Saturday, November 24, 2012
Friday, November 23, 2012
Nagarjuna's Damarukam Movie Review
విడుదల విషయంలో కొంత నిరాశ కలిగించినప్పటికీ ... ఊహాతీతమైన ఆసక్తిని సర్వత్ర రేకెత్తిస్తూ ఈ వారం విడుదల అయ్యింది డమరుకం. ఆడంబరంగా మొదలై.. అణుకువగా పూర్తై ... ఆర్భాటంగా విడుదలకు సిద్దం అయిన డమరుకం అనూహ్యంగా కష్టాల ఊబిలో కూరుకుపోయింది. ఆ ఫై సినిమాలో ఉన్నా విశేషాల కంటే విడుదలలో తలెత్తిన వివాదాలే బోలెడంత ప్రచారాన్ని మూటగట్టుకున్నాయి.
Thursday, November 22, 2012
Wednesday, November 21, 2012
Damarukam Got a New Release Date
King Nagarjuna's latest venture 'Damarukam' has got a new release date. Makers revealed a poster stating that movie is releasing this week on November 23rd. After repeated post ponments due to financial issues Damarukam team is now planning to release this movie at any cost with out fail. Nagarjuna fans and movie lovers hopping that November 23 would be the finale release date for Damarukam.
Anushka is pairing with Nagarjuna in this movie. R R Movie makers produced this graphical extravaganza movie with a whopping budget of 40 crores. Srinivasa Reddy is the director and Devi Sri Prasad did the music for Damarukam.
Sunday, November 18, 2012
Saturday, November 10, 2012
Friday, November 9, 2012
కదిలిస్తున్న దళం...!
రామ్ గోపాల్ వర్మ శిష్యుడు జీవన్ రెడ్డి దళం ట్రైలర్స్ తో ప్రకంపనలు సృష్టిస్తున్నాడు..! కొద్దిసేపటి క్రితం వదిలిన ఈ ట్రైలర్ చూడండి నేను ఎందుకు అలా అన్నానో.. మీకు అర్ధం అవుతుంది. టెర్రరిజం లోని మరో యాంగిల్ ను మన ముందుకు తెస్తున్నాడు జీవన్ ... వ్యాపారత్మక దోరణి తో కాకుండా ఇది ఒక నిజాయితీ అయినా ప్రయత్నం కావాలని ఆశిద్దాం...!
Thursday, November 8, 2012
Wednesday, November 7, 2012
Tuesday, November 6, 2012
ఆరుంధతినే రుద్రమ్మ అంటున్నా గుణశేఖర్
![]() |
| Aarundhati - Rudhrama Devi |
పైన కనిపిస్తున్నా రెండు పిక్చర్స్ లో మీకు ఏమన్నా తేడా కనిపిస్తుందా ..? నాకైతే పేరు తప్పించి పెద్ద తేడా ఏమి కనిపించటం లేదు. రెండు ఫోటోలలో ఉన్నది ఒకటే స్టిల్ కాకపోతే సినిమాలే వేరు..! ఎడమ చేతి పక్కనుంది 2009 లో వచ్చిన ఆరుంధతి సినిమాలోనిది, మరి కుడి పక్కనుందేమో... రేపు తీయ్యబోయే రుద్రమ దేవి చిత్రానికి సంబందించింది.
డమరుక నాదానికి అదిరేది లేదంటున్న కృష్ణం...
![]() |
| Nagarjuna - Rana |
బావ బావే...! పేకాట పేకాటే..! అన్నా నానుడి ప్రకారం బంధుత్వాన్ని పక్కన పెట్టి బరిలోకి దిగాడు సురేష్ బాబు. ఈ రోజు మధ్యానం నుండి సురేష్ బాబు , దర్శకుడు క్రిష్, కృష్ణం వందే జగద్గురుం సినిమా నిర్మాతలు పంపిణిదారులతో సాగించిన చర్చలు కాసేపటి క్రితమే ఓ కొలికి వచ్చాయి. వారందరూ సినిమాను నవంబర్ 9 నే విడుదల చెయ్యాలని నిర్ణయించినట్టు సమాచారం. అందుకు సంబందించిన అధికారిక ప్రకటన రేపు ఉదయం వెలువడనుంది. ఈ రోజు ఉదయం వరకు సందిగ్దంలో ఉన్నఈ టీం సెన్సార్ తరవాత వచ్చిన ప్రశంశలు ఇచ్చిన ఉత్సాహమే వెనక్కి తగ్గక పోవటానికి కారణంగా తెలుస్తుంది.
