Pages

Ads 468x60px

Text Widget

Recent Posts

Definition List

Download

Friday, August 31, 2012

Secret Behind Balayya's Glamour


"రోజు రోజుకు బాలయ్య కుర్రాడిలా  మారి పోతున్నాడు... ఈ  మధ్య కాలంలో బాలకృష్ణలో గ్లామర్ వీపరితంగా పెరిగిపోయింది" ఎక్కడ చూసిన  ఇదే  టాపిక్ ...!  అసలు బాలయ్య గ్లామర్ సిక్రెట్ ఏమిటి ... ? ఏమిటి...? ఏమిటి..?   ఎవరడిగినా  ఇదే ప్రశ్న ...! ఇంతకీ  బాలయ్య అందం వెనకున్న ఆ  అందమైన రహస్యం ఏమిటి ...?

 రహస్యం ఏమి  లేదు ...! మనసు హాయిగా ఉంటే .... మనిషి ఆనందంగా ఉంటాడు. ఆనందం ఎంత ఎక్కువైతే గ్లామర్ అంతకు రెట్టింపవుతుంది. అదే బాలయ్యలో పెరుగుతున్న అందానికి కారణం. బాలయ్యలో అంత  ఆనందాన్ని నింపుతున్న విషయం ఏమంటే..... 'సేవ'. మనకు అన్ని ఉన్నాయని తృప్తి పడితే కొంతే సంతోషం. చేతనైనంతలో ఆపదలో ఉన్నవాళ్ళకి సహాయం చేయటంలో పూర్తీ ఆనందం ఉంది. 

మన వల్ల  ఒకరికి మంచి జరిగింది అని తెలిసినప్పుడు మనలో కలిగే ఫీలింగ్ ను ఎన్ని కోట్లు పెట్టిన కొనలేం . ఆ ఫీలింగ్ ఇచ్చే శక్తి  వెయ్యి విటమిన్ టాబ్లెట్ లు కూడా ఇవ్వలేవు. అలాంటి పాజిటివ్ శక్తి మనిషిలో ఉంటే  అంతకుమించిన ఆనందం ఉండదు.  బాలయ్య ఇప్పుడు నందమూరి బసవతారకం ఇండో అమెరికన్ కాన్సర్ హాస్పిటల్ చైర్మన్ గా పలు సేవ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటున్నాడు. ఏంతో ఉత్సాహంగా విరాళాలు సేకరిస్తున్నాడు. ఈ మధ్యే హాస్పిటల్  కొత్త భవనాన్ని ప్రారంభించాడు. అంతే  కాకుండా హాస్పిటల్ లో రిసర్చ్ కూడా ఆశావహంగా కొనసాగుతుంది. ఇప్పుడు రాబోయే ఆరు నెలలు పూర్తిగా విరాళాల సేకరణ కోసం కేటాయించాడు. 

ఈ కార్యక్రమాల వల్ల ఏంతో మంది సహాయం పొందుతున్నారు. అలా మేలు పొందినవారి  దీవెనలు బాలయ్యలో ఆనందానికి కారణం కావచ్చు. అదే బాలయ్య గ్లామర్ పెరగటానికి దోహదపడి ఉండొచ్చు....! అనేది ఒక కోణంలో ఆలోచించిన అభిప్రాయం మాత్రమే . ఇదే కాకుండా  మరిన్ని కారణాలు ఉండే అవకాశాలు మెండుగా ఉన్నాయి.  

 

Mask Movie review - Jeeva Mugamoodi Review



రంగం విజయంతో తెలుగునాట కొద్దిగా గుర్తింపు తెచ్చుకున్న తమిళ నటుడు జీవా ఆ తరవాత చేసిన ప్రయత్నాలేవీ పెద్దగా ఆకట్టుకోలేక పోయాయి. తాజాగా సూపర్ హీరో కధంశంతో రూపొందిన 'మాస్క్' చిత్రం తో ఈ వారం తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తమిళంలో 'ముగమూడి' గా నిర్మితమైన ఈ చిత్రాన్ని ఆర్ బి చౌదరి సమర్పణలో సూపర్ గుడ్ ఫిల్మ్స్ పతాకం ఫై తెలుగులోకి అనువదించారు. మిస్కిన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో జీవా సరసన ప్రియ హెగ్డే హీరోయిన్ గా నటించగా నాజర్, నరేన్ తదితరులు ఇతర ప్రధాన పాత్రలలో నటించారు.  కె సంగీతాన్ని అందించాడు. 
 
నిర్మాణపరంగా ఎన్నో కష్టాలను అధిగమించి విడుదలకు సిద్దమైన ఈ చిత్రం ఫై తమిళంలో భారి అంచనాలున్నాయి. టాలీవుడ్ లో పెద్దగా అంచనాలు లేకుండానే విడుదలైన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవటంలో ఎంతవరకు సఫలం అయ్యిందో.... మన సమీక్షలో చూద్దాం.

కధ:

డిగ్రీ పూర్తిచేసి జులాయిగా తిరుగుతున్నా ఆనంద్ అలియాస్ బ్రూస్ లీ (జీవా)కి కుంగ్ ఫూ అన్నా , తనకు ఆ విద్య నేర్పించిన గురువు చంద్రు అన్నాఅమితమైన ప్రేమ. కుంగ్ ఫూ అనేది మానసిక ప్రశాంతత కోసం నేర్చుకునే ఆత్మరక్షణ విద్య అని నమ్మే చంద్రు దానిని వ్యాపారంగా చూడక, పేద ఓవుత్సహికులకు నేర్పిస్తూ ఉంటాడు. చంద్రు సమకాలికుడైన ఆది(నరేన్) ఆ విద్యనూ అడ్డుపెట్టుకుని దోపిడిలు, హత్యలు చేస్తూ పోలీసులకు సవాలుగా నిలుస్తాడు.  
 
కుంగ్ ఫూ నేర్చుకుని ఆ తరవాత ఏమి చేయాలో తెలియక ఒక అయోమయం స్థితిలో ఉన్నా బ్రూస్ లీ జీవితంలోకి శాంతి (ప్రియ హెగ్డే) ప్రవేశిస్తుంది. కొన్ని అనుకోని తప్పిదాల వల్ల శాంతి దృష్టిలో లీ పోకిరి అవుతాడు. అందుకని ఆమెను ఇంప్రెస్ చేయటానికి మాస్క్ మాన్ గా అవతారం ఎత్తుతాడు. 
 
మాస్క్ మాన్ గా అనుకోకుండానే ఒక దొంగను పట్టించి సూపర్ హీరో అవుతాడు. కాని  ఒక విషమ సమయంలో ఆదిని పట్టుకునే పనిలో ఉన్నా శాంతి తండ్రి అయినా పోలీసు కమిషనర్ ఫై జరిగిన హత్యయత్నంలో ఇరుక్కుంటాడు లీ. దాంతో మాములు రూపంలో తిరగలేని లీ పూర్తిగా మాస్క్ మాన్ గా మారిపోతాడు. ఆ ఫై మాస్క్ మాన్ తానూ నిర్దోషి అని నిరూపించుకుని ఆది ఆగడలను ఎలా ఎదుర్కున్నాడు అన్నది మిగిలిన కధ. 

విశ్లేషణ:   

తమిళంలో ఈ సినిమాకు సూపర్ హీరో సినిమా అనే క్రేజ్ కంటే ... మిస్కిన్ సినిమా అనే క్రేజే ఎక్కువ. ఎందుకంటే అతను కధ చెప్పే విధానంలోను , అతని చిత్రీకరణలోను ఒక ప్రత్యేకత ఉంటుంది. అలా అని మిస్కిన్ పక్తు కమర్షియల్ దర్శకుడు మాత్రం కాదు. అతని సినిమాలు , చిత్రీకరణ శైలి వాస్తవానికి దగ్గరగా ఉంటాయి. మన చుట్టూ పక్కల జరిగే విషయాలే అతని సినిమాల్లో ప్రధానంగా కనిపిస్తూఉంటాయి. కాని ఈ సినిమాకు ఆ ఫార్ముల కొంత వరకు మైనస్ గా పరిణమించిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పుడు వరకు మనం చూసిన సూపర్  హీరోలందరూ ఫాంటసిలో నుండి , ఊహల్లో మాత్రమే జరిగే అద్భుతాల నుండి పుట్టుకొచ్చారు. కాని ఇక్కడ మిస్కిన్ వాస్తవం లో ఉన్నా సామాన్య జనంలో నుండి ఒక సూపర్ హీరోను బయటకు తీసుకొచ్చాడు. అలా వచ్చిన హీరో అద్భుతాలకు తవ్వివ్వకా రియలిస్టిక్ గా ప్రవర్తించడం ప్రేక్షకులకు బోర్ కొట్టించింది. 

ఈ సినిమా గురించి రెండు భాగాలుగా చెప్పుకోవాలి. ఎందుకంటే సినిమా మొదటి సగం ఎంత బాగుందో... రెండో సగం అంత నిరాశ పరుస్తుంది. అసలు రెంటికి సంబందమే ఉన్నట్టు అనిపించదు. మొదటి సగాన్ని ఎంత ఎంజాయ్ చేస్తామో రెండో సగాన్ని అంతలా భరించాల్సిఉంటుంది. అంతు చిక్కని దోపిడీ దొంగల అరచాకంతో చాలా ఆసక్తిగా మొదలవుతుంది సినిమా. తరవాత హీరో ఇంట్రడక్షన్ సింపుల్ గా అదిరిపోద్ది. హీరో పాత్ర తీరు తెన్నులు  రియలిస్టిక్ పద్దతిలో భలేగా చెప్పాడు మిస్కిన్.  ఆ ఫై హీరోలో లవ్ యాంగిల్ మొదలయ్యాక సినిమాకు మరింత ఊపు వస్తుంది. అక్కడ నుండి ఇంటర్వల్ వరకు సినిమా భలే పసందుగా ఉంటుంది. కాని ఈ ఆనందానికి ఇంటర్వెల్ లోనే బ్రేకులు పడటం భాదాకరం. 
 
రెండో సగం మొదలైనప్పటి నుండే మార్పు స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. ఏదో మిస్ అవుతున్నాం ... దేన్నో వదిలేస్తూ వెళ్తున్నాం అన్నా ఫీలింగ్ ను మనతో మోపిస్తూ బోరింగ్ గా కధను చివరి వరకు నడిపిస్తాడు దర్శకుడు మిస్కిన్. మొదటి సగం లో ఎంతో ఆక్టివ్ గా కనిపించిన అన్ని పాత్రలు రెండో సగంలో మందగమనంతో విసుగు పుట్టిస్తాయి. మొదటి సగంలో మురిపించిన ప్రేమ రెండో సగంలో పడకేసింది, అలానే ముందు కనిపించిన అడ్వెంచర్ తరవాత అటకెక్కింది. పేలవమైన సాగతీత సన్నివేశాలు సహనాన్ని పరీక్షిస్తాయి. 
 
వీటి సంగతే ఇలా ఉంది ఇక లాజిక్ లా దగ్గరకి వస్తే కనిపించే బొక్కలు బోలెడన్ని..!  కుంగ్ ఫూ లో నైపుణ్యం సాదించిన హీరో జులాయిగా తిరగకుండా కాంపిటేషన్ లో పాల్గొనే విషయంగా ఎందుకు ట్రై చేయడో ... అర్ధం కాదు. ఈ మాస్క్ మాన్ కి సూపర్ పవర్స్ లేక పొతే మానే తెలివితేటలూ కుడా లేకుండా చేశాడు దర్శకుడు . ఎక్కడా మచ్చుకకి కుడా బుర్ర వాడినట్టు కనపడడు. అలానే మాస్క్ మాన్ అనే ఈ సూపర్ హీరో  సమాజానికి మంచి చేయటం కంటే తాను నిర్దోషి అని నిరూపించుకోవాలని ప్రయత్నించినట్టు మాత్రమే ఉంటుంది సినిమా.  

