Pages

Ads 468x60px

Text Widget

Recent Posts

Definition List

Download

Saturday, June 23, 2012

Review : Mem Vayasuku Vachham



మౌనరాగం తో మొదలు పెట్టి ప్లాపుల హ్యాట్రిక్ ఫైన ఓ ప్లాపు కొట్టి నిరాశాలో ఉన్న తనిష్ 'మేం వయసుకు వచ్చాం' చిత్రం తో తన అదృష్టాన్ని పరీక్షించుకోవటానికి ఈ వారం ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. లక్కి మీడియా బ్యానర్  ఫై నిర్మితమైన ఈ చిత్రానికి దర్శకుడు త్రినాధ  రావ్ నక్కిన.  ఈ చిత్రం తో నీతి టేలర్ కధానాయకిగా పరిచయం కాగా మదాలస శర్మ , భాగ్య రాజ్ , సూర్య తదితరులు ప్రధాన పాత్రలలో కనిపించారు. శేఖర్ చంద్ర సంగీతాన్ని అందించాడు. రైడ్ హిట్ తరవాత మాస్ హీరోగా నిలబడేందుకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలం అవటంతో.... వయసుకు తగ్గట్టు రొమాంటిక్ టీనేజ్ హీరోగా నిరూపించుకునేందుకు తనిష్ చేసిన ఈ ప్రయోగం ఎంతవరకు సఫలం అయ్యిందో... మన సమీక్షలో చూద్దాం .

కధ :
లక్కి ( తనిష్) , కుషి (మదాలస) ప్రేమించు కుంటారు... పెళ్లి చేసుకోవలనుకుంటారు. తాను ప్రేమించే వాడు తనకే సొంతం కావాలనుకున్న కుషి కి వేరొ అమ్మాయితో లక్కి కి ఎఫైర్ ఉందని తెలిసి  ఆత్మహత్య చేసుకోవాలనుకుంటుంది.  ఆమెను సుబ్రమణియన్ (భాగ్య రాజ్) వారించి లక్కిని నిలదీస్తాడు. దాంతో తన ఫస్ట్ లవ్ గురించి వారికీ చెప్పటం మొదలు పెడతాడు లక్కి . గ్రాడ్యుయేషన్ చదివేప్పుడు లక్కి క్లాస్ మేట్ దిల్ రుబా  బేగం(నీతి  టేలర్) తో అతని ప్రేమ వ్యవహారం నడిచేది. మిస్ అండర్ స్టాండింగ్ తో మొదలైన వారి స్నేహం ఓ అండర్ స్టాండింగ్  కు వచ్చి ప్రేమగా కన్ఫర్మ్ అవుతుంది. కాని మద్య ఉన్న మతం అనే అడ్డుగోడ కారణంగా లక్కి ప్రేమను ఒప్పుకోవటానికి భయపడుతుంది దిల్ . కాని ఒక సమయం లో  లక్కి ప్రేమకు దాసోహం అవుతుంది. ఆ ఫై వారు కలిసి జీవించటానికి సిద్దం అవుతారు. కాని కొన్ని అనూహ్య పరిణామాలు వారిద్దరిని విడదిస్తాయి. ఆ పరిణామాలు ఏమిటి ..? ఆ తరవాత అవి లక్కి , దిల్ జీవితాల్లో  ఏ  విధమైన మార్పును తీసుకువచ్చాయి అన్నది మిగిలిన కధ .

విశ్లేషణ:

