![]() | |
ఈ మధ్య మెగా హీరోలా దర్శకుడిగా పిలవబడుతున్న వి వి వినాయక్ దర్శకత్వంలో డి వి వి దానయ్య ప్రతిస్థాత్మకంగా నిర్మిస్తున్న 'నాయక్' ది లీడర్ సినిమాకు సంబందించిన ఓ పాటలోని స్టిల్స్ ఇవి.....!
యాక్షన్ కామెడీ మాస్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో చెర్రీ సరసన కాజల్, అమల పాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వినాయక్ ఆస్థాన రచయత ఆకుల శివ రచన సహకారం అందిస్తున్నాడు.
సాంకేతికంగా మరియు టేకింగ్ పరంగా వినాయక్ స్టైల్ లో నిర్మితమవుతున్న ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. విశేషం ఏమంటే తమన్ వినాయక్ తోనూ , చెర్రి తోనూ పనిచేయటం ఇదే మొదటిసారి...!
అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, స్టిల్స్ లో కనిపిస్తున్న వాతావరణం ప్రకారం రామ్ చరణ్ చేసిన ఈ స్టెప్పులను జానీ మాస్టర్ నేతృత్వంలో, పబ్ నేపద్యంలో, దుబాయ్ లో చిత్రీకరించినట్టు తెలుస్తుంది.
ఇక్కడ వ్రాసేవాడి బుర్రకేం తట్టిందేమంటే..... ఇప్పటి వరకు ఎన్నో అంశాల్లో చిరంజీవిని తలపించి మురిపించిన ఈ బుల్లి మెగాస్టార్ లో ఈ ఫోటోలు చూసాక బాలీవుడ్ డాన్సింగ్ డైనమేట్ హృతిక్ రోషన్ కనిపిస్తున్నాడు. ఆ స్టైల్ , ఆ మానరిజం , ఆ మూమెంట్స్ లో హృతిక్ రోషన్ తలంపుకు రావటం డాన్స్ చేయటంలో రామ్ చరణ్ కు ఉన్న డెడికేషన్ ను తెలియచేస్తుంది. దీనిని బట్టి అర్ధం చేసుకోవచ్చు అభిమానులను అలరించటానికి చెర్రీ ఎంతలా కష్ట పడుతున్నాడో....! కీప్ ఇట్ అప్ చెర్రీ ...!






No comments:
Post a Comment