తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మనవడు ఉదయనిది స్టాలిన్ హీరోగా పరిచయమైనా 'ఓకే ..ఓకే..' చిత్రం ఈ ఏడాది మొదట్లో విడుదలై తమిళంలో ఘనవిజయాన్ని సాదించింది. ఇప్పుడు ఆ చిత్రాన్ని మన బెల్లంకొండ తెలుగులోకి అనువదించి మనకు అందిస్తున్నాడు. ఓ పెద్ద నిర్మాత ప్రత్యేకంగా ఈ సినిమా ఫై శ్రద్ద పెట్టాడు అంటే ఇందులో ఏదో విషయం ఉంది అని మనందరికీ అనిపించటం సహజమే...!
మన బెల్లంకొండకు సినిమా మనస్పూర్తిగా నచ్చితే తెలుగులో డైరెక్ట్ గా రీమేక్ చేస్తాడు, అలాంటిది ఇంకా సరిగా గుర్తింపురాని హీరోను తెలుగు తెరకు పరిచయం చేస్తున్నాడంటే తప్పకుండా ఏదో విశేషం ఉండే తీరాలని అనుమానం వచ్చి తీరాలి. అప్పుడే నిజాలు బయటకు వస్తాయి. మనం ఊహించినట్టే ఈ సినిమాలో ఓ పెద్ద విశేషమే ఉంది ... ఆ విశేషం పేరు 'సంతానం'. సినిమాకు సంబంధించి బయట కనిపిస్తున్న పోస్టర్లు, ట్రైలర్లు , పాటలు ఇవన్నీ ట్రాష్..... సినిమాలో అసలు పండగా సంతానం చేసే కామెడీది.
ఒట్టూ ..... నిజమే చెబుతున్న సినిమాలో కూర్చున్నాకా సంతానం పెట్టే గిలిగింతలకు నవ్వలేక రెండు మూడు సార్లు కడుపులో నొప్పి రావటం ఖాయం. సంతానం లేక పొతే ఈ సినిమాకు అర్ధమే లేదు. అంత బాగా వచ్చిన ఆ పాత్రను తెలుగులో అంతే స్పెషల్ గా చేయగలిగింది సునీల్ మాత్రమే...! కాని ఇప్పుడు సునీల్ హీరో కాబట్టి ఆ పాత్ర చేయటం కుదరదు. దాంతో వేరే ప్రత్యామ్నయం లేక బెల్లంకొండ ఒరిజినల్ నే తెలుగు వాళ్ళకు చూపించి ... నవ్వించి.... క్యాష్ చేసుకోవటానికి సిద్దం అయ్యాడు.
ఈ సినిమా గురించి ఒక విషయం మాత్రం మనస్పూర్తిగా చెప్పవచ్చు. ఈ సినిమాను చూస్తూ స్వచ్చమైన కామెడీని ఆస్వాదించవచ్చు, హాయిగా నవ్వుకోవచ్చు. పూర్తిగా పైసా వసూల్ టైం పాస్ ఎంటర్ టైనర్ ...! ఆ క్రెడిట్ పూర్తిగా సంతానానికే దక్కుతుంది.

No comments:
Post a Comment