తనిష్ ఈ సినిమాను ఎంచుకోవటం ద్వార ఓ మంచి ప్రయత్నమే చేసాడు.. అలానే అతని కెరీర్ కు ఈ సినిమా ఏంతో  కొంత తప్పక ఉపయోగపడుతుంది. దర్శకుడు త్రినాద్ రావు కూడా ఒక ఆలోచింపజేసే పాయింట్ తో తనకున్న  పరిదిలో  మంచి అవుట్ పుట్ తో సినిమాను రూపొందించాడు.  ఇలా  ఈ సినిమా  వీరిద్దరి ప్రతిభకు కొంతవరకు కొలమానం కావొచ్చేమో కాని..... ప్రేక్షకులను రంజింప చేయటంలో మాత్రం వెనుక పడిందనే చెప్పాలి. హీరో కు తన నటనలో ఉన్న మరో కోణాన్ని ప్రదర్శించటం, దర్శకుడికేమో తనకూ  సినిమా తీయటం వచ్చు అని నిరుపించుకోవటం అనేవి ఈ సినిమాలో ఉన్న ప్రధాన లక్ష్యాలు. అంతే  కానీ  ఏదో కొత్త దానాన్ని చూపించాలి... వైవిధ్యమైన ప్రదర్సన చెయ్యాలి అనే ఆలోచనలు మచ్చుకకి కూడా కనిపించవు.  రొటీన్ ప్రేమ  కధ .. పరమ మూస సన్నీవేశాలు , గ్రిప్ లేని డైలాగులు ,  క్యాచిగా లేని పాటలు, ఆ ఫై తనకుమాలిన సందేశం వెరసి 'మేం వయసుకు వచ్చాం'. ఈ సినిమాను స్పష్టంగా సమీక్షిస్తే .. బోలెడన్ని అస్పష్టతలు  కనిపిస్తాయి. వాటితో మనకెందుకులే అని వదిలేస్తే సినిమా మీద ఫీలింగే ఉండదు. ఫీలింగ్స్ లేని ప్రేమ కధలను ఊహించుకోగలమా..! ఉంటుంది ఆ అవకాశము ఉంటుంది.... ఇలాంటి సినిమాల మూలంగా.  రీల్ లైఫ్ లో అయిన, రియల్ లైఫ్ లో అయిన ప్రేమ అనేది ఎవెర్ గ్రీన్ పాయింట్. ప్రేమ అనే పదానికి ఉన్న క్రేజ్ ను బట్టి దాన్ని ఎంత లోతుగా స్పృశిస్తే  అంత  ఎక్కువ కాష్ చేసుకోవచ్చు.  ఈ సినిమాలో  ప్రేమే  ప్రధాన పాయింట్  .. కాని దాని చుట్టూ అల్లుకున్న పరిస్థితులు , సంఘటనలు, అవి చేసే సంఘర్షణలు అతి సామాన్యంగా ఉండి రంజింప లేకపోయాయి. మతాన్ని ప్రేమకు అడ్డుగోడగా ఎంచుకున్నాడు... కాని దాని మూలంగా జరిగే  పరిణామాలను ధైర్యంగా  చెప్పలేక పోయారు. కేవలం ప్రచారం కోసమే హిందూ , ముస్లిం ల మద్య ప్రేమ అన్న అంశాన్ని తీసుకున్నట్టు ఉంది. అలానే టీనేజ్ లో ఉన్న వాళ్ళలో ప్రేమ మొదలయ్యే సంఘటనలను కాని, ఆ ఫై వారిలో జరిగే అంతర్మధనాన్ని, ప్రేమలో ఉన్న ఆనందాన్ని , విఫలం అవటంలో ఉన్న భాదను  టచ్ చేసేలా చిత్రికరించలేదు. చివర్లో ప్రేమలో విఫలం అవటమే జీవితానికి ఎండ్  కాదు. తరవాత జీవితం చాల ఉంది అని చెప్పిన సందేశం ఏ  కోశానా  ప్రేక్షకులకు కనెక్ట్ కాదు. సినిమా మొదటి సగం రొటీన్ సన్నివేశాలతో బోరింగాగా గడిచి పోతుంది. రెండో సగంలో హీరో హీరోయిన్ లు ప్రేమను ఆస్వాదించే సన్నివేశాలు, ఆ ఫై పెళ్లి చేసుకోవలనుకోవటం , కాదనుకుని విడిపోవటం వంటి సన్నీవేశాలు  కొద్దిగా ఆకర్షిస్తాయి. సినిమా కోసం వ్రాసిన  మాటల్లో జీవం లేదు .. పంచ్ డైలాగుల   కోసం తాపత్రయం కనిపించిందే కాని అర్ధవంతమైనే  డైలాగులు తక్కువ వినిపించాయి.  శేకర్ చంద్ర స్వరపరిచిన పాటలలో ఒక పాట  పర్వాలేదనిపించింది.  బ్యాక్ స్కోరు లో రెహ్మాన్ బీట్ లా అనిపించే ట్రాక్ వచ్చినప్పుడల్లా బాగుంది. కెమెరా , ఎడిటింగ్ వర్క్ పర్వలేదనిపిస్తాయి. నిర్మాణాత్మక  విలువలు చిన్న బడ్జెట్ సినిమాల పరంగా బాగానే ఉన్నట్టు చెప్పవచ్చు.

అభినయం :
తనిష్ ఫిజిక్ లో మార్పు కనిపించింది కాని .. నటనలో మార్పు కనిపించలేదు. కొంచెం బొద్దుగా తయారయ్యాడు. డాన్సుల్లో ఈజ్ తగ్గింది. మాటల్లో పవర్  తగ్గింది. కొన్ని సన్నీవేశాల్లో మంచి ఎక్స్ ప్రేషన్స్  ఇచ్చాడు కానీ అవి సరిపోవు. కొత్తమ్మాయి నీతీ  ఆకట్టుకుంది. బొద్దుగా, అమాయకమైన ముస్లిం యువతిగా చక్కగా సరిపోయింది. నటనలో కూడా మంచి ఈజ్ కనపరిచింది. టైం కలిసి వస్తే మంచి హీరోయిన్ గా నిల దోక్కుకునే అవకాశం ఉంది. మదాలస అందం సంగతి పక్కన పెట్టి చుట్టానికి ఎండిపోయిన నక్కల ఉంది. భాగ్య రాజ్ స్పెషల్ రోల్ కు ప్రత్యేకత లేదు. సూర్య, రామప్రభ , సన అవకాశం మేర బాగా నటించారు. 'కేక' బాష కు మంచి రోల్ పడింది. తను కూడా అందివచ్చిన అవకాశాన్ని చక్కగాఉపయోగించుకున్నాడు. బాష కనిపించిన ప్రతిసారి  నవ్వించాడు.

 ప్లస్ పాయింట్స్: 

సెకండ్ హాఫ్  లో కొన్ని లవర్ ఎపిసోడ్స్ , అక్కడక్కడ కొన్ని కామెడీ సన్నీవేశాలు

 మైనస్  పాయింట్స్:

 రొటీన్ కధ , ఆకట్టుకోలేని కధనం, ఫెలింగ్స్ కరువైన సన్నీ వేశాలు ప్రధానంగా ఈ సినిమాకు మైనస్ పాయింట్స్ 

చివరిగా :
ఈ సినిమాలో హీరో తో హీరోయిన్ ఓ కోట్ చెబుతుంది.... జ్ఞాపకాలు చెరిగిపోతాయి.... గుర్తులు మిగిలిపోతాయని...! అలా చూసుకుంటే ఈ సినిమా ఓ .. జ్ఞాపకమే కాని.... గుర్తు కాదు...!


