Pages

Ads 468x60px

Text Widget

Recent Posts

Definition List

Download

Wednesday, October 31, 2012

ముదిరిన దేనికైనా రెడీ వివాదం..!


దేనికైనా రెడీ చిత్రం ఫై చెలరేగుతున్న వివాదం ముదిరి దాడులు చేసుకునే స్థాయికి వచ్చింది.  తాజాగా ఈ రోజు రాత్రి 8 గంటలకు కొన్ని బ్రాహ్మణ సంఘాలు ఫిలిం నగర్ లోని మోహన్ బాబు ఇంటి  ముందు ధర్నాకు యత్నించగా మోహన్ బాబు సెక్యూరిటీ సిబ్బంది , కొంతమంది అనుచరులు దాడి చేసినట్టు  మీడియా లో వస్తున్నా కధనాలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ ఘటనలో పలువురు గాయపడినట్టు తెలుస్తుంది. 

ఈ సంఘటనను ఇరు వర్గాలు చాలా సీరియస్ గా తీసుకున్నట్టు తెలుస్తుంది. రాష్ట్ర, దేశ వ్యాప్త బ్రాహ్మణ సంఘాలు దాడిని ఖండించి మోహన్ బాబు ను అరెస్ట్ చేయాలనీ డిమాండ్ చేస్తుంటే.... రాత్రి వేళా ఇంటి ఫైకి వచ్చి దౌర్జన్యం చేస్తే ప్రతిఘటించాం,  ఇక ఫై ఇళ్ళ మీదకు దాడికి వస్తే చూస్తూ ఊరుకోం అని మంచు విష్ణు తీవ్రంగా స్పందించాడు. ప్రజాస్వామిక పద్దతుల్లో నిరసన తెలియచేయటం, కేసులు పెట్టడం పద్దతి, అందుకు మేము అదే రీతిలో సహకరిస్తాం... అంతే  కాని భౌతిక దాడులకు దిగితే సహించం అని గట్టిగా చెప్పాడు. 

ఈ వివాదంలో ఇరు  వర్గాలు సామరస్యంగా ఆలోచించకుండా ఎవరి పంతం వాళ్ళు నెగ్గించుకోవాలనుకోవటమే సమస్య పెద్దదవటానికి కారణంగా కనపడుతుంది. గోరంతల్ని కొండంతలు చేసుకుని ఒకరు వర్గం అవేశాపడుతుంటే గోటి తో పోయేదాన్ని గొడ్డలి దాక తెచ్చుకుని మరో వర్గం లేని ఇబ్బందుల్ని కొనితెచ్చుకుంది.  

ఇప్పటి వరకు  ఈ వివాదంలో రాజకీయనేతలు కాని, సినీ పరిశ్రమ పెద్దలు కాని కల్పించుకున్న వాతావరణం లేదు. ఎవరో ఒకరు నడుం బిగించక పొతే ఈ వాయుగుండం తుఫానుగా మారి బీభత్సం సృష్టించవచ్చు. అనవసరపు అనర్ధాలకు అంకురార్పణ జరగవచ్చు. ఢి అంటే ఢి కొట్టటానికి సై అనే మోహన్ బాబు ను వారించి ... సముదయించేవారు ముందుకొచ్చినప్పుడే సమస్య తీవ్రత తగ్గు ముఖం పడుతుంది అని కొందరు  ప్రముఖులు  అభిప్రాయపడుతున్నారు.             

Prakash Raj performed Naatu Dance

విలక్షణ నటుడిగా దక్షిణాదిన నాలుగు బాషలతో పాటు బాలీవుడ్ లో కూడా తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాయించుకున్న 'మోనార్క్' ప్రకాష్ రాజ్ లేటు వయసులో లేటెస్ట్ ఆలోచనలు చేస్తూ తాజాగా డాన్సర్ గా తన ప్రతిభను నిరూపించుకునే ప్రయత్నాల్లో ఉన్నాడు. అందుకు కోలీవుడ్ వేదిక కానుంది. వివరాలలోకి వెళ్తే....



తమిళంలో 'తులు విలయాడు ' అనే చిత్రంలో ఓ ప్రధాన భూమిక పోషిస్తున్నాడు ప్రకాష్ రాజ్. ఆ పాత్రకు ప్రతినాయక చాయలున్నప్పటికి మంచి హుషారుగా ఉంటుందంటా..! ఆ పాత్రలో ఉన్న జోరును జనానికి తెలియజేయటానికి ఆ చిత్ర దర్శకుడు ఒక మాంచి ఊపున్న మసాలా పాటను ట్యూన్ చేయించి అంతే మజాగా చిత్రీకరణ కానిచ్చేశాడంటా..!    



ఇప్పుడు ఆ పాట గురించి తమిళనాట మోతాదుకు మించి ప్రచారం జరుగుతుంది. అంత విశేషం ఏముందా అని అరా తీస్తే... ఆ పాటలో ప్రకాష్ రాజ్ 'కుత్తు ' అనే తమిళ నాటు డాన్స్ ను చించి అరెశాడంటా..! వారి సంస్కృతికి సంబంధించి ఏ  చిన్న విషయాన్ని కూడా  గొప్పగా ప్రచారం చేసుకునే తమిళ తంబిలు ఈ విషయానికి కూడా అంతే ప్రాదాన్యత ఇచ్చారు.      


కుత్తు డాన్స్ అంటే ఎదో గొప్ప డాన్స్ అనుకునేరు... నాటు డప్పుల చప్పుడికి టంటనకర... టంటనకర.. అంటూ   మన వాళ్ళు వేస్తారు చూడండి చిందులు అలాంటిదే ...! కాకపోతే తేడా ఏమిటంటే తమిళులు  ఆ డాన్స్ కు తమ జాతి జానపద నాట్యంగా గౌరవం కట్టబెట్టి ఎంతో  విలువ  ఇస్తారు. 


