రంగం విజయంతో తెలుగునాట కొద్దిగా గుర్తింపు తెచ్చుకున్న తమిళ నటుడు జీవా ఆ తరవాత చేసిన ప్రయత్నాలేవీ పెద్దగా ఆకట్టుకోలేక పోయాయి. తాజాగా సూపర్ హీరో కధంశంతో రూపొందిన 'మాస్క్' చిత్రం తో ఈ వారం తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తమిళంలో 'ముగమూడి' గా నిర్మితమైన ఈ చిత్రాన్ని ఆర్ బి చౌదరి సమర్పణలో సూపర్ గుడ్ ఫిల్మ్స్ పతాకం ఫై తెలుగులోకి అనువదించారు. మిస్కిన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో జీవా సరసన ప్రియ హెగ్డే హీరోయిన్ గా నటించగా నాజర్, నరేన్ తదితరులు ఇతర ప్రధాన పాత్రలలో నటించారు. కె సంగీతాన్ని అందించాడు.
నిర్మాణపరంగా ఎన్నో కష్టాలను అధిగమించి విడుదలకు సిద్దమైన ఈ చిత్రం ఫై తమిళంలో భారి అంచనాలున్నాయి. టాలీవుడ్ లో పెద్దగా అంచనాలు లేకుండానే విడుదలైన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవటంలో ఎంతవరకు సఫలం అయ్యిందో.... మన సమీక్షలో చూద్దాం.
కధ:
డిగ్రీ పూర్తిచేసి జులాయిగా తిరుగుతున్నా ఆనంద్ అలియాస్ బ్రూస్ లీ (జీవా)కి కుంగ్ ఫూ అన్నా , తనకు ఆ విద్య నేర్పించిన గురువు చంద్రు అన్నాఅమితమైన ప్రేమ. కుంగ్ ఫూ అనేది మానసిక ప్రశాంతత కోసం నేర్చుకునే ఆత్మరక్షణ విద్య అని నమ్మే చంద్రు దానిని వ్యాపారంగా చూడక, పేద ఓవుత్సహికులకు నేర్పిస్తూ ఉంటాడు. చంద్రు సమకాలికుడైన ఆది(నరేన్) ఆ విద్యనూ అడ్డుపెట్టుకుని దోపిడిలు, హత్యలు చేస్తూ పోలీసులకు సవాలుగా నిలుస్తాడు.
కుంగ్ ఫూ నేర్చుకుని ఆ తరవాత ఏమి చేయాలో తెలియక ఒక అయోమయం స్థితిలో ఉన్నా బ్రూస్ లీ జీవితంలోకి శాంతి (ప్రియ హెగ్డే) ప్రవేశిస్తుంది. కొన్ని అనుకోని తప్పిదాల వల్ల శాంతి దృష్టిలో లీ పోకిరి అవుతాడు. అందుకని ఆమెను ఇంప్రెస్ చేయటానికి మాస్క్ మాన్ గా అవతారం ఎత్తుతాడు.
మాస్క్ మాన్ గా అనుకోకుండానే ఒక దొంగను పట్టించి సూపర్ హీరో అవుతాడు. కాని ఒక విషమ సమయంలో ఆదిని పట్టుకునే పనిలో ఉన్నా శాంతి తండ్రి అయినా పోలీసు కమిషనర్ ఫై జరిగిన హత్యయత్నంలో ఇరుక్కుంటాడు లీ. దాంతో మాములు రూపంలో తిరగలేని లీ పూర్తిగా మాస్క్ మాన్ గా మారిపోతాడు. ఆ ఫై మాస్క్ మాన్ తానూ నిర్దోషి అని నిరూపించుకుని ఆది ఆగడలను ఎలా ఎదుర్కున్నాడు అన్నది మిగిలిన కధ.
విశ్లేషణ:
తమిళంలో ఈ సినిమాకు సూపర్ హీరో సినిమా అనే క్రేజ్ కంటే ... మిస్కిన్ సినిమా అనే క్రేజే ఎక్కువ. ఎందుకంటే అతను కధ చెప్పే విధానంలోను , అతని చిత్రీకరణలోను ఒక ప్రత్యేకత ఉంటుంది. అలా అని మిస్కిన్ పక్తు కమర్షియల్ దర్శకుడు మాత్రం కాదు. అతని సినిమాలు , చిత్రీకరణ శైలి వాస్తవానికి దగ్గరగా ఉంటాయి. మన చుట్టూ పక్కల జరిగే విషయాలే అతని సినిమాల్లో ప్రధానంగా కనిపిస్తూఉంటాయి. కాని ఈ సినిమాకు ఆ ఫార్ముల కొంత వరకు మైనస్ గా పరిణమించిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పుడు వరకు మనం చూసిన సూపర్ హీరోలందరూ ఫాంటసిలో నుండి , ఊహల్లో మాత్రమే జరిగే అద్భుతాల నుండి పుట్టుకొచ్చారు. కాని ఇక్కడ మిస్కిన్ వాస్తవం లో ఉన్నా సామాన్య జనంలో నుండి ఒక సూపర్ హీరోను బయటకు తీసుకొచ్చాడు. అలా వచ్చిన హీరో అద్భుతాలకు తవ్వివ్వకా రియలిస్టిక్ గా ప్రవర్తించడం ప్రేక్షకులకు బోర్ కొట్టించింది.