Maruthi Talkies Rating : 2.5 out of 5 

  

Brammi as Vishnu Moorty in Puri's DCM

పూరి జగన్నాథ్ 'దేవుడు చేసిన మనుషులు ' సినిమాతో దేవుడి మీద , దేవుణ్ణి నమ్మే వాళ్ళ మీద , దేవుణ్ణి నమ్మని వాళ్ళ మీద మొత్తంగా ఓ.. సెటైర్ వేసే  ప్రయత్నంలో ఉన్నట్టు కనపడుతుంది. అందుకు మొదటి సంకేతం బ్రహ్మానందాన్ని విష్ణు మూర్తిగాను , కోవై సరళను  లక్ష్మి దేవిగా చూపించటాన్ని బట్టి అర్ధం చేసుకోవచ్చు. ఇంతకీ  సినిమా కధేంటి ...? సినిమాలో ఉన్న విషయం ఏమిటి అన్నా విషయాలు పక్కన పెడితే ... దేవుడు చేసిన మనుషులు ట్రైలర్ మాత్రం ముచ్చటగా ఉంది. పూరి జగన్నాథ్ వెటకారాన్ని రంగరించుకుని ఫన్నీగానే ఉండి  సినిమా మీద ఆసక్తిని పెంచుతుంది. మొదటి చూపులో  కొద్దిగా ఊరిస్తున్న ఈ సినిమా ఎలా ఉందో .... తెలుసుకోవాలంటే మాత్రం జూలై 27 వరకు ఆగాల్సిందే..! అప్పటి వరకు ఈ సినిమా పాటలు వింటూ... బ్రమ్మిని విష్ణు మూర్తిగా ఊహించుకుంటూ  మురిసిపోండి ...!

మీ కోసం బ్రమ్మి , కోవై సరళ ఫోటోలు 'దేవుడు చేసిన మనుషులు'  చిత్రం నుండి.....





Review : Karthi's Shakuni


వరస విజయాలతో జైత్రయాత్ర కొనసాగిస్తున్న తమిళ హీరో కార్తి తాజాగా 'శకుని' చిత్రం తో తన పరంపరను కొనసాగించటానికి ఈ వారం  ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తమిళం లో 'శగుని ' పేరుతొ రూపొందిన ఈ చిత్రాన్ని బెల్లంకొండ సురేష్ తెలుగులోకి అనువదించి విడుదల చేశాడు . ఈ చిత్రం తో శంకర్ దయాళ్  దర్శకుడిగా పరిచయం అయ్యాడు.  రాధిక,  రోజా, నాజర్ , ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాస రావు ప్రధాన  పాత్రలలో కనిపించారు.  అనుకున్న సమయానికంటే ముందర అంటే జూలై 6 న రావలసిన  ఈ సినిమా కొంచెం ముందే  విడుదల కావటం తో ప్రచారానికి పెద్దగా టైం లేకుండా పోయింది. అయిన కార్తి కి ఉన్న గుర్తింపు రీత్యా  ఓపినింగ్స్ బాగానే వచ్చే అవకాశం ఉండటం, నిర్మాత బెల్లంకొండ ఈ సినిమాను  విడుదల చేయటం మొదలైనవి ఈ సినిమాకు కలిసొచ్చే అంశాలు. అంతే  కాకుండా ఈ 'శకుని' కి  ఉన్న మరో బంపర్ ఆఫర్ ఏమిటంటే ... సినిమా కొద్దిగా బాగుంది అని అనిపించుకుంటే చాలు ఓ రెండు వారల  పాటు ఏ  పెద్ద సినిమా తెలుగులో లేక పోవటంతో వసూళ్ళ  పండగ చేసుకోవచ్చు.  మరి రెడీ గా ఉన్న  అవకాశాన్ని వాడుకోవటానికి  ఈ 'శకుని' దగ్గర ఏవిధమైన ఎత్తులు ఉన్నయ్యో మన సమీక్షలో చూద్దాం .

కధ :
కమల్ కృష్ణ (కార్తి) ఓ సామాన్య యువకుడు. సంప్రదాయాలకు, ప్రజాసేవకు ప్రాముఖ్యం ఇచ్చే కుటుంబంలో పుట్టిన కమల్ ...తమ ఆస్తి మొత్తం పణంగా పెట్టి తరతరాలుగా అతడి కుటుంబం నడుపుతున్నా  అన్నదాన సత్రాన్ని నిర్వహిస్తూ హాయిగా ఉంటాడు. ఒక రైల్వే ప్రాజెక్ట్ కోసం కమల్ కుటుంబానికి చివరికి మిగిలిన ఇల్లును పడగొట్టాలని నిర్ణయిస్తుంది ప్రభుత్వం. దానిని ఎలాగైనా ఆపించాలని ప్రయత్నాలు మొదలు పెట్టిన కమల్ కృష్ణకు ఎన్నో అవమానాలు చిత్కారాలు ఎదురవుతాయి. వేదనతో ఎదురు తిరిగిన కమల్ తన తెలివి తేటలు ఉపయోగించి కార్పొరేటర్ లెవెల్ దగ్గర మొదలు పెట్టి రాష్ట్ర రాజకియలను శాసించే స్థాయికి ఎదుగుతాడు.ప్రభుత్వం లో ఉన్న పార్టీని ఓడించి ప్రతిపక్ష నాయకుణ్ణి ముఖ్యమంత్రిని చేసి తన ఇంటిని కాపాడుకోవటంతో సినిమా ముగుస్తుంది.

