'బద్రినాథ్' సినిమా విడుదలయ్యి సంవత్సరం దాటినా అల్లు అరవింద్ క్యాంపులో మరో సినిమా హడావిడి కనిపించలేదు. అలాంటిది సడెన్ గా ప్రియమణి ప్రధాన పాత్రలో నటించిన కన్నడ డబ్బింగ్ సినిమా 'చారులత' పోస్టర్ ఫై గీత ఆర్ట్స్ డిస్ట్రిబ్యుషన్ అని కనిపించటం... పరిశ్రమ వర్గాలలో ఆశ్చర్యం రేకెత్తిస్తే ... ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగించింది.
వరసగా సినిమాలు చేయక పోయినప్పటికీ తనకున్న పలుకుబడితో.... తెలుగు సిని పరిశ్రమకు , విడుదల కావాల్సిన సినిమాలకు దిశ నిర్దేశం చేయగలిగే సత్తా ఉన్న గీత ఆర్ట్స్ 'చారులత' సినిమా ఫై శ్రద్ద పెట్టటం ఆలోచించవలసిన అంశంగా మారింది. ఎందుకంటే ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థగా తెలుగునాట వెలుగొందుతున్న గీత ఆర్ట్స్ చాలా వరకు తనే సొంతంగా సినిమాలను నిర్మిస్తుంది. అతి తక్కువగా మాత్రమే అనువాద చిత్రాలను ప్రమోట్ చేస్తుంది. ఈ మద్య కాలంలో వారు అందించిన అనువాద చిత్రాలు తమిళ 'గజినీ' మరియు ఇంగ్లీష్ 'అవతార్'. ఈ రెండు చిత్రాలు గీత సంస్థకు లాభాలు తెచ్చి పెట్టాయి.
ఇలా చూసుకుంటే ఇక్కడ ఆలోచించవలసిన విషయం ఏమిటంటే .. ఏంతో ప్రత్యేకత ఉంటేనే గీత ఆర్ట్స్ అనువాద చిత్రాలా జోలికిపోదు..! అలాంటిది చారులత మీద స్పెషల్ శ్రద్ద పెట్టింది అంటే ఆ సినిమాలో ఏదో విషయం ఉంది అని ఫిలిం నగర్ టాక్. అదే విషయాన్నీ బలపరుస్తూ ప్రేక్షకులు కూడా సినిమా మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. నిజంగా సినిమాలో ఏదన్నా విషయం ఉంటే అంతా బానే ఉంటుంది. అలా కాకుండా నిర్మాత బంధువనో... ఆప్తమిత్రుడనో... లేక నమ్మిన బంటనో ... గీత ఆర్ట్స్ పేరు వాడుకోమని భరోసా ఇచ్చినట్టయితే మాత్రం జాగ్రత్తగా ఉండాల్సిందే...!
ఎందుకంటే తెలుగు ప్రేక్షకులు సస్పెన్సు థ్రిల్లర్స్ ఫై పెద్ద ఆసక్తి కనబరచరు... అందులోను హర్రర్ సస్పెన్సు అంటే అసలు పట్టించుకోరు. అంటే అలాంటి సినిమాలు చూసే వాళ్ళు లేరని కాదు .. వాటిని ఆదరించే వాళ్ళ శాతం చాలా తక్కువని. అందువల్ల తక్కువ బడ్జెట్ సినిమాలు ఒడ్డున పడతాయి కాని.. భారి చిత్రాల పరిస్థితి కొంచెం కష్టమే..!
ఈ 'చారులత' 'ఎలోన్' అనే థాయి సినిమాకు అధికారిక రిమేక్ గా వస్తుంది. అవిభక్త కవలల కధతో వచ్చిన 'ఎలోన్' ప్రపంచవ్యాప్తంగా ఓ సంచలనం .. మరి ఆ సంచలనం తెలుగు లో కూడా కొనసాగుతుందో... లేదో.. త్వరలో తెలియనుంది.
Watch Charulatha Trailer

No comments:
Post a Comment