Pages

Ads 468x60px

Text Widget

Recent Posts

Definition List

Download

Friday, June 15, 2012

Review: 'Oka Romantic Crime Kadha'

రివ్యూ :  'ఒక రొమాంటిక్ క్రైం కధ' 
పెద్ద సినిమాల సందడి తక్కువుగా ఉండటం గమనించి అవకాశాన్ని అందిపుచ్చు కోవటానికి 'నంది' చిత్రాల దర్శకుడు పి సునీల్ కుమార్  రెడ్డి దర్శకత్వంలో రూపొందింపబడిన  'ఒక రొమాంటిక్ క్రైం కధ '  ఈ వారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శ్రావ్య  ఫిల్మ్స్ పతాకం  ఫై నిర్మితమైన ఈ చిత్రం లో మనోజ్ నందం , గాయత్రీ, సాయి అనిల్ తదితరులు ప్రధాన పాత్రలు  పోషించారు.  ప్రవీణ్ ఇమ్మడి సంగీతాన్ని అందించాడు. 'సొంత ఊరు ', 'గంగ పుత్రులు' చిత్రాలతో నందులు దక్కించుకుని అవార్డు చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న సునీల్ కుమార్ రెడ్డి ఈ చిత్రం తో కూడా అవార్డులకే పరిమితం అవుతాడో లేక ప్రేక్షకుల ఆదరణ పొందుతాడో మన సమీక్షలో చూద్దాం .

కధ : 
డిగ్రీ  చదువుతున్న వీణ , ఇంటర్ చదువుతున్న అంజలి , టెన్త్ చదువుతున్న తన్మయి బస్ స్టాండ్ ఫ్రెండ్స్  అంటే ఒకే బస్  స్టాప్ లో రోజు కలుసుకుంటూ ఉంటారు. టీనేజ్ లో ఉన్న ఆ ముగ్గురు అమ్మాయిల అనుభవాల సారమే ఈ రొమాంటిక్ క్రైం కధ. వీణను కిరణ్ ప్రేమిస్తున్నానని  మాయచేసి, ఆమెతో శృంగారాన్ని వీడియో తీసి డబ్బులు కావాలని బ్లాక్  మెయిల్ చేస్తాడు. ఆ భాద భరించలేక వీణ ఆత్మ హత్య చేసుకుంటుంది. ఇంట్లో వాళ్ళ ప్రేమ దక్కని అంజలి తనతో ప్రేమగా మాట్లాడే వాళ్ళందరిలోను ప్రేమను వెక్కుంటూ లెక్కకు మించి ఆబార్శన్స్ చేయించుకుని చివరికి తల్లి అయ్యే అవకాశాన్ని కోల్పోతుంది. మద్య తరగతి కుటుంబానికి చెందిన తన్మయి సంజయ్ ని ప్రేమిస్తుంది. అనాధ  అయిన సంజయ్  తన్మయి ని సంతోష పెట్టడం పెట్టడం కోసం  దొంగతనాలు మొదలు పెడతాడు. ఇంట్లో పరిస్థితులు , వీణ మరణానికి కారణం డబ్బు అని అపోహ పడి  దాని కోసం సంజయ్ చేస్తున్న  అసాంఘిక కార్యకలాపాలను ను ప్రోత్సహించటమే కాకుండా అతనికి సహకరిస్తుంది.  అలా  వాళ్ళిద్దరూ ఓ ఎనిమిది మందిని హత్య చేస్తారు. ఆ తదుపరి వారి జీవితాల్లో ఏ  విధమైన మార్పులు చోటు చేసుకున్నాయ్ అన్నది మిగిలిన కధ.

విశ్లేషణ: 

దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి కి ఉన్న సామజిక స్పృహ అభినందించతగ్గది. నేటి సమాజం లో ఉన్న ఎన్నో రుగ్మతలను ఇతివృత్తం గా చేసుకుని అయన సినిమాలు రూపొందించటం మంచి పరిణామం. ఎందుకంటే కమర్షియల్... కమర్షియల్... అంటూ కృత్రిమత్వాన్ని , అసహజాన్ని ప్రేక్షకుల ఫై రుద్దుతున్న వారి కంటే సునీల్ కుమార్ అనుసరిస్తున్న మార్గం , తన పరిధిలో చేస్తున్న ప్రయత్నం శ్లాఘనియ్యం. కధ  వస్తువు ఎంపిక వరకు మాత్రమే ఈ ప్రోత్సాహం .. అది మిహన సినిమాను రూపొందించే  విషయంలో అయన  ఎన్నో తరాల వెనుకబడినట్టు అనిపిస్తుంది. బహుశా అది అయన వయసు ప్రభావం కావొచ్చు. ఎందుకంటే ఇప్పుడు  మార్కెట్ లో ఉన్న లేటెస్ట్ టెక్నాలజీ తో తక్కువ బడ్జెట్ తోనే ఎన్నో అద్భుతాలు చేస్తున్నారు . ఆ విషయాల మీద ఆయనకు అవగాహనా లేకపోవటం విచారించ తగ్గ విషయం. అలానే సినిమాను ఓ కదల చెప్పుకు పోవటం కాకుండా ఇంటిలిజెంట్ స్క్రీన్ ప్లే తో ప్రేక్షకులను కట్టి పడెయ్యొచ్చు. ఆ కోణం లో అయన కృషి శూన్యం . ముఖ్యంగా ఈ సినిమాకు కొద్దిగా సస్పెన్స్ అద్ది , కొంచెం త్రిల్ చేసే స్క్రీన్ ప్లే ని జోడించి నట్టైతే ... ఒక ఫీల్ ఉన్న సినిమాలగా మనసుకు హత్తుకునేది. అలా  లేక పోవటంతో  సన్నివేశాలు వార్త కధనాలను , నేరాలు ఘోరాలు లాంటి కార్యక్రమాలను తలపించాయి తప్పించి  సినిమా చూస్తున్నట్టు అనిపించవు. అలానే ప్రతి పరదా వెనుక ఓ రహస్యం ఉంది .. , మనం చేసే ప్రతి తప్పు రికార్డు చేయ బడుతుంది . అది ఏదో ఒక రోజు బయట పడక తప్పదు . అనే మాటల్లో ఉన్న సత్యాన్ని సైబర్ క్రైం , టీనేజ్ సెక్స్ , టీనేజ్ అబోర్శన్స్ అనే అసాంఘిక కార్యకలాపాలను ఆధారంగా చేసుకుని దర్శకుడు తన పరిదిలో విడమరచి ఓ డాక్యుమెంటరీ ల బాగానే చెప్పాడు. కాకపోతే ఆ అంశాల గురించి అయన పేపర్లలోనూ , టివిలలోను వస్తున్నా సమాచారాన్నే బాసే చేసుకున్నాడు కాని వాటి మీద పెద్దగా రిసెర్చ్ చేసినట్టు కనిపించదు. దాంతో ఈ సినిమా పేపర్ లోనో , టివి లోనో  వస్తున్నా  కధనంలా  అనిపిస్తుంది.  అంతకు మించి ఈ  సినిమాలో   కొత్తగా చెప్పిందేమీ లేదు. అలానే దర్శకుడి కధనంలో సమాజం మీద , పరిస్థితుల మీద ఒక రకమైన నెగిటివ్ అభిప్రాయం కనబడుతూ ఉంటుంది. దాంతో మన చుట్టూ ఉన్న సమాజం లో మంచి అన్నదే లేదు అంత  మోసమే అన్న ఫీలింగ్ కలుగుతుందే తప్పా .. ఏదో మెసేజ్ తీసుకుంటున్న ఫీలింగ్ మాత్రం కనిపించదు. సినిమా పోస్టర్ల మీద కనిపిస్తున్న ఆ రెండు కాప్షన్స్  మినహా సినిమాలో ఉన్న మాటలు మెప్పించలేకపోయాయి. ప్రవీణ్ ఇమ్మడి పాటలు , బ్యాక్ స్కోరు బాగాలేవు. సాంకేతికంగా ఈ సినిమాలో ఎంచాలేనన్ని తప్పులు ఉన్నాయి. ఈ సినిమాకు పనిచేసిన  సినిమాటోగ్రఫర్ పి  సి శ్రీరామ్ దగ్గర చేసాడు అని చెప్పారు. అయన దగ్గర పనిచేసిన సాబు జేమ్స్ పనితనం చూసి మతిపోతుంది. మరి దారుణంగా కొన్ని ఫ్రేముల్లో ఆర్టిస్ట్ పేస్ కట్ అయిపోతున్న గమనించక పోవటం ఏమి టాలెంటో  అర్ధం కాదు. ఎడిటింగ్ కూడా ఫుల్ జేర్క్లు లతో ఉంది. దాదాపు అన్ని విభాగాలు ఇన్ కంప్లీట్ వర్కే  చేశాయి.  

పాత్రల  పరం గా ముగ్గురమ్మాయిలు, సంజయ్, కిరణ్ పాత్రలను దర్శకుడు బాగా మలిచాడు. మనోజ్ నందం సంజయ్  పాత్రలో బాగా నటించాడు. తన్మయి పాత్రలో నటించిన గాయత్రీ ఆకట్టుకుంది. ఆమె వాయిస్ ప్రత్యేకంగా ఉంది బాగుంది. నటనలో ఈజ్ కనబరిచింది . వీరిద్దరి తరవాత సాయి అనిల్ గురించి చెప్పుకోవాలి. ఈ కుర్రాడు ప్లే బాయ్ గా హుషారైన నెగిటివ్ పాత్రలో నటించి మెప్పించాడు. ఈ ఐదు పాత్రలకు  మినహా సినిమా లో ఉన్న మిగత పాత్రలకు పెద్ద గుర్తింపు లేదు. అలానే వాటిలో నటించిన వాళ్ళుకూడా అలరించలేక పోయారు.

ప్లస్ పాయింట్స్: 

కధ  వస్తువు, టీనేజ్ కుర్రాళ్ళను ఆకట్టుకునేట్టు ఈ సినిమాకు చేసిన పబ్లిసిటీ కొంత వరకు ప్లస్ పాయింట్

మైనస్ పాయింట్:
 ఆసక్తికరంగా  లేని కధనం, కామెడీ సహా ఎంటర్ టైన్ మెంట్ లేక పోవటం, సాంకేతిక పరమైన తప్పులు ఈ సినిమాకు మైనస్ పాయింట్స్.

కొసమెరుపు: 

ప్రతి పరదా వెనుక ఒక రహస్యం ఉన్నట్టు , ఈ సినిమా వెనుక కూడా ఒక రహస్యం  ఉంది. అదేమంటే ఈ సినిమాకు  ఉన్న 'ఎ' సర్టిఫికేట్ చూసి, ఏవో కొన్ని మాటలు విని ఏదో ఊహించుకుని, మరేదో ఆశించి  సినిమాకు వెళ్తే  మాత్రం తప్పక నిరాశ పడతారు . ఎందుకంటే ఈ సినిమా 'ఎ' సర్టిఫికేట్ వేయించుకున్న ఒక సందేసాత్మక చిత్రం.  

.  
       

1 comment:

  1. keka gaa rasav maruthi talkies, ikka nenu ninnu follow avvutnna...

    ReplyDelete