శశాంక్ వెన్నెలకంటి మాటలు పెద్దగా ఆకట్టుకోలేదు. కె అందించిన పాటలు క్యాచిగా లేవు. బ్యాక్ స్కోరు మాత్రం డార్క్ నైట్ సెరీస్ ను గుర్తుకు తెస్తుంది. టెక్నికల్ గా మాత్రం సినిమా అద్భుతంగా వచ్చింది. సత్య సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, కాస్ట్యూమ్స్ తదితర విభాగాలు ఉన్నతమైన పనితనాన్ని ప్రదర్శించాయి. నిర్మాణాత్మక విలువలు ఉన్నతంగా ఉన్నాయి. 

జీవా మాస్క్ మాన్ పాత్రకు అతికినట్టు సరిపోయాడు. ఆ పాత్రలో ఉన్నా వేరియేషన్స్ అన్నింటిలోకి మోల్డ్ అవుతూ మాస్క్ మాన్ పాత్రను సమర్ధవంతంగా పోషించగలిగాడు. ముచ్చటే లేదు అద్భుతంగా నటించాడు. జీవాలో మంచి నటుడుకి అవసరమైన అన్ని లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ సినిమా కమర్షియల్ గా నడిచిన నడవకపోయిన జీవా నటనకు మాత్రం తప్పక గుర్తింపు ఉంటుంది. కొత్త నటి ప్రియ హెగ్డే బాగుంది నటన కుడా పర్వాలేదు. విలన్ గా నటించిన నరేన్ నిరాశపరిచాడు. ఆ పాత్రకు నరేన్ సరిపోలేదు. మరీ క్లైమాక్స్ లో అతని నటన వెటకారంగా ఉంటుంది. నాజర్ సహా మిగత నటులు వారి పాత్రలకనుగుణంగా బాగా నటించారు.

ప్లస్  పాయింట్స్: 

జీవ పెర్ఫార్మెన్స్  , మొదటి సగం ఈ సినిమాకు ప్రధాన ప్లస్ పాయింట్స్.

మైనస్ పాయింట్స్ :

బోరింగ్ సెకండ్ హాఫ్ , ఆకట్టుకోలేక పోయిన విలన్ ప్రధానంగా ఈ సినిమాకు మైనస్ పాయింట్స్ 

కొసమెరుపు: 

మొత్తంగా ఈ సినిమా మొదటి సగం చూస్తుంటే ముచ్చటేస్తుంది... రెండో సగం చూస్తుంటే చిరకేసిద్ది. ఎలాగూ సినిమా మీద పెద్దగా అంచనాలు లేవు కాబట్టి ఒక వారం ఆగితే సినిమా వచ్చినట్టుకాని ... పోయినట్టు కాని ఎవరికీ తెలేసే అవకాశమే ఉండదు..!     
 
Maruthi Talkies Rating 2.5 out of 5

Young Tiger Roaring - NTR Badshah First look



 పులి....... వేటాడటానికి మళ్లీ సిద్దం అయ్యింది. యన్ టి ఆర్ 'బాద్షా' ఫస్ట్ లుక్ అదిరిపోయింది.


కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని కూల్ గా పైకి కనిపిస్తున్నాడు కాని..... 
ఎక్స్ ప్రెషన్ లో వైలెంట్ ను క్రియేట్ చేసే విబ్రేషన్ ఉంది . బాద్షా రాక్స్...!  

Thursday, August 30, 2012

Unexpected Surpraise in Ok Ok


తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మనవడు ఉదయనిది స్టాలిన్ హీరోగా పరిచయమైనా 'ఓకే ..ఓకే..' చిత్రం ఈ ఏడాది మొదట్లో విడుదలై తమిళంలో ఘనవిజయాన్ని సాదించింది. ఇప్పుడు ఆ చిత్రాన్ని మన బెల్లంకొండ తెలుగులోకి అనువదించి మనకు అందిస్తున్నాడు. ఓ పెద్ద నిర్మాత ప్రత్యేకంగా ఈ సినిమా ఫై శ్రద్ద పెట్టాడు అంటే ఇందులో ఏదో విషయం ఉంది అని మనందరికీ అనిపించటం సహజమే...! 

మన బెల్లంకొండకు సినిమా మనస్పూర్తిగా నచ్చితే తెలుగులో డైరెక్ట్ గా రీమేక్ చేస్తాడు, అలాంటిది ఇంకా సరిగా గుర్తింపురాని  హీరోను  తెలుగు తెరకు పరిచయం చేస్తున్నాడంటే తప్పకుండా ఏదో విశేషం ఉండే తీరాలని అనుమానం వచ్చి తీరాలి. అప్పుడే నిజాలు బయటకు వస్తాయి. మనం ఊహించినట్టే ఈ సినిమాలో ఓ పెద్ద విశేషమే ఉంది ... ఆ విశేషం పేరు 'సంతానం'.  సినిమాకు సంబంధించి బయట కనిపిస్తున్న పోస్టర్లు, ట్రైలర్లు , పాటలు ఇవన్నీ ట్రాష్..... సినిమాలో అసలు పండగా సంతానం చేసే కామెడీది. 

ఒట్టూ ..... నిజమే చెబుతున్న సినిమాలో కూర్చున్నాకా సంతానం పెట్టే గిలిగింతలకు నవ్వలేక రెండు మూడు సార్లు కడుపులో నొప్పి రావటం ఖాయం. సంతానం లేక పొతే ఈ సినిమాకు అర్ధమే లేదు. అంత బాగా వచ్చిన ఆ పాత్రను తెలుగులో అంతే  స్పెషల్ గా చేయగలిగింది  సునీల్ మాత్రమే...! కాని ఇప్పుడు సునీల్ హీరో కాబట్టి ఆ  పాత్ర చేయటం కుదరదు.  దాంతో వేరే ప్రత్యామ్నయం లేక బెల్లంకొండ ఒరిజినల్ నే తెలుగు వాళ్ళకు చూపించి ... నవ్వించి.... క్యాష్ చేసుకోవటానికి సిద్దం అయ్యాడు. 

ఈ సినిమా గురించి ఒక విషయం మాత్రం మనస్పూర్తిగా చెప్పవచ్చు. ఈ సినిమాను చూస్తూ  స్వచ్చమైన కామెడీని ఆస్వాదించవచ్చు, హాయిగా నవ్వుకోవచ్చు. పూర్తిగా పైసా వసూల్ టైం పాస్ ఎంటర్ టైనర్ ...!   ఆ క్రెడిట్ పూర్తిగా సంతానానికే దక్కుతుంది.

Jeeva's 'Mask' Carrying 0 % Expectations


'రంగం' జీవా సూపర్ హీరోగా రేపు విడుదలవుతున్న 'మాస్క్' తెలుగు ప్రేక్షకులలో ఏ  విధమైన ఆసక్తిని కలిగించలేకపోయింది. దాంతో ప్రేక్షకులు  ఈ సినిమా గురించి పెద్దగా పట్టించుకుంటునట్టు అనిపించటం లేదు. అందుకు ప్రధాన కారణం ఆకర్షణీయంగా లేని ప్రచారం. నెల ముందే విడుదలైన ట్రైలర్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేయటంమాని బోర్ కొట్టించింది. 

అసలు సూపర్ హీరో సినిమా అంటే ఎలా ఉండాలి........ అదిరిపోయే మ్యూజిక్ , కళ్ళు  చెదిరే గ్రాఫిక్స్, ఒళ్ళు గగుర్పొడిచే పోరాట దృశ్యాలు ఉండాలి. అవన్నీ లేకుండానే  ఈ మద్య ఇంగ్లీష్ డబ్బింగ్ సినిమాలకు అలవాటు పడిన తెలుగు ప్రేక్షకులను ఇది సూపర్ హీరో సినిమా అని మాటలు చెప్పి నమ్మించాలని చూడటం కుదురుతుందా...! అలానే ఈ మధ్యే విడుదలైన సినిమా పాటలు ఒక్కటి కూడా సరిగ్గా కనెక్ట్ అయినట్టు అనిపించలేదు.

కాని అవి నాణానికి ఒక వైపే ఈ సినిమాకు మరో కోణం ఉంది. అది ఏమంటే జీవా 'రంగం'  కూడా ఏ  విధమైన అంచనాలు లేకుండా విడుదలై తెలుగు నాట అఖండ విజయాన్ని అందుకుంది. అందుకు కారణం ఆ సినిమా దర్శకుడు కె  వి ఆనంద్ ప్రతిభ.  అలానే ఈ సినిమాకు కూడా బలం దర్శకుడు 'మిస్కిన్'.  చేసింది మూడు చిత్రాలే అయిన స్టైలిష్ దర్శకుడిగా తమిళనాట నీరాజనలందుకుంటున్నాడు మిస్కిన్. 

అందులోను చూస్తుంటే ఈ సినిమాలో క్రిస్టోఫర్ నోలన్ 'డార్క్ నైట్ ' లక్షణాలు కనిపిస్తున్నాయి. హీరో బ్యాట్ మాన్ ను  పోలి ఉండటం, విలన్ కు జోకర్ పోలికలున్నాయని చెప్పటం అందుకు సాక్ష్యాలు. ఆ విధంగా చూస్తే మిస్కిన్ టాలంట్ ప్రకారం ఈ సినిమాలో ఆసక్తికరమైన స్క్రీన్ ప్లే ఉండే అవకాశం ఉంది. నోలన్ ను కాపీ కొట్టకుండా మిస్కిన్ అయన ఆలోచనల స్పూర్తితో సినిమాలో కొత్తగా ఏదన్న చూపిస్తే బాగానే ఉంటుంది. అలా కాకుండా నోలన్ ను కాపి కొట్టినా  లేదా నోలన్ ఆలోచనలను చెడగొట్టిన దెబ్బై పోయినట్టే...!  

అదీ సంగతి....! ఇంతకీ ఈ మాస్క్ లో ఏముందో... మరి కొన్ని గంటల్లో తేలనుంది.

Srimannarayana Review - Balakrishna Movie



మూడు నెలలు తిరక్కుండానే మూడో సినిమాతో నందమూరి అభిమానులను అలరించటానికి సిద్దం అయిన నటసింహ బాలకృష్ణ శ్రీమన్నారాయణ చిత్రంతో ఈ వారం దియేటర్లలో సందడి చేయటానికి వచ్చాడు.  ఆర్ ఆర్ మూవీ మేకర్స్ సమర్పణలో రమేష్ పుప్పాల నిర్మించిన ఈ చిత్రానికి రవి చావలి దర్శకుడు. ఈ సినిమాలో తొలిసారి బాలయ్య జర్నలిస్ట్ పాత్రలో నటించగా అయన సరసన పార్వతి మిల్టన్ , ఇషా చావ్లా హీరోయిన్ లుగా నటించారు. చక్రి సంగీతాన్ని అందించాడు.

జయాపజయాలను సమదృష్టితో స్వీకరిస్తూ తెలుగు చలన చిత్ర యవనిక ఫై అవిశ్రాంతంగా తన నటకౌశాలన్ని ప్రదర్శిశిస్తూ అభిమానులను అలరిస్తున్న నందమూరి నట సింహం ఈ యేడాది మూడు చిత్రాల విడుదలలో భాగస్వామిగా ఉండి .... తోటి అగ్ర నటులకు సవాలు విసిరాడు. ముందు విడుదలైన రెండు చిత్రాల (అధినాయకుడు, ఉ కొడతార ఉలిక్కి పడతారా ) ఫలితాలు నిరాశపరిచిన మనసులో పెట్టుకోకుండా  నూతనోత్సాహంతో శ్రీమన్నారాయణను పూర్తీ చేసిన బాలయ్య ఈ సినిమాలో కొత్త బాలకృష్ణను చూస్తారు అని ప్రకటన చేసాడు. 96 చిత్రాలుగా చూడని బాలకృష్ణను తన 97 వ చిత్రంలో ఎంత కొత్తగా చూపించాడో...మన సమీక్షలో చూద్దాం .