విశ్లేషణ:

ముందుగా ఈ సినిమాకు సంబంధించి గొప్పగా చింతించవలసిన విషయం ఏమిటంటే .... ఇప్పటివరకు వైవిధ్యమైన కధలనో , పాత్రలనో ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరించిన కార్తి ఈ సినిమా కోసం ఓ రొటీన్ కధను అందులోను ఓ మూస పాత్రను ఎంచుకోవటం...! ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్స్ లో కనిపించినదంతా కేవలం పంచదార పూత మాత్రమే. అసలు విషయంలోకి వెళ్తే ....మొత్తం ...డొల్లా...మేటారే లేదు...! కొత్త దర్శకుడు శంకర్ దయాళ్  తెలుగు సినిమాలకు సహా దర్శకుడిగా పనిచేసిన ప్రభావం ఏమో కాని..... కధ , కధనాలు మినహా అన్ని విభాగాలను అవసరం మేరా వాడుకుని సినిమాను అందంగా కనపడేలా తీర్చిదిద్దాడు.  కాని చికెన్ బిర్యాని ఎంత అందంగా ఉంటే మాత్రం ఏం  లాభం.....! అందులో ఉప్పు, కారం, మసాల గట్రా సరిగ్గా ఉంటేనే కదా..రుచి. ఈ సినిమా  కూడా అంతే చుట్టానికి  అందంగానే ఉంది గాని ఆస్వాదించలేం. కారణం పస లేని కధ , దమ్ము లేని కధనం. అప్పుడెప్పుడో రవి తేజ నటించిన భగీరధ సినిమా లాంటిదే ఈ శకుని కూడా. దాదాపు కధనం కూడా అలానే ఉంటుంది.తేడా  కదా వస్తువులోనే...!భగీరధ లో ఊరికి వంతెన కోసం రియల్ ఎస్టేట్ వ్యాపారిని ఓడించినట్టు... ఈ సినిమాలో తరతరాలుగా వస్తున్నా ఇంటి  కోసం ఓ రాజకీయ నాయకుణ్ణి ఓడించటం. అలానే మరో దగ్గరి సారూప్యం కూడా ఉంది. భగీరధ సినిమాలో ప్రకాష్ రాజ్ ను రవితేజ గెలవటానికి నాజర్ పాత్ర ఉపయోగపడుతుంది. శకునిలో కూడా కార్తి ప్రకాష్ రాజ్ ను గెలవటానికి ఉపయోగపడేది ..నాజర్ పాత్రే...!  సినిమా ఓ ఆసక్తికరమైన ఎపిసోడ్ తో మొదలవుతుంది. దానిని చూస్తే  ఇది  ఓ పొలిటికల్ రివెంజ్ స్టొరీ ఏమో అనిపిస్తుంది. కాని ఆ అంచనాలను తల కిందులు చేస్తూ దర్శకుడు శంకర్ హీరో ని ఇంట్రోడుస్ చేసి  ఒక నీరసమైన కధనానికి తెర  తీసాడు. ఆ ఫై ఫస్ట్ హాఫ్ మొత్తం డల్ గా, బోరింగ్ పాటలతో , సంతోషం వేసే పంచ డైలాగులతో, హీరో పడే  అవమానాలతో ... ఏదో అలా మమ .. అనిపించుకుంటుంది. ఏక రెండో సగం హీరో లక్ష్యం దిశగా ఎదిగే క్రమం. అందులో రాధిక ను హీరో మేయర్ చేసే క్రమం కాస్త కన్వేన్సింగ్ గా ఉంటుంది. పొగ మిగిలినవన్నీ రొటీన్ గా , లాజిక్ కు దూరంగా ఉంటాయి. మరీ క్లైమాక్స్ అయితే చాల సింపుల్ గాను, వీక్ గాను ఉండి చిరాకు తెప్పిస్తుంది. మొత్తంగా శకుని ఒక చమక్కు లేని ఓ రొటీన్ ఎంటర్టైనర్. అసలు శకుని అనే టైటిల్ కి జస్టిఫికేషన్ ఏంటో అర్ధం కాదు. ఈ సినిమాకు శశాంక్ వెన్నెలకంటి వ్రాసిన మాటలు సన్నివేశాలకు తగ్గట్టు బాగానే ఉన్నాయి. జి  వి ప్రకాష్ కుమార్ అందించిన పాటలు బోరింగ్ గా అనిపించాయి. ఒక్క పాట  కూడా బాగాలేదు. బ్యాక్ స్కోరు కూడా అంతంత మాత్రమే. కెమెరా , ఎడిటింగ్ సహా సాంకేతికంగా అన్ని విభాగాలు చాలా  పర్ఫెక్ట్ గా ఉన్నాయి. నిర్మాణాత్మక  విలువలు ఉన్నతంగా ఉన్నాయి.