దసరాకు రెండు సినిమాలు మాత్రమే విడుదలై సెలవుల్లో ప్రేక్షకులను నిరాశపరిచాయి. ఇప్పుడు అసలైన దీపావళి పండగా బాక్స్ ఆఫీస్ దగ్గర జరగనుంది. చాలా రోజులు తరవాత తెలుగులో రెండు పెద్ద సినిమాలు ఒకే రోజు తలపడటం కొంత ఆసక్తిని కలిగించే అంశమే..! ఈ సినిమాలకు వేటి ప్రత్యేకత వాటికుంది. రెండు సినిమాలు పాజిటివ్ టాక్ నే క్యారి చేస్తున్నాయి. కాకపోతే కృష్ణం వందే జగద్గురుంతో పోలిస్తే డమరుకం ఆడియన్సు కు రీచ్ అయిన అంశంలో ఓ అడుగు ముందుందని చెప్పాలి.
క్లాసు సినిమాల దర్శకుడుగా ముద్ర వేయించుకున్న క్రిష్ , ఇంతవరకు హిట్ లేని రానా సినిమా గురించి మాస్ లో కావలసినంత ఆసక్తిని నెలకొల్పలేకపోయారు. ఆ అంశం బి, సి సెంటర్ లలో సినిమా ఓపెనింగ్స్ మీద ప్రభావం చూపించవచ్చు. ఆ తరవాత మాత్రం బాగున్నా సినిమాదే దీపావళి సింహాసనం. కానీ ఏ ఒక్కటో కాకుండా రెండు సినిమాలు బాగుంటే ఈ సెలవల్లో ప్రేక్షకులకు అంతకు మించిన ఆనందం మరోటుండదు.
Monday, November 5, 2012
మాస్ కామెడికి సై అంటున్న మాస్ రాజా
![]() |
| Raviteja - Nageswara Reddy New Movie |
గత్తర గత్తర కామెడీ టైమింగ్ తో పంచ్ డైలాగులను చిత్తడి చిత్తడి చేసేస్తూ వెటకారానికి ఒక ప్రోఫిషనలిజం కట్టబెట్టిన రవితేజ ప్రస్తుతం తెలుగు సిని పరిశ్రమలో మాస్ కామెడీ కి టాప్ స్టార్. ఈ ఘనతను మాటి మాటికి గుర్తుచేయ్యాలనే ఆయన్ని మాస్ మహారాజ అని పిలుచుకుంటారు అభిమానులు. వీపరిత దోరణిలో కామెడీ చేస్తూ జనాలను ఉర్రుతలుగించిన రవి గత కొన్ని సినిమాలుగా దారుణంగా నిరుత్సాహపరుస్తున్నాడు. ఫలితం .... వరస తిరస్కరణలు. ఒకే రకమైన స్వభావం కలిగిన పాత్రలను మళ్లీ మళ్లీ చేసి చూపించటమే మొహం మొత్తటానికి కారణం. ఈ తప్పును తెలుసుకునే రాబోయే చిత్రాలను జాగ్రత్తగా ఎంచుకుంటున్నాడని వినికిడి.
ఆ మార్పుకు పరుశురామ్ దర్శకత్వంలో వస్తున్నా 'సార్ వస్తారు' శ్రీకారం చూడుతుందని తరవాత గోపీచంద్ తీస్తున్నా 'బలపు' దానిని కంటిన్యూ చేస్తుందని రవి సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఇలా హిట్ కోసం ప్రక్షాళన బాట పట్టిన రవితేజ తాజా గా దేనికైనా రెడీ హిట్ తో ఉత్సాహంగా ఉన్న జి నాగేశ్వర రెడ్డి తో సినిమా చేయటానికి సై అన్నట్టు సమాచారం. మాస్ కామెడీ ని పండించటంలో సిద్దహస్తుడిగా పేరు తెచ్చుకున్న నాగేశ్వర రెడ్డి మాస్ ఎలెమెంట్స్ కు పవర్ స్టేషన్ లాంటి రవితేజ ను ఎలా ఒడిసి పట్టుకుంటాడో... అని అప్పుడే అంచనాలు మొదలయ్యాయి.