కధ :

పెద్ద  సంఘసంస్కర్త అల్లూరి కల్కి నారాయణ (విజయకుమార్) కొడుకు శ్రీమన్నారాయణ అలియాస్ శ్రీమాన్ (బాలకృష్ణ ) జర్నలిస్ట్ గా పనిచేస్తూ ఉంటాడు. తన వృత్తిలో భాగంగా జై జవాన్ స్కాం ను బయట పెట్టి మంత్రి బైల్ రెడ్డి ( జయ ప్రకాష్ రెడ్డి  ) అతని అనుచరుల ఆటకట్టిస్తాడు శ్రీమాన్. శ్రీమాన్ కు అతని మరదలు భానుమతి(ఇషా చావ్లా )తో  నిశ్చితార్ధం జరుగుతుంది. అలానే మరో చానెల్ రిపోర్టర్ స్వప్నిక (పార్వతి మిల్టన్) కూడా శ్రీ మాన్ ను ఇష్టపడుతూ ఉంటుంది. రైతుల గురించి తపించిపోయే కల్కి నారాయణ పేద రైతుల సహాయార్ధం జై కిసాన్ అనే కార్యక్రమాన్ని మొదలుపెడతాడు. అందులో భాగంగా రైతుల సహాయ నిధి ఏర్పాటు చేసి 5000 కోట్ల రూపాయలు విరాళాల ద్వార సేకరిస్తాడు. 

తరవాత జై కిసాన్ కార్యక్రమం ప్రారంభించాలనుకునే సమయానికి కొన్ని అనూహ్య పరిణామాలు చోటు చేసుకుని కల్కి నారాయణ మరణిస్తాడు. అంతే కాకుండా 5000 కోట్ల రూపాయల సొమ్ము దొంగలించబడుతుంది. ఆ నేరం శ్రీమన్నారాయణ మీద పడుతుంది. హడావిడి సద్దుమణిగి కూల్ గా ఆలోచించిన శ్రీమాన్ తను ప్లాన్ ప్రకారం ఇరికించబడ్డనని తెలుసుకుని ప్రతీకారానికి పూనుకుంటాడు. ఆ ఫై  దొంగలను కనిపెట్టి, 5000 కోట్లను వెనక్కు తెచ్చి తండ్రి ఆశయాన్ని ఎలా నెరవేర్చాడు అన్నది మిగిలిన కధ .  

విశ్లేషణ:  

శ్రీమన్నారాయణ కధ గా చూస్తే పరమ రొటీన్ కధ . కధనం గురించి చెప్పాలంటే మూస శైలిలో రూపొందించిన ఓ రోడ్ద కొట్టుడు తెలుగు కమర్షియల్ సినిమా . ఈ తరహ చిత్రాలు  తెలుగు సినిమాకు హీరోయిజం పరిచయం అయినప్పటి నుండి వస్తూనే ఉన్నాయి. ఈ సినిమాను 1960 లోనో 70 లోనో తీసినట్టైతే తప్పకుండా సంవత్సరం ఆడేది. అంత  విషయం ఉంది ఈ సినిమాలో...! విధి విచిత్రమైనది కాకపోతే అప్పుడు పుట్టాల్సిన టాలెంట్ ను ఇప్పటి వరకు ఆపి దేవుడు ఎంత తప్పు చేసాడు అని అనిపిస్తుంది . 

దర్శకుడు రవి చావలి లో ఒక సినిమా దర్శకుడి కంటే స్టేజ్ మీద డ్రామా వేయించే దర్శకుడు ఎక్కువ కనపడుతూ ఉంటాడు. అరె....  చాలినంత బడ్జెట్ ఉండి... ఒక పెద్ద హీరోతో సినిమా చేస్తూ కూడా ఏదో స్టేజ్ మీద నాటకం వేయిస్తున్నట్టు సన్నివేశాలు రూపకల్పన చేసుకుని చాలా భద్రంగా లేని పోనీ లిమిటేషన్స్ మద్య చిత్రీకరణ చేయటం చూస్తుంటే అదే అనిపిస్తుంది. సామజిక స్పృహ కలిగిన వ్యక్తిగా కొన్ని మంచి విషయాలను తన సినిమాలతో చెప్పాలనుకునే విషయంగా రవి అభినందనియ్యుడు. ఈ సినిమాలో కూడా రైతు సహాయనిధి అనే ఒక ఆలోచించవలసిన పాయింట్ ను వెలుగులోకి తెచ్చాడు. బాబాలకు, మఠాలకు , స్వాములకు లక్షలకు లక్షలు విరాళాలు అందుతున్నాయి. అలాంటిది రైతు మనుగడ కోసం, వ్యవసాయం అభివృద్ధి కోసం సమాజం తానూ నిర్వర్తించవలసిన బాద్యతను గుర్తుచేసాడు హాట్స్ ఆఫ్.  ఇది చిన్న పాయింట్... మహా అయితే ఒక నిమిషంలో కన్వే చేసేయ వచ్చు.  సినిమా అంటే 2 గంటల  ఉంటుంది. ఆ సమయాన్ని రసవత్తరంగా మలిచి ప్రేక్షకులను కట్టి పడేయటంలో రవి చావలి ఎప్పటిలానే నిరాశపరిచాడు. 

అవసరం మేర లాజిక్ లను ఎగ్గోడుతూ.... కొన్ని చోట్ల అవసరం లేక పోయిన లాజిక్ లను తగిలిస్తూ రవి నడిపిన కధనంతో, సందర్భంతో సంబందం లేకుండా వచ్చే పాటలతో  సినిమా  మొదటి గంట గడిచిపోతుంది. కాని ఇంటర్వెల్ ముందు 20 న నిముషాలు మాత్రం కొంత ఆసక్తిగా మలిచాడు రవి. ఇంటర్వెల్ కి ఏదో ఆ కాసేపు కొద్దిగా పట్టి ఉంచిన సుస్పెన్సు కాస్తా  వీడిపోతుంది. ఆ తరవాత తెలుగు సినిమాతో అనుబందం ఉన్న ప్రతి ఒక్కరు ఊహించే కధనంతో పరమ రొటీన్ గా సాగిన రెండో సగం ఒక సాదారణ క్లైమాక్స్ తో చప్పగా ముగుస్తుంది. 

మాటల రచయత ఘటికాచలం సినిమా కోసం మాటలు వ్రాశాడో... లేక ట్రైలర్స్  కోసం మాటలు వ్రాశాడో... అర్ధం కాదు. ఎందుకంటే కాస్తా చెవులకు ఇంపుగా వినిపించిన నాలుగు  డైలాగులు ట్రైలర్స్ లో విని వెళ్ళిన  ప్రేక్షకులకు అవి మినహా మరో మంచి డైలాగ్ సినిమాలో వినపడక పోవటం భాద కలిగిస్తుంది. సింహ ఇచ్చిన కిక్ ఏమో కాని చక్రి బాలయ్య మీద ప్రయోగం చేసాడు. బాలయ్య సినిమాలో పాటలంటే సరదాగా హమ్ చేసుకునే విధంగా ఉండాలి. ఇందులో ఒక్క పాట  కూడా గుర్తుకుచేసుకుని పాడుకునేట్టు లేదు. బ్యాక్ స్కోరు విషయానికి వస్తే.... సన్నివేశాల్లో పస లేక పొతే ఎంత వాయిస్తే మాత్రం ఏం  వినపడుద్ది...? సురేందర్ రెడ్డి , గౌతంరాజు లాంటి టాప్ టెక్నిషియన్స్ ఉన్నప్పటికీ శ్రీమన్నారాయణ సాంకేతికంగా ఉన్నతంగా ఉంది అని చెప్పలేని పరిస్థితి. నిర్మాణాత్మక విలువలు బాలయ్యకు తగ్గటు, ఎల్లో ఫ్లోవర్స్ బ్యానర్ రేంజ్ తెలియజేసేలా మాత్రం లేవు. 

నందమూరి అభిమానులను అలరించటానికి అవిరామంగా కష్టపడుతూనే ఉంటాడు బాలయ్య అని మరో సారి ఈ సినిమాతో నిరూపించాడు. కొత్తగా కనిపించటానికి తన ప్రయత్నలోపం లేకుండా కష్టపడ్డాడు. కాని ఆయన్ని ఉపయోగించుకోవటం చేతకాని వాళ్ళదే తప్పంతా...! సినిమా మొత్తం మంచి ఎనర్జీతో చాలా ఉత్సాహంగా కనిపించాడు . అవకాశం మేర పదునైన డైలాగులు వదులుతూ , పాటల్లో జోరుగా నృత్యాలు చేస్తూ అబిమానులను ఆకట్టుకున్నాడు. ఎండు నక్కల తయారైన పార్వతి మిల్టన్ చిత్రహింస పెట్టింది. బక్కగా ఉన్న ఆమె స్టెప్పులేస్తుంటే నిండుదనం లేక తేలిపోయింది. ఇషా ఆకట్టుకుంది. పెర్ఫర్మన్సుకి పెద్దగా స్కోప్ లేక పోయిన ఉన్నంతలో బాగానే చేసింది. విజయ్ కుమార్ గంభీరంగా కనిపించారు. విల్లన్ లు గా ఆరుగురు ఉన్నప్పటికీ ఏ  ఒక్క పాత్ర వైవిద్యంగా అనిపించదు. కాని వారి పాత్రలకనుగుణంగా కోట , సురేష్, రావు రమేష్,తదితరులు  బాగానే చేసారు. యం యస్ దువ్వాసి, కృష్ణ భగవాన్ చేసిన కామెడీ ఆకట్టు కోలేదు. 

ప్లస్ పాయింట్స్: 

బాలకృష్ణ నటన, డాన్సులు, డైలాగులు మొదలైనవి ప్లస్ పాయింట్స్ 

మైనస్ పాయింట్స్: 

బలహీనమైన కధ , బలంలేని కధనం, పూర్ డైరెక్షన్ ప్రధానంగా మైనస్ పాయింట్స్. 

కొసమెరుపు; 

శ్రీమన్నారాయణ సినిమా చూసి పర్వాలేదు.... ఓకే! అని బాలయ్య వీరాభిమాని సర్దుకుపోవచ్చుకాని... సగటు ప్రేక్షకుడు ఈ సినిమాను జీర్ణించుకోవటం కష్టమే. కొత్తదనం కోరుకునే వాళ్ళైతే ఈ సినిమా గురించి ఆలోచించనవసరం కూడా లేదు...!

Maruthi Talkies Rating 2 out of 5

  

Mind blowing First Look of Pawan Kalyan's CGR



చాలు ..... ఈ ఒక్కటి చాలు పవనాభిమనులకు పిచ్చేక్కటానికి ...! పట్టేసాడు..... పూరి పవన్ ఫాన్స్ వీక్ నెస్ పట్టేసాడు.  మట్లాడకుండా పూరికి సలాం చేసి గులామ్ లు అయిపోవటం మినహా వాళ్ళు చేయగలిగింది ఏమిలేదు. దేవుడా..... ఆ చూపేంటి తండ్రి ..! చూస్తుంటే.... వైబ్రేషన్ స్టార్ట్ అయ్యి కరెంట్ షాక్ తగులుతుంది.