అభినయం :
ఒక విధంగా చెప్పాలంటే ఈ సినిమా కార్తి ఒన్ మాన్ షో ..! కదా ప్రకారం మిగత పాత్రలకు ప్రాదాన్యం ఇవ్వాల్సినప్పటికీ... దర్శకుడు మొత్తం భాద్యతను హీరో మీదే వేసి నడిపించాడు. దాంతో సినిమా మొత్తం కార్తి మయంగా కనపడుతుంది. నటుడిగా కార్తి లో ఉన్న టాలెంట్ గురించి , నటన కోసం అతను  పడే కష్టం గురించి వేరే చెప్పే పనే లేదు. ఎందుకంటే వృత్తి  పట్ల అతనికి ఉన్న కమిట్మెంట్ , అంకితభావం ఈ సినిమాలో కూడా స్పష్టంగా కనపడుతుంది.అలానే తెలుగులో మాట్లాడటాన్ని ఈ సినిమాతో మరింత మెరుగు పరుచుకున్నాడు. డాన్సుల్లో మాత్రం వీక్ గా ఉన్నాడు , ఆకట్టుకోలేకపోయాడు. హీరోయిన్ హీరోయిన్ ప్రణీత గురించి మాట్లాడుకునే అవసరమే లేదు.అమెది ఓ ప్రాముఖ్యం లేని ..నాలుగు  సన్నీవేశాలకి, రెండు పాటలకి మాత్రమే పరిమితమైన పాత్ర. ఈ సినిమాలో అసలు హీరోయిన్ సంతానం. హీరో తో పాటే ఉంటూ... ఆద్యంతం నవ్విస్తూ ఎంటర్టైన్ చేశాడు . అసలు ఈ సినిమాకే సంతానం ఓ పెద్ద రిలీఫ్. అతనే కనుక లేక పొతే సినిమా చూడలేం అని చెప్పటం నిజం అవుతుంది. ప్రకాష్ రాజ్, రాధిక, కోట శ్రీనివాస రావు,నాజర్ లవి ప్రాముఖ్యం ఉన్న పాత్రలే కాని ... వాటిని నడిపించే సన్నివేశాలు బలంగా లేకపోవటంతో అవి తేలిపోయినట్టు అనిపించాయి.వారు మాత్రం ఆ పాత్రలకనుగుణంగా  బాగా నటించారు.

చివరిగా :

శంకర్ దయాళ్  శకుని సినిమాను లాజిక్ కు దూరంగా ఉన్నా, ఆసక్తికలిగించలేని మూస కధనం అనే పూనాది మీద నిర్మించాడు. పొతే సినిమా చూసే వాళ్ళు లాజిక్ గురించి ఆలోచిస్తే మాత్రం 'శకుని' కుప్ప కులినట్లే...! అలా  కాకుండా  లాజిక్ ను మర్చిపోతే మాత్రం ఓ రొటీన్ ఎంటర్ టైనర్ తో తృప్తి పడ్డట్టే లేఖ్హ ...!    

Maruthi Talkies Rating : 2.25 out of 5

Banner: Sai Ganesh Production
Cast: Karthi , Pranitha, Prakash Raj, Kota srinivasa rao
Music: G. V. Prakash Kumar
Producer: Bellamkonda Suresh
Directer: N. Shankar Dayal

Wednesday, June 20, 2012

New Angle of Brammi's Comedy

మన బ్రమ్మి నడిస్తే... నవ్వు, కదిల్తే...ఓ .. కిసుక్కు....! బ్రమ్మిని  తలచుకున్నా , చూసినా  వెంటనే గుర్తోచ్చేది చిరునవ్వు . బ్రమ్మి  మాట్లాడుతూ నవ్విస్తాడు... ఏడుస్తూ నవ్విస్తాడు .... భాద పడుతూ నవ్విస్తాడు.... చివరికి జాలి గా ముఖం  పెట్టి కూడా నవ్విస్తాడు.  అలా బ్రమ్మి ఆణువణువూ  హాస్యంతో నిండిపోయి ఓ  హాస్య పరమాణువు అయిపోయాడు.  ఇప్పటివరకు ఎన్నో  కోణాలా నుండి బ్రమ్మిని చూసినా  .. పుష్పక విమానంలా ఆయనలో ఎప్పుడు ఓ నవ్వించే కొత్త కోణం  మిగిలే ఉంటుంది.  తాజాగా ఈ కామెడీ మిషన్ నుండి బయట పడిన కొత్త ప్రోడక్ట్ ఏమిటంటే 'జఫ్ఫా'.  ఈ కొత్తావతరంలో  మన బ్రమ్మి మాటలతోనో.... చేతలతోనో....కాకుండా చేతి వేళ్ళతో నవ్వించే కార్యక్రమం పెట్టాడు. అదెలాగో  మీరే  చూడండి .....!

ఓ మర్డరో.... రేపో....కిడ్నాపో..... ఏదో ఒకటి  చేయకుండా ... ఖాళీగా ఉన్నాడని జఫ్ఫాని  అరెస్ట్ చేసి బొక్కలో పడేసారు....!  అక్కడ జఫ్ఫా......

                           మొత్తానికి ఓ మంచి ప్లేస్ దొరికింది ..... ఇక  హ్యాపీ గా బ్రతికేయ్యవచ్చు...


                     
                        ఎంచక్కా ఆడుకోవచ్చు ..........



                     కావాలంటే పాడుకోవచ్చు.... లేదంటే పడుకోవచ్చు.

