Pages

Ads 468x60px

Text Widget

Recent Posts

Definition List

Download

Tuesday, August 28, 2012

Real Star Sri Hari Innocence


పిల్ల రౌడీగా తెరంగేట్రం  చేసి..... కాలక్రమేణ పెద్ద రౌడిగా జనాలను భయపెట్టి... తరవాత సహాయనటుడిగా ఆకట్టుకుని .... కధానాయకుడిగా కట్టిపడేసి రియల్ స్టార్ అనిపించుకున్నాడు శ్రీహరి. ఎన్నో సవాళ్ళు ఎదుర్కుంటూ .. అందివచ్చిన అవకాశాలను సద్వినియోగపరచుకుంటూ ఉన్నతంగా ఎదిగిన శ్రీ హరికి తెలుగు సిని పరిశ్రమలో ప్రత్యేకమైన స్థానం ఉంది. ప్రస్తుతం హీరోగా తన ఉనికిని కాపాడుకుంటూనే సహాయనటుడిగా చరిత్రలో నిలిచిపోయే పాత్రలు చేస్తున్నాడు. అలా  ఫైటర్ గా, విలన్ గా , క్యారెక్టర్ నటుడిగా , హీరోగా ఇప్పటివరకు తిరుగులేని సిని ప్రస్థానాన్ని కొనసాగించిన  శ్రీ హరి త్వరలో ఓ కొత్త అవతారంలో కనిపించనున్నాడు.

ఇప్పటి వరకు దర్శకులు చెప్పినట్టు నటించిన శ్రీ హరి ఇక  ఫై  దర్శకుడిగా మారి తానే సినిమా రూపొందించే పనిలో ఉన్నాడు.  ఈ మద్య తన పుట్టిన రోజు సందర్భంగా మనసులోని భావాలను అభిమానులతో పంచుకున్న శ్రీ హరి దర్శకుడిగా మారబోతున్నట్టు వెల్లడించాడు. దాని కోసం రెండు కధలను కూడా సిద్దం చేసుకున్నట్టు చెప్పారు. అందులో తొలిగా 'డి గ్యాంగ్స్' అనే సినిమాను సెట్స్ మీదకు తీసుకువెళ్ళనున్నారు. కరుడుకట్టిన తీవ్రవాది దావూద్ సాదువులా మారి శాంతి కోసం తపిస్తే ఎలా ఉంటుంది అనేది ఆ సినిమా పాయింట్. అలానే శ్రీ హరి మరో కధ 'లైబ్రరీతో పాటు సకల సదుపాయాలు , అడిగినవెంటనే సమాచారం ఇచ్చే సిబ్బంది, ఆహ్లాదకరమైన వాతావరణంలో  భయానికి తావులేని ఓ అందమైన కలల పోలీసు స్టేషన్ కధ'.

విశేషం ఏమిటంటే ఈ రెండు కధలు శ్రీ హరి మనసు నుండి పుట్టుకొచ్చినవే...! ఈ ఆలోచనలను తరచి చూస్తే వాటిల్లో కొద్దిగా మంచితనం చాలా అమాయకత్వం కనిపించటంలేదు...! చూడటానికి గంభీరంగా కనిపిస్తున్న శ్రీహరి ఫైకే పహిల్వాన్... లోపల పసిపిల్లోడని ఈ మాటలను బట్టి అర్ధం అవుతుంది. ఇది ఒక రకంగా సంతోషించతగ్గ విషయమే. కాని ప్రస్తుత ట్రెండ్ ప్రకారం తెలుగు సిని ప్రియులు లాజిక్ కంటే మ్యాజిక్ ను  , మంచి మాటల కంటే  చెడు ప్రవర్తనలను ఎక్కువగా ఇష్ట పడుతున్నారు. దానినే కొత్తదనం అంటున్నారు .... ఎంజాయ్ చేస్తున్నారు... ఎంటర్టైన్ అవుతున్నారు.  ఇలాంటి తరుణంలో మంచి మనసుతో శ్రీ హరి చేస్తున్న ప్రయత్నానికి ఆదరణ దక్కుతుందా... ? అన్నది ఓ చిన్న సందేహం.

ఇక్కడో నిజం ఉంది ట్రెండ్స్ వస్తుంటాయి... పోతుంటాయి... కాని సినిమా మాత్రం శాశ్వతంగా ఉంటుంది. ట్రెండ్ ను ఫాలో అవకుండా శ్రీ హరి చేయబోతున్న ఈ ప్రయత్నం... ట్రెండ్ సెట్టర్ అవుతుందేమో...! ఎవరికీ తెలుసు...?    

No comments:

Post a Comment