పవన్ ఒక మత్తు..... పవన్ మీద అభిమానం ఒక వ్యసనం ..... పవనిజం ఒక వదిలించుకోలేని రోగం...... అందుకు నిదర్శనం ఆ చూపు. నిమ్మళ్ళంగా ఉన్నా .... నిన్నే  చూడకపోయినా ..... ఆ చూపుల్లో ఏదో ఆకర్షణ ఉంది. కాదు..... వల్ల కాదు... ఎవరి వల్లా కాదు ఆ చూపుల నుండి తప్పించుకోవటం...!     



Wednesday, August 29, 2012

Balayya Is On Full Swing

 జాగ్రత్తగా గమనిస్తే నటసింహ  బాలకృష్ణలో ఈ మద్య కొత్త ఉత్సాహం ఉరకలెత్తుతుంది. కారణం ఏదైనా బాలయ్యలో  ఏదో తెలియని మెరుపు కనపడుతుంది. గడచినా కొన్ని సంవత్సరాలలో ఎప్పుడు లేనంత ఊపు మీద కనపడుతున్నాడు. ముఖ్యంగా శ్రీమన్నారాయణ సినిమా విషయంగా ఏ  కార్యక్రమంలో పాల్గొన్న చిన్న కుర్రాడిలా మారిపోయి  బాలా కుమారుడిలా ప్రవర్తిస్తున్నాడు.  స్టేజ్ మీద సరదాగా ఆటలాడుతున్నాడు , గమ్మత్తుగా మాట్లాడుతున్నాడు, సమయానుకూలంగా జోకులేస్తూ తన చుట్టూ ఉన్నవాళ్ళను నవ్విస్తున్నాడు. 

కారణం తెలుసుకోవాలని ప్రయత్నిస్తే ... దొరికిన సమాదానం 'సినిమా సినిమాకి ఒక పాత్ర ఉంటుంది. ఈ సినిమాలో హీరో పాత్ర జర్నలిస్ట్ అయినప్పటికీ మంచి హుషారైన కుర్రడంటా ..... బాలయ్యది సహజంగా పాత్రలో లినమయ్యే తత్త్వం  కాబట్టి అలా కనిపిస్తున్ననేమో అని  అంటున్నారని తెలుస్తుంది.   



కాని కొంతమంది చమత్కారంగా చేస్తున్న కామెంట్ ఏమంటే..... కుర్రా హీరోయిన్ లతో జత కట్టి ఆడి, పాడుతున్నాడు  కాబట్టి తెలియకుండానే ఆయనలో కొత్త ఉత్సాహం పొంగిపోర్లుతుంది అని. 
8 సంవత్సరాలకే నటన మొదలుపెట్టి ఇప్పటికి 97 సినిమాలు చేసిన బాలయ్యను చూసి ఆ అమ్మాయిలు ఉత్సాహపడలే కాని బాలయ్యకు అది పెద్ద విషయం కాదు ఇంకేదో ఉంది అని వాదించే వాళ్ళు ఉన్నారు.



ఎవరెలా అనుకున్న బాలయ్య లో కనిపిస్తున్న మార్పును చూసి అయన అభిమానులు మాత్రం తెగ సంబరపడిపోతున్నారు. వారితో పాటు శ్రీమన్నారాయణ సినిమా నిర్మాత కూడా అంతే ఆనందపడిపోతున్నాడు.
ఎందుకంటే బాలయ్యలో రెట్టించిన ఉత్సాహం కారణంగా సినిమా అతి కొద్ది రోజుల్లో పూర్తయి విడుదలకు సిద్దం అయ్యింది. అలానే జోరుగా బాలయ్య చేస్తున్నా ప్రచారం సినిమా మీద అంచనాలను  పెంచింది. దాంతో ఈ సినిమా కోసం అయన అభిమానులతో పాటు సిని ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  

ఎంత  సాదారణంగా మొదలైన విడుదల సమయం వచ్చేప్పటికి  బాలకృష్ణ సినిమా అంటే..... తెలుగు సినిమాతో పరిచయం ఉన్న ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఎక్స్ పెక్టేషన్ ఉంటుంది. వాటిని బాలయ్య ఎలా నేరవేర్చుతాడో.... మరి కొన్ని గంటల్లో తేలనుంది. 

Tuesday, August 28, 2012

Ram Charan Resembles Hrithik

  
రచ్చ విజయంతో ఫుల్ గా రీచార్జ్ అయిన మెగా పవర్ స్టార్ ఆ ఉత్సాహాన్ని తన రాబోయే చిత్రంలో మరింత ఎక్కువగా ప్రదర్శించటానికి సిద్దం అవుతున్నాడు. దానికి నిదర్శనం తాజాగా వెలువడిన ఈ ఫోటోగ్రాఫ్స్ ..!


ఈ మధ్య మెగా హీరోలా దర్శకుడిగా పిలవబడుతున్న వి వి వినాయక్ దర్శకత్వంలో డి వి వి దానయ్య ప్రతిస్థాత్మకంగా నిర్మిస్తున్న 'నాయక్' ది లీడర్ సినిమాకు సంబందించిన ఓ పాటలోని స్టిల్స్ ఇవి.....! 


యాక్షన్ కామెడీ మాస్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో చెర్రీ సరసన కాజల్, అమల పాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వినాయక్ ఆస్థాన రచయత ఆకుల శివ రచన సహకారం అందిస్తున్నాడు.

 సాంకేతికంగా మరియు టేకింగ్ పరంగా వినాయక్  స్టైల్ లో నిర్మితమవుతున్న ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. విశేషం ఏమంటే తమన్ వినాయక్ తోనూ , చెర్రి తోనూ పనిచేయటం  ఇదే  మొదటిసారి...!


అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, స్టిల్స్ లో కనిపిస్తున్న వాతావరణం ప్రకారం రామ్ చరణ్ చేసిన ఈ స్టెప్పులను  జానీ మాస్టర్ నేతృత్వంలో, పబ్  నేపద్యంలో, దుబాయ్ లో చిత్రీకరించినట్టు తెలుస్తుంది. 


ఫైనా చెప్పుకున్న విషయాలను పక్కన పెట్టి ఒకసారి ఫై నుండి కింద వరకు ఈ ఫోటోలను మరోసారి పరిశీలిస్తే ఓ విషయం లీలగా మీ మస్తిష్కాన్ని(బుర్రను) తాకకపోదు ట్రై చేయండి.

ఇక్కడ  వ్రాసేవాడి  బుర్రకేం తట్టిందేమంటే..... ఇప్పటి వరకు  ఎన్నో అంశాల్లో చిరంజీవిని తలపించి మురిపించిన ఈ బుల్లి మెగాస్టార్ లో ఈ ఫోటోలు చూసాక  బాలీవుడ్ డాన్సింగ్ డైనమేట్ హృతిక్ రోషన్ కనిపిస్తున్నాడు. ఆ స్టైల్ , ఆ మానరిజం , ఆ మూమెంట్స్ లో హృతిక్ రోషన్ తలంపుకు రావటం డాన్స్ చేయటంలో రామ్ చరణ్ కు ఉన్న డెడికేషన్ ను తెలియచేస్తుంది. దీనిని బట్టి అర్ధం చేసుకోవచ్చు అభిమానులను అలరించటానికి చెర్రీ ఎంతలా కష్ట పడుతున్నాడో....! కీప్ ఇట్ అప్ చెర్రీ ...! 

Real Star Sri Hari Innocence


పిల్ల రౌడీగా తెరంగేట్రం  చేసి..... కాలక్రమేణ పెద్ద రౌడిగా జనాలను భయపెట్టి... తరవాత సహాయనటుడిగా ఆకట్టుకుని .... కధానాయకుడిగా కట్టిపడేసి రియల్ స్టార్ అనిపించుకున్నాడు శ్రీహరి. ఎన్నో సవాళ్ళు ఎదుర్కుంటూ .. అందివచ్చిన అవకాశాలను సద్వినియోగపరచుకుంటూ ఉన్నతంగా ఎదిగిన శ్రీ హరికి తెలుగు సిని పరిశ్రమలో ప్రత్యేకమైన స్థానం ఉంది. ప్రస్తుతం హీరోగా తన ఉనికిని కాపాడుకుంటూనే సహాయనటుడిగా చరిత్రలో నిలిచిపోయే పాత్రలు చేస్తున్నాడు. అలా  ఫైటర్ గా, విలన్ గా , క్యారెక్టర్ నటుడిగా , హీరోగా ఇప్పటివరకు తిరుగులేని సిని ప్రస్థానాన్ని కొనసాగించిన  శ్రీ హరి త్వరలో ఓ కొత్త అవతారంలో కనిపించనున్నాడు.

ఇప్పటి వరకు దర్శకులు చెప్పినట్టు నటించిన శ్రీ హరి ఇక  ఫై  దర్శకుడిగా మారి తానే సినిమా రూపొందించే పనిలో ఉన్నాడు.  ఈ మద్య తన పుట్టిన రోజు సందర్భంగా మనసులోని భావాలను అభిమానులతో పంచుకున్న శ్రీ హరి దర్శకుడిగా మారబోతున్నట్టు వెల్లడించాడు. దాని కోసం రెండు కధలను కూడా సిద్దం చేసుకున్నట్టు చెప్పారు. అందులో తొలిగా 'డి గ్యాంగ్స్' అనే సినిమాను సెట్స్ మీదకు తీసుకువెళ్ళనున్నారు. కరుడుకట్టిన తీవ్రవాది దావూద్ సాదువులా మారి శాంతి కోసం తపిస్తే ఎలా ఉంటుంది అనేది ఆ సినిమా పాయింట్. అలానే శ్రీ హరి మరో కధ 'లైబ్రరీతో పాటు సకల సదుపాయాలు , అడిగినవెంటనే సమాచారం ఇచ్చే సిబ్బంది, ఆహ్లాదకరమైన వాతావరణంలో  భయానికి తావులేని ఓ అందమైన కలల పోలీసు స్టేషన్ కధ'.

విశేషం ఏమిటంటే ఈ రెండు కధలు శ్రీ హరి మనసు నుండి పుట్టుకొచ్చినవే...! ఈ ఆలోచనలను తరచి చూస్తే వాటిల్లో కొద్దిగా మంచితనం చాలా అమాయకత్వం కనిపించటంలేదు...! చూడటానికి గంభీరంగా కనిపిస్తున్న శ్రీహరి ఫైకే పహిల్వాన్... లోపల పసిపిల్లోడని ఈ మాటలను బట్టి అర్ధం అవుతుంది. ఇది ఒక రకంగా సంతోషించతగ్గ విషయమే. కాని ప్రస్తుత ట్రెండ్ ప్రకారం తెలుగు సిని ప్రియులు లాజిక్ కంటే మ్యాజిక్ ను  , మంచి మాటల కంటే  చెడు ప్రవర్తనలను ఎక్కువగా ఇష్ట పడుతున్నారు. దానినే కొత్తదనం అంటున్నారు .... ఎంజాయ్ చేస్తున్నారు... ఎంటర్టైన్ అవుతున్నారు.  ఇలాంటి తరుణంలో మంచి మనసుతో శ్రీ హరి చేస్తున్న ప్రయత్నానికి ఆదరణ దక్కుతుందా... ? అన్నది ఓ చిన్న సందేహం.

ఇక్కడో నిజం ఉంది ట్రెండ్స్ వస్తుంటాయి... పోతుంటాయి... కాని సినిమా మాత్రం శాశ్వతంగా ఉంటుంది. ట్రెండ్ ను ఫాలో అవకుండా శ్రీ హరి చేయబోతున్న ఈ ప్రయత్నం... ట్రెండ్ సెట్టర్ అవుతుందేమో...! ఎవరికీ తెలుసు...?    