సినిమాలో హాస్య నటులు ఎంతమంది ఉన్నాతనదైన గుర్తింపును ఎప్పుడు హైలైట్ చేసుకునే రవితేజకు, కామెడీ ని స్టార్ ని చేసి హీరోను కూడా సాటి కామెడీ ఆర్టిస్ట్ గా చూపించే నాగేశ్వర రెడ్డికి ఎలా సింక్ అవుతుందో.. తెలుసుకోవటమే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి ఆసక్తికరమైన అంశం.
క్లారిటీ కావాలంటున్న బాలయ్య ఫాన్స్
సింహ విజయం ఇచ్చిన కిక్ తో వరస సినిమాలు చేస్తూ తెలుగు ప్రేక్షకులను ఉక్కిరి బిక్కిరి చేసిన బాలకృష్ణ శ్రీమన్నారాయణ తరవాత ఒక్కసారిగా సైలెంట్ అయిపోయాడు. దాంతో బాలయ్య అభిమానుల్లో స్థబ్ధత నెలకుంది. వారు బాలయ్య తరవాతి సినిమా ఏమిటా అని ఆలోచనలో ఉండగానే మూడు సినిమాలకు సంబందించిన రూమర్స్ సంచారం మొదలుపెట్టాయి. బోయపాటి శ్రీను రూలర్ పేరుతో బాలయ్యతో సినిమా చేస్తున్నాడు అని వినపడింది. అలానే లక్ష్యం దర్శకుడు శ్రీవాస్ బాలయ్యను సి బి ఐ ఆఫీసర్ పాత్రలో చూపించటానికి ప్రయత్నాలు చేస్తున్నాడు అని ప్రచారం జరిగింది. అంతే కాని ఆ సినిమాల గురించి ఎవరు అధికారికంగా ప్రకటించలేదు.
అవి అలా ఉంటే నృత్యదర్శకుడి నుండి దర్శకుడిగా ప్రమోషన్ తెచ్చుకుని ఒక హిట్టు రెండు ప్లాపులతో నిశ్శబ్దంగా ఉన్న అమ్మ రాజశేఖర్ ఓ పవర్ ఫుల్ యాక్షన్ కధను తాయారు చేసి బాలయ్యకు చెప్పి ఒప్పించాడని కొత్త దూమారం ఈ మద్యనే రేగింది. అలానే ఈ సినిమాను మహాత్మా , రంగ ది దొంగ సినిమాలను నిర్మించిన మనోహర్ నాయుడు నిర్మించనున్నాడని ప్రచారం ఊపందుకుంది. కాకపోతే దీనికి సంబంధించి కూడా అధికారిక సమర్ధనలేదు. దాంతో బాలయ్య తరవాతి సినిమా ఏమిటి అని అయన అభిమానుల్లో కలవరం కంటిన్యూ అవుతూనే ఉంది.
జయాపజయాలతో సంబంధం లేకుండా నిర్విరామంగా సినిమాలు చేసుకుంటూ పోయే బాలయ్య కామ్ గా ఉండటం పలు అనుమానాలకు తావిస్తుంది. రీలాక్స్ అవటం కోసం గ్యాప్ తీసుకున్నారా ...? లేక రాజకీయాల మీద దృష్టి పెట్టటానికి వ్యుహత్మకంగానే గ్యాప్ తీసుకున్నారా..? అన్న ప్రశ్నలు వినపడుతున్నాయి. ఈ విషయాలు అయన అభిమానులను మరింత గందరగోళానికి గురిచేస్తున్నాయి. అందకే వారు అనవసరపు వాదనలకు తవ్వివ్వకుండా బాలయ్య త్వరగా ఓ స్పష్టత ఇవ్వాలని అభిలాషిస్తున్నారు.
తగ్గేది లేదంటున్నా విష్ణు..!
