Pages

Ads 468x60px

Text Widget

Recent Posts

Definition List

Download

Tuesday, January 8, 2013

నాయక్ మొదటాటకు బాద్ షా


నాయక్ సినిమాకు సంబంధించి అందులో రామ్ చరణ్ చేసిన మ్యాజిక్ గురించి, వినాయక్ సృష్టించిన వినోదం గురించి వినపడుతున్నా విశేషాల కంటే మరో అంశం మెగా అభిమానులు సహా సర్వత్ర వీపరితమైన ఆసక్తిని కలుగజేస్తుంది. ఎందుకంటే ఆ విషయంతో జూనియర్ చిరంజీవికి జూనియర్ యన్ టి అర్ కు లింక్ ఉంది కాబట్టి.

అసలు విషయంలోకి వస్తే వ్యక్తిగతంగా స్నేహితులుగా కనిపిస్తున్నప్పటికీ వృత్తిపరంగా చరణ్, యన్ టి అర్ లా మద్య ఉన్న పోటి అందరికి తెలిసిందే. దాని ప్రకారం ఇద్దరిలో ఎవరి సినిమా విడుదల అవుతున్నా మరొకరు ఎలా ఉందొ అని ఆసక్తి కనపరచటం సహజమే. కాని మొదటి రోజే ఒకరి సినిమా ఒకరు చూసుకోవటం అనే ఆనవాయితీ ఈ ఇద్దరి మద్య దాదాపు లేదనే చెప్పవచ్చు. అలాంటిది చరణ్ 'నాయక్' సినిమాను జూనియర్ మొదటి రోజే... అది మొదటి ఆటే చూడబోతున్నాడని తెలిసి అందరు ఆశర్యంతో కూడిన ఆసక్తిని కనబరుస్తున్నారు.

ఈ విషయం కేవలం ఊహాజనితమైనదేమో అని కొట్టి పారేయటానికి వీలు లేకుండా కొన్ని ఆధారాలు కూడా ఉండటంతో నమ్మాల్సిన పరిస్థితి. ఇంతకీ విషయం ఏమిటంటే హైదరాబాద్ లోని కాచిగూడాలో  నందమూరి  కుటుంబానికి చెందిన తారకరామా అనే సినిమా హాల్ ఉంది. అది జమానా కాలం నాటిది కావటంతో మరమత్తులు నిర్వహించి సరికొత్తగా తాయారుచేశారు. రేపు 9 తారీకు మంచి రోజు కావటంతో జూనియర్ యన్ టి అర్ తో పునః ప్రారంభించాటానికి  ఏర్పాట్లు చేసుకున్నారు. యాదృచ్చికంగా ఆ రోజే నాయక్ విడుదల ఉండటంతో కొత్త తారకరామా ధియేటర్ ప్రారంభ చిత్రంగాఆ సినిమానే ఎంచుకున్నారు. అలా ఆ రోజు యన్ టి అర్ దియేటర్ ను ఓపెన్ చేసి మొదటి షో ను కుటుంబ సమేతంగా చూస్తాడని వినికిడి. 

ఈ విషయానికి సంబంధించి ఎటువంటి అధికారిక ధృవీకరణ లేదుకాని గోల మాత్రం ఘనంగానే జరుగుతుంది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం  యన్ టి అర్ వస్తాడన్నా దాని ఫై స్పష్టత లేదు కాని దియేటర్ ప్రారంభానికి సంబంధించి ప్రచారం మాత్రం బాగానే జరుగుతుంది. అందులో భాగంగా పెద్ద యన్ టి అర్, నాయక్ పోస్టర్ తో బయటకు వచ్చిన ప్రచార చిత్రాలు ఈ వార్తలో కొంత నిజం ఉండొచ్చు అని చెబుతున్నాయి. కాని చివరకు ఏమి జరుగుతుంది అని తెలుసుకోవటానికి మాత్రం రేపటి ఉదయం ఆట వరకు ఆగాల్సిందే...! 

         

          

No comments:

Post a Comment