అందుకనే దాదాపు తమిళ్ లో మాస్ పాట అనగానే కుత్తు బీట్ తగాలల్సిందే  దానికి తగ్గట్టు అడుగులు పడాల్సిందే..! అక్కడి మాస్టర్ లు ఆ డాన్స్ కి ఎంత విలువ ఇస్తారంటే ఫాస్ట్ బీట్ లకు కూడా అలవోకగా కుత్తు మూమెంట్స్ ను కంపోజ్ చేసి పారేస్తారు. అలానే కుత్తు  డాన్స్ చేయని తమిళ హీరో ఒక్కరు కూడా ఉండరు అని చెప్పటం అతిశయోక్తి కాదు.   


ఈ పాటలో ప్రకాష్ రాజ్  అంజలి అనే ముంబై అమ్మాయితో జోడి కట్టి డాన్స్ చేశాడు . దినా నృత్య దర్శకత్వంలో రాజస్తాన్ లో చిత్రీకరించారని తెలుస్తుంది.  వృత్తి పరంగా నృత్య దర్శకురాలైన ప్రకాష్ రాజ్ భార్య పోనీవర్మ తన భర్త  డాన్సింగ్ టాలెంట్ ను ఏవిధంగా ప్రశంశిస్తుందో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం అని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.  సినిమాకు సంబంధించి ప్రతి విషయం లో నిఖ్కచ్చిగా ఉండే ప్రకాష్ రాజ్ ఈ డాన్స్ విషయంగా ఎంతవరకు న్యాయం చేశాడో ... వేచి చూడాలి.     


Is 'Dhenikaina Ready' Really Insulted Someone's feelings..?



దేనికైనా రెడీ చిత్రంలోని సన్నివేశాలు నిజంగా కొందరి ఆత్మగౌరవాన్ని కించపరిచేలా ఉన్నాయా...? ఈ ప్రశ్నకు కొన్ని కారణాల రిత్యా అవును..! అని సమాధానం చెప్పాలి. కొన్ని కారణాల రీత్యా కాదు...! అని చెప్పాలి. అవును అని ఎందుకు చెప్పాలంటే... ఒక మనిషి తనను గురించి పట్టించుకోపోయిన పర్వలేదనుకుంటాడు కాని తన మీద జోకులేసి నవ్వుకోడాన్ని మాత్రం సహించడు అది సహజం. అందునా సినిమా అనేది ఒక బలమైన ప్రచార సాధనం అందులో చూపించేది నిజమో... అబద్దమో...ఏంతో కొంత సమాజం మీద ప్రభావం చూపిస్తుంది. దాంతో అలా చూపించబడిన వారిలో ఎదో ఒక మూలా  అందరిలోకి   తక్కువ అయిపోతాం అనే భయం ఉంటుంది. అందునా పవిత్రమైన పనిని వృత్తిగా కలిగిన వారిని తక్కువ చేసి చూపించినట్టు అనిపిస్తేనే భాదపడతారు. ఈ సినిమాలో పౌరోహిత్యం చేస్తూ మహా యాగం చేయటానికి వచ్చిన పండితులు మాంసం తినటానికి వెంపర్లడిపోతున్నట్టు  చూపించటం వారు అభ్యంతరం చెప్పటానికి అవకాశం కల్పించింది.

ఇక కాదు అని సమాధానం చెప్పాల్సి వస్తే ఒక జాతిలో కాని , కులంలోకాని ఉన్న మనుషులందరూ ఒకేరకంగా ఆలోచించారు , ఒకే రకంగా ప్రవర్తించారు. ఎవరు కాదన్నా, అవునన్నా ఇది నిజం. అలాంటప్పుడు ఒక వ్యక్తినో.. కొందరు వ్యక్తులనో... హాస్య ధోరణిలో చూపిస్తే మొత్తం కులన్నో.. జాతినో... అవమానపరిచినట్టు అభిప్రాయపడటం కేవలం అపోహ మాత్రమే అవుతుంది. సావధానంగా ఆలోచిస్తే దేనికైనా రెడీ చిత్రంలో జరిగింది ఇదే తప్పించి వేరే కాదు. కాని ఈ విషయం గురించి సానుకూలంగా చర్చించుకోకపోవటం మూలంగా సమస్య వివాదంగా మారింది. 

ఈ వివాదాన్ని సర్దుబాటు చెయ్యాల్సిన భాద్యత కచ్చితంగా సినిమా రుపకర్తల పైనే ఉంది. అలా కాకుండా మోహన్ బాబు 'విరాళాల కోసం వచ్చుంటారు అని'  అవతలి వారిని రెచ్చగొట్టే విధంగా స్పందించిన విధానం.... దానిని మీడియా విశేషంగా చూపించటం అగ్నికి ఆజ్యం పోసినట్టు అయ్యింది. దాంతో మోహన్ బాబు కు పిండ ప్రధానాలు, శత్రు హోమాలు, శాపనశానాలు పెట్టడం జరిగి పోయింది.  పంతానికి పోకుండా అవమానించబడ్డం అన్నా వారికీ నిజ నిజాలు తెలియజెప్పి శాంతింప చేయటం అనేది కొంత వరకు సబబుగా ఉంటుంది.  అలా కాకుండా సినిమా ఏటు విజయం సాదించింది ఈ తతగం అంత ఎక్సట్రా పబ్లిసిటీ గా పడి ఉంటుందిలే... అనుకుని నిర్మాతలు 'దేనికైనా రెడీ ' అంటే మాత్రం ఎవ్వరు ఏమి చేయలేరు. 

కాకపోతే తాజా పరిణామాల ప్రకారం ఈ సమస్యకు శుభం కార్డ్ పడే సమయం ఆసన్నమైనట్టు సూచనలు కనపడుతున్నాయి. ఇప్పుడు ఈ వివాదం కోర్టకు ఎక్కి పోలీస్ స్టేషన్ కి వెళ్ళింది. ఇక అంతర్గత శక్తులు మేల్కొంటాయి.రాజీ ప్రయత్నాలు మొదలవుతాయి. ఆ ఫై సమస్య ఎప్పుడు...? ఎక్కడ...? ఎలా ..? అని బయటకు తెలియకుండానే సమసిపోతుంది. అలా జరగలేదు అంటేనే .. విశేషం... మీడియాకు, వీక్షకులకు మరింత వినోదం...!                                     