సమసి పోయిందిలే అనుకుంటున్నా వివాదాన్ని ఓ పట్టాన వదిలిపెట్టటం విష్ణుకు ఇష్టం ఉన్నట్టు లేదు. అందుకు ప్రతీక పైనా కనిపిస్తున్న ప్రకటన. వివాదానికి పరిష్కారం సులువైనదే అయిన పంతం మీద ఉన్నా మంచు ఫ్యామిలీ దానిని ఎట్టి పరిస్థితుల్లో నెగ్గించుకోవాలనే ఉన్నట్టు ఈ ప్రకటనను బట్టి అర్ధం చేసుకోవచ్చు. వివాదం మొదలైనప్పటి నుండి విష్ణు ఏమైతే చెబుతున్నాడో.. అదే ఈ ప్రకటనలోను చెప్పాడు తప్పా కొత్తగా వేడుకున్నది ఏమి లేదు. అంటే విష్ణు ఈ సమస్యను ఉపయోగించుకుని సినిమాకు మరింత ప్రచారం దక్కించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నట్టు కనపడుతుంది. అదే కనుక వారి ఆలోచన అయితే ఇది విచారించ తగ్గ విషయం..!
అలానే ఆవేశంలో విష్ణు 'దేనికైనా రెడీ' సినిమా 14 సంవత్సరాల క్రితం వచ్చిన ఓ మలయాళ చిత్రానికి రీమేక్ అని ప్రకటించటం చర్చనియ్యంశం అయ్యింది. రీమేక్ అన్నప్పుడు కధ పరంగా ప్రశంశలన్ని ఒరిజినల్ సినిమా కధ రచయతకు దక్కుతాయి. అలాంటప్పుడు ఈ సినిమాకు పనిచేసిన రచయతలు అనువాదకులు మాత్రమే అవుతారు.ఈ విషయంలో ఏ మాత్రం వాస్తవం ఉన్నాఈ సినిమాకు పనిచేసిన రచయతలను అవమానించి నట్టే అవుతుంది. అయినా మలయాళం లో తీసిన చిత్రాన్ని కొన్ని మార్పులతో మళ్లీ నిర్మించటానికి ఉద్దండులైన నలుగురు రచయతలు అవసరమా..? ఈ ప్రశ్నకు విష్ణు తడుముకోకుండా సమాధానం చెప్పాలి.
Sunday, November 4, 2012
మామతో పోటి వద్దంటున్నా అల్లుడు
ఇండియా లో జరిగే పండగల వల్ల ఉపయోగం... ఒక పండక్కి సేల్ కాని స్టాక్ మరో పండక్కి పోద్ది...! అలానే దసరా స్పెషల్ గా సందడి చేస్తుందనుకున్నా డమరుకం ఇప్పుడు దీపావళి ధమాకాగా రానుంది. అద్భుతం చేసైనా సరే దసరాకు సినిమాను విడుదల చెయ్యాలనుకున్న నిర్మాతల సంకల్పానికి ఆర్ధిక ఇబ్బందులు గండికొట్టి నాగార్జునకు మునుపెన్నడూ ఎరుగని అవమానాన్ని మూటగట్టాయి. పరిస్థితులు చేయిదాటినా తనకున్న పలుకుబడితో వాటిని అదుపులోకి తెచ్చి నష్టం మరీ ఎక్కువ కాకుండా జాగ్రత్తపడింది నిర్మాణ సంస్థ ఆర్ ఆర్ మూవీ మేకర్స్. దాంతో డమరుకం ఉత్సాహంగా నవంబర్ 9 న విడుదల అవటానికి సిద్దం అయ్యింది.
ఈ పరిణామం ఇప్పుడు కొన్ని సినిమాల విడుదలకు అవరోధంగా మారింది అని తెలుస్తుంది. డమరుకం విడుదల గురించి స్పష్టత లేకపోవటంతో కృష్ణం వందే జగద్గురుం నవంబర్ 9 న విడుదలకు ఏర్పాట్లు చేసుకుని అందుకు తగ్గట్టు ప్రచారం కూడా మొదలు పెట్టింది. కాని హఠత్తుగా సైడ్ ట్రాక్ లో ఉందనుకున్నా డమరుకం మెయిన్ ట్రాక్ లోకి రావటంతో సందిగ్దంలో పడింది కృష్ణం వందే జగద్గురుం టీం. దియేటర్ల గేమ్ లో భాగంగా ఎక్కువ హాళ్ళలో ప్రదర్సించటానికి సోలో రీలీజ్ ను ఆశిస్తున్నా రానా, దర్శకుడు క్రిష్ వెనక్కి తగ్గి నాగార్జునకు దారి ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. కొద్దిగా టైం తీసుకుని డమరుకం ఫలితాన్ని బట్టి దీపావళి రోజు కాని ఆ తరవాత వచ్చే శుక్రవారం కాని విడుదల చెయ్యాలి అనే మంతనాలు అంతర్గతంగా జరుగుతున్నట్టు బోగట్టా..! ఈ విషయంలో స్పష్టత సోమవారం తెలియవచ్చు.
