Pages

Ads 468x60px

Text Widget

Recent Posts

Definition List

Download

Monday, September 24, 2012

Watch New NTR in Badshah


రఫ్ అండ్ టఫ్ గా ఉండే జూనియర్ యన్ టి ఆర్ రాజకుమారిడిలా తయారైయ్యాడు. స్టైలిష్ లుక్ లో, వెరైటి హెయిర్ స్టైల్ తో,  వెల్ దిజైన్డ్ కాస్ట్యూమ్స్ తో చాలా క్యుట్ గా కనిపిస్తున్నాడు. మొత్తానికి శ్రీను వైట్ల ఒక కొత్త యన్ టి ఆర్ ను ప్రేక్షకులకు చూపించటానికి కష్టపడుతున్నాడని అర్ధం అవుతుంది. శ్రీను తన పుట్టిన రోజు స్పెషల్ గా ఈ ట్రైలర్ తో యన్ టి ఆర్ అభిమానులకు మంచి ట్రీట్ ఇచ్చాడు. 

యన్ టి ఆర్  ఈ సినిమాలో పెద్ద డాన్ పాత్రలో నటిస్తున్నట్టు అనిపిస్తుంది. ట్రైలర్ లో కనిపించిన వాతావరణం అందుకు తగ్గట్టుగానే కనిపిస్తుంది . బ్యాక్ స్కోరు డాన్ సినిమాను గుర్తుకుతెస్తుంది. అలానే ముకేష్ రుషి, ఆశిష్ విద్యార్ధి, కిల్లి దోర్జీ, ఆదిత్య వంటి  నలుగురు ప్రముఖ విలన్స్ కనిపిస్తున్నారు. చివరిలో డైలాగ్ 'బాద్షా డిసైడ్ అయితే వార్ ఒన్ సైడ్ అయిపోద్ది...!' ఆ రోల్ కెపాసిటీ ఎంటో  తెలియజేస్తుంది.

అలానే ట్రైలర్ లో 'The Privilege For Gentleman' అని ఉంది. అంటే  'బాద్షా అనే వ్యక్తీ జంటిల్ మాన్ అనే పదానికి దక్కిన అరుదైన గౌరవం' అని అర్ధం వస్తుంది. అది ఎంత వరకు అనేది వెండితెర మీద చూడాల్సిందే...! ఇకపోతే ఈ ట్రైలర్ లో మనకు కనిపించింది  సినిమాకు ఒక వైపే... మరో వైపు శ్రీను వైట్ల మార్క్ ఎంటర్ టైన్ మెంట్ ఉంటుంది కాదా...! అందుకోసం కూడా వైట్ల ఈ సినిమాలో అన్ని ఏర్పాట్లు ఘనంగానే చేసినట్టు సమాచారం. 

'బాద్షా డిసైడ్ అయితే వార్ ఒన్ సైడ్ అయిపోద్ది...!' అన్నట్టుగానే శ్రీను వైట్ల డిసైడ్ అయితే ఎంటర్ టైన్ మెంట్ వరదలై పారుద్ది..! అన్న సంగతి మనందరికీ తెలుసు కాబట్టి ఆసక్తిగా బాద్షా కోసం వేచి చూద్దాం ...!   

No comments:

Post a Comment