కృష్ణ వంశీ కృషి కారణంగా శ్రీ ఆంజనేయం సినిమాతో తెలుగు తెర ఫై తన అందాల విందును ప్రారంబించిన పంజాబీ బొద్దుగుమ్మ ఛార్మి తన టాలెంట్ తో కొంత కాలం తెలుగు ప్రేక్షకులను ఒక ఊపు ఉపింది. కాని అమ్మడి దురదృష్టంకొద్ది పెర్ఫార్మన్స్ కు అవకాశం ఉన్నా పాత్రలకంటే గ్లామర్ వెదజల్లే పాత్రలే ఎక్కువ వచ్చాయి. దాంతో రోజు ఒకే రకం భోజనం ఎన్నాళ్ళు తినగలరు అన్న సిద్దాంతం ప్రకారం తెలుగు అగ్ర దర్శకులకు, అదిక శాతం ప్రేక్షకులకు తొందరగానే దూరం అయ్యింది.
అందుకు నిదర్శనం 2002 లో కెరీర్ మొదలు పెట్టిన ఈ బబ్లి గర్ల్ 2004 లో శ్రీ ఆంజనేయం చిత్రంతో ట్రాక్ లో పడింది, ఆ తరవాత కేవలం సంవత్సరాలలో దాదాపు అందరు పెద్ద హీరోలతో నటించిన, 2006 లో రాఖి తరవాత ఇప్పటి వరకు అగ్ర నటుడితో నటించే మరో అవకాశాన్ని దక్కించుకోలేకపోయింది. మద్యలో మంత్ర , మంగళ చిత్రాలతో కొంత గుర్తింపు తెచ్చుకుంది కాని ఒక వర్గం ప్రేక్షకులనే మెప్పించగలిగింది. చివరికి ఈ చిన్నదాన్ని ప్రోత్సహించే నాగార్జున కూడా ఐటెం సాంగ్స్ వరకే పరిమితం చేసాడు.
కాని 'రగడ' తరవాత అలాంటి అవకాశాలు కూడా ఛార్మికి ఎదురవటం మానేశాయి. అలా నిరాశగా సాగిపోతున్న ఆమె కెరీర్ లో తాజాగా 'డమరుకం' రూపంలో కొత్త ఆశలు చిగురించాయి. పుణ్యం ఎవరిదైన కాని చార్మికి 'సక్కుభాయి' ఐటెం సాంగ్ అనే వరం దొరికింది. ఇప్పుడు ఈ అవకాశాన్ని 200 % సద్వినియోగపరుచుకోవటానికి సిద్దం అయ్యింది. అందుకోసం ఓ పక్క సెట్స్ లో శక్తికి మించి కష్టపడుతూనే మరో పక్క అవకాశం మేర ఈ విషయాన్నీ అన్ని మార్గాల్లో విపరీతంగా ప్రచారం చేస్తుంది.
అందులో భాగంగా ఈ మద్య 'కెవ్వు కేక ' పాటతో తెలుగు ప్రేక్షకులను ఊర్రుతలుగించిన దేవి శ్రీ ఈ 'సక్కుబాయి' పాటను కూడా ఆ రేంజ్ లో రూపొందించాడని గొప్పగా చెప్పుకుంటుంది. తను 'మనీ' అని ముద్దుగా పిలిచే నాగ్ తో వేసే స్టెప్పులు బాగుంటాయని చెబుతూనే .... ఈ పాటలో కొత్తగా కనిపించే తన రూపం.... సరికొత్త మొమెంట్స్ ప్రత్యేకంగా మీ కోసం అని జనాలను ఊరిస్తుంది. అంతే కాకుండా 'ఉందిలే మంచి కాలం ముందు ముందునా ...' అంటూ పాడుకుంటూ..... ఈ పాటతో తన కెరీర్ కు మంచి మలుపు దొరుకుతుందని బోలుడన్ని ఆశలు పెట్టుకుంది.
అలా ఎంతో నమ్మకంగా ఛార్మి నిర్మించుకుంటున్న ఈ ఆశల నావ ఏ తీరం చేరుతుందో తెలుసుకోవటానికి అక్టోబర్ వరకు ఆగాల్సిందే.....!



No comments:
Post a Comment