డమరుకం విడుదలలో జప్యమేకాని సర్వత్ర సినిమా మీద సానుకులా అంచనాలే ఉన్నాయి. పరిశ్రమతో పాటు సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరు సినిమా గురించి గొప్పగా చెబుతున్నారు. ఈ పాజిటివ్ సంకేతాలే సినిమా విడుదల మరింత ఆలస్యం కాకుండా కాపాడాయి అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక ఈ దీపావళిని 'డమరుకం'తో సెలబ్రేట్ చేసుకోవటానికి సిద్దంగా ఉండండి.
పవన్ కు చేదయ్యిందే విష్ణుకు బెల్లం అయ్యింది..!
వెంటవెంటనే వరసగా రెండు బ్లాక్ బాస్టర్స్ ఇచ్చి మహేష్ బాబుకు సవాలు విసురుదాం అనుకున్న పవన్ కళ్యాణ్ ఆశలకు గండి కొట్టింది 'కెమెరా మాన్ గంగతో రాంబాబు. వివాదాస్పదం కాకుంటే విస్తుపోయే విధంగా రికార్డులు సృస్టించటానికి సిద్దం అయిన ఈ సినిమాను దురదృష్టం వెక్కిరించింది. విడుదల తోలిరోజు సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్నా వివాదాన్ని ధైర్యంగా ఎదుర్కోనలేక 12 సీన్లు కోత పెట్టించుకున్నాడు రాంబాబు. దాంతో సినిమా ఆడటానికి అవసరమైన కంటెంట్ అంతా చెత్తబుట్ట పాలై జనాలు చూడటానికి స్క్రాబ్ మిగిలింది. అందువల్ల వివాదం మూలంగా వచ్చిన వీపరితమైన ప్రచారానికి అర్ధం లేకుండాపోయింది. అలా సూపర్ హిట్ అనిపించుకోవాల్సిన రాంబాబు యావరేజ్ తో... కొన్ని చోట్ల బయ్యర్లకు నష్టాలు మిగుల్చుతూ సర్దుకోవలసివచ్చింది.
రాంబాబు వివాదం సమసిపోయింది అని అనుకునేలోపే దేనికైనా రెడీ వివాదం తెర మీదకు వచ్చింది. ఈ సినిమాది రాంబాబు గొడవంత పెద్దది కాకపోయినప్పటికీ మోహన్ బాబు , విష్ణు పంతానికి పోయి ఊహించనంత పెద్దది చేసి పెట్టారు. ఆ తరవాత జరిగిన పరిణామాలు సినిమాకు ఇబ్బడి ముబ్బడిగా ప్రచారాన్ని తెచ్చిపెట్టాయి. దాంతో ఓ పక్క వివాదం నడుస్తున్నప్పటికీ దియేటర్లు ప్రేక్షకులతో కిక్కిరిసిపోయాయి. రెండు వారాలు దియేటర్లు నిలుపుకోగలిగితే చాలు సినిమా హిట్ అంటున్న ఈ రోజుల్లో.. మూడో వారం కూడా మంచి వసూళ్ళు రాబడుతూ హిట్ నుండి సూపర్ హిట్ స్థాయికి పయనిస్తుంది దేనికైనా రెడీ..!
ఆ విధంగా ఓ వివాదం పవన్ సినిమాను ముంచేస్తే... మరో వివాదం హిట్ కోసం పరితపిస్తున్న విష్ణుకు మర్చిపోలేని విజయాన్ని అందించింది. కొంత పంతానికి పోయినప్పటికీ సినిమా మీద నమ్మకంతో విష్ణు కుటుంబం ధైర్యం ప్రదర్సించటమే సినిమా విజయానికి దోహదపడింది అని కొందరు అంటున్నారు. అలానే ఆటువంటి చొరవను పవన్ కళ్యాణ్ దర్శించకపోవటమే కాకుండా సినిమాతో తనకు సంబంధంలేదు అన్నట్టు స్థబ్దుగా ఉండటం కూడా సినిమా పరాజయం కావటానికి కారణం అయ్యింది అని కొన్నివిమర్శలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా తెలుగు సినిమా దర్శక నిర్మాతలు మాత్రం ఈ రెండు వివాదాల అనుభవం దృష్ట్యా ఇక నుండి సున్నితమైన అంశాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది.
