Pages

Ads 468x60px

Text Widget

Recent Posts

Definition List

Download

Wednesday, August 1, 2012

Dil Raju Vakitlo Mahesh Sitara


ప్రముఖ నిర్మాత..... కాదు ..కాదు హిట్ సినిమాల ఫార్ములా  తెలిసిన నిర్మాత దిల్ రాజు పట్టిందల్లా బంగారమే...! ఒకోసారి తను పట్టుకుంది బంగారం కాకపోయినా మనందరిచేత బంగారం అని అనిపిస్తాడు. అదెలా అంటే 'ఓ మై ఫ్రెండ్' సినిమా జనాలను పెద్దగా ఆకట్టుకోలేదు కాని వ్యాపారపరంగా సినిమాకు ఏ  ఇబ్బంది లేదు దాంతో ఆ సినిమాను హిట్ అని మెచ్చుకోక తప్పని పరిస్థితి. ఇలాంటి మ్యాజిక్ తెలుగు సిని పరిశ్రమలో ఓ నలుగురు మాత్రమే చేయగలరు.  అందులో ముందుండేది దిల్ రాజు. అలానే ఇలాంటివి చేయటానికి కేవలం అదృష్టం ఉంటే మాత్రమే సరిపోదు, తెలివితేటలు కూడా ఉండాలి. ఆ రెండు దిల్ రాజు దగ్గర పుష్కలంగా ఉన్నాయి. అన్నీ ఉన్నాయి , అంత  బాగుంది ఇంతకీ  దిల్ రాజు వాకిట్లో మహేష్ కు ఈ మధ్యే పుట్టిన బుల్లి కూతురు 'సితార' కు పనేంటి అని మీకు అనుమానం రావాలి ...! లేదంటే ఈ ఆర్టికల్ కు అర్ధమే లేదు. వచ్చిందని నమ్ముతూ .....


అదృష్టం పడిశం పట్టినట్టు పట్టటం అంటే ఇదే ....! ఎవరో చెప్పారు అదృష్టం ఒక్కసారే తలుపు తడుతుందని .... అదేం విచిత్రమో... దిల్ రాజు తలుపును లక్కుల దేవత మళ్ళీ  మళ్ళీ  తడుతూనే ఉంటుంది. ఈ సారి మహేష్ బాబు కూతురు సితార రూపంలో రాజుకు లాటరి తగలనుంది. ఎలా అంటే మహేష్ కు తొలి సంతానంగా గౌతమ్ పుట్టిన వెంటనే 'పోకిరి' విడుదలైంది. అది ఎంత సంచలనమో మనందరికీ తెలుసు. పోకిరి సూపర్ హిట్ పూరి జగన్నాథ్ ను తీసుకెళ్ళి ఎక్కడో కూర్చో బెట్టింది. ఇప్పుడు మహేష్ కూతురు వంతు, అందున ఈ 'సితార'మాహలక్ష్మి ఘట్టమనేని వంశాన శ్రావణ  శుక్రవారం పూట అడుగుపెట్టింది.  సాదారణంగా శుక్రవారంనాడు అమ్మాయి పుడితే అదృష్టం  అంటారు. అలాంటిది శ్రావణ శుక్రవారంనాడు పుడితే అదృష్టలకే  అదృష్టం.    


మహేష్ కు కూతురు పుట్టిన తరవాత విడుదలయ్యే  మొదటి సినిమా 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు '. ఇక ఊహించుకోండి... ఈ సినిమా ఏ రేంజ్ లో హిట్టు కానుందో ...! అసలే చాలా  కాలం తరవాత వస్తున్నా నిజమైన మల్టిస్టారర్ గా ఈ సినిమా మీద ఉన్న అంచనాలు టీజర్ విడుదల తరువాత వీపరీతంగా పెరిగిపోయాయి. ఇలాంటి  పరిస్థితిలో బ్యాక్ సపోర్ట్ గా సితార రావటం దిల్ రాజు అదృష్టలా పరంపరకు పరాకాష్ట . ఇక వేరే  ఆలోచనే  లేదు ఈ ' సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' దిల్ రాజు దోసిట్లో ... ధన రాశుల గుట్టే ...!     


No comments:

Post a Comment