Thursday, August 16, 2012

Allu Aravind Special Interset on 'Charulatha'


'బద్రినాథ్' సినిమా విడుదలయ్యి సంవత్సరం దాటినా అల్లు అరవింద్ క్యాంపులో మరో సినిమా హడావిడి కనిపించలేదు. అలాంటిది సడెన్ గా ప్రియమణి ప్రధాన పాత్రలో నటించిన కన్నడ డబ్బింగ్ సినిమా 'చారులత' పోస్టర్ ఫై గీత ఆర్ట్స్ డిస్ట్రిబ్యుషన్ అని కనిపించటం... పరిశ్రమ వర్గాలలో ఆశ్చర్యం రేకెత్తిస్తే ... ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగించింది.

వరసగా సినిమాలు చేయక పోయినప్పటికీ తనకున్న పలుకుబడితో.... తెలుగు సిని పరిశ్రమకు , విడుదల కావాల్సిన  సినిమాలకు దిశ నిర్దేశం చేయగలిగే సత్తా ఉన్న గీత ఆర్ట్స్ 'చారులత' సినిమా  ఫై శ్రద్ద పెట్టటం ఆలోచించవలసిన అంశంగా మారింది. ఎందుకంటే ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థగా తెలుగునాట వెలుగొందుతున్న గీత ఆర్ట్స్ చాలా వరకు తనే సొంతంగా సినిమాలను నిర్మిస్తుంది. అతి  తక్కువగా మాత్రమే అనువాద చిత్రాలను ప్రమోట్ చేస్తుంది. ఈ మద్య కాలంలో వారు అందించిన అనువాద చిత్రాలు తమిళ 'గజినీ' మరియు ఇంగ్లీష్ 'అవతార్'. ఈ రెండు చిత్రాలు గీత సంస్థకు లాభాలు తెచ్చి పెట్టాయి.

ఇలా చూసుకుంటే ఇక్కడ ఆలోచించవలసిన విషయం ఏమిటంటే .. ఏంతో  ప్రత్యేకత ఉంటేనే గీత ఆర్ట్స్ అనువాద చిత్రాలా జోలికిపోదు..! అలాంటిది చారులత మీద స్పెషల్ శ్రద్ద పెట్టింది అంటే ఆ సినిమాలో ఏదో విషయం ఉంది అని ఫిలిం నగర్ టాక్. అదే విషయాన్నీ బలపరుస్తూ ప్రేక్షకులు కూడా సినిమా మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. నిజంగా సినిమాలో ఏదన్నా  విషయం ఉంటే  అంతా బానే ఉంటుంది. అలా కాకుండా నిర్మాత బంధువనో... ఆప్తమిత్రుడనో... లేక  నమ్మిన బంటనో ... గీత ఆర్ట్స్ పేరు వాడుకోమని భరోసా ఇచ్చినట్టయితే మాత్రం జాగ్రత్తగా ఉండాల్సిందే...!

ఎందుకంటే తెలుగు ప్రేక్షకులు సస్పెన్సు థ్రిల్లర్స్ ఫై పెద్ద ఆసక్తి కనబరచరు... అందులోను హర్రర్ సస్పెన్సు అంటే అసలు పట్టించుకోరు. అంటే అలాంటి  సినిమాలు చూసే వాళ్ళు లేరని కాదు .. వాటిని ఆదరించే వాళ్ళ శాతం చాలా తక్కువని. అందువల్ల తక్కువ బడ్జెట్ సినిమాలు ఒడ్డున పడతాయి కాని.. భారి చిత్రాల పరిస్థితి కొంచెం కష్టమే..! 

ఈ 'చారులత' 'ఎలోన్' అనే థాయి సినిమాకు  అధికారిక రిమేక్ గా వస్తుంది. అవిభక్త కవలల కధతో వచ్చిన 'ఎలోన్'  ప్రపంచవ్యాప్తంగా ఓ సంచలనం .. మరి ఆ సంచలనం తెలుగు లో కూడా కొనసాగుతుందో... లేదో.. త్వరలో తెలియనుంది.

Watch Charulatha Trailer


Rebel Time Starts - First Look Teaser


యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ దాదాపు సంవత్సరం తరవాత ఈ సెప్టెంబర్ లో తన అభిమానులను అలరించటానికి 'రెబెల్ ' సినిమాతో సిద్దం అవుతున్నాడు. రాఘవ లారెన్స్ దర్శకత్వంలో గత ఏడాదే మొదలైన ఈ సినిమా పరిస్థితలు ఆడిన పవర్ ఫుల్ 'ప్లే'  కారణంగా అనుకున్న సమయంకంటే చాలా  ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. గడిచిన మూడేళ్ళలో  డార్లింగ్ , మిస్టర్ పెర్ఫెక్ట్ వంటి క్లాస్ హిట్స్ తో తన మాస్ అభిమానులను నిరాశపరుస్తూ వచ్చిన ప్రభాస్ రెబెల్ సినిమాతో వారికి నాన్ - వెజ్ రెడీ చేస్తున్నాడు. 

అందుకు నిదర్శనం ఈ రోజు వదిలిన రెబెల్ టీజర్ ..! మంచి మసాల దట్టించిన నాన్ వెజ్ కూర  రెడీ అయ్యే ముందు ఉప్పు, కారం సరిగా సరిపోయాయో...  లేదో.. చూడటానికి రుచి చూపిస్తారు చూడండి... అలా ఉంది ఆ టీజర్. ఇక  ఈ  టీజర్ ను చూస్తే  ప్రభాస్ అభిమానులు ఎగిరి గంతేయటం ఖాయం.  పవర్ ప్యాకడ్ గా రూపొందిన ఈ ట్రైలర్ లో ఎనర్జిటిక్ గా కనిపిస్తున్న ప్రభాస్ 'ఛత్రపతి' ని జ్ఞప్తికి తెస్తున్నాడు. 

ప్రభాస్ స్టైల్ గా నడుచుకుంటూరావటం.... ఫోకాస్ లైట్ లో ధీమాగా నుంచోవటం..., ప్రభాస్ కు ఒకడు కిక్ ఇవ్వటం .... ప్రభాస్ ఒకడికి హెడ్ తో పంచ్ ఇవ్వటం హైలైట్ గా ఉన్నాయి..... ! అలానే వ్రేజ్లర్ 'రెబెల్ టైం స్టార్ట్స్ '  అని చివరలో చెప్పటం బాగుంది. బ్యాక్ స్కోరు థీమ్ అదిరిపోయింది...... !

Watch 'Rebel' First Look Teaser

Wednesday, August 15, 2012

Devudu Chesina Manushulu Review


బిజినెస్ మాన్ ఇచ్చిన కిక్ తో మాంచి  కాక మీదున్నపూరి జగన్నాథ్ తన స్టార్ హీరోలతో అతి తక్కువ రోజుల్లో సినిమా అనే పధకంలో భాగంగా రవితేజతో 'దేవుడు చేసిన మనుషులు ' అనే సినిమాను రూపొందించి ఈ వారం ప్రేక్షకుల ఫైన పడేసాడు. రిలయన్సు మీడియా సమర్పణలో బి వి యస్ యన్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి కర్త పూరి జగన్నాథ్ అయితే క్రియ రవి తేజ , ఇలియానా , ప్రకాష్ రాజ్, బ్రహ్మ్మనందం, అలీ తదితరులది. 

'దేవుడు చేసిన మనుషులు ' అనే టైటిల్ , కధ లేని సినిమా అని పూరి చేసిన కామెంట్స్ విని సినిమా మీద కొంత అనుమానపడ్డప్పటికీ బిజినెస్ మాన్ ను చూసిన  కళ్ళతో పూరి మీద కొంత  నమ్మకాన్ని ఖాయపరుచుకున్నారు సిని ప్రియులు.  కాని  అంచనాలు ఉన్నప్పుడు వాటిని గల్లంతు చేయటం పట్టించుకోనప్పుడు హిట్లివ్వటం పూరి కి మాములే..! ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని....  దేవుడు చేసిన మనుషులుగా పూరి చేసిన పాత్రలు ఆడిన  గారడి ఏమిటో....? మన సమీక్షలో చూద్దాం .

కధ : 
  వైకుంఠం లో అన్యోన్యంగా ఉన్న  విష్ణుమూర్తి, లక్ష్మి దేవి దంపతుల మద్య నారదుడు పెట్టిన చిచ్చు కారణంగా విష్ణు మూర్తి కి ఈ 'దేవుడు చేసిన మనుషులు '  అనే కధ  చెప్పాల్సిన అవస్థ ఏర్పడుతుంది. ఆ కధ రవి తేజ (రవి తేజ), ఇలియానా (ఇలియానా), ప్రకాష్ రాజ్ (ప్రకాష్ రాజ్ ) అనే ముగ్గురు అనాధల కధ. రవితేజ హైదరాబాద్ లో సెటిల్ మెంట్లు చేసుకుంటూ ఉంటాడు. ఇలియానా బ్యాంకాక్ లో టాక్సీ తోలుకుంటూ బ్రతికేస్తూ ఉంటుంది. ప్రకాష్ రాజ్ కూడా డాన్  గా బ్యాంకాక్ లోనే ఉంటాడు. 

ఒకరితో  ఒకరికి సంబందం లేని ఈ ముగ్గురిని కలపటంలో దేవుని కటాక్షం కలిగిన ఓ పనిలేని పాపయ్య తిని పారేసిన అరటికాయ తొక్క క్రియ శీలకంగా పనిచేస్తుంది. పాపయ్య పడేసిన తొక్క తొక్కి ఓ వ్యక్తీ పడిపోవటం మూలంగా జరిగిన సంఘటనలు ఆ  ముగ్గిరు అనాధలను  కలిసేట్టు చేస్తాయి. కాని మనుషులను ఆడిస్తూ వినోదించే దేవుళ్ళు తొక్క తొక్కటం మూలంగా వాళ్ళు కలిసారు కదా.... మరి తొక్కను  తోక్కక పొతే ఏం జరుగుతుందో....చూడాలని ఉబలాటపడతారు. అలా  మళ్లీ మొదటి నుండి మొదలయ్యే ఈ కధలో ఆ ముగ్గురు చివరికి ఎలా కలిసారు అన్నది మిగిలిన కధ. 

విశ్లేషణ: 

ఈ సినిమా కధలోని పాయింట్ వినగానే ఏంతో  కొంత ఆసక్తి కలగటం సహజం . అలానే ఈ తెలివితేటలూ మనోళ్ళవేనా అనే అనుమానం రావచ్చు.... అది కూడా  సహజంగానే. విషయం  తెలియక పొతే ఇది మన సొంతమే అని మనం గర్వపడొచ్చు.  కాని సాంకేతిక అభివృద్ధి..... ముఖ్యంగా ఇంటర్ నెట్ చేస్తున్న పాపం కారణంగా ప్రపంచంలో ఏ  మూలన జరుగుతున్నా చిన్న విషయాన్నైనా తేలికగా తెలుసుకునే అవకాశం ఏర్పడింది. దాంతో  గుమ్మడికాయల దొంగలకు భుజాలు తడుముకోవాల్సిన పరిస్థితి.   

ఇంతకీ  ఇదంతా ఎందుకు అంటే ఈ దేవుడు చేసిన మనుషులు సినిమా లో అంతర్లీనంగా ఉన్న పాయింట్ ... అదే తొక్క తొక్కితే ఒకలా జరగటం ... తోక్కక పొతే మరోలా  జరగటం అనే పాయింట్ 'రన్ లోలా రన్ ' అనే జర్మన్ సినిమా నుండి స్పూర్తి పొందినట్టు కనపడుతుంది. కాకపోతే ఆ సినిమాలో కనిపించే సహజత్వం , ఆసక్తి ఈ సినిమాలో కనిపించావ్ అది వేరే సంగతి . కొత్తగా అనిపించే విషయం నుండి స్పూర్తి పొందటంలో తప్పు ఉండదు. కాని దానికి ప్రయోగం అని పేరు పెట్టి.... ఎడా పెడా  చుట్టేసి జనాలకు సినిమాలు  చూడటం రాదు అని చాటలనుకోవటం మాత్రం కరెక్ట్ కాదు. 