Saturday, November 3, 2012
మహాజనానికి మరదలు పిల్లగా శ్రేయ
హీరోయిన్ అనిపించుకోవాలంటే ఎదో ఒక సినిమాలో హీరో పక్కన కనిపిస్తే చాలు హీరోయిన్ అనే అంటారు. కాని నటి అనిపించుకోవాలంటే మాత్రం మంచి కధ , మంచి పాత్ర ఇలా చాలా విషయాలు కలసి రావాలి. గృహిణి, ప్రియురాలు వంటి రొటీన్ పాత్రలు కాకుండా భిన్నామైన పాత్రలలో రాణించగలిగినప్పుడే నటిగా ప్రత్యేకమైన గుర్తింపు సంపాయించుకోగలుగుతారు. అలాంటి బిన్నమైన పాత్రలలో మహాజనానికి మరదలు పిల్ల అంటే వ్యభిచారి పాత్ర కూడా ఒకటి.
కన్యాశుల్కం లో మధురవాణి గా మహానటి సావిత్రి నట చాతుర్యాన్ని ఎంత పొగిడినా తక్కువే...! ఆ తరవాత జయసుధ, మాధవి వంటి వారు ఆ పాత్రను ఏంతో వైవిద్యంగా పోషించి పేరు గడించారు. 1990 వరకు సామజిక అంశాలను స్పృశించే దర్శకులు వ్యభిచారి పాత్రకు కొంత ప్రాధాన్యత ఇచ్చారు. కాని 1993 లో సిల్క్ స్మిత 'బావలు సైయ్యా ..!' అంటూ చేసిన హడావిడి తరవాత ఆ పాత్ర ఐటెం పాటలకు, విలన్ పక్కన వాంప్ గా మాత్రమే ఎక్కువగా కనిపించటం మొదలు పెట్టింది. 90 ల తరవాత పేరున్న నటిమణులు వ్యభిచారిగా నటించిన దాఖలాలు గుర్తుంచుకునేట్టు లేవు. మళ్ళి 2010 లో వేదం చిత్రంలో అనుష్క వేశ్యగా నటించి తెలుగు, తమిళల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. దాంతో ఇప్పుడు ఆ పాత్రకు కొంత ప్రాముఖ్యం ఏర్పడింది.
ఫామ్ లో ఉన్నప్పుడు గ్లామర్ తో నెట్టు కొచ్చిన హీరోయిన్ లు అది కాస్త తగ్గగానే నటిగా నిరూపించుకునే అవకాశాలను వెతుక్కుంటూ వెళ్తున్నారు. అనుష్కను చూసి ఛార్మి మొదలు పెడితే ఇక ఇప్పుడు శ్రేయ వంతు..! ఆ మద్య ఓ బెంగాలీ చిత్రంలో వేశ్యగా దిగంబరంగా నటించటానికి ఒప్పుకుంది అని ప్రచారం జరిగిందిగాని... దానికి సంబందించిన ప్రోగ్రెస్ ఏమిటో ఇప్పుడు తెలియకుంది. అదలా ఉంచితే ఓ తెలుగు సినిమాలో శ్రేయ వ్యభిచారిగా నటించటానికి పూనుకుంది అని, సినిమాకు 'పవిత్ర' అని పేరు పెట్టారని ఫిలింనగర్ లో గుసగుసలు వినపడుతున్నాయి. రచయతగా లాంగ్ ఇన్నింగ్స్ ఆడుతూ ఈ మధ్యే దర్శకుడిగా అవతారం ఎత్తిన జనార్ధన మహర్షి ఈ సినిమాను రుపొందిస్తున్నాడని తెలుస్తుంది.