                    ఓరి... నీ అయ్యా...! వచ్చింది ఇప్పుడే  కదరా. అప్పుడే నీ కళ్ళు నా మీద పడ్డాయా.....! 


                           సర్లే కాని..... ఏమ్చేస్తాం ...! రాని  చూద్దాం .....
 
                           ఈలోపు ఫ్యాన్ వేసుకుందాం....
 
                          ఇది కూడా నీ ముఖంలానే ఉంది..... తిరగదా ...?
                                                    
                        వాడు నస మొదలు పెడతాడు ...  నువ్వు తిరగవే ...నీ అవ్వ..!       

                       ఇది తిరగటం లేదు.... ఇక  మనకి తప్పేట్టు లేదు...! 
        
       
                       సరే ... చెప్పు...!  ఏంటి సంగతి..?


                        చెప్పింది చాల్లే.... ఇక  ఆపు...!


                      ఇప్పుడు  నేను చెబుతాను .... నువ్విను .....


                       ఇక్కడ నేనున్నంత కాలం ....... మనిద్దరం............

                        ఇలా కలిసి మెలిసి ఉన్నాం అనుకో ....... ఏ  ఇబ్బంది ఉండదు.


                          కాదని ... కాకా పుట్టించావ్ అనుకో...... ఖాతం అయిపోతావ్...!


                            నేనెవరో  తెలుసుగా... జఫ్ఫా... జఫ్ఫానంద. పారిపోయనో...పట్టుకోలేక చస్తావ్..!
                             Handle with care ...... !




Pawan Kalyan's First look from the sets of Cameraman Gangatho Rambabu.......



Power star Pawan kalyan, who tasted a memorable hit after a decade is now busy with his next movie 'Cameraman Gangatho Rambabu'.  Puri Jagannth is the director for this movie. Currently the movie is shooting its first schedule in a specially erected set at Saradhi studio, Hyderabad.

Manisharma is composing the music for this movie. It is heard that Mani has tuned a extraordinary item song for this movie which going to be shot soon as a part of  present schedule. 

Tuesday, June 19, 2012

Devudu Chesina Manushulu Songs Track list



Ravi teja upcoming flick Devudu Chesina Manushulu audio is all set to release on June 22nd. Raghu Kunche has scored the music for this movie and it is his first movie with star director and star hero. Raghu is confident about the songs out put and he is excited about the audience reaction. Lets wait and see what Raghu will get with this album. 

Here is the songs track list of DCM  and wait for the original tracks till 22nd of this month


1. Subba Lakshmi
Singers: Raghu Kunche

2. Nuvvele Nuvvele
Singers: Shreya Goshal

3. Disturb Chethannade
Singers: Suchitra

4. Yemi Sethura
Singers: Udit Narayan, Chinmayi

5. Nuvvante Chala
Singers: Adnan Sami, Joanni

6. Devuda Devuda
Singers: Raghu Kunche, Anjana Soumya

DCM Audio Release Walls

Mass Maharaja Raviteja's latest movie Devudu Chesina Manushulu audio is about to launch on June 22nd. Here are the Latest walls pertinent to Audio release. On these walls Raviteja and Ileana are steeling attention and designs are good too. Go grab it....

       

Friday, June 15, 2012

Review: 'Oka Romantic Crime Kadha'

రివ్యూ :  'ఒక రొమాంటిక్ క్రైం కధ' 
పెద్ద సినిమాల సందడి తక్కువుగా ఉండటం గమనించి అవకాశాన్ని అందిపుచ్చు కోవటానికి 'నంది' చిత్రాల దర్శకుడు పి సునీల్ కుమార్  రెడ్డి దర్శకత్వంలో రూపొందింపబడిన  'ఒక రొమాంటిక్ క్రైం కధ '  ఈ వారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శ్రావ్య  ఫిల్మ్స్ పతాకం  ఫై నిర్మితమైన ఈ చిత్రం లో మనోజ్ నందం , గాయత్రీ, సాయి అనిల్ తదితరులు ప్రధాన పాత్రలు  పోషించారు.  ప్రవీణ్ ఇమ్మడి సంగీతాన్ని అందించాడు. 'సొంత ఊరు ', 'గంగ పుత్రులు' చిత్రాలతో నందులు దక్కించుకుని అవార్డు చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న సునీల్ కుమార్ రెడ్డి ఈ చిత్రం తో కూడా అవార్డులకే పరిమితం అవుతాడో లేక ప్రేక్షకుల ఆదరణ పొందుతాడో మన సమీక్షలో చూద్దాం .