ఈ సినిమా గురించి రెండు భాగాలుగా చెప్పుకోవాలి. ఎందుకంటే సినిమా మొదటి సగం ఎంత బాగుందో... రెండో సగం అంత నిరాశ పరుస్తుంది. అసలు రెంటికి సంబందమే ఉన్నట్టు అనిపించదు. మొదటి సగాన్ని ఎంత ఎంజాయ్ చేస్తామో రెండో సగాన్ని అంతలా భరించాల్సిఉంటుంది. అంతు చిక్కని దోపిడీ దొంగల అరచాకంతో చాలా ఆసక్తిగా మొదలవుతుంది సినిమా. తరవాత హీరో ఇంట్రడక్షన్ సింపుల్ గా అదిరిపోద్ది. హీరో పాత్ర తీరు తెన్నులు రియలిస్టిక్ పద్దతిలో భలేగా చెప్పాడు మిస్కిన్. ఆ ఫై హీరోలో లవ్ యాంగిల్ మొదలయ్యాక సినిమాకు మరింత ఊపు వస్తుంది. అక్కడ నుండి ఇంటర్వల్ వరకు సినిమా భలే పసందుగా ఉంటుంది. కాని ఈ ఆనందానికి ఇంటర్వెల్ లోనే బ్రేకులు పడటం భాదాకరం.
రెండో సగం మొదలైనప్పటి నుండే మార్పు స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. ఏదో మిస్ అవుతున్నాం ... దేన్నో వదిలేస్తూ వెళ్తున్నాం అన్నా ఫీలింగ్ ను మనతో మోపిస్తూ బోరింగ్ గా కధను చివరి వరకు నడిపిస్తాడు దర్శకుడు మిస్కిన్. మొదటి సగం లో ఎంతో ఆక్టివ్ గా కనిపించిన అన్ని పాత్రలు రెండో సగంలో మందగమనంతో విసుగు పుట్టిస్తాయి. మొదటి సగంలో మురిపించిన ప్రేమ రెండో సగంలో పడకేసింది, అలానే ముందు కనిపించిన అడ్వెంచర్ తరవాత అటకెక్కింది. పేలవమైన సాగతీత సన్నివేశాలు సహనాన్ని పరీక్షిస్తాయి.
వీటి సంగతే ఇలా ఉంది ఇక లాజిక్ లా దగ్గరకి వస్తే కనిపించే బొక్కలు బోలెడన్ని..! కుంగ్ ఫూ లో నైపుణ్యం సాదించిన హీరో జులాయిగా తిరగకుండా కాంపిటేషన్ లో పాల్గొనే విషయంగా ఎందుకు ట్రై చేయడో ... అర్ధం కాదు. ఈ మాస్క్ మాన్ కి సూపర్ పవర్స్ లేక పొతే మానే తెలివితేటలూ కుడా లేకుండా చేశాడు దర్శకుడు . ఎక్కడా మచ్చుకకి కుడా బుర్ర వాడినట్టు కనపడడు. అలానే మాస్క్ మాన్ అనే ఈ సూపర్ హీరో సమాజానికి మంచి చేయటం కంటే తాను నిర్దోషి అని నిరూపించుకోవాలని ప్రయత్నించినట్టు మాత్రమే ఉంటుంది సినిమా.
శశాంక్ వెన్నెలకంటి మాటలు పెద్దగా ఆకట్టుకోలేదు. కె అందించిన పాటలు క్యాచిగా లేవు. బ్యాక్ స్కోరు మాత్రం డార్క్ నైట్ సెరీస్ ను గుర్తుకు తెస్తుంది. టెక్నికల్ గా మాత్రం సినిమా అద్భుతంగా వచ్చింది. సత్య సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, కాస్ట్యూమ్స్ తదితర విభాగాలు ఉన్నతమైన పనితనాన్ని ప్రదర్శించాయి. నిర్మాణాత్మక విలువలు ఉన్నతంగా ఉన్నాయి.
జీవా మాస్క్ మాన్ పాత్రకు అతికినట్టు సరిపోయాడు. ఆ పాత్రలో ఉన్నా వేరియేషన్స్ అన్నింటిలోకి మోల్డ్ అవుతూ మాస్క్ మాన్ పాత్రను సమర్ధవంతంగా పోషించగలిగాడు. ముచ్చటే లేదు అద్భుతంగా నటించాడు. జీవాలో మంచి నటుడుకి అవసరమైన అన్ని లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ సినిమా కమర్షియల్ గా నడిచిన నడవకపోయిన జీవా నటనకు మాత్రం తప్పక గుర్తింపు ఉంటుంది. కొత్త నటి ప్రియ హెగ్డే బాగుంది నటన కుడా పర్వాలేదు. విలన్ గా నటించిన నరేన్ నిరాశపరిచాడు. ఆ పాత్రకు నరేన్ సరిపోలేదు. మరీ క్లైమాక్స్ లో అతని నటన వెటకారంగా ఉంటుంది. నాజర్ సహా మిగత నటులు వారి పాత్రలకనుగుణంగా బాగా నటించారు.
ప్లస్ పాయింట్స్:
జీవ పెర్ఫార్మెన్స్ , మొదటి సగం ఈ సినిమాకు ప్రధాన ప్లస్ పాయింట్స్.
మైనస్ పాయింట్స్ :
బోరింగ్ సెకండ్ హాఫ్ , ఆకట్టుకోలేక పోయిన విలన్ ప్రధానంగా ఈ సినిమాకు మైనస్ పాయింట్స్
కొసమెరుపు:
మొత్తంగా ఈ సినిమా మొదటి సగం చూస్తుంటే ముచ్చటేస్తుంది... రెండో సగం చూస్తుంటే చిరకేసిద్ది. ఎలాగూ సినిమా మీద పెద్దగా అంచనాలు లేవు కాబట్టి ఒక వారం ఆగితే సినిమా వచ్చినట్టుకాని ... పోయినట్టు కాని ఎవరికీ తెలేసే అవకాశమే ఉండదు..!
Maruthi Talkies Rating 2.5 out of 5

No comments:
Post a Comment