పూరి జగన్నాథ్ తలచుకుంటే ఈ పాయింట్ ను అందరు మెచ్చుకునేలా,  ఒరిజినల్ కంటే బాగా తియ్యగల సమర్దుడే ... కాని లోపం తనలో ఉందొ .. తను చేసే పనిలో ఉందొ తెలియదు కాని ఈ సినిమాను భరించలేనంత భారంగా రూపొందించాడు. నిర్లక్ష్యం, అలసత్వం సినిమాలోని ప్రతి సన్నివేశంలో కనిపించే ప్రధాన ఆకర్షణలు. అక్కడక్కడ కొన్ని డైలాగులు, రెండు మూడు పాటలు మినహా సినిమాలో లీనమవటం చాలా కష్టంగా అనిపిస్తుంది. సినిమా కధ రీత్యా కొన్ని ఆసక్తికరమైన సన్నివేశాలను , థ్రిల్లింగ్ సన్నివేశాలను డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే సినిమా  మొదలై ఇంటర్వల్ వరకు జరిగిన కధ ఆ తరవాత మళ్లీ  మొదటి నుండి మొదలవుతుంది. అంటే రెండో సగం లో వచ్చే సన్నివేశాల్లో ఎంత దమ్ము ఉండాలో ఊహించండి. కాని పూరి ఆ విషయానికి చాలా లీస్ట్ ప్రాధాన్యత ఇచ్చి బోరింగ్ కధనాన్ని జోడించి ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించాడు.  క్లైమక్ గురించి చెప్పాలంటే పూరి సినిమాలలోనే వరస్ట్ క్లైమాక్స్ గా చెప్పుకోవచ్చు. 

పూరి కధ రచయతగా, దర్శకుడిగా నొప్పించిన మాటల రచయతగా మాత్రం ఎప్పటిలానే మెప్పించాడు. మాటలు తరవాత ఈ సినిమాను చూస్తూ... భరిస్తున్న వారికి రఘు కుంచె సంగీతం చాలా వరకు రిలీఫ్. పాటల మూలంగానైన దియేటర్ లో కాసేపు కుర్చోగలుగుతారు లేదంటే.... ఊహించటం కష్టం. రఘు అంది వచ్చిన అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకున్నాడు. బ్యాక్ స్కోరు విషయంగా మాత్రం నిరాశ పరిచాడు. పాటల  చిత్రీకరణ బాగుంది. శ్యాం కే నాయుడు పనితనానికి పేరు పెట్టలేం... కాని తొందరగా సినిమాను చుట్టేసే హడావిడిలో ప్రధానంగా నాణ్యత తగ్గేది ఫోటోగ్రఫిలోనే. ఆ లోపం ఈ సినిమాలో స్పష్టంగా కనపడుతుంది. ఎడిటింగ్ కూడా సరిగా లేదు. ప్రొడక్షన్ వేల్యూస్ పరవాలేదనిపిస్తాయి.

అభినయం :

రవితేజది ఎప్పటిలానే   రొటీన్ మూస పాత్ర. కాని తన శక్తి కొద్ది సినిమాను భుజాన  వేసుకుని ఏరు దాటించే  ప్రయత్నం చేసాడు కాని కధనం సహకరించక నట్టేట్లో మునకేసాడు. పాటల్లో మాత్రం తన హుషారును మైంటైన్ చేస్తూ అభిమానులను అలరించాడు. ఇలియానా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలో కనిపించిది కాని ఆ పాత్రను హై లైట్ చేసే సన్నివేశాలు మాత్రం పడలేదనే చెప్పాలి. 

ఉన్నంతలో ప్రకాష్ రాజ్ పాత్రే కొంత వైవిద్యంగా కనపడుతుంది. మతి మరుపు ఉన్న విలన్ గా ఆకట్టుకున్నాడు. కాకపోతే ఆ మతి మరుపు అనే ప్రత్యేకతను దర్శకుడు రెండో సగంలో కరెక్ట్ గా ఉపయోగించక పోవటంతో చివరికి ఆ పాత్ర ఓ డమ్మి అయ్యి కూర్చుంది . ఆలీ కామెడీ రొటీన్ గా ఉంది. బ్రమ్మి, కోవై సరళ విష్ణు మూర్తి, లక్ష్మి దేవి పాత్రలో పర్వాలేదనిపించారు. మిగత నటులు వారి పాత్రల కనుగుణంగా బాగానే చేసారు.

ప్లస్ పాయింట్స్: 

పాటలు, పూరి మార్క్ డైలాగ్స్ ప్లస్ పాయింట్స్ 

మైనస్ పాయింట్స్ : 

అర్ధం లేని కధ .. వ్యర్ధమైన కధనం ప్రధానంగా ఈ సినిమాకు మైనస్ పాయింట్స్. 

కొసమెరుపు ;  

 'దేవుడున్నాడని మనస్పూర్తిగా నమ్మి ఈ సినిమా చూడండి  ... మీకెలాంటి  అనుమానాలు రావు ..!'అని సినిమా ప్రారంభానికి ముందు చెబుతాడు పూరి. కాని ఈ సినిమాలో  అనుమానించే విషయాల కంటే అర్ధంలేని విషయాలే ఎక్కువ.. మరీ ఆ విషయాలను కూడా  ఎలా చూడాలో ప్రేక్షకులకు నేర్పినట్టైతే  బాగుండేది...... అప్పుడు 'అరటి కాయ  తొక్కతో చేసిన తొక్కలో సినిమా' అనే కామెంట్లు దియేటర్ల దగ్గర వినపడకుండా ఉండేవి.

Maruthi Talkies Rating 2 out of  5


      
         

Saturday, August 11, 2012

Andala Rakshasi Movie Review



తోలి చిత్రం గా ఈగ సినిమాతో సంచలనాన్ని సృష్టించి పరిశ్రమ దృష్టిని ఆకర్షించిన కొత్త నిర్మాత సాయి కొర్రపాటి మలి చిత్రంగా 'అందాల రాక్షసి ' అనే ప్రేమ కధతో తెలుగు సిని ప్రియులను అలరించటానికి ఈ వారం ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. వారాహి చలన చిత్ర బ్యానర్ ఫై నిర్మితమైన ఈ చిత్రం తో హను రాఘవపూడి దర్శకుడిగా పరిచయం కాగా నవీన్, లావణ్య , రాహుల్ నటి నటులుగా పరిచయం అయ్యారు. దర్శకుడు, నటి నటులతో పాటు ఈ చిత్రానికి పనిచేసిన సాంకేతిక వర్గం అంత కొత్త వారే కావటం విశేషం. 

ఫ్రెష్ లుక్ తో ... సరికొత్త ప్రచారంతో... అందంగా కనిపించిన ఈ 'అందాల రాక్షసి ' టీం లో స్టార్ దర్శకుడు రాజమౌళి భాగం కావటంతో సినిమాకు మంచి గుర్తింపు లభించింది. పెయింటింగ్ ను తలపించేలా ఉన్న పోస్టర్స్ , మణిరత్నం సినిమాలను గుర్తుకు తెచ్చేలా కనిపించిన వాతావరణం , మంచి మెలోడి గీతాలు సినిమా ఫై కొంత ఆసక్తిని కలిగించాయి. కొత్త దర్శకుడు హను జనాలు ఈ సినిమా మీద పెంచుకున్న ఆసక్తిని నిజం చేసాడో... ? లేక నీరుగార్చాడో..? మన సమీక్షలో చూద్దాం.  

కధ: 

మిధున (లావణ్య) , సూర్య ( నవీన్) , గౌతమ్ (రాహుల్) అనే ముగ్గురు అవిశ్రాంత ప్రేమికులు. ఆ ముగ్గురు ప్రేమ కోసం ఎన్ని సార్లైనా చనిపోవటానికి సిద్దం. అలాంటి ఈ ముగ్గిరి మద్య జరిగిన త్రికోణపు ప్రేమకదే ఈ అందాల రాక్షసి. అందంతో పాటు అల్లరి , అణుకువ సమపాళ్ళలో ఉన్న మిధునను అనుకోకుండా ఒకే రోజు వేరు వేరు సమయాల్లో చూసి.... తోలి చూపులోనే పీకల్లోతు ప్రేమలో మునిగి పోతారు సూర్య , గౌతమ్.  

కాని అవకాశం కలిసి వచ్చి పేద కళాకారుడైన సూర్య కు దగ్గరవుతుంది మిధున. తరవాత విధి ఆడిన వింత నాటకంలో డబ్బు అనే అడ్డుగోడ అడ్డు తగిలి మిదునను సూర్య కు దూరం చేసి గౌతమ్ కు దగ్గర చేస్తుంది. మనసులో సూర్యను ఆరాధిస్తూ గౌతమ్ కు దగ్గర కాలేక పోతుంది మిధున. కాని ప్రయత్నం మీద సూర్యను మరచి గౌతంకు దగ్గరవుతున్న సమయంలో సూర్య మళ్లీ  తెర ఫైకి వస్తాడు. ఆ ఫై ఆ ముగ్గురి జీవితాలలో ఏ విధమైన పరిస్థితులు చోటు చేసుకున్నాయి ..?  వాటి పరిణామాలు ఏమిటి....? అనేది మిగిలిన కధ.

విశ్లేషణ :
ప్రస్తుతం తెలుగు సిని పరిశ్రమ యాంత్రికమైన మనస్తత్వం కలిగిన సినిమా రూపకర్తలను తయారు చేసే ఫ్యాక్టరి గా అవతరించింది. వారికి  సాంకేతికంగా సరికొత్త విధానాలను ఉపయోగించుకుని సినిమాను ఎంత అందంగా చూపించ వచ్చో తెలుసు , సినిమాను మార్కెట్ ఎలా చేసుకోవాలో తెలుసు.... కాని మంచి కధతో ఆకట్టుకునే సన్నివేశాల రూపకల్పన చేసి గొప్ప ఫీల్ ను సృష్టించి ప్రేక్షకులను కట్టిపడేసే కళ మాత్రం అబ్బటం లేదు. సినిమాకు కధే ప్రాణం .. కాని సాంకేతిక ప్రమాణాలు పెరుగుతున్న కొద్ది కధ కధనాలు పతనమవుతు పోతున్నాయి....  ఫలితం ఈ 'అందాల రాక్షసి' లాంటి సినిమాలు. 

మార్కెట్లో ప్లాస్టిక్ పువ్వులు , పండ్లు దొరుకుతాయి. అవి చూడటానికి నిజమైన వాటికంటే అందంగా ఉంటాయి. కాని ఆ పూల వాసనను గ్రహించలేం... ఆ పండ్ల రుచిని ఆస్వాదించలేం..! అదే పరిస్థితి ఈ సినిమా చూస్తున్న ప్రేక్షకులది కూడా ..! సినిమా చూడటానికి ప్రచారానికి వాడిన పోస్టర్ల లానే చాలా అందంగా ఉంటుంది. అందమైన లోకేషన్స్ , ఆహ్లాదకరమైన వాతావరణం, సూపర్బ్ సినిమాటోగ్రఫీ , మంచి ఆర్ట్ వర్క్ తెర మీద నుండి చూపును పక్కకు తిప్పనియ్యవు. కాని సినిమాకు ఆత్మ లాంటి కధ, కధనాలు మాత్రం చికాకు పెట్టి చిరాకు తెప్పిస్తాయి. 