కధ : 
డిగ్రీ  చదువుతున్న వీణ , ఇంటర్ చదువుతున్న అంజలి , టెన్త్ చదువుతున్న తన్మయి బస్ స్టాండ్ ఫ్రెండ్స్  అంటే ఒకే బస్  స్టాప్ లో రోజు కలుసుకుంటూ ఉంటారు. టీనేజ్ లో ఉన్న ఆ ముగ్గురు అమ్మాయిల అనుభవాల సారమే ఈ రొమాంటిక్ క్రైం కధ. వీణను కిరణ్ ప్రేమిస్తున్నానని  మాయచేసి, ఆమెతో శృంగారాన్ని వీడియో తీసి డబ్బులు కావాలని బ్లాక్  మెయిల్ చేస్తాడు. ఆ భాద భరించలేక వీణ ఆత్మ హత్య చేసుకుంటుంది. ఇంట్లో వాళ్ళ ప్రేమ దక్కని అంజలి తనతో ప్రేమగా మాట్లాడే వాళ్ళందరిలోను ప్రేమను వెక్కుంటూ లెక్కకు మించి ఆబార్శన్స్ చేయించుకుని చివరికి తల్లి అయ్యే అవకాశాన్ని కోల్పోతుంది. మద్య తరగతి కుటుంబానికి చెందిన తన్మయి సంజయ్ ని ప్రేమిస్తుంది. అనాధ  అయిన సంజయ్  తన్మయి ని సంతోష పెట్టడం పెట్టడం కోసం  దొంగతనాలు మొదలు పెడతాడు. ఇంట్లో పరిస్థితులు , వీణ మరణానికి కారణం డబ్బు అని అపోహ పడి  దాని కోసం సంజయ్ చేస్తున్న  అసాంఘిక కార్యకలాపాలను ను ప్రోత్సహించటమే కాకుండా అతనికి సహకరిస్తుంది.  అలా  వాళ్ళిద్దరూ ఓ ఎనిమిది మందిని హత్య చేస్తారు. ఆ తదుపరి వారి జీవితాల్లో ఏ  విధమైన మార్పులు చోటు చేసుకున్నాయ్ అన్నది మిగిలిన కధ.

విశ్లేషణ: 

దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి కి ఉన్న సామజిక స్పృహ అభినందించతగ్గది. నేటి సమాజం లో ఉన్న ఎన్నో రుగ్మతలను ఇతివృత్తం గా చేసుకుని అయన సినిమాలు రూపొందించటం మంచి పరిణామం. ఎందుకంటే కమర్షియల్... కమర్షియల్... అంటూ కృత్రిమత్వాన్ని , అసహజాన్ని ప్రేక్షకుల ఫై రుద్దుతున్న వారి కంటే సునీల్ కుమార్ అనుసరిస్తున్న మార్గం , తన పరిధిలో చేస్తున్న ప్రయత్నం శ్లాఘనియ్యం. కధ  వస్తువు ఎంపిక వరకు మాత్రమే ఈ ప్రోత్సాహం .. అది మిహన సినిమాను రూపొందించే  విషయంలో అయన  ఎన్నో తరాల వెనుకబడినట్టు అనిపిస్తుంది. బహుశా అది అయన వయసు ప్రభావం కావొచ్చు. ఎందుకంటే ఇప్పుడు  మార్కెట్ లో ఉన్న లేటెస్ట్ టెక్నాలజీ తో తక్కువ బడ్జెట్ తోనే ఎన్నో అద్భుతాలు చేస్తున్నారు . ఆ విషయాల మీద ఆయనకు అవగాహనా లేకపోవటం విచారించ తగ్గ విషయం. అలానే సినిమాను ఓ కదల చెప్పుకు పోవటం కాకుండా ఇంటిలిజెంట్ స్క్రీన్ ప్లే తో ప్రేక్షకులను కట్టి పడెయ్యొచ్చు. ఆ కోణం లో అయన కృషి శూన్యం . ముఖ్యంగా ఈ సినిమాకు కొద్దిగా సస్పెన్స్ అద్ది , కొంచెం త్రిల్ చేసే స్క్రీన్ ప్లే ని జోడించి నట్టైతే ... ఒక ఫీల్ ఉన్న సినిమాలగా మనసుకు హత్తుకునేది. అలా  లేక పోవటంతో  సన్నివేశాలు వార్త కధనాలను , నేరాలు ఘోరాలు లాంటి కార్యక్రమాలను తలపించాయి తప్పించి  సినిమా చూస్తున్నట్టు అనిపించవు. అలానే ప్రతి పరదా వెనుక ఓ రహస్యం ఉంది .. , మనం చేసే ప్రతి తప్పు రికార్డు చేయ బడుతుంది . అది ఏదో ఒక రోజు బయట పడక తప్పదు . అనే మాటల్లో ఉన్న సత్యాన్ని సైబర్ క్రైం , టీనేజ్ సెక్స్ , టీనేజ్ అబోర్శన్స్ అనే అసాంఘిక కార్యకలాపాలను ఆధారంగా చేసుకుని దర్శకుడు తన పరిదిలో విడమరచి ఓ డాక్యుమెంటరీ ల బాగానే చెప్పాడు. కాకపోతే ఆ అంశాల గురించి అయన పేపర్లలోనూ , టివిలలోను వస్తున్నా సమాచారాన్నే బాసే చేసుకున్నాడు కాని వాటి మీద పెద్దగా రిసెర్చ్ చేసినట్టు కనిపించదు. దాంతో ఈ సినిమా పేపర్ లోనో , టివి లోనో  వస్తున్నా  కధనంలా  అనిపిస్తుంది.  అంతకు మించి ఈ  సినిమాలో   కొత్తగా చెప్పిందేమీ లేదు. అలానే దర్శకుడి కధనంలో సమాజం మీద , పరిస్థితుల మీద ఒక రకమైన నెగిటివ్ అభిప్రాయం కనబడుతూ ఉంటుంది. దాంతో మన చుట్టూ ఉన్న సమాజం లో మంచి అన్నదే లేదు అంత  మోసమే అన్న ఫీలింగ్ కలుగుతుందే తప్పా .. ఏదో మెసేజ్ తీసుకుంటున్న ఫీలింగ్ మాత్రం కనిపించదు. సినిమా పోస్టర్ల మీద కనిపిస్తున్న ఆ రెండు కాప్షన్స్  మినహా సినిమాలో ఉన్న మాటలు మెప్పించలేకపోయాయి. ప్రవీణ్ ఇమ్మడి పాటలు , బ్యాక్ స్కోరు బాగాలేవు. సాంకేతికంగా ఈ సినిమాలో ఎంచాలేనన్ని తప్పులు ఉన్నాయి. ఈ సినిమాకు పనిచేసిన  సినిమాటోగ్రఫర్ పి  సి శ్రీరామ్ దగ్గర చేసాడు అని చెప్పారు. అయన దగ్గర పనిచేసిన సాబు జేమ్స్ పనితనం చూసి మతిపోతుంది. మరి దారుణంగా కొన్ని ఫ్రేముల్లో ఆర్టిస్ట్ పేస్ కట్ అయిపోతున్న గమనించక పోవటం ఏమి టాలెంటో  అర్ధం కాదు. ఎడిటింగ్ కూడా ఫుల్ జేర్క్లు లతో ఉంది. దాదాపు అన్ని విభాగాలు ఇన్ కంప్లీట్ వర్కే  చేశాయి.  

