తోలి చిత్రం గా ఈగ సినిమాతో సంచలనాన్ని సృష్టించి పరిశ్రమ దృష్టిని
ఆకర్షించిన కొత్త నిర్మాత సాయి కొర్రపాటి మలి చిత్రంగా 'అందాల రాక్షసి '
అనే ప్రేమ కధతో తెలుగు సిని ప్రియులను అలరించటానికి ఈ వారం ప్రేక్షకుల
ముందుకు వచ్చాడు. వారాహి చలన చిత్ర బ్యానర్ ఫై నిర్మితమైన ఈ చిత్రం తో హను
రాఘవపూడి దర్శకుడిగా పరిచయం కాగా నవీన్, లావణ్య , రాహుల్ నటి నటులుగా
పరిచయం అయ్యారు. దర్శకుడు, నటి నటులతో పాటు ఈ చిత్రానికి పనిచేసిన సాంకేతిక
వర్గం అంత కొత్త వారే కావటం విశేషం.
ఫ్రెష్ లుక్ తో ... సరికొత్త ప్రచారంతో... అందంగా కనిపించిన ఈ 'అందాల రాక్షసి ' టీం లో స్టార్ దర్శకుడు రాజమౌళి భాగం కావటంతో సినిమాకు మంచి గుర్తింపు లభించింది. పెయింటింగ్ ను తలపించేలా ఉన్న పోస్టర్స్ , మణిరత్నం సినిమాలను గుర్తుకు తెచ్చేలా కనిపించిన వాతావరణం , మంచి మెలోడి గీతాలు సినిమా ఫై కొంత ఆసక్తిని కలిగించాయి. కొత్త దర్శకుడు హను జనాలు ఈ సినిమా మీద పెంచుకున్న ఆసక్తిని నిజం చేసాడో... ? లేక నీరుగార్చాడో..? మన సమీక్షలో చూద్దాం.

కధ:
మిధున (లావణ్య) , సూర్య
( నవీన్) , గౌతమ్ (రాహుల్) అనే ముగ్గురు అవిశ్రాంత ప్రేమికులు. ఆ ముగ్గురు
ప్రేమ కోసం ఎన్ని సార్లైనా చనిపోవటానికి సిద్దం. అలాంటి ఈ ముగ్గిరి మద్య
జరిగిన త్రికోణపు ప్రేమకదే ఈ అందాల రాక్షసి. అందంతో పాటు అల్లరి , అణుకువ
సమపాళ్ళలో ఉన్న మిధునను అనుకోకుండా ఒకే రోజు వేరు వేరు సమయాల్లో చూసి.... తోలి
చూపులోనే పీకల్లోతు ప్రేమలో మునిగి పోతారు సూర్య , గౌతమ్.
కాని అవకాశం కలిసి వచ్చి పేద కళాకారుడైన సూర్య కు దగ్గరవుతుంది మిధున. తరవాత విధి ఆడిన వింత నాటకంలో డబ్బు అనే అడ్డుగోడ అడ్డు తగిలి మిదునను సూర్య కు దూరం చేసి గౌతమ్ కు దగ్గర చేస్తుంది. మనసులో సూర్యను ఆరాధిస్తూ గౌతమ్ కు దగ్గర కాలేక పోతుంది మిధున. కాని ప్రయత్నం మీద సూర్యను మరచి గౌతంకు దగ్గరవుతున్న సమయంలో సూర్య మళ్లీ తెర ఫైకి వస్తాడు. ఆ ఫై ఆ ముగ్గురి జీవితాలలో ఏ విధమైన పరిస్థితులు చోటు చేసుకున్నాయి ..? వాటి పరిణామాలు ఏమిటి....? అనేది మిగిలిన కధ.
