'రంగం' జీవా సూపర్ హీరోగా రేపు విడుదలవుతున్న 'మాస్క్' తెలుగు ప్రేక్షకులలో ఏ విధమైన ఆసక్తిని కలిగించలేకపోయింది. దాంతో ప్రేక్షకులు ఈ సినిమా గురించి పెద్దగా పట్టించుకుంటునట్టు అనిపించటం లేదు. అందుకు ప్రధాన కారణం ఆకర్షణీయంగా లేని ప్రచారం. నెల ముందే విడుదలైన ట్రైలర్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేయటంమాని బోర్ కొట్టించింది.
అసలు సూపర్ హీరో సినిమా అంటే ఎలా ఉండాలి........ అదిరిపోయే మ్యూజిక్ , కళ్ళు చెదిరే గ్రాఫిక్స్, ఒళ్ళు గగుర్పొడిచే పోరాట దృశ్యాలు ఉండాలి. అవన్నీ లేకుండానే ఈ మద్య ఇంగ్లీష్ డబ్బింగ్ సినిమాలకు అలవాటు పడిన తెలుగు ప్రేక్షకులను ఇది సూపర్ హీరో సినిమా అని మాటలు చెప్పి నమ్మించాలని చూడటం కుదురుతుందా...! అలానే ఈ మధ్యే విడుదలైన సినిమా పాటలు ఒక్కటి కూడా సరిగ్గా కనెక్ట్ అయినట్టు అనిపించలేదు.
కాని అవి నాణానికి ఒక వైపే ఈ సినిమాకు మరో కోణం ఉంది. అది ఏమంటే జీవా 'రంగం' కూడా ఏ విధమైన అంచనాలు లేకుండా విడుదలై తెలుగు నాట అఖండ విజయాన్ని అందుకుంది. అందుకు కారణం ఆ సినిమా దర్శకుడు కె వి ఆనంద్ ప్రతిభ. అలానే ఈ సినిమాకు కూడా బలం దర్శకుడు 'మిస్కిన్'. చేసింది మూడు చిత్రాలే అయిన స్టైలిష్ దర్శకుడిగా తమిళనాట నీరాజనలందుకుంటున్నాడు మిస్కిన్.
అందులోను చూస్తుంటే ఈ సినిమాలో క్రిస్టోఫర్ నోలన్ 'డార్క్ నైట్ ' లక్షణాలు కనిపిస్తున్నాయి. హీరో బ్యాట్ మాన్ ను పోలి ఉండటం, విలన్ కు జోకర్ పోలికలున్నాయని చెప్పటం అందుకు సాక్ష్యాలు. ఆ విధంగా చూస్తే మిస్కిన్ టాలంట్ ప్రకారం ఈ సినిమాలో ఆసక్తికరమైన స్క్రీన్ ప్లే ఉండే అవకాశం ఉంది. నోలన్ ను కాపీ కొట్టకుండా మిస్కిన్ అయన ఆలోచనల స్పూర్తితో సినిమాలో కొత్తగా ఏదన్న చూపిస్తే బాగానే ఉంటుంది. అలా కాకుండా నోలన్ ను కాపి కొట్టినా లేదా నోలన్ ఆలోచనలను చెడగొట్టిన దెబ్బై పోయినట్టే...!
అదీ సంగతి....! ఇంతకీ ఈ మాస్క్ లో ఏముందో... మరి కొన్ని గంటల్లో తేలనుంది.

No comments:
Post a Comment