Videos Related To 'Denikaina Ready' Issue    
         


Tuesday, October 30, 2012

Is Naresh's New Girl Will Set A Trend..?


రిచా పనాయ్, అవకాశాలను వెతుకుంటూ దక్షిణాదికి వచ్చిన సరి కొత్త ఉత్తరాది అందం. ఢిల్లీ యునివర్సిటీ లో చదువు పూర్తీ చేసి మోడల్ గా కెరీర్ మొదలుపెట్టిన పనాయ్ ను హీరోయిన్ గా మార్చేసింది మల్లువుడ్. అక్కడ నాలుగు సినిమాలు పూర్తిచేసుకుని షాపింగ్ మాల్స్ ఓపెన్ చేసే రేంజ్ కి ఎదిగింది. కంటికి ఆనే అందంతో పాటు కొంచెం పాపులారిటీ కూడా కూడగట్టుకోవటంతో అవకశాలు కేరళ దాటి ఆంధ్రలో మొదలయ్యాయి. 

అలా అదృష్టమో..దురదృష్టమో....మొత్తానికి అల్లరి నరేష్ తోడుగా 'యముడికి మొగుడు'సినిమాతో తెలుగు తెర ఫై కాలు మోపటానికి త్వరలో సిద్దం అవుతుంది.  ఏంతో ఉత్సాహంగా తెలుగు సినిమా లోకంలోనికి అడుగుపెట్టిన రిచా కు కలిసివచ్చిన అదృష్టం ఏమిటంటే మొదటి సినిమాలోనే మంచి పాత్ర(యమధర్మరాజు కూతురు) దక్కటం.  అలానే ఆ పాత్ర స్వభావరీత్యా గ్రాంధికం మాట్లాడాల్సిఉన్నప్పటికీ తానే  స్వయంగా డబ్బింగ్ చెప్పుకోవటానికి సిద్డంకావటం ఆమె ఆత్మవిశ్వాసానికి ప్రతీక, చేసే పనిపట్ల నిబద్దతకు నిదర్శనం.    

కాకపోతే ఇక్కడ వచ్చిన చిక్కేమిటంటే ఇంత కష్టపడుతున్న ఈ  అమ్మడి భవిష్యత్తు రేపు ఎలా ఉంటుందా .... అని. ఎందుకంటే నరేష్ ట్రాక్ రికార్డ్ ప్రకారం .... అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం..... అతనితో నటించిన ఏ ఒక్క కొత్తమ్మాయి టాప్ రేంజ్ కి వెళ్ళిన దాఖలాలు లేవు. హిట్లు , ప్లాపులతో సంబంధం లేకుండా సినిమాకో అమ్మాయి చొప్పున సిడి లకు, టివి లకు పరిమితం చేస్తూ చరిత్రలో కలిపేస్తున్నాడు. ఇలా నిరాటంకంగా కొనసాగుతున్న ఈ నిర్దాక్షిణ్య ఒరవడికి రిచా పనాయ్ అన్నా అడ్డుకట్ట వేసి కొత్త ట్రెండ్ కు శ్రీకారం చుడుతుందో... లేక తానూ ఆ పరంపరలో ఓ పుటగా మిగిలిపోతుందో... వచ్చే నవంబర్ నెల తేల్చనుంది. 

Have a Look on Richa Panai  Eye Catching  Gallery ..... 










Wednesday, October 24, 2012

Denikaina Ready Movie Review


'డీ' సినిమా తరవాత ఆ రేంజ్ విజయం సంగతి పక్కనుంచి పర్వాలేదు అని అనిపించుకోవటానికే ముఖం వాచిపోయిన మంచు విష్ణు ఈసారి సక్సెస్ సాదించటానికి 'దేనికైనా రెడీ ' అంటూ దసరా పండగ పూట దియేటర్లకు వచ్చాడు. విష్ణు కెరీర్ గ్రాఫ్ దృష్ట్యా సినిమా మీద పెద్దగా అంచనాలు లేకపోయినప్పటికీ చివరి నిమిషంలో చెలరేగిన సెన్సార్ వివాదంతో కొంత జనాల అటెన్షన్ ను దక్కించుకుంది. అలానే తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం ఫాం లో ఉన్న రచయతలు తలో చేయి వెయ్యటం సినిమా ప్రచారానికి కొంత ఉపయోగపడింది. 

ఇలా కొన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నప్పటికీ మంచు వారి సినిమా అనగానే ఈ మద్య వారి నుండి వచ్చిన సినిమాల అనుభవం కారణంగా  కొన్ని అనుమానాలు ఉండటం సహజమే..! కాని ఆ అనుమానాలు మీరు సినిమా హాల్ లోకి ప్రవేశించే వరకు మాత్రమే ఉంటాయి. ఆ తరవాత మీరు ఒక సీరియస్ పనిలో పడిపోతారు. అదేమిటో... ? ఎందుకలాగా జరిగిందో...? మన సమీక్షలో చూద్దాం .      

కధ : 

రాయలసీమ ప్రాంతంలోని కపట్రాల అనే ఊరులో నరసింహనాయుడు (ప్రభు) పెద్ద ఫాక్ష్యనిస్ట్. అతని చెల్లెలు సరస్వతి (సీత), బాషా (సుమన్) ముస్లిం ను ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. ఆ భాధతో వారి తండ్రి చనిపోతాడు. దాంతో నరసింహనాయుడు బాష కాలు నరికేస్తాడు. అప్పటినుండి ఆ రెండు కుటుంబాల మద్య గొడవలు నడుస్తూ ఉంటాయి. 22 సంవత్సరాల తరవాత సరస్వతి కొడుకు సులేమాన్ (విష్ణు) అమ్మ సంతోషం కోసం ఆ రెండు కుటుంబాలను కలపటానికి పూనుకుంటాడు.  

