విలక్షణ నటుడిగా దక్షిణాదిన నాలుగు బాషలతో పాటు బాలీవుడ్ లో కూడా తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాయించుకున్న 'మోనార్క్' ప్రకాష్ రాజ్ లేటు వయసులో లేటెస్ట్ ఆలోచనలు చేస్తూ తాజాగా డాన్సర్ గా తన ప్రతిభను నిరూపించుకునే ప్రయత్నాల్లో ఉన్నాడు. అందుకు కోలీవుడ్ వేదిక కానుంది. వివరాలలోకి వెళ్తే....
తమిళంలో 'తులు విలయాడు ' అనే చిత్రంలో ఓ ప్రధాన భూమిక పోషిస్తున్నాడు ప్రకాష్ రాజ్. ఆ పాత్రకు ప్రతినాయక చాయలున్నప్పటికి మంచి హుషారుగా ఉంటుందంటా..! ఆ పాత్రలో ఉన్న జోరును జనానికి తెలియజేయటానికి ఆ చిత్ర దర్శకుడు ఒక మాంచి ఊపున్న మసాలా పాటను ట్యూన్ చేయించి అంతే మజాగా చిత్రీకరణ కానిచ్చేశాడంటా..!
ఇప్పుడు ఆ పాట గురించి తమిళనాట మోతాదుకు మించి ప్రచారం జరుగుతుంది. అంత విశేషం ఏముందా అని అరా తీస్తే... ఆ పాటలో ప్రకాష్ రాజ్ 'కుత్తు ' అనే తమిళ నాటు డాన్స్ ను చించి అరెశాడంటా..! వారి సంస్కృతికి సంబంధించి ఏ చిన్న విషయాన్ని కూడా గొప్పగా ప్రచారం చేసుకునే తమిళ తంబిలు ఈ విషయానికి కూడా అంతే ప్రాదాన్యత ఇచ్చారు.
కుత్తు డాన్స్ అంటే ఎదో గొప్ప డాన్స్ అనుకునేరు... నాటు డప్పుల చప్పుడికి టంటనకర... టంటనకర.. అంటూ మన వాళ్ళు వేస్తారు చూడండి చిందులు అలాంటిదే ...! కాకపోతే తేడా ఏమిటంటే తమిళులు ఆ డాన్స్ కు తమ జాతి జానపద నాట్యంగా గౌరవం కట్టబెట్టి ఎంతో విలువ ఇస్తారు.







No comments:
Post a Comment