ఈ సినిమా ఒక టాప్ రేటెడ్ హై క్లాసు వేశ్య జీవిత కధ అని, అందులో అసభ్యతకు తావుండదని పూర్తీ కళాత్మకంగా తెరకేక్కిస్తారని భోగట్టా...! ఇంటర్నెట్ లో హాట్ ఫొటోలతో జనాలకి పిచ్చెక్కిస్తున్న శ్రేయ అంతే బోల్డ్ గా ఈ సినిమాలో కనిపించాలని ఆమె అందాలను అభిమానించే ఆరాధకులు ఆశపడుతున్నారు. అలానే ఈ సినిమా రూమర్స్ లో పూట్టి గాలిలో కలిసిపోకుండా వెండితెర మీద విందు కావాలని మొక్కులు మొక్కుతున్నారు. ఇక ఏమి జరుగుతుంది అనేది కాలమే నిర్ణయించాలి...!
దర్శకుడు క్రిష్ కు పొంచి ఉన్న ముప్పు
మనసు స్పందించే చిత్రాలతో మంచి దర్శకుడిగా పేరుతెచ్చుకున్న క్రిష్ ఇప్పుడు ఒక సక్సెస్ ఫుల్ దర్శకుడిగా పరిశ్రమలో పాతుకుపోవటానికి 'కృష్ణం వందే జగద్గురుం' తో పక్కగా ప్లాన్ చేసుకున్నట్టు తెలుస్తుంది. ఇప్పటివరకు చేసిన సినిమాలకు ప్రశంశాలేకాని పైసలు దక్కించుకోలేక పోయిన క్రిష్ ఈ సినిమాతో ఒక కమర్షియల్ బ్లాక్ బాస్టర్ ఇచ్చి టాలీవుడ్ స్టార్ హీరోలా కలల దర్శకుడిగా మారిపోవాలని డ్రీమ్స్ వేసుకుంటున్నాడు. ఒక వైపు సొంత స్వప్న సౌధాలు నిర్మించుకుంటూనే ఇది రానా కు స్టార్ గా లాంచ్ పాడ్ చిత్రం అని ప్రచారం చేస్తున్నాడు.
దేవుడంటే సాయం, కళ అంటే నోద్రలేపేది వంటి డైలాగులు, మైనింగ్ మాఫియా ఆధారంగా రూపొందిన కధ వంటి విషయాలు కొంత ఆసక్తి కలిగిస్తున్నప్పటికి ఈ విషయాలను జనాలలోకి తీసుకెళ్ళటానికి అవసరమైన వినుత్నమైన ప్రచార లోపం కారణంగా ఈ సినిమా రిలీజ్ కు కావల్సినంత మైలేజ్ దక్కినట్టు కనిపించటంలేదు. ఈ పరిస్థితుల మధ్యే ఈ సినిమా వచ్చే వారం విడుదల కానుంది. రానా గత చిత్రాల వైఫల్యాలు , క్రిష్ కమర్షియల్ దర్శకుడిగా ప్రూవ్ చేసుకోపోవటం కారణంగా ఈ సినిమా మీద వ్యాపార వర్గాలు కూడా పెద్దగా ఆసక్తి చూపిస్తున్నట్టు కనిపించటం లేదు. ఎవరికీ ఆసక్తి ఉన్న లేక పోయిన రానా వెనుక ఉన్న సురేష్ ప్రొడక్షన్స్ దన్నుతో సినిమా విడుదలకు ఎటువంటి డోకా ఉండదు. అంతవరకూ బానే ఉందికాని ఆ తరవాతే సినిమా సక్సెస్ కు కనపడని అపాయంగా తమిళ డబ్బింగ్ తుపాకీ 'కృష్ణం వందే జగద్గురుం' మెడ మీద కత్తిలా వెళ్లాడుతుంది.
పోటిలకు,పంతాలకు పోకుండా వంతులు వారిగా సినిమాలు విడుదల చేసి జయాపజయాలతో సంబంధం లేకుండా ప్రారంభ వసూళ్లతో సినిమాలను గట్టేక్కించుకుంటున్నారు ఇప్పటి అగ్రనిర్మాతలు.ఈ విషయంగా కెవిజె (KVJ) విషయంలో అంత సవ్యంగా జరిగే సూచనలు ఉన్నప్పటికీ... తుపాకీ రూపంలో కొంత అవరోధం కనపడుతుంది. ఎందుకంటే తమిళ సూపర్ స్టార్ విజయ్ కు ఇక్కడ మార్కెట్ లేకపోయినప్పటికీ తుపాకీ సినిమాకు మురుగదాస్ దర్శకుడు అవటంతో కొద్దిగా ఆలోచించవలసిన పరిస్థితి వచ్చింది. గజినీ ముందు వరకు సూర్యకు కూడా తెలుగులో పెద్ద పాపులారిటీ లేదు. కాని ఇప్పుడెంట్రా అంటే తెలుగులో కూడా ఓ మాదిరి స్టార్ హీరో అయి కూర్చున్నాడు. అదే ద్యాసలో ఉన్న విజయ్ కు ఈ సినిమా చాలా కీలకమైనది. మురుగదాస్ మ్యాజిక్ ఫలించి సినిమా హిట్ టాక్ తెచ్చుకుంటే ఆ ప్రభావం ఏంతో కొంత కెవిజె(KVJ) ఫై ఉంటుంది అన్నా విషయాన్నీ ఎంత కాదనుకున్న కొట్టిపారేయాలెం ..!