అందుకోసం కృష్ణ శాస్త్రి అనే బ్రాహ్మణుడిగా రూపు మార్చుకుని చండి యాగం చేసేందుకు నరసింహనాయుడి ఇంట్లోకి ప్రవేశిస్తాడు. అందుకు నరసింహ నాయుడి మేనేజర్ బంగారు రాజు (బ్రమ్మి) తన అజ్ఞానంతో సహకరిస్తాడు. ఆ ఫై ముస్లిం అయిన బ్రాహ్మణుడు ఆ ఇంట్లో చేసే అల్లరి. నిజం తెలుసుకున్న బంగారు రాజు పడే టెన్షన్ సరదాగా ఉంటాయి. ఈ సందడిని కొనసాగిస్తూనే  తన తెలివితేటలు ఉపయోగించి  ఆ రెండు కుటుంబాలను సులేమాన్ ఎలా కలిపాడో... సినిమా చూసే తెలుసుకోవాలి. 

విశ్లేషణ: 

సినిమా మీద అనుమానాలు ఉంటే అది హాల్ లో కూర్చునే వరుకే అని ముందే చెప్పను ... ఆ  తరవాత అందరు చేసే సీరియస్ పని ఏంటంటే ఏక బిగిన ఓ రెండు గంటల పాటు హాయిగా నవ్వుకోవటం. విష్ణు కూతుళ్ళు అరియానా వివియానా మొత్తానికి నాన్న కోసం అదృష్టాన్ని మోసుకోచ్చినట్టే ఉన్నారు. గత కొన్ని చిత్రాలుగా వీపరితంగా నిరుత్సాహపరుస్తున్న విష్ణు ఈ చిత్రంతో ఆ కొరతను తీర్చాడు.  మూల కధను  ఓ ఇద్దరు, అసలు కధను బి వి యస్ రవి వ్రాయగా దానిని కోన వెంకట్ , గోపీమోహన్ విస్తరించారు. ఆ ఫై మరుధూరి రాజా మాటలు వ్రాశారు . ఇలా ఉద్దండులందరూ నడుం బిగించటంతో సినిమా 'బాగుంది' అనే టాక్ ను సంపాయించుకుంది. 

రచయతల శ్రమను బ్రాహ్మి,యం యస్ , ధర్మవరపు,ఎ వియస్ మాస్టర్ భరత్ తదితరులు భుజాన వేసుకుని సందు దొరికినప్పుడల్లా చెడుగుడు ఆడేస్తూ హాస్యపు వరద పరించారు. మనల్ని ఒకరి తరవాత ఒకళ్ళు వంతులు వేసుకుని మరి నాన్ స్టాప్ గా నవ్విస్తూనే ఉంటారు. ఇలా అందరిని సమన్వయ పరుస్తూ సినిమా ఎక్కడ బోర్ అనిపించకుండా ఆద్యంతం నవ్వుకునేలా రూపొందించి జి . నాగేశ్వర రెడ్డి కామెడీ చిత్రాల దర్శకుడిగా తన పేరును మరోసారి సార్ధకం చేసుకున్నాడు. 

కధ  పరంగా చూసుకుంటే రొటీన్ కధే కాని వినోదపు మయమైన కధనం కారణంగా కధ గురించి ఆలోచించే అవసరం రాదు. అలా అని నూటికో.. కోటికో.. వచ్చే ఆ ఒక్కటీ మాత్రం  కాదు. ఇప్పడు ,మోస్ట్ సక్సెస్ ఫుల్ ఫార్ముల అనిపించుకుంటున్న ట్రెండ్ ప్రకారం నడిచే మాములు కామెడీ ఎంటర్ టైనర్. కాకపోతే బోర్ కొట్టించని టైం పాస్ మరియు పైసా వసూల్ మూవీ. ఈ దసరాకు ఈ సినిమా ఒక నవ్వుల విందు మిస్ అవ్వకుండా ఆస్వాదించండి.  

సాంకేతికత :

ఈ సినిమాకు రెండు ప్రధానమైన అంశాలు వెన్ను దన్నుగా నిలిచాయి. మరుధూరి రాజా  మాటలు. కధనంలో వచ్చే మెలికలకు , మెరుపులకు తగురీతిన హాస్యాన్ని జోడించి సరదా సరదగా సాగిపోయే మాటలను వండి వడ్డించటం ఒక ప్రధాన అంశం అయితే, రెండవది ఆ వంటకాన్ని కడుపు పగిలేలా మన చేత తినిపించే హాస్య నటులు. ఇక మిగిలిన అన్ని విభాగాలు ఈ రెండు అంశాలకు సహాయ పడి వాటి ఉనికిని చాటుకున్నాయి తప్ప ప్రత్యేకతను చూపలేదు. పాటలు పర్వాలేదు. బ్యాక్ స్కోర్ ఓకే. నిర్మాణాత్మక విలువలు ఉన్నతంగా ఉన్నాయి. కాకపోతే ఒక షరా... 'మంచు' వారి సినిమాలన్నీ వారు ప్రత్యేకంగా నిర్మించుకున్న గందర్వ మహల్ చుట్టూనే తిరగటం ఇప్పటికైతే పరవాలేదు కాని ఇహ మీదట విసుగు పుట్టించవచ్చు.... గమనించవలెను. 