ప్రత్యేకంగా నొక్కి చెప్పటం కాదు కాని కొత్త దర్శకుడు హను రాఘవపూడి సహా దర్శకుడిగా చంద్ర శేకర్ ఎలిటి దగ్గర పనిచేసాడు కాని సినిమా చూసిన తరవాత అనిపించేదేమంటే అయన మణిరత్నం కు ఏకలవ్య శిష్యుడేమో అని. అంటే మణిరత్నం లా సినిమా తీసాడని కాదు... ఆయన్ను అనుకరించాలని అనుకున్నాడు అందుకు..! కాని ఇక్కడో విషయం గుర్తించాలి మణిరత్నం లాంటి వాళ్ళను ఆస్వాదించలే కాని అనుకరించలేం ..!  ఎందుకంటే మణిరత్నం సినిమాలు అయన మనసు నుండి వస్తాయి. పనిని అనుకరించ వచ్చు కాని ఒకరి మనసులో పుట్టే భావాలను మరొకరు ఎప్పుడు అనుకరించలేరు. ఈ విషయాన్నీ గుర్తించని హను మణిరత్నం మౌనరాగం , గీతాంజలి సినిమాల ఫ్లేవర్ ను  ఈ సినిమాకు అద్దాలని ప్రయత్నించి ఘోరంగా భంగపడ్డాడు. 

సినిమాకు అవసరంలేని ఎన్నో విషయాలను కధకు జోడించాడు. అలానే కధనాన్ని ఆసక్తికరంగా నడిపించటానికి అవసరం అయిన ఎన్నో విషయాలను లైట్ తీసుకుని పక్కన పెట్టేసాడు. సినిమా కధ  1992 సమయంలో జరిగింది అని చెప్పాడు ..కాని అప్పటి పరిస్థితులను కాని , వాతావరణాన్ని కాని అర్ధవంతంగా ప్రెజెంట్  చెయ్యలేక పోయాడు. అసలు ఆ బ్యాక్ డ్రాప్ ను కధకు ఎందుకు జోడించాడో కూడా అర్ధం కాదు. అలానే సినిమా మొదటిసగం మొత్తం పూర్తీ శూన్యం ఆవరించి ఉంటుంది. ప్రేక్షకులను ఆహ్లాద పరచటానికి అవసరమైన ఎంతో ఉత్సాహాన్ని మొదటి సగం లోని సన్నీ వేశాలకు  జోడించవలసి  ఉంది కాని హాను ఆ భాద్యతను రాహుల్, లావణ్య ల  మీద వదిలేసి వాళ్ళేం చేసారో అది చూట్టేసి జనాల  ముందు ఉంచినట్టు అనిపిస్తుంది. 

అలానే క్లైమాక్స్ లో స్పష్టంగా అర్ధం అయ్యేది ఏమంటే ఏదో చెప్పాలని  ముందనుకుని... తరవాత మనసు మార్చుకుని మరేదో చేసి .. అదీ నచ్చక చివరికి ఎలాగో ముగించాం అనిపించాడు.. ! కధలో నవీన్ పాత్ర ఎంటర్ అయిన తరవాత సినిమాకు కొంత ఎనర్జీ వస్తుంది, నవీన్ యాక్టివ్ గా ఉన్న పార్ట్ ఈ  సినిమా చూస్తున్న వాళ్ళకు కొంత ఊరట. 

కాని టెక్నికల్ గా మాత్రం ఈ సినిమాను, దానికి పనిచేసిన వాళ్ళను  ఎంత మెచ్చుకున్న తక్కువే ..!  ముఖ్యంగా మురళి సినిమాటోగ్రఫీ సినిమాకే ప్రాణం. తరవాత రధన్ అందించిన పాటలు , బ్యాక్ స్కోరు చాలా బాగున్నాయి. ఆర్ట్ వర్క్ .. ముఖ్యంగా బీర్ బాటిల్స్ తో హీరోయిన్ బొమ్మ వెయ్యటం నిజంగా అద్భుతం. అన్ని సాంకేతిక విభాగాలు చాలా చక్కగా పనిచేశాయి. నిర్మాణాత్మక  విలువలు ఉన్నతంగా ఉన్నాయి.

అభినయం : 

నవీన్ ఆకట్టుకున్నాడు .. అతనిలో మంచి ఈజ్ ఉంది. ముందు ముందు మంచి అవకాశాలు వస్తే తప్పక రాణిస్తాడు. లావణ్య చూడటానికి బక్కగా కనిపించిన ఆ అమ్మాయిలో ఏదో విషయం ఉంది. ప్రధానంగా ఆమె కళ్ళు సూదంటు రాళ్ళలా చూస్తూ ఉంటే చూడాలనిపిస్తూనే ఉంటాయి. అలానే ఆమె నవ్వుతూ ఉన్నా ,  కోపం తో ఉన్నా, బుంగ మూతి పెట్టిన భలే ముచ్చటేస్తుంది. 

రాహుల్ చూడటానికి బాగున్నాడు నటన కూడా పర్వాలేదు. కాని అతను మాట్లాడుతుంటేనే అసహనం కలుగుతుంది. రాహుల్, అతని తండ్రి పాత్ర మాట్లాడుకుంటుంటే ఏదో ఇంగ్లీష్ డబ్బింగ్  సినిమా చూస్తున్నట్టు అని పిస్తుంది కాని తెలుగు సినిమాలా అనిపించదు . మిగత నటులు వారి పాత్రలకనుగుణంగా బాగానే నటించారు.

ప్లస్ పాయింట్స్ :

సాంకేతికంగా అన్ని విభాగాలు ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్

మైనస్ పాయింట్స్ : 

నెమ్మదిగా... ఆసక్తి లేకుండా సాగే కధనం ... క్లారిటి లేని క్లైమాక్స్  చాలా వరకు ఈ సినిమాకు మైనస్ పాయింట్స్. 

కొసమెరుపు :


అందాల రాక్షసి అంటే అర్ధం ఏమిటి..? అందంగా ఉండే రాక్షసి .. అనే కాదా...! అంటే అందంగా ఉన్నా... లేక పోయినా రాక్షసి రాక్షసే..! అదీ ఎంత అందమైనదైనా... దాని నైజం మనుషులను పిక్కు తినటమే ..!  కాబట్టి ఎప్పుడన్నా మన కర్మ కొద్ది ఒక అందమైన రాక్షసి పాలపడి హింస అనుభవిస్తున్నప్పుడు మనకు కలిగే ఒకే ఒక సంతృప్తి ఏమంటే మనం భరిస్తుంది ఓ అందమైన రాక్షసిని అనే ఫీలింగ్ ....!  సరిగ్గా ఈ లాజిక్ అందాల రాక్షసి సినిమాకు ష్యూర్ గా వర్తిస్తుంది. 

Maruthi Talkies Rating 2.5 Out Of 5

 

Thursday, August 9, 2012

Julayi Movie Review


గత సంవత్సరం బద్రీనాథ్ సినిమాలో క్షేత్ర పాలకుడిగా అభిమానుల మన్ననలు అందుకోలేక పోయిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ సంవత్సరం త్రివిక్రమ్ ను తోడూ తీసుకుని కొంటె అల్లరి చేయటానికి 'జులాయి' గా ఈ వారం ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. డి వి వి దానయ్య సమర్పణలో  హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ ఫై నిర్మితమైన ఈ చిత్రంలో బన్నీ సరసన ఇలియానా హొయలు ఒలకబోసింది. రాజేంద్రప్రసాద్, సోను సూద్, బ్రమ్మి , యం యస్ తదితరులు ఇతర ప్రధాన పాత్రలలో కనిపించారు. దేవి సంగీతాన్నిఅందించాడు. స్టార్ సినిమాటోగ్రాఫర్ లు నాయుడు సోదరులు కేమెర బాధ్యతలు నిర్వహించారు. 

కొత్త సినిమా మార్కెటింగ్ విధానం టాలీవుడ్ నటులలోను , దర్శకులలోను ఒక స్పష్టమైన మార్పును తీసుకు వచ్చింది. దానిని జాగ్రత్తగా ఫాలో అవుతూ లాభాలను పిండుకుంటున్నారు సినిమావాళ్ళు. ఆ క్రమంలో ఇప్పుడు బన్ని , త్రివిక్రమ్ వంతు వచ్చింది . ఏంతో  ఇష్టపడి... మరెంతో కష్టపడి బన్నీచేసిన బద్రీనాథ్, త్రివిక్రమ్ చేసిన ఖలేజా వారికి తీరని నిరాశను  మిగిల్చాయి. ఆ అనుభవాలు నేర్పిన పాఠాలను ఆచరణ లో పెడుతూ వారిద్దరూ రూపొందించిన ఈ 'జులాయి' మరింత మందికి ఆదర్శం కానుంది.

దేవి శ్రీ పాటలు, త్రివిక్రమ్ మార్క్ పంచ్ డైలాగులు విడుదలకు ముందే సినిమాకు కావలసినంత ప్రచారాన్ని తీసుకువచ్చాయి. సినిమా హిట్టా...! ఫట్టా..! అన్న సంగతి పక్కనుంచి త్రివిక్రమ్ నుండి ఓ సోలిడ్ ఎంటర్టైనర్ కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారని ఈ సినిమా మీదా పెరిగిన  క్రేజ్ తెలియజేస్తుంది. అలా ఎంతో  ఆశగా ఉన్న ప్రేక్షకుల ఇష్టాన్ని త్రివిక్రమ్, బన్ని కలిసి ఎంత వరకు నేరవేర్చారో .. మన సమీక్షలో చూద్దాం.    

కధ: 

రవీంద్ర నారాయణ (అల్లు అర్జున్) , బిట్టు(సోను సూద్ ) ఒకే రకంగా ఆలోచించే తెలివైన వాళ్ళు. కాకపోతే రవి ఆలోచనలు పెద్దవే కాని ఆశ చిన్నది. బిట్టు ఆలోచనలు పెద్దవే...... ఆశ కూడా పెద్దదే. అందుకే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా చలామణి అవుతూ  వరద రాజులూ(కోట శ్రీనివాస రావు ) అనే రాజకీయ నాయకుడి సహాయంతో 1500 కోట్ల బ్యాంకు డబ్బు కొట్టేయటానికి ప్లాన్ చేస్తాడు.  

తక్కువ శ్రమ తో దొంగ దారిలో అయినా ఒకే దెబ్బతో జీవితంలో సెటిల్ అవ్వాలనుకునే మధ్యతరగతి రవి కి బిట్టుకు సంబందమే ఉండదు. కాని అనుకోని పరిస్థితిలో బిట్టుకు దొంగతనం చేసే ముందు రవి తో చిన్న పరిచయం అవుతుంది. దాంతో 1500 కోట్ల బ్యాంకు దోపిడీ కేసులో బిట్టు నేరస్తుడైతే ... రవి సాక్షిగా పోలీసులకు సహాయం చేస్తూ ఉంటాడు. ఆ క్రమంలో బిట్టు తమ్ముడు రవి మూలంగా చనిపోతాడు అలానే దొంగలించిన డబ్బు కూడా దక్కకుండా పోతుంది. దాంతో బిట్టు రవి మీద పగ పెంచుకుంటాడు. 

పరిస్థితిని  గమనించిన పోలీసులు  బిట్టు నుండి రవినీ కాపాడటానికి హైదరాబాద్ పంపిస్తారు. అక్కడ ఏ సి పి (రాజేంద్ర ప్రసాద్ ) ఇంట్లో ఉంటున్న రవి మధు(ఇలియానా ) ను చూసి ప్రేమిస్తాడు. బిట్టు పోగొట్టుకున్న డబ్బును రికవరీ చేసుకునే ప్రయత్నాలు చేస్తూనే రవినీ  కుటుంబంతో సహా చంపటానికి కుట్ర  చేస్తూ ఉంటాడు. ఆ ఫై బిట్టు కుట్రలను ఎదుర్కుంటూ 1500 కోట్లను రవి ఎలా వెనక్కి తే గలిగాడు అన్నది మిగిలిన కధ. 