పాత్రల  పరం గా ముగ్గురమ్మాయిలు, సంజయ్, కిరణ్ పాత్రలను దర్శకుడు బాగా మలిచాడు. మనోజ్ నందం సంజయ్  పాత్రలో బాగా నటించాడు. తన్మయి పాత్రలో నటించిన గాయత్రీ ఆకట్టుకుంది. ఆమె వాయిస్ ప్రత్యేకంగా ఉంది బాగుంది. నటనలో ఈజ్ కనబరిచింది . వీరిద్దరి తరవాత సాయి అనిల్ గురించి చెప్పుకోవాలి. ఈ కుర్రాడు ప్లే బాయ్ గా హుషారైన నెగిటివ్ పాత్రలో నటించి మెప్పించాడు. ఈ ఐదు పాత్రలకు  మినహా సినిమా లో ఉన్న మిగత పాత్రలకు పెద్ద గుర్తింపు లేదు. అలానే వాటిలో నటించిన వాళ్ళుకూడా అలరించలేక పోయారు.

ప్లస్ పాయింట్స్: 

కధ  వస్తువు, టీనేజ్ కుర్రాళ్ళను ఆకట్టుకునేట్టు ఈ సినిమాకు చేసిన పబ్లిసిటీ కొంత వరకు ప్లస్ పాయింట్

మైనస్ పాయింట్:
 ఆసక్తికరంగా  లేని కధనం, కామెడీ సహా ఎంటర్ టైన్ మెంట్ లేక పోవటం, సాంకేతిక పరమైన తప్పులు ఈ సినిమాకు మైనస్ పాయింట్స్.

కొసమెరుపు: 

ప్రతి పరదా వెనుక ఒక రహస్యం ఉన్నట్టు , ఈ సినిమా వెనుక కూడా ఒక రహస్యం  ఉంది. అదేమంటే ఈ సినిమాకు  ఉన్న 'ఎ' సర్టిఫికేట్ చూసి, ఏవో కొన్ని మాటలు విని ఏదో ఊహించుకుని, మరేదో ఆశించి  సినిమాకు వెళ్తే  మాత్రం తప్పక నిరాశ పడతారు . ఎందుకంటే ఈ సినిమా 'ఎ' సర్టిఫికేట్ వేయించుకున్న ఒక సందేసాత్మక చిత్రం.  

.  
       

Tuesday, June 5, 2012

మనసులు కొల్లగొడుతున్న అందాల రాక్షసి...!

ఎందుకనో ఆ సినిమాను చూడగానే ఒక్కసారిగా మణిరత్నం గీతాంజలి గుర్తుకొచ్చింది. మూస సినిమాలతో ముఖం మోత్తిపోయి ఉన్న నాకు  'అందాల రాక్షసి' టీజర్ చూడగానే సరి కొత్తగా అనిపించింది, ఏవో చిలిపి ఊహలు మనసును ఆహ్లాద పరిచాయి. వెంటనే అనుమానం వచ్చింది  ఇదేదో తమిళ సినిమా అని.... కాని హను రాఘవపూడి, నవీన్ ఈ పేర్లు చూడగానే ప్రాణం లేచొచ్చింది . ఇది  మన తెలుగు సినిమా అని ఆనందం కలిగింది. దర్శకుడు హను కేమెర కళ్ళకు ఉన్న అందం అతను  చూపించిన ప్రతి ఫ్రేం లో కనిపించింది. ముఖ్యంగా రోడ్డు పక్కన పడై పోయిన కారు, హీరోయిన్, ఆమె కు డబ్బింగ్ చెప్పిన వాయిస్,  మైమరపించే  లోకేషన్స్ చాల చాల కొత్తగా అనిపించాయి. మొత్తానికి అందరు కొత్తవారితో నిర్మితమైన ఈ సినిమా కొంగోత్తగా ఉంది. కాకపోతే అర నిమిషం , నిమిషం పాటు అయితే బాగానే ఆకట్టుకున్నారు కాని రెండున్నర గంటలు ఎలా కూర్చో పెడతారో ... చూడాలని తహ తహగా ఉంది.