అభినయం :

విష్ణు తన సహజ శైలిలో నటించి ఆకట్టుకున్నాడు. అతని డాన్సుల్లో కాస్తా ఈజ్ మిస్ అయినట్టు కనపడుతుంది సరి దిద్దుకోవాలి. హీరో పాత్ర ప్రకారం ఒక ముస్లిం అయ్యుండి హిందుగా నటించటం అనే ప్రత్యేకత మీద విష్ణు పెద్దగా శ్రద్ద పెట్టలేదు కాని కామెడీ ని మాత్రం టైమింగ్ ప్రకారం పండిచటంలో సక్సెస్ అయ్యాడు. అంతే  కాని 'డీ'లో కనిపించినంత గొప్పగా అయితే కనిపించడు. ఏదేమైనా మొత్తంగా సినిమా విజయం తొలిగా హీరోకే దక్కుతుంది కాబట్టి విష్ణు హిట్ కొట్టినట్టే..! ఈ సినిమాలో హన్సిక పెర్ఫార్మెన్స్ కంటే గ్లామర్ గా కనిపించటానికే ఆసక్తి చూపినట్టు కనపడుతుంది. ఆ రకంగా చెప్పుకోవాల్సి వస్తే అమ్మడు తన భారి అందాలతో బాగానే ఆకట్టుకుంది. 

ఇక ఈ సినిమాకు అసలు హీరోలు బ్రామ్మి , యం యస్ అండ్ కో..! వాళ్ళెం చేసారో చెప్పటం కాదు సినిమాలో చూసి ఎంజోయ్ చెయ్యాలి. బ్రామ్మిది 'రెడీ' లో మేక్దోవాల్ మూర్తి తరహ పాత్రే అయినప్పటికీ తన కామెడీ టైమింగ్ లో ఉన్న ఎవర్ గ్రీన్ ఫ్రెష్ నెస్ తో మరోసారి కేరింతలు కొట్టించాడు. సంపంగి శాస్త్రి పాత్రలో యం యస్ బ్రామ్మి తో  కలిసి సందడి చేశాడు . ధర్మవరపు, మాస్టర్ భరత్ మరియు వారి పండితుల గ్యాంగ్  చేసే అల్లరి గిలిగింతలు పెడుతుంది. ఎ వి యస్ , యల్ బి శ్రీరామ్ , రఘుబాబు తదితరులు సందర్భానుసారం చేసే కామెడీ నవ్వులు పూయిస్తుంది. కాకపోతే వెన్నెల కిషోర్ నే సరిగా వాడుకోలేదు. ఎప్పటిలానే కోట విలన్ గా రాణించాడు. సుమన్ , ప్రభు, సీత తదితరులు వారి పాత్రలకనుగుణంగా బాగా నటించారు. 

ప్లస్ పాయింట్స్: 

వినోదాత్మకమైన కధనం , హాస్యపు జల్లు కురిపించే మాటల మతాబులు, బ్రమ్మి అండ్ కో చేసే కామెడీ ప్రధానమైన ప్లస్ పాయింట్స్ .

మైనస్ పాయింట్స్: 

రొటీన్ కధ , హీరో హీరోయిన్ మద్య లవ్ ట్రాక్ సరిగా లేకపోవటం కొంతవరకు మైనస్ పాయింట్స్ 

కొస మెరుపు:

ఈ సెలవులలో  కుటుంబ సమేతంగా వెళ్లి హాయిగా ఎంజాయ్ చేసే సినిమా గా ఈ 'దేనికైనారెడీ' ని చెప్పుకోవచ్చు. కాకపోతే ఒక సూచన ఈ సినిమాకు వెళ్ళే ముందు బాగా తినేసి వెళ్ళండి ఎందుకంటే రెండుగంటలు నాన్  స్టాప్ గా నవ్వలంటే ఆ మాత్రం ఎనర్జీ కావలిగా...! అలాగే కర్చీఫ్ కూడా మర్చిపోవద్దు... ఆనంద బాష్పాలు తుడుచుకోవల్సివస్తుంది అందుకు..! 

మారుతీ టాకీస్ రేటింగ్ :  5 కి 3 

           

                 

  

Thursday, October 18, 2012

Cameraman Gangato Rambabu Review


పవనిజం అనే కైపులో జోగుతున్న పవనాభిమనులు 'గబ్బర్ సింగ్' సినిమా విజయం ఇచ్చిన కిక్ నుండి ఇప్పుడుప్పుడే తేరుకుంటున్నారు. ఆ మత్తులో ఉన్న సంతోషాన్ని వారికి అంత తొందరగా దూరం చేయటం ఇష్టంలేని పవన్ కళ్యాణ్ 'కెమరామెన్ గంగతో రాంబాబు ' సినిమాతో మరో డోస్ ఇవ్వటానికి ఈ వారం సిద్దం అయ్యాడు.  అభిమానానికి తాలింపు పెట్టి కూర వండితే పవన్ కళ్యాణ్ అభిమానులయ్యరంటా ...! ఎందుకంటే వాళ్ళు ఎంతో గొప్పగా... ఎన్నో రకాలుగా.... ఆయనను అభిమానించటంలో ఉన్న రుచిని ప్రపంచానికి చాటుతూ ఉంటారు. అంతలా వెర్రెత్తి పోయున్నవాళ్ళు ఈ రాంబాబు మీద పెంచుకున్న అంచనాలను ఎంచటం అంటే ఆకాశానికి నుచ్చేనేసినట్టే అవుతుంది.

పవన్ కళ్యాణ్ హీరోగా కెరీర్ మొదలు పెట్టిన తరవాత 1998లో సుస్వాగతం, తొలిప్రేమ చిత్రాలతో ఒకే సంవత్సరం రెండు వెంటవెంట హిట్ లు ఇచ్చి సంచలనం సృష్టించాడు. మరల 12 సంవత్సరాల తరవాత ఇప్పుడు ఆ ఫీట్ ను రీపీట్ చేయటానికి దగ్గరగా ఉన్నాడు. దానికి తోడు ఒకవైపు పవన్ కళ్యాణ్ కున్న క్రేజ్... మరో వైపు పూరి జగన్నాథ్ దర్శకత్వం... వీటికి దసరా సెలవులు కూడా తోడవటంతో... ఇక రాంబాబు ఏ రేంజ్ లో చెలరేగిపోతాడో చూడాలని పరిశ్రమ వర్గాలతో పాటు సామాన్య ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


ఇలా ఎవరి అభిప్రాయాలూ వారికి ఉన్నప్పటికీ కామన్ సినిమా ఆడియన్ కు కావాల్సింది తనను తృప్తి పరిచే వినోదం...! మరి  'జస్ట్  కామన్ మాన్ కాదు.... కామన్ మాన్ హీరో' అని ఈ చిత్రం ద్వార చెప్పించుకుంటున్న పవన్ కళ్యాణ్  కామన్ ఆడియన్ కోరుకునే  వినోదాన్నిఈ సినిమాతో ఎంత వరకు  అందించగలిగాడో మన సమీక్షలో చూద్దాం.