ఇలా దేనికదే ప్రాముఖ్యతను సంపాయించుకున్నఈ రెండు సినిమాలు నవంబర్ 9న విడుదల అవుతున్నాయి. రెండు చిత్రాలు బాగుంటే తెలుగు ప్రేక్షకులకు ఈ దీపావళి డబుల్ దమక అవుతుంది. అలా కాకుండా తుపాకీ పరాజయం పాలైతే పెద్దగా పట్టించుకోరు... కాని కృష్ణం వందే జగద్గురుం కనుక అటు ఎటు అయ్యిందో.. ఆశాభంగం తప్పదు .
Thursday, November 1, 2012
Srikanth Lucky Movie Review
శ్రీకాంత్ శత చిత్రాల హీరోగా పేరునైతే సంపాయించుకున్నాడు కాని అ ఘనతకు తగ్గ రేంజ్ లో హిట్లు లేక కొంత సతమతమవుతున్నాడు. సహాయ నటుడిగా నెట్టుకొస్తున్నాడు కాని సోలో హీరోగా మాత్రం పూర్తిగా చతికిల పడిపోయాడు. హీరోగా వరస డిజాస్టర్స్ ఇస్తున్నా శ్రీకాంత్ 'లక్కీ' తో అన్నా తన లక్ మారుతుందేమో పరిక్షించుకోవటానికి ఈ వారం ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
మల్టిప్లెక్స్ లు బలపడేప్పటికి హీరోగా వెనుక పడ్డ శ్రీకాంత్ ఇప్పటికి బి, సి సెంటర్లను నమ్ముకునే సినిమాలు తీస్తున్నాడు. ఈ సినిమా విడుదలను చూస్తే ఆ విషయం స్పష్టంగా అర్ధం అవుతుంది. రోజుల గేమ్ నుండి అధిక దియేటర్ల గేమ్ గా మారిన సినిమా వ్యాపారంలో ఈ లక్కీ తన ఉనికిని చాటుకోవటానికి ఓ వారం మాత్రమే ఉంది. ఎందుకంటే వచ్చే వారం కృష్ణం వందే జగద్గురుమ్ దియేటర్ల ఫై కి దండెత్తనుంది. సో... పరిమిత దియేటర్లలో 20 20 మొదలు పెట్టిన 'లక్కీ ' భవితవ్యం ఏమిటో మన సమీక్షలో చూద్దాం.
కధ :
లక్ష్మి నారాయణ అలియాస్ లక్కీ (శ్రీకాంత్) ఆడవాళ్ళ వ్యతిరేకి. ప్రపంచంలో ఉన్న భాదలకు, కష్టాలకు, నష్టాలకు ప్రధాన కారణం ఆడదే అని గాడంగా నమ్ముతూ ఉంటాడు. చివరికి తన భార్య, తల్లి, చెల్లీ, నానమ్మ కూడా ఆ లిస్టు లో ఉంటారు. అలా ఆడవాళ్ళ మీద ఎంత కోపం ఉన్నప్పటికీ వాళ్ళతోనే కలిసి జీవించాలని తెలుసుకుని రాజిపడి నిర్లిప్తంగా జీవితాన్ని గడిపేస్తూ ఉంటాడు. అలా రొటీన్ గా సాగిపోతున్న లక్కీ జీవితంలో రాజరాజేశ్వరి అమ్మ వారి మూలంగా ఓ అద్భుతం జరుగుతుంది.
అదేమంటే.. ఆడవాళ్లు మనసులో అనