేంత మంచితనం రేలంగి గారిది. ఆయనకు ఇద్దరు కొడుకులు పెద్దోడు(వెంకటేష్), చిన్నోడు(మహేష్). రేలంగి గారి వ్యక్తిత్వం మొత్తంగా కాదుకాని అయన మంచి తనం మాత్రం ఈ ఇద్దరి అన్నదమ్ముల నరనరాల్లో జీర్ణించుకుని పోయిఉంటుంది. కానీ కుర్రాళ్ళు కాబట్టి తండ్రికి ఉన్నంత సహనం కొడుకులకు ఉండదు. ఫైగా ఇద్దరి మనస్తత్వాలు వేరు. దాంతో చుట్టూ ఉన్న పరిస్థితులను ఎదుర్కోవటంలో ఇద్దరి మద్య చాలా తేడా ఉంటుంది. ఆ తేడానే అన్నదమ్ముల మద్య కొన్ని అపార్దాలకు దారితీస్తుంది. కానీ ఎన్ని అపార్ధాలు వచ్చిన నాన్న నేర్పిన మంచితం వారిద్దరిని ఎప్పుడు కలిసుండేలానే చేస్తుంది. ముక్కుకు సూటిగా నడుస్తూ..నేనింతే.. ఇట్లాగే ఉంటాను..! అని మంకు పట్టుతో ఉండే తత్త్వం పెద్దోడిది. ఆవేశాగాడే అయినప్పటికీ సమయానుకూలంగా పరిస్థితికి తగ్గట్టు ప్రతిస్పందించే మనస్తత్వం చిన్నోడిది. అలాంటి ఈ ఇద్దరి జీవితాలలో చోటుచేసుకున్నా కొన్ని సంఘటనల సమాహారమే ఈ 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు'.
విశ్లేషణ:
సినిమా ఫలితం సంగతి పక్కనుంచి ముందుగా ఈ సినిమాను నిర్మించటానికి ధైర్యంగా పూనుకుని పట్టుదలతో ఎన్నో అసాద్యాలను సుసాద్యాలుగా చేసి చూపించిన దిల్ రాజుకు మనస్పూర్తిగా అభినందనలు తెలియజేయాలి. మహేష్,వెంకటేష్ సంకల్పం తోడవ్వక పొతే ఈ సినిమా ఉండేది కాదేమో...! ఆ కారణంగా వారు కూడా అభినందనార్హులే..! కాని అసలు ఈ సినిమాకు కర్త,కర్మఅయిన కుర్ర దర్శకుణ్ణి మాత్రం మెచ్చుకుంటూ విమర్శించాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఇద్దరు స్టార్ హీరోలతో సినిమా అంటే పెద్ద పెద్ద దర్శకులే కనీసం ట్రై చేయటానికి కూడా ఆలోచించేటటువంటి ప్రయత్నానికి నమ్మకంగా శ్రీకారం చుట్టి ఏంతో కష్టపడి తెర పైనా ఈ సినిమాను ఆవిష్కరించాడు. ఆ విషయంగా శ్రీకాంత్ ను ఎంత మెచ్చుకున్న తక్కువే. కాని సినిమాను రూపొందించిన విధానంతో మాత్రం కావలసినన్ని విమర్శలకు అవకాశం కల్పించాడు.
ప్రధానంగా శ్రీకాంత్ చేసిన పొరపాటు ఏమిటంటే ఇద్దరు స్టార్ హీరోలను పెట్టుకుని సినిమా తీయటం అంటే వాళ్ళు వీళ్ళు అని కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆశ పెట్టటమే అవుతుంది. ఆ ఆశకు తగ్గట్టు సినిమా అన్నివర్గాలను అలరించెదై ఉండాలి. కాని ఈ సినిమా కొంతమందినే బలంగా ఆకర్షిస్తూ మిగతావారిని వికర్షిస్తుంది. అన్ని వర్గాలను ఆకట్టుకునేట్టు కొంచెం తెలివిగా స్క్రిప్ట్ ను తాయారు చేసుకుని ఉండాల్సింది. కధ పరంగా అందుకు అవకాశం కూడా ఉంది. కాని శ్రీకాంత్ తన వ్యక్తిగత అనుభవలా ఆధారంగా మాత్రమే కధనాన్ని తయారుచేసుకున్నాడని స్పష్టంగా తెలుస్తుంది. అతనికి తెలిసి , తన చుట్టూ పక్కల జరిగిన సంఘటనలనే భగవత్గీత గా భావించి ఉన్నవాటిని ఉన్నట్టుగానే చిత్రీకరించి సినిమాలో సహజత్వాన్ని నింపటానికి ప్రయత్నించాడు. కాని ఆ సహజత్వం ఆ అనుభవాలతో ఏంతో కొంత సంబంధం ఉన్నా వారిని మాత్రమే ఆకర్షించ గలుగుతుంది. మిగత వారిని మాత్రం తప్పకుండా ఇబ్బంది పెడుతుంది. దాంతో ఈ సినిమా అతి కొద్దిమందికి పసందుగా అనిపిస్తుంది... కొద్దిమందికి పర్వాలేదనిపిస్తుంది... మిగత వారని మాత్రం ఆలోచనలో పడేస్తుంది.
అలా ఆలోచనలో పడే వారి కోణంలో చూస్తే మాత్రం సినిమా అంత బోల్డన్ని పొరపాట్లు. మొదటిది దర్శకుడు ఈ సినిమాతో సమాజానికి ఇవ్వలనుకున్నా సందేశం. మంచితనం, మానవత్వం, చిరునవ్వు అంటూ సినిమా మొదట్లోను చివర్లోను వాయిస్ ఓవర్ గా చెప్పటం తప్ప దర్శకుడు చెప్పాలనుకున్నా పాయింట్ ను సినిమాలో ఎలా చూపించాడు అన్నదాని మీద స్పష్టత ఉండదు. ఫైగా హీరోలకు వారి భాదలు వారికుంటాయి తప్పా ఏదో చెప్పలాన్నా తపన వారిలో కనిపించదు. దాంతో సందేశం కధలోనూ, కధనంలోనూ అంతర్భాగం అనిపించక ఎక్కడినుంచో.. తెచ్చి పెట్టుకున్నాట్టు ఉంటుంది. అలానే సినిమాలో చాలా పాత్రలున్నప్పటికి హీరోలా మద్య వచ్చే మనస్పర్ధలనే ఆధారంగా చేసుకుని కధను నడిపించారు. దాంతో మిగత పాత్రలకు ప్రాధాన్యత లేకపోవటమే కాకుండా.. అన్నదమ్ముల మద్య కనిపించే ఆప్యాయత అనురాగం తప్పా మిగత భావోద్వేగాలకు అవకాశం లేకుండా పోయింది. అంటే హీరోలకు అమ్మానాన్నలతోను, బంధువులతోను, స్నేహితులతోను,శత్రువులతోను ఉండాల్సిన బంధాలకు ఆస్కారం లేకుండా పోయింది. చివరికి వారు హీరోయిన్స్ తో చేసే రొమాన్స్ కూడా అద్దెకు తెచ్చుకున్నట్టే ఉంటుందికాని ఆకట్టుకోదు. సినిమాలో అంజలి చేసిన సీత పాత్రకు సంబంధించి పెళ్ళిచూపుల సీన్ ఉంటుంది. ఆ సీన్ ఎంత బావుంటుందంటే... చెప్పటం కాదు చూడాలి. ఆలాంటి సన్నివేశాలు సినిమా అంతా కనిపించాలి. కానీ అలా జరగలేదు. కొంతవరకు క్లైమాక్స్ మినహా సినిమాలో పెద్దగా కదిలించే సన్నివేశాలు కనిపించవ్. కామెడీని పూర్తిగా పడుకోబెట్టారు. ఒకట్రెండు పాటలు మినహా మిగతావి నిరశపరిచాయి.
అలానే ఈ సినిమా అతి కొద్ది మందికి మాత్రం పసందుగా ఉంటుందని చెప్పుకున్నాం...! అది ఎవరికంటే .. సొంత అన్నదమ్ములకు..! అందులోను మధ్యతరగతి కుటుంబానికి చెందినా అన్నదమ్ములను మాత్రం ఈ సినిమా తప్పకుండా తాకుతుంది. వారికి మాత్రమే సొంతం అయిన ఎన్నో అనుభవాలకు ఈ సినిమా వేదికగా ఉంటుంది. వెంకటేష్, మహేష్ పాత్రలతో వారిని వాళ్ళు పోల్చుకుని పులకించిపోతారు.... పరవశించిపోతారు. ఇక మహేష్ ను వెంకటేష్ ను అన్నదమ్ములుగా చూడాలని ముచ్చట పడ్డవారికి తనివి తీరిపోతుంది. వారిద్దరిని ఒకే స్క్రీన్ ఫై రెండున్నార గంటల పాటు చూస్తూ ఉండటం కన్నుల పండగగా ఉంటుంది. అలానే సినిమాలో పెద్ద మలుపులు, భారి యాక్షన్ ఎపిసోడ్స్, లెంగ్తి డైలాగులు వంటివి కనిపించవు. సినిమా మొదలైన దగ్గర నుండి అయిపోయే వరకు ఒకటే ఫ్లోతో సమాంతరంగా గడిచిపోతుంది. సో...ఇలాంటి సింపుల్ మరియు స్లో చిత్రాలను ఇష్టపడే వారికి ఆ సినిమా చాలా బాగా నచ్చుతుంది. చివరిగా చెప్పేదేమంటే ఆంధ్రదేశంలో ఉన్న అన్నదమ్ములందరూ నడుంబిగించి ప్రచారం చేపడితే మాత్రం ఈ సినిమా విజయం నల్లేరు మీద నడకే..!
రేటింగ్ :
విభాగాలు
|
రేటింగ్
| |||||
అభినయం :
వెంకటేష్,మహేష్ అన్నదమ్ములుగా నటించలేదు జీవించారు. అవకాశాన్ని బట్టి ఒకరిని ఒకరు బాగా డామినేట్ చేశారు. వారి నటనను చూస్తుంటే సంతోషం కట్టలు తెంచుకుంటుంది. ముఖ్యంగా ఒకరి ఫై ఒకరికి వల్లమాలిన ప్రేమ ఉంటుంది కానీ దానిని ఫైకి చెప్పుకోరు. అలా ఫైకి చెప్పుకోకుండానే ఒకరి ఫై ఒకరు ప్రేమ కురిపించుకునే సన్నివేశాల్లో భలే నటించారు. వెంకటేష్ కు అది ట్రైలర్ మేడ్ పాత్ర. పెద్దోడు పాత్రకు అతికినట్టు సరిపోయాడు. కొన్ని ఎమోషన్ సన్నివేశాల్లో కన్నీళ్ళు పెట్టిస్తాడు. ఈ మద్య కాలంలో వెంకి ది బెస్ట్ పెర్ఫార్మన్స్ ఈ పాత్రకు చేశాడని చెప్పుకోవచ్చు. మహేష్ సహజంగా భలే కనిపించాడు. ఈ సినిమా కోసం వయసు తగ్గించుకుని కుర్రాడల్లా పిల్లాడైపోయాడు. చిన్నోడుగా కట్టిపడేస్తాడు. ముఖ్యంగా బామ్మతో చేసే అల్లరి బాగుంటుంది. అలాగే ఇంటర్వ్యూ సీన్ లో మహేష్ యాక్షన్ అదరగొట్టేశాడు. తరవాత చెప్పుకోవాల్సింది అంజలి గురించి.. కాస్తా అతిశయంగా అనిపించినా కూడా తెలుగమ్మాయి అనే స్వార్ధంతో చెప్పెదేమంటే అవకాశం ఉండాలే కాని సౌందర్యను రీప్లేస్ చేయగల సత్తా ఆమెకు ఉంది అని. సీతగా ఎంత బాగా నటించిందంటే.. నమ్మకంగా చెబుతున్నాను ఫిదా అయిపోతారు. చిలిపితనం, అమాయకత్వం, ప్రేమ, ఇలా అన్నిరకాల భావాలను చాలా చక్కగా అభినయించి ముచ్చట తీర్చింది. సమంతా ఎప్పటిలానే బాగానే చేసింది. ప్రకాష్ రాజ్, జయసుధ బాగానే చేశారు. కోట, తనికెళ్ళ భరణి, రవిబాబు, రావు రమేష్ , తదితరులు వారి పాత్రలకనుగుణంగా బాగానే చేశారు.
|
3.5/5
| |||||
దర్శకత్వం :
దర్శకుడు శ్రీకాంత్ అడ్దాలా తానేం చెప్పాలనుకున్నాడో దానిని పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుని చాలా చక్కగా సినిమాను తెరకెక్కించాడు. అతను చెప్పాలనుకున్న పాయింట్ వరకు సినిమాను ఇలా తీయటం కొంతవరకు కరెక్టే. కాని ఆ పాయింట్ చేరే పరిది చాలా తక్కువ. సో అతని విజన్ లో స్పష్టత లేని కారంణంగా సినిమాకు జరిగే నష్టం ఎక్కువగానే ఉంటుందని ఓ అంచనా. అది మినహా సాంకేతికంగా అన్ని విభాగాలను చాలా చక్కగా వాడుకుని సినిమాను అందంగా తెరకెక్కించాడు.
|
3/5
| |||||
రచన
| ||||||
కధ:
కధ చాలా సింపుల్ గా ఉంది ఎందుకంటే ఇది కొన్ని అనుభవాల సమాహారం. కాకపోతే ఆ అనుభవాలలో అవసరమైన డెప్త్ లేకపోవటం నిరాశ పరుస్తుంది. (2.5/5)
| ||||||
కధనం:
మహేష్,వెంకటేష్ ల మద్య వచ్చే సన్నివేశాలను తప్ప మిగత వాటి గురించి పెద్దగా పట్టించుకున్నట్టు కనిపించలేదు. స్లో నరేషన్ కొంత ఇబ్బంది పెడుతుంది. (2.5/5)
|
2.5/5
| |||||
మాటలు :
మాటల రచనకు గణేష్ పాత్రో సహకారం సొంత తెలివికే ఎక్కువ అవకాశం ఇచ్చిన శ్రీకాంత్ మాటలను పేలవంగా వ్రాసి నిరాశపరిచాడు. కాకపోతే గోదావరి యాసను అందరితో బాగా పలికించాడు.(2/5)
| ||||||
సంగీతం
| 2.5/5 | |||||
పాటలు :
మిక్కి అందించిన పాటలు యావరేజ్ గా వినిపించాయి. (2.5/5)
| ||||||
నేపధ్య సంగీతం:
మణిశర్మ అవసరం ఉన్న మేర సినిమాను బాగానే బతికించాడు. అంతే కాని స్పెషల్ గా మాత్రం అనిపించదు.(2.5/5)
| ||||||
డాన్సులు:
పాటల చిత్రీకరణ కూడా పాటలకు మల్లేనే యావరేజ్ గా ఉంది. ఒక్క పెళ్లి పాట మినహా మరే పాట బాగున్నట్టు అనిపించదు.(2.5/5)
| ||||||
సాంకేతికం
|
3/5
| |||||
కెమెరా:
గుహన్ కెమెరా పనితనం చాలా బాగుంది. సినిమాలో ప్రతి ఫ్రెమ్ ను చాలా అందంగా చూపించాడు. (3.25/5)
| ||||||
ఎడిటింగ్ :
మార్తాండ్ చాలా వరకు మెరుగైన పనితనాన్నే ప్రదర్శించాడు. కాని రెండో సగంలో ఎడిటింగ్ కట్స్ కధలో స్పష్టతను మింగేసాయి. క్లైమాక్స్ సరిగా అనిపించలేదు.(2.5/5)
| ||||||
ఆర్ట్ :
ఎ యస్ ప్రకాష్ ఆర్ట్ పనితనం బాగుంది. పల్లె వాతావరణాన్ని, హీరోల ఇంటిని బాగా ముస్తాబు చేశాడు. కొబ్బరి తోటల మద్య పెళ్లి సెట్ ఆకట్టుకుంది.(3/5)
| ||||||
తులాభారం
|
2.5/5
| |||||
హెచ్చులు :
| ||||||
తగ్గులు:
| ||||||
మారుతీ టాకీస్ విశ్లేషణాత్మక రేటింగ్ : 3/5
| ||||||
కొసమెరుపు:
ఈ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా దర్శకనిర్మాతలకే కాదు ప్రేక్షకుల అభిరుచికి కూడా పరీక్షే..! సినిమాను కాదన్నారంటే.. ఇలాంటి సినిమాలు తియ్యటం మానేస్తారు. ఒప్పుకుంటే తప్పులున్నప్పటికి దీన్నో ఫార్ములాగా పరిగణించి వాయగొట్టి వదులుతారు. మొత్తానికి సంకట స్థితే... ! వాస్తవంగా ఆలోచించి పరిస్థితులను చూస్తుంటే ఈ సినిమా మాస్ జనాలను మెప్పించటం కష్టమే..! ఇక మిగిలిన వారిలో ఎవరెటువైపు మొగ్గుతారు అన్నాదాని బట్టే .. ఈ సినిమా విజయం ఖరారవుతుంది.

No comments:
Post a Comment