కధ :
మామూలు మెకానిక్ అయిన రాంబాబు (పవన్ కళ్యాణ్ ) పేపర్లోను , టివిలోను వచ్చే వార్తలను చూసి అన్యాయం అనిపించిన వాటి ఫై తనదైన స్టైల్ లో స్పందిస్తూ ఉంటాడు. ఈ ప్రత్యేకమైన లక్షణమే కెమరామెన్ గంగ (తమన్నా ) సహాయంతో రాంబాబును జర్నలిస్ట్ ను చేస్తుంది. మాములుగా ఉంటేనే తిన్నగా ఉండని తిక్కమనిషి రాంబాబు జర్నలిస్ట్ అయ్యేప్పటికి అప్పటి వరకు ఏకులా ఉన్నవాడు కాస్తా అన్యాయాల పాలిట మేకై కూర్చున్నాడు. దాంతో సహజంగానే రాష్ట్రంలో అన్యాయానికి కేర్ అఫ్ అడ్రెస్ గా ఉన్న ప్రతిపక్షనాయకుడు జవహర్ నాయుడు(కోట ) అతని కొడుకు రానా నాయుడు(ప్రకాష్ రాజ్ )లకు ప్రతిబందకంగా తయారవుతాడు రాంబాబు. ఆ ఫై ముఖ్యమంత్రి కావాలని రానా నాయుడు చేసిన కుట్రలకు అడ్డు కట్టా వేస్తూ అతని పతనాన్ని రాంబాబు ఏ విధంగా శాసించాడు అన్నది మిగిలిన కధ .

విశ్లేషణ :

మన దేశంలో ప్రజాస్వామ్యం కంటే నిరంకుశత్వం ఉంటేనే బాగుంటుంది అని అభిప్రాయపడుతున్న పూరి... దేశం సంగతేమో కాని తను రూపొందించే సినిమాలలో మాత్రం నిరంకుశత్వాన్ని నిరాటంకంగా కొనసాగిస్తున్నాడు. ఎందుకంటే ఒకప్పుడు మంచి కధలతో అబ్బురపరిచే కధనంతో ప్రేక్షకులను కట్టి పడేసిన పూరి ఇప్పుడు కేవలం డైలాగులతో గారడి చేస్తూ పబ్బం గడుపుకుంటున్నాడు. క్రియేటివిటికి ఎప్పుడో చెల్లు చీటి వ్రాసేసి, నేటి బిజినెస్ ట్రెండ్ ను బాగా వంటబట్టించుకున్న పూరి జనాల వీక్ నెస్ కు స్టార్ ఇమేజ్ ను జోడించి అందినకాడికి దండుకుంటున్నాడు. ఆ ప్రయత్నంలోని మరో అంకమే ఈ 'కెమరామెన్ గంగతో రాంబాబు'. కధ లేకుండా సినిమాలు తీయటం అలవాటు చేసుకున్న పూరి ఈ సినిమాను కూడా ఓ నాలుగు మంచి సన్నివేశాలు , కొన్ని పదునైన డైలాగులను ఆసరాగా చేసుకుని మమ అనిపించాడు .

ఇక కధ విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ జర్నలిస్ట్ గా నటించాడు అన్న ప్రత్యేకత తప్పించి రెగ్యులర్ గా నడిచే రొటీన్ పాయింటే....! కధనం కూడా మన ఊహల పరిదిలో మనం ఊహించే విధంగానే ఉంటుంది.  తానూ చెప్పాలనుకున్న పాయింట్ ను సూటిగా చెప్పుకుంటూ పోవటమే తప్పించి లాజిక్కులు గిజిక్కులు గురించి ఆలోచించటం మానేసిన పూరి... అందుకు అనుగుణంగానే ఈ సినిమాలో లజిక్కులకు అతీతంగా హీరో పాత్రను సృష్టించాడు. అన్యాయాలకు స్పందించటం అంటూ.... రాంబాబును ఎవరిని పడితే వాణ్ణి ఎక్కడ పడితే అక్కడ వీర కుమ్ముడు కుమ్మేస్తూ ఉంటాడు దానిని టివి లో కూడా చూపిస్తూ ఉంటారు కాని ఎవరు ఏమి చేయారు. అలానే అన్యాయాలను ఎదుర్కునే రాంబాబు మొండిగా ప్రవర్తిస్తూ ఉంటాడు తప్పించి వాటిని రూపుమాపటానికి ఏ  విధమైన చొరవ తీసుకోడు. అదెలా .. కామన్ సెన్సు అనిపించుకుంటుందో అర్ధం కాదు. 

 అలా మొదటి సగం మొత్తం అనవసరమైన ప్రశ్నలను , కొద్దిగా అసహనాన్ని కలిగిస్తూ గడిచిపోతుంది. తీరు తెన్నూ లేకుండా పోతున్న రాంబాబుకు రానా నాయుడు ఇంటర్వెల్ కి ఓ చాలెంజ్ ఇస్తాడు. అది రాంబాబుకు, చూస్తున్న జనానికి కూడా ఊరట కలిగిస్తుంది. ఆ తరవాత కూడా పెద్దగా చెప్పుకోవాల్సింది ఏమి లేదు కాని పూరి అనుభవం ఫామ్ లోకి వచ్చి ఓ రెండు ఎపిసోడ్లు మాత్రం బాగా కుదిరాయి. అవే సినిమాకు హై లైట్. పూరి సినిమా క్లైమాక్స్ మాత్రం చాలా బాగా ప్లాన్ చేసి అంతే బాగా ప్రెజెంట్ చేశాడు . కాకపోతే ఒక కండిషన్ క్లైమాక్స్ ను విడిగా చూడాలే కాని సినిమాలో భాగంగా ఎంజాయ్ చెయ్యలేం. ఎందుకంటే అప్పటి వరకు మాములుగా ఉన్న రాంబాబు ఒక్కసారిగా జనాలను ఉద్దరించటానికి పూనుకుని 5 నిమిషాలలో వారిని మేలుకొలిపి ఒక్క పూటలో ఉద్యమాన్ని వేడెక్కించి , ఒక్కరోజులో రాష్ట్రానికి పట్టిన చీడను వదిలిస్తాడు. ఇది ఎంతవరకు సాధ్యమో ఎవరికీ వాళ్ళే ఆలోచించుకోవాలి. 

