Pages

Ads 468x60px

Text Widget

Recent Posts

Definition List

Download

Thursday, August 2, 2012

"Eddarammayilatho..." Allu Arjun

అల్లు అర్జున్ 'జులాయి' గా వేసిన వేషాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవటానికి మరో వారం మాత్రమే ఉంది. ఈలోపు బన్నీ చేయబోయే తరవాతి సినిమా గురించి పరిశ్రమలో వాడి వేడి చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఆ సినిమాను ప్రస్తుతం టాలీవుడ్ ను దున్ని పారేస్తున్నా పూరి జగన్నాథ్ రూపొందించటం ఒక విశేషం అయితే.... మరో విశేషం బన్ని తొలిసారి ఇద్దరు హీరోయిన్లతో నటించనుండటం. జులాయి తో కలిపి ఇప్పటి వరకు 10 సినిమాలు పూర్తిచేసుకున్న బన్ని కెరీర్లో..... తనతో కలిసి నటించిన  హీరోయిన్ కు ఇద్దరు హీరోలు(ఆర్య, ఆర్య 2 ) ఉన్నారు కాని తను మాత్రం ఇద్దరు కధనాయికిలతో పనిచేయలేదు. ఇప్పుడు  ఆ లోటు ఈ మొదలవబోయే సినిమాతో తీరనుంది.   


ఈ విషయాన్నీ గ్రహించే కాబోలు దర్శకుడు పూరి ఆ విశేషం కలిసోచ్చేలా ఈ సినిమాకు 'ఇద్దరమ్మాయిలతో ...! ' అని నామకరణం చేశాడు.  మనలో మన మాట మొదట ఈ సినిమాకు 'ఇద్దరమ్మాయిలు ' అనే పేరును ప్రచారంలోకి తెచ్చారు... కాని ఆ పేరుతో హీరోకు సంబంధం కనపడటంలేదని  ఫిర్యాదులు పోటెత్తటంతో కధనాయకుడికి కలిసోచ్చేలా 'తో' అనే తోకను తగిలించారని సమాచారం. కాని లక్కీగా ఇప్పుడు ఆ పేరే బన్ని మొదటి సారి 'ఇద్దరమ్మాయిలతో ...! ' నటిస్తున్నాడు అని చెప్పకనే చెబుతుంది. 


చక చక సినిమాలను పూర్తి చేస్తూ యమ స్పీడ్ మీదున్న పూరి  సినిమా సినిమాకి షూటింగ్ చేసే రోజులను తగ్గించుకుంటూ పోతున్నాడు. అందులో భాగంగా బన్ని సినిమాను 60 రోజుల్లో పూర్తిచేసి విడుదల చేసేలా  ప్రణాళిక సిద్దం చేసుకుంటున్నాడు. ఓ పక్క పవన్ కళ్యాణ్ తో 'కెమెరామన్ గంగతో రాంబాబు' ను చుట్టేస్తూనే... మరో పక్క 'ఇద్దరమ్మాయిలతో ...! ' ప్రీ ప్రొడక్షన్ పనులను చక్కబెడుతున్నాడు. సెప్టెంబర్ లో సెట్స్ ఫైకి వెళ్లనున్న ఈ సినిమాలో బన్ని సరసన నటించబోయే ఇద్దరమ్మాయిలలో ఒకరిగా శ్రుతి హసన్ ఎంపికైంది. మరో అమ్మాయి ఎవరో తేలాల్సి ఉంది. తాప్సి పేరు వినపడుతుంది కాని అధికారికంగా ద్రువికరణలేదు.  


బండ్ల గణేష్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రం లో పూరి 'ఇద్దరమ్మాయిలతో ...! ' బన్ని ఏమి చేశాడో చూపించనున్నాడు. చక్రి సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ లో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు.  

No comments:

Post a Comment