దేనికైనా రెడీ చిత్రంలోని సన్నివేశాలు నిజంగా కొందరి ఆత్మగౌరవాన్ని కించపరిచేలా ఉన్నాయా...? ఈ ప్రశ్నకు కొన్ని కారణాల రిత్యా అవును..! అని సమాధానం చెప్పాలి. కొన్ని కారణాల రీత్యా కాదు...! అని చెప్పాలి. అవును అని ఎందుకు చెప్పాలంటే... ఒక మనిషి తనను గురించి పట్టించుకోపోయిన పర్వలేదనుకుంటాడు కాని తన మీద జోకులేసి నవ్వుకోడాన్ని మాత్రం సహించడు అది సహజం. అందునా సినిమా అనేది ఒక బలమైన ప్రచార సాధనం అందులో చూపించేది నిజమో... అబద్దమో...ఏంతో కొంత సమాజం మీద ప్రభావం చూపిస్తుంది. దాంతో అలా చూపించబడిన వారిలో ఎదో ఒక మూలా అందరిలోకి తక్కువ అయిపోతాం అనే భయం ఉంటుంది. అందునా పవిత్రమైన పనిని వృత్తిగా కలిగిన వారిని తక్కువ చేసి చూపించినట్టు అనిపిస్తేనే భాదపడతారు. ఈ సినిమాలో పౌరోహిత్యం చేస్తూ మహా యాగం చేయటానికి వచ్చిన పండితులు మాంసం తినటానికి వెంపర్లడిపోతున్నట్టు చూపించటం వారు అభ్యంతరం చెప్పటానికి అవకాశం కల్పించింది.
ఇక కాదు అని సమాధానం చెప్పాల్సి వస్తే ఒక జాతిలో కాని , కులంలోకాని ఉన్న మనుషులందరూ ఒకేరకంగా ఆలోచించారు , ఒకే రకంగా ప్రవర్తించారు. ఎవరు కాదన్నా, అవునన్నా ఇది నిజం. అలాంటప్పుడు ఒక వ్యక్తినో.. కొందరు వ్యక్తులనో... హాస్య ధోరణిలో చూపిస్తే మొత్తం కులన్నో.. జాతినో... అవమానపరిచినట్టు అభిప్రాయపడటం కేవలం అపోహ మాత్రమే అవుతుంది. సావధానంగా ఆలోచిస్తే దేనికైనా రెడీ చిత్రంలో జరిగింది ఇదే తప్పించి వేరే కాదు. కాని ఈ విషయం గురించి సానుకూలంగా చర్చించుకోకపోవటం మూలంగా సమస్య వివాదంగా మారింది.
ఈ వివాదాన్ని సర్దుబాటు చెయ్యాల్సిన భాద్యత కచ్చితంగా సినిమా రుపకర్తల పైనే ఉంది. అలా కాకుండా మోహన్ బాబు 'విరాళాల కోసం వచ్చుంటారు అని' అవతలి వారిని రెచ్చగొట్టే విధంగా స్పందించిన విధానం.... దానిని మీడియా విశేషంగా చూపించటం అగ్నికి ఆజ్యం పోసినట్టు అయ్యింది. దాంతో మోహన్ బాబు కు పిండ ప్రధానాలు, శత్రు హోమాలు, శాపనశానాలు పెట్టడం జరిగి పోయింది. పంతానికి పోకుండా అవమానించబడ్డం అన్నా వారికీ నిజ నిజాలు తెలియజెప్పి శాంతింప చేయటం అనేది కొంత వరకు సబబుగా ఉంటుంది. అలా కాకుండా సినిమా ఏటు విజయం సాదించింది ఈ తతగం అంత ఎక్సట్రా పబ్లిసిటీ గా పడి ఉంటుందిలే... అనుకుని నిర్మాతలు 'దేనికైనా రెడీ ' అంటే మాత్రం ఎవ్వరు ఏమి చేయలేరు.
కాకపోతే తాజా పరిణామాల ప్రకారం ఈ సమస్యకు శుభం కార్డ్ పడే సమయం ఆసన్నమైనట్టు సూచనలు కనపడుతున్నాయి. ఇప్పుడు ఈ వివాదం కోర్టకు ఎక్కి పోలీస్ స్టేషన్ కి వెళ్ళింది. ఇక అంతర్గత శక్తులు మేల్కొంటాయి.రాజీ ప్రయత్నాలు మొదలవుతాయి. ఆ ఫై సమస్య ఎప్పుడు...? ఎక్కడ...? ఎలా ..? అని బయటకు తెలియకుండానే సమసిపోతుంది. అలా జరగలేదు అంటేనే .. విశేషం... మీడియాకు, వీక్షకులకు మరింత వినోదం...!
Videos Related To 'Denikaina Ready' Issue

PLEASE SEE CINEMA AS ENTERTAINMENT ONLY. NOT TO CREATE A SEAN IT WILL CREATE UNNECESSARY COMPLICATIONS BETWEEN RELIGIONS
ReplyDeleteThe movie has shown brahmin ladies as nymphomaniacs who crave for sex and are ready to do anything for the sake of money. Also the film showed priests as those who crave for 'haleem'. In Telugu movies, "Brahmin Priest" character has become an object of ridicule. Their food habits, life style, dress, family relations, language etc have become targets for the sadistic people. There are hundreds of movies which project brahmins as "useless fellows", "secret meat eaters", "responsible for all evils" etc. On the other hand, Muslim characters are shown as peace loving "bhai", Dalits/BCs are shown as "sufferers", Reddys/Naidus are shown as people of valour because these film people know pretty well that if they show them in poor light MRPS/MIM/BC associations will break their bones. Those castes which are politically less empowered and who don't indulge in rowdyism like brahmins and vaisyas have become easy targets.
ReplyDelete