కాకపోతే ఈ సినిమాకు అతి పెద్ద ఆకర్షణ పవన్ కళ్యాణ్. ఆయనే లేకపోతే ఈ సినిమా ఈ  మధ్యే విడుదలైన మరో 'దేవుడు చేసిన మనుషులు' అయ్యుండేది ... నిస్సందేహంగా...! అసలు సరిగ్గా సినిమా తియ్యాలి అనుకుంటే 'ఒకే ఒక్కడు ' రేంజ్ ఈ రాంబాబుది. కాని ఇక్కడ మేటర్ అది కాదు తీసామా ...! తోసామా .......! అయిపోయిందా...! కనీసం ఆరు నెలలన్న తియ్యల్సిన సినిమాను మూడు నెలలకే చుట్టేస్తుంటే ఇంతకంటే నాణ్యతను ఏ  విభాగంలోనూ ఊహించలేం.    మాటల రచయతగా పూరి చాలా చోట్ల బాగానే క్లాప్స్ కొట్టించుకున్నాడు. మణిశర్మ పాటలు, బ్యాక్ స్కోర్ చాల వరకు ఈ సినిమాను బ్రతికించాయి.    'జరమొచ్చింది ....' , 'మెలికలు తిరిగే అమ్మాయో... ' పాటలు కన్నుల పండుగా చేశాయి . శ్యాం కె నాయుడు కెమెరా తో సహా అన్ని విభాగాలు వారికున్న అవకాశం మేర బాగా పనిచేశాయి. 

పవన్ కళ్యాణ్  ఒన్ మాన్ షో ఈ రాంబాబు. కొత్తగా కనిపించాడు ...డైలాగులను చిత్తు చిత్తూ చేశాడు . పవన్ డైలాగులు చెబుతుంటే విజిల్ వేయటమో... క్లాప్స్ కొట్టడమో చేయకుండా ఉండలేం ఇది నిజం.  పవన్ లో గ్లామర్ కూడా కొద్దిగా పెరిగినట్టుంది చాలా అందంగా కనిపించాడు . తమన్నా ఆకట్టుకుంది. అందానికి అభినయాన్ని సమపాళ్ళలో జోడించి అవకాశం మేర బాగా నటించింది. పాటల్లో కూడా తన ప్రెజెన్స్ ను చాల చక్కగా తెలియచేసింది. కోట, ప్రకాష్ రాజ్, తనికెళ్ళ భరణి వారి సహజ ధోరణిలో నటించారు. బ్రాహ్మి , ఆలీ చేసిన కామెడీ పర్వాలేదనిపిస్తుంది. బ్రాహ్మి తో న్యూస్ కంటెంట్ మరియు రీడింగ్ మీద పూరి వేసిన సెటైర్ బాగుంది. మిగత నటులు వారి పాత్రలకనుగుణంగా బాగానే నటించారు. 

ప్లస్ పాయింట్స్ : 

పవన్ కళ్యాణ్ నటన, మణిశర్మ సంగీతం, కొన్ని పూరి డైలాగులు ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్ 

మైనస్ పాయింట్స్ : 

రొటీన్ కధ , ఆకట్టుకోలేని కధనం, కామెడీ మోతాదు తగ్గటం ప్రదానంగా మైనస్ పాయింట్స్. 

కొసమెరుపు:

దసరా సెలవుల పుణ్యం , పవన్ కళ్యాణ్ కున్న క్రేజ్ ఈ సినిమాను గట్టేక్కించవచ్చు కాని రెండు వారాలకు మించి నిలబడటం కష్టం అనే టాక్ బలంగా వినపడుతుంది ఇండస్ట్రిలో...! కాని సంచలనాలు సమయానుకూలంగా నమోదవుతాయి అనేది సినిమాలకు సరిగ్గా సరిపోతుంది. అ లెక్కన రాంబాబు భవితవ్యం ఫై స్పష్టత రావటానికి ఓ వారం ఆగాల్సిందే..! 

Maruthi Talkies Rating 2.75 out of 5   

 

   


Tuesday, October 2, 2012

Feel The Fresh Romance In 'Routine Love Story'







బంధాలు భలే కామెడీగా  ఉంటాయి...! అంటూ... ఒక రొటీన్ సినిమాను అందంగా చెప్పే  ప్రయత్నంలో ఉన్నాడు యల్ బి డబ్ల్యు ఫేం ప్రవీణ్ సత్తారు .   సినిమాలో ఉన్న విషయం ఏమిటి ..? దానిని ప్రవీణ్ ఎలా చెప్పబోతున్నాడు అన్నా  విషయాన్నీ ఎంతో  ముచ్చటగా పైన కనిపిస్తున్న పోస్టర్ తో తెలియచేశారు. ప్రేమలో ఉన్న అమ్మాయి, అబ్బాయి మద్య ఉండే రిలేషన్ లో చాలా  చిత్రమైన మార్పులు తరచుగా కనపడటం సహజం అన్న సంకేతాలను చాలా బాగా ప్రదర్శించారు ఈ పోస్టర్ లో.... !  అందులో పైన దొంగ ముద్దులు పెట్టుకుని దొరికిపోయినట్టున్న ఇద్దరి ఎక్స్ ప్రేషన్స్  కంటే.... క్రింద తన్నుకుని తలో దిక్కు కూర్చున్న వాళ్ళ ముఖాలను చూసి నవ్వకుండా ఉండటం చాలా కష్టం.

పోస్టర్ తో ఇలా కట్టి పడేసిన ప్రవీణ్  ట్రైలర్ తో ఓ అడుగు ముందుకేసి సినిమా మీద అంచనాలకు నాంది వేశాడు. రొటీన్... రొటీన్.... అంటూనే సినిమాలో సంథింగ్ ఉంది అన్న సిగ్నల్స్ ను ఇస్తున్నాడు. ట్రైలర్ లో వస్తున్న డైలాగులు, సన్నివేశాలు రొటీన్ గానే అనిపిస్తున్నాయి కాని ' ఒక అమ్మాయి... ఒక అబ్బాయి.... అబ్బాయి థియరీ.... అమ్మాయి లాజిక్ .... అందుకనో  డీల్..... !' అంటూనే..... ప్రేమలో పడటం తేలికే...! కాని ప్రేమలో ఉండగలగటం ....? మ్ ..... అంత తేలిక కాదు....!' అదే 'రొటీన్ లవ్ స్టొరీ' అని సినిమా సెంటర్  పాయింట్ ను చెప్పిన విధానం చాల ఆసక్తిగా ఉంది.   అలానే చివర్లో అమ్మాయి 'బట్టలు... నువ్వే  ఉతుకుతావ్... ఇల్లు  కూడా నువ్వే క్లీన్ చేస్తావ్'.. అంటే అబ్బాయి 'మొత్తం నేనే చేస్తే నువ్వేం చేస్తావ్ ... బంగారం' అంటే అమ్మాయి 'నేను టివి చూస్తా ..!' అని చెప్పటం రొటీనే అయిన సో..... రొమాంటిక్ గా ఉంది. వీళ్ళ గోల  వీళ్ళదయితే.... వీళ్ళ కధను సినిమా తీసి ఇండస్ట్రి ని మార్చేయాలనే ప్రయత్నంలో  వెన్నెల కిషోర్ , స్నిగ్ద ఉండటం ఫన్నిగా అనిపిస్తుంది . 

ఇకపోతే ఈ 'రొటీన్ లవ్ స్టొరీ' చూడటానికి రొటీన్ గా ఉన్నా, ఉండకపోయినా..! ఓ మంచి వినోదాత్మక చిత్రంగా అందరిని అలరించాలని ఆశిద్దాం..! క్రింద ఉన్నా ట్రైలర్ చూసి ఎంజాయ్ చెయ్యండి.......! 

  

Venkatesh Shadow Wall Papers

 లుక్ కొత్తగా అనిపిస్తున్నప్పటికీ వెంకి రొటీన్ గానే కనపడుతున్నాడు. కాకపోతే ఈ పోస్టర్స్ లో వెంకటేష్ ను ఇంతకు ముందు చూడని విధంగా చూపించాలనే తపన కనపడుతుంది. మెహర్ రమేష్ కష్టం ఫలించి వెంకిలోని  కొత్త కోణం ఆవిష్కరించబడి  ఈ 'షాడో' మనల్ని వినోదపరచాలని ఆశిద్దాం...! 






Venky's 'Shadow' Teaser Catching The Eye balls


విక్టరీ వెంకటేష్ , మెహర్ రమేష్ కలయికలో త్వరలో రాబోతున్న చిత్రం 'షాడో'. ఎవరు ఊహించని ఈ కాంబినేషన్ నుండి వచ్చే ఈ సినిమా ఎలా ఉంటుందో ... అని ఆలోచిస్తున్న వారి ఊహలకందని రీతిలో 'షాడో' టీజర్ బయటకు వచ్చింది.  బీభత్సమైన స్టైలిష్ గా ఉన్న ఈ టీజర్ 'బిల్లా'ను గుర్తుకుతెస్తుంది. షాడో పేరుకు సర్దకమన్నట్టు వెంకి చాలా వరకు బ్లాక్  డ్రెస్ తో నీడలా(షాడో) మాటున కనిపించాడు . లుక్ లో కొత్తదనం కనిపిస్తున్నప్పటికీ స్టైల్ మాత్రం వెంకి మార్క్ మేనరిజాన్ని దాటిపోలేదు.

సినిమా కధ ప్రకారం యాక్షన్ సన్నివేశాలు మెండుగా ఉన్నట్టు అనిపిస్తున్నాయి. అలానే వాటిని ఓ రేంజ్ లో చిత్రీకరించినట్టు ఈ టీజర్ లో కనపడుతుంది. తరవాత టీజర్ కు సంబంధించి రెండు విషయాలు ప్రధానంగా హై లైట్ గా కనిపిస్తున్నాయి. ఒకటి సర్వేశ్ మురారి సినిమాటోగ్రఫీ, రెండు తమన్ బ్యాక్ స్కోర్. ఈ రెండు అంశాలు సినిమా వెయిట్ ను తెలియ చేస్తున్నాయి. ఇక పొతే హీరోయిన్స్ కనిపించక పోవటం నిరుత్సాహపరుస్తుంది. అలానే టైటిల్స్ వచ్చే స్టైల్ గబ్బర్ సింగ్ సినిమాలో టైటిల్స్ వచ్చిన విధానాన్ని అనుకరించినట్టు ఉంది.  

మొత్తంగా షాడో తొలిచూపు పసందుగానే ఉంది. కాని అరంభశురత్వాలు మెహెర్ రమేష్ కు కొత్త కాదు. ఇప్పటి వరకు వచ్చిన ఆయన సినిమాల ట్రైలర్స్ అన్ని దాదాపు సూపర్ హిట్టే. కాకపోతే సినిమాలే అంచనాలను తలకిందులు చేశాయి . మరి ఈ 'షాడో ' పరిస్థితి ఏంటి..?  అనేది కాలమే నిర్ణయించాలి.