 విశ్లేషణ :
'కష్ట పడకుండా వచ్చిన సొమ్ము ఊరకనే రాదు.... లెక్క లేనన్ని కష్టాలతో వస్తుంది' అని జులాయి సినిమా తో చెప్పాలన్నది త్రివిక్రమ్ ఉద్దేశం. ఆలోచన అయితే బాగానే ఉంది కాని ఆ పాయింట్ ను చెప్పిన విధానమే చాలా అపోహలకు అవకాశం ఇస్తుంది. ఇది ఈ సినిమా వరుకే కాదు రెగ్యులర్ గా త్రివిక్రమ్ సినిమాలలో ఎప్పుడు కనిపించేదే. అయన సినిమా కధలో ప్రధానమైన అంశం సినిమా మొదట్లో , ఇంటర్వెల్లో అలాగే చివరలో మాత్రమే ఆక్టివ్ గా ఉంటుంది. మిగత సమయం అంత మంచి రూం తీసుకుని రెస్ట్ తీసుకుంటూ ఉంటుంది. ఆ మిగిలిన పార్ట్ను త్రివిక్రమ్ తనదైన శైలిలో వినోదానికి కేటాయించి నవ్వులు పూయించే ప్రయత్నం చేస్తాడు.

అయన దర్శకతం వహిస్తున్న మొదట్లో ఇది పొరపాటు కింద అనుకున్నారు కొందరు కాని ఇప్పటి వరకు త్రివిక్రమ్ అన్ని సినిమాలలో అదే ఫాలో  అవుతూ వచ్చారు, చివరికి ఈ సినిమాలో కూడా...! దీనితో తెలిందేమా  అంటే.....  ఇది పొరపాటు కాదు త్రివిక్రమ్ స్టైల్ అఫ్ ఫిలిం మేకింగ్ ఫార్మేట్ అని. ఈ టైపు అఫ్ ఫార్మేట్ లో ఉండే మజా ఏమిటంటే... సినిమాలో వచ్చే సన్నివేశాలను విడి విడిగా చూస్తే ... చాలా అద్భుతంగా ఉంటాయి,వాటిని మనస్పూర్తిగా అస్వాదిస్తాం  కూడా..! 

అలానే ఇందులో ఓ ప్రమాదం కూడా ఉంది అది కూడా ఇంటర్వెల్ తరవాత.... ఎందుకంటే  అప్పటి వరుకు త్రివిక్రమ్ మ్యాజిక్ మనల్ని కట్టి పడేస్తుంది. ఆ తరవత కూడా ఆ మ్యాజిక్ కంటిన్యూ అవుతుంది.. ఎప్పటివరుకు అంటే అసలు సినిమా కదేంటి అని చూసేవాళ్ళ బుర్రలో ఆలోచన రానంత వరుకు... ! ఒక్కసారి ఆ ఆలోచన వచ్చిందా.... వెంటనే లాజిక్కులు గుర్తుకు వస్తాయి. ఆ ఫై సినిమా మీదా ఆశక్తి నెమ్మదిగా తగ్గుతూ పోతుంది. కాని ఇక్కడో వెసులుబాటు.. ఈ విషయాన్నీ గుర్తించ గలిగిన వాళ్ళకి మాత్రమే కొద్దిగా అసంతృప్తి.... గుర్తించలేదు అనుకోండి సినిమాను భీభత్సంగా ఎంజాయ్ చేస్తారు.

 దానికి ఒక ఉదాహరణ చెబుతా సినిమాకు జులాయి అని పేరు పెట్టారు... కాని హీరో అసలు ఒక్క జులాయి వేషం కూడా వేయాడు... ఫై పెచ్చు బాధ్యత గల పౌరిడిలా పోలీసులకు సహకరిస్తూ... వారికి నీతులు చెబుతూ క్రిమినల్స్ ను పట్టుకోవటం లో వారికంటే ఎక్కువ ఉత్సాహంగా ఉంటాడు. ఇలాంటివి ఆలోచిస్తే సినిమాలో చాలానే ఉంటాయి కాని పట్టించుకోక పోవటమే ఉత్తమం. అప్పుడే త్రివిక్రమ్ పెట్టే గిలిగింతలను ఎంజాయ్ చేయవచ్చు.        

జులాయి విషయానికి వస్తే కధ చాలా సింపుల్..కాని స్క్రీన్ ప్లే చాలా కాంప్లికేటేడ్. సినిమా ఆసక్తి కరమైన బ్యాంకు రోబరి ఎపిసోడ్ తో మొదలవుతుంది. ఇది డార్క్  నైట్ సినిమాలో జోకర్ ఇంట్రడక్షన్ సీన్ ను తలపిస్తుంది. అలా మొదటి 20 నిముషాలు సీరియస్ గా సాగిన సినిమా కీలకమైన మలుపు తీసుకుని కామెడీ రోడ్ ఎక్కుతుంది. బ్రమ్మి, యం యస్ , రాజేంద్ర ప్రసాద్ లు చేసే కామెడీ కి బన్నీ, ఇలియానాలా రొమాన్స్ కూడా తోడై సరదాగా గడిచి పోతుంది. 

అలా రేసిగా సాగిపోతున్న సినిమా మూడో పాట పూర్తవగానే నెమ్మదిగా డ్రాప్ అవటం మొదలుపెట్టింది. అది అలా చివరి వరకు కొనసాగింది. కాకపోతే మద్యలో బ్రమ్మి అండ్ కో చేసిన కామెడీ చాలా వరకు రిలీఫ్ నిస్తుంది. జులాయి ఫస్ట్ హాఫ్ సూపర్ గాను సెకండ్ హాఫ్ కొంత డల్ గాను మొత్తంగా ఓకే పర్వాలేదు అని మాత్రమే అనిపిస్తుంది. 

సాంకేతికంగా త్రివిక్రమ్ ప్రతిభను ఎంత పొగిడిన తక్కువే. తెలుగు సిని ప్రపంచం గర్వించ తగ్గ నిపుణుడు. దర్శకుడిగా అన్ని విభాగాలను చాలా గొప్పగా ఉపయోగించుకుంటాడు. ఆ పనితనం సినిమా ప్రతి ఫేం లోను కనపడుతుంది. ఇక మాటల రచయతగా త్రివిక్రమ్ గురింఛి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏమి లేదు...! సందర్భానికి అవసరమైనట్టు, అయన అభిమానులు ఆనందపడేట్లు సింగిల్ లైన్ పంచ్ డైలాగులను ఈ సినిమా కూడా కావలసినన్ని పొందుపరిచారు. దర్శకుడిగా,  మాటల రచయతగా  సినిమా మీద పూర్తీ ఆధిపత్యం ప్రదర్శించే త్రివిక్రమ్ కధ రచయతగా కొంత అస్పష్టతను మైంటైన్ చేస్తున్నాడు. దానిని గుర్తించి సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది.  

త్రివిక్రమ్ మాటలతో పాటు దేవి శ్రీ అందించి పాటలు , వాటిని తీసిన విధం, వాటికీ బన్నీ వేసిన స్టెప్పులు... అబ్బో...   వీటి గురించి చెప్పటం కాదు చూస్తేనే బాగుంటుంది. నాయుడు సోదరుల సినిమాటోగ్రఫీ , ప్రవీణ్ పూడి ఎడిటింగ్ ప్లెజెంట్ గా ఉన్నాయి. నిర్మాణాత్మక విలువలు ఉన్నతంగా ఉన్నాయి. 

అభినయం :   

బన్నీ ఈ సినిమాలో చాలా ఫ్రెష్ గా కనిపించాడు... అంతకంటే బాగా ఎంటర్టైన్ చేశాడు. ఇప్పటి వరకు డైలాగ్ డెలివరీ, ఎక్స్ ప్రేషన్స్ విషయంలో కొద్దిగా నిరాశ పరిచే బన్ని ఈ సినిమాతో పరిపూర్ణమైన నటుడిగా అవతరించాడు. అతని డైలాగ్స్ లో స్పష్టత ఉంది, ఎక్స్ ప్రేషన్స్ లో అందం ఉంది, ఆహార్యం మీదా అదుపు ఉంది...ఇక డాన్సుల గురించి చెప్పేదేముంది.....! బన్ని పుట్టిందే డాన్సుల కోసం . పాట పాటకు కొత్త కొత్త  స్టెప్పులేసి అభిమానులను అలరించాడు. 

ఇలియానా ఎప్పటిలానే అందాన్ని వెదజల్లి ప్రేక్షకులను సమ్మోహనపరిచింది. బన్ని ఇలియానాల జోడి సూపర్ గా  సెట్ అయ్యింది. వారిద్దరి మద్య కెమిస్ట్రీ కూడా బాగా వర్క్ అవుట్ అయ్యింది. సోను సూద్ పాత్ర పవర్ ఫుల్ గా లేక పోవటం కొంతవరకు లోటు... కాని తన పాత్ర పరిది మేర  సోను బాగా నటించాడు. త్రివిక్రమ్ రాసిన మాటలు కోట శ్రీనివాస రావు నోటి వెంటే వింటేనే వినసొంపుగా ఉంటాయి అని అనిపిస్తుంది. అంత కమాండ్ తో కోట ఆ డైలాగులు చెబుతారు. ఈ సినిమాలో కూడా కోట గుర్తుంచుకునే కొన్ని డైలాగులను బాగానే పేల్చారు. 

రాజేంద్ర ప్రసాద్కు  ఫుల్ లెంగ్త్  పాత్ర పడింది కాని అది ఆయనే ప్రత్యేకంగా చేయవలసిన పాత్ర అయితే కాదు. ఏదేమైనా తన పాత్రకు 100 % న్యాయం  చేసారు. ఇక బ్రమ్మి మరో సారి ఇన్నోసెంట్ దొంగగా కనిపించినప్పటికీ ఫ్రెష్ అప్రోచ్ తో సినిమాలో నవ్వుల పండుగా చేశాడు. సినిమాలో బ్రమ్మి కనిపించినంత సేపు నవ్వుతూనే ఉంటాం. యం యస్ ఓకే  అనిపిస్తాడు. ధర్మవరం, రావు రమేష్ సహా మిగత నటులు వారి పాత్రలకనుగుణంగా బాగా నటించారు. 

ప్లస్ పాయింట్స్ : 

త్రివిక్రమ్ మాటలు , దర్శకత్వం , బన్ని డాన్సులు, బ్రమ్మి అండ్ కో కామెడీ ప్రధానంగా ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్. 

మైనస్ పాయింట్స్; 

సింపుల్ కధ , లాజిక్ తప్పిన కధనం , కొద్దిగా బోర్ అనిపించే సెకండ్ హాఫ్  కొంత వరకు  ఈ సినిమాకు మైనస్ పాయింట్స్.                

కొసమెరుపు : 
 ఈ సినిమాలో ఒక డైలాగ్ ఉంది. 'ఈ దేశంలో జనాలు లాజిక్ కంటే మ్యాజిక్ నే ఎక్కువ  నమ్ముతారు... అందుకే సైంటిస్టులా కంటే బాబాలు ఫేమస్ ' అని. అది సినిమాలకు కూడా వర్తిస్తుంది. త్రివిక్రమ్ తన సినిమాల్లో లాజిక్, మ్యాజిక్ రెంటికి సమానమైన స్థానం కల్పిస్తాడు. దాని మూలంగా సినిమాలో ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్. అలా కాకుండా  లాజిక్ నో ... మ్యాజిక్ నో... ఏదో ఒక దానిని నమ్ముకుంటే ఆయన సినిమాలకి ఒక పరిపూర్ణత వస్తుందేమో...అని ఒక సూచన. 

Maruthi Talkies Rating 3 out of 5