Pages

Ads 468x60px

Text Widget

Recent Posts

Definition List

Download

Thursday, September 27, 2012

ప్రివ్యూ : మాస్ ప్రేక్షకుల ఆశలపందిరి 'రెబెల్'



ప్రతి సినిమాకు విడుదలకు ముందు కొన్ని అంచనాలు ఉంటాయి. అందులోను ప్రభాస్ లాంటి హీరో ఉన్నమాస్ సినిమా అంటే అంచనాలకు హద్దు, పొద్దు ఉండదు.  యేడాదిన్నార పాటు చడి చప్పుడు లేకుండా షూటింగ్ చేసుకున్న ఈ సినిమా మొదటి టిజర్ విడుదలతో అందరి దృష్టిని ఆకర్షించింది. కాని తరవాత విడుదలైన పాటలు కొంత నిరాశపరిచినప్పటికీ లారెన్స్ కాబట్టి పాటలు వినటానికి ఓ మాదిరిగా ఉన్నా .. చూడటానికి అదరగొట్టి ఉంటాడులే అని సర్దిపెట్టుకున్నారు.

పాటల సంగతి పక్కన పెడితే ఈ సినిమాలో వీర మాస్ అంశాలు వీపరీతంగా ఉన్నాయని సినిమాను చూసిన కొంతమంది చెబుతున్నారు. రెబెల్ లో 10  నుండి 12 వరకు ఒళ్లుగగుర్పోడిచే యాక్షన్ సన్నివేశాలున్నాయని, క్లైమాక్స్ లో వచ్చే ఫైట్ అయితే ఫైటింగులకే తాతలా ఉందనీ ... యాక్షన్ సినిమాలను ఇష్టపడేవారికి ఈ 'రెబెల్ ' మళ్ళి వచ్చిన  బోనాల్ జాతర అని చెప్పుకొస్తున్నారు.  కాకపోతే ఈ రిపోర్ట్ ను  పూర్తిగా నమ్మటానికి వీలులేదు.  ఎందుకంటే  ఇప్పుడు సినిమాను చూసేవాళ్ళు హీరోకు , నిర్మాతలకు అనుకూలంగా ఉండే వాళ్ళు. దాదాపు వాళ్ళ రిపోర్ట్ పాజిటివ్ గానే ఉంటుంది. అసలు సంగతి రేపు కాని తెలియదు. 

ఏదేమైనప్పటికీ కొన్ని అంశాలు సినిమా మీద ఆసక్తిని నిలబెడుతున్నాయి. ముఖ్యంగా లారెన్స్  చిత్రీకరణ స్టైల్, అయన వేయించే స్టెప్పులు ప్రధానమైన ఆకర్షణలు. మాస్ కు ఏమికావాలో నాకు తెలుసు అని ప్రకటించిన లారెన్స్ రెబెల్ ను మాస్ మయం చేసాడు. చివరికి ముద్దులు  కుడా మాస్ గానే పెట్టించాడు. 
తమన్నాను ఎలా చూపిస్తే మాస్ కు నచ్చుతుందో... అలానే చూపించాడు. 

     ఇక ప్రభాస్ గురించైతే చెప్పనే అవసరం లేదు.... ఛత్రపతి ని గుర్తుకుతెస్తున్నాడు. ఇవన్నీ సినిమాకు ప్లస్ లు. ఎంత వద్దనుకున్న కొన్ని మైనస్ లు తప్పకుండా ఉంటాయి.... !

రెబెల్ కి ముప్పు కధ , కధనాల నుండి పొంచి ఉంటుంది. ఏలనంటే.... గత చిత్రాల అనుభవం దృష్ట్యా మన రాఘవ లారెన్స్ లాజిక్ ను విడిచి మ్యాజిక్ మీద స్వారి చేస్తాడు అన్నది సత్యం. అందుకు నిదర్శనం నిన్న వచ్చిన ట్రైలర్ లో....  రెండేళ్ళు ఉపవాసం ఉన్న పులి డైలాగ్, దానిని ప్రభాస్ చెప్పిని తీరు లాజిక్ అనే మాటను చిన్నాభిన్నం చేశాయి . Rebel Dialogue Trailer

కధ విషయానికి వస్తే 'ఓ మంచి డాన్ కు కొడుకైన హీరో తండ్రి మరణంతో రెబెల్ గా మారి ప్రతినాయకుల భరతం పడతాడు అని కొందరు చెబుతుంటే... ప్రేమించిన అమ్మాయిని చంపినా వాళ్ళ ఫై పగ తీర్చుకోవటానికి రెబెల్ గా మారతాడు అని కొందరు వినిపిస్తున్నారు. రెంటిలో  ఏదైనప్పటికీ కధ రొటీన్ అండ్ సింపుల్ అని అర్ధం అవుతుంది. ఇక ఆశలన్ని లారెన్స్ మాస్టర్ టేకింగ్ మీదే...! 

ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు ఈ  సినిమా ఫై ఉన్న అంచనాల  ప్రకారం ఛత్రపతి రేంజ్ కి కొద్దిగా దగ్గరగా అనిపిస్తే  చాలు రెబెల్ సూపర్ హిట్ అవటం ఖాయం. ఎందుకంటే  మాస్ జనాలు వీర భీభత్స మాస్ సినిమా కోసం మొహం వాచీ పోయి ఉండటం ఒక కారణం అయితే.... కెమెరామాన్ గంగతో రాంబాబు సినిమా వచ్చే వరకు మరో పెద్ద సినిమా  లేకపోవటంతో  మూడు వారలు దియేటర్ లు అపుకునే అవకాశం ఉండటం మరో కారణం.

ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా బాక్స్ ఆఫీసుల దగ్గర రెబెల్ సందడి మొదలైంది. మరి ఈ సందడి ఎన్నాళ్ళు కొనసాగుతుందో.... రేపు తేలుతుంది. 

No comments:

Post a Comment