విశ్లేషణ :
ప్రస్తుతం తెలుగు సిని పరిశ్రమ యాంత్రికమైన మనస్తత్వం కలిగిన సినిమా రూపకర్తలను తయారు చేసే ఫ్యాక్టరి గా అవతరించింది. వారికి సాంకేతికంగా సరికొత్త విధానాలను ఉపయోగించుకుని సినిమాను ఎంత అందంగా చూపించ వచ్చో తెలుసు , సినిమాను మార్కెట్ ఎలా చేసుకోవాలో తెలుసు.... కాని మంచి కధతో ఆకట్టుకునే సన్నివేశాల రూపకల్పన చేసి గొప్ప ఫీల్ ను సృష్టించి ప్రేక్షకులను కట్టిపడేసే కళ మాత్రం అబ్బటం లేదు. సినిమాకు కధే ప్రాణం .. కాని సాంకేతిక ప్రమాణాలు పెరుగుతున్న కొద్ది కధ కధనాలు పతనమవుతు పోతున్నాయి.... ఫలితం ఈ 'అందాల రాక్షసి' లాంటి సినిమాలు.
మార్కెట్లో ప్లాస్టిక్ పువ్వులు , పండ్లు దొరుకుతాయి. అవి చూడటానికి నిజమైన వాటికంటే అందంగా ఉంటాయి. కాని ఆ పూల వాసనను గ్రహించలేం... ఆ పండ్ల రుచిని ఆస్వాదించలేం..! అదే పరిస్థితి ఈ సినిమా చూస్తున్న ప్రేక్షకులది కూడా ..! సినిమా చూడటానికి ప్రచారానికి వాడిన పోస్టర్ల లానే చాలా అందంగా ఉంటుంది. అందమైన లోకేషన్స్ , ఆహ్లాదకరమైన వాతావరణం, సూపర్బ్ సినిమాటోగ్రఫీ , మంచి ఆర్ట్ వర్క్ తెర మీద నుండి చూపును పక్కకు తిప్పనియ్యవు. కాని సినిమాకు ఆత్మ లాంటి కధ, కధనాలు మాత్రం చికాకు పెట్టి చిరాకు తెప్పిస్తాయి.
ప్రత్యేకంగా నొక్కి చెప్పటం కాదు కాని కొత్త దర్శకుడు హను రాఘవపూడి సహా దర్శకుడిగా చంద్ర శేకర్ ఎలిటి దగ్గర పనిచేసాడు కాని సినిమా చూసిన తరవాత అనిపించేదేమంటే అయన మణిరత్నం కు ఏకలవ్య శిష్యుడేమో అని. అంటే మణిరత్నం లా సినిమా తీసాడని కాదు... ఆయన్ను అనుకరించాలని అనుకున్నాడు అందుకు..! కాని ఇక్కడో విషయం గుర్తించాలి మణిరత్నం లాంటి వాళ్ళను ఆస్వాదించలే కాని అనుకరించలేం ..! ఎందుకంటే మణిరత్నం సినిమాలు అయన మనసు నుండి వస్తాయి. పనిని అనుకరించ వచ్చు కాని ఒకరి మనసులో పుట్టే భావాలను మరొకరు ఎప్పుడు అనుకరించలేరు. ఈ విషయాన్నీ గుర్తించని హను మణిరత్నం మౌనరాగం , గీతాంజలి సినిమాల ఫ్లేవర్ ను ఈ సినిమాకు అద్దాలని ప్రయత్నించి ఘోరంగా భంగపడ్డాడు.
సినిమాకు అవసరంలేని ఎన్నో విషయాలను కధకు జోడించాడు. అలానే కధనాన్ని ఆసక్తికరంగా నడిపించటానికి అవసరం అయిన ఎన్నో విషయాలను లైట్ తీసుకుని పక్కన పెట్టేసాడు. సినిమా కధ 1992 సమయంలో జరిగింది అని చెప్పాడు ..కాని అప్పటి పరిస్థితులను కాని , వాతావరణాన్ని కాని అర్ధవంతంగా ప్రెజెంట్ చెయ్యలేక పోయాడు. అసలు ఆ బ్యాక్ డ్రాప్ ను కధకు ఎందుకు జోడించాడో కూడా అర్ధం కాదు. అలానే సినిమా మొదటిసగం మొత్తం పూర్తీ శూన్యం ఆవరించి ఉంటుంది. ప్రేక్షకులను ఆహ్లాద పరచటానికి అవసరమైన ఎంతో ఉత్సాహాన్ని మొదటి సగం లోని సన్నీ వేశాలకు జోడించవలసి ఉంది కాని హాను ఆ భాద్యతను రాహుల్, లావణ్య ల మీద వదిలేసి వాళ్ళేం చేసారో అది చూట్టేసి జనాల ముందు ఉంచినట్టు అనిపిస్తుంది.
అలానే క్లైమాక్స్ లో స్పష్టంగా అర్ధం అయ్యేది ఏమంటే ఏదో చెప్పాలని ముందనుకుని... తరవాత మనసు మార్చుకుని మరేదో చేసి .. అదీ నచ్చక చివరికి ఎలాగో ముగించాం అనిపించాడు.. ! కధలో నవీన్ పాత్ర ఎంటర్ అయిన తరవాత సినిమాకు కొంత ఎనర్జీ వస్తుంది, నవీన్ యాక్టివ్ గా ఉన్న పార్ట్ ఈ సినిమా చూస్తున్న వాళ్ళకు కొంత ఊరట.
కాని టెక్నికల్ గా మాత్రం ఈ సినిమాను, దానికి పనిచేసిన వాళ్ళను ఎంత మెచ్చుకున్న తక్కువే ..! ముఖ్యంగా మురళి సినిమాటోగ్రఫీ సినిమాకే ప్రాణం. తరవాత రధన్ అందించిన పాటలు , బ్యాక్ స్కోరు చాలా బాగున్నాయి. ఆర్ట్ వర్క్ .. ముఖ్యంగా బీర్ బాటిల్స్ తో హీరోయిన్ బొమ్మ వెయ్యటం నిజంగా అద్భుతం. అన్ని సాంకేతిక విభాగాలు చాలా చక్కగా పనిచేశాయి. నిర్మాణాత్మక విలువలు ఉన్నతంగా ఉన్నాయి.
అభినయం :
నవీన్ ఆకట్టుకున్నాడు .. అతనిలో మంచి ఈజ్ ఉంది. ముందు ముందు మంచి అవకాశాలు వస్తే తప్పక రాణిస్తాడు. లావణ్య చూడటానికి బక్కగా కనిపించిన ఆ అమ్మాయిలో ఏదో విషయం ఉంది. ప్రధానంగా ఆమె కళ్ళు సూదంటు రాళ్ళలా చూస్తూ ఉంటే చూడాలనిపిస్తూనే ఉంటాయి. అలానే ఆమె నవ్వుతూ ఉన్నా , కోపం తో ఉన్నా, బుంగ మూతి పెట్టిన భలే ముచ్చటేస్తుంది.
రాహుల్ చూడటానికి బాగున్నాడు నటన కూడా పర్వాలేదు. కాని అతను మాట్లాడుతుంటేనే అసహనం కలుగుతుంది. రాహుల్, అతని తండ్రి పాత్ర మాట్లాడుకుంటుంటే ఏదో ఇంగ్లీష్ డబ్బింగ్ సినిమా చూస్తున్నట్టు అని పిస్తుంది కాని తెలుగు సినిమాలా అనిపించదు . మిగత నటులు వారి పాత్రలకనుగుణంగా బాగానే నటించారు.
ప్లస్ పాయింట్స్ :
సాంకేతికంగా అన్ని విభాగాలు ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్
మైనస్ పాయింట్స్ :
నెమ్మదిగా... ఆసక్తి లేకుండా సాగే కధనం ... క్లారిటి లేని క్లైమాక్స్ చాలా వరకు ఈ సినిమాకు మైనస్ పాయింట్స్.
కొసమెరుపు :

అందాల రాక్షసి అంటే అర్ధం ఏమిటి..? అందంగా ఉండే రాక్షసి .. అనే కాదా...!
అంటే అందంగా ఉన్నా... లేక పోయినా రాక్షసి రాక్షసే..! అదీ ఎంత అందమైనదైనా...
దాని నైజం మనుషులను పిక్కు తినటమే ..! కాబట్టి ఎప్పుడన్నా మన కర్మ కొద్ది ఒక అందమైన రాక్షసి పాలపడి హింస అనుభవిస్తున్నప్పుడు మనకు కలిగే ఒకే ఒక సంతృప్తి ఏమంటే మనం భరిస్తుంది ఓ అందమైన రాక్షసిని అనే ఫీలింగ్ ....! సరిగ్గా ఈ లాజిక్ అందాల రాక్షసి
సినిమాకు ష్యూర్ గా వర్తిస్తుంది.
Maruthi Talkies Rating 2.5 Out Of 5

No comments:
Post a Comment