దేనికైనా రెడీ చిత్రం ఫై చెలరేగుతున్న వివాదం ముదిరి దాడులు చేసుకునే స్థాయికి వచ్చింది. తాజాగా ఈ రోజు రాత్రి 8 గంటలకు కొన్ని బ్రాహ్మణ సంఘాలు ఫిలిం నగర్ లోని మోహన్ బాబు ఇంటి ముందు ధర్నాకు యత్నించగా మోహన్ బాబు సెక్యూరిటీ సిబ్బంది , కొంతమంది అనుచరులు దాడి చేసినట్టు మీడియా లో వస్తున్నా కధనాలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ ఘటనలో పలువురు గాయపడినట్టు తెలుస్తుంది.
ఈ సంఘటనను ఇరు వర్గాలు చాలా సీరియస్ గా తీసుకున్నట్టు తెలుస్తుంది. రాష్ట్ర, దేశ వ్యాప్త బ్రాహ్మణ సంఘాలు దాడిని ఖండించి మోహన్ బాబు ను అరెస్ట్ చేయాలనీ డిమాండ్ చేస్తుంటే.... రాత్రి వేళా ఇంటి ఫైకి వచ్చి దౌర్జన్యం చేస్తే ప్రతిఘటించాం, ఇక ఫై ఇళ్ళ మీదకు దాడికి వస్తే చూస్తూ ఊరుకోం అని మంచు విష్ణు తీవ్రంగా స్పందించాడు. ప్రజాస్వామిక పద్దతుల్లో నిరసన తెలియచేయటం, కేసులు పెట్టడం పద్దతి, అందుకు మేము అదే రీతిలో సహకరిస్తాం... అంతే కాని భౌతిక దాడులకు దిగితే సహించం అని గట్టిగా చెప్పాడు.
ఈ వివాదంలో ఇరు వర్గాలు సామరస్యంగా ఆలోచించకుండా ఎవరి పంతం వాళ్ళు నెగ్గించుకోవాలనుకోవటమే సమస్య పెద్దదవటానికి కారణంగా కనపడుతుంది. గోరంతల్ని కొండంతలు చేసుకుని ఒకరు వర్గం అవేశాపడుతుంటే గోటి తో పోయేదాన్ని గొడ్డలి దాక తెచ్చుకుని మరో వర్గం లేని ఇబ్బందుల్ని కొనితెచ్చుకుంది.
ఇప్పటి వరకు ఈ వివాదంలో రాజకీయనేతలు కాని, సినీ పరిశ్రమ పెద్దలు కాని కల్పించుకున్న వాతావరణం లేదు. ఎవరో ఒకరు నడుం బిగించక పొతే ఈ వాయుగుండం తుఫానుగా మారి బీభత్సం సృష్టించవచ్చు. అనవసరపు అనర్ధాలకు అంకురార్పణ జరగవచ్చు. ఢి అంటే ఢి కొట్టటానికి సై అనే మోహన్ బాబు ను వారించి ... సముదయించేవారు ముందుకొచ్చినప్పుడే సమస్య తీవ్రత తగ్గు ముఖం పడుతుంది అని కొందరు ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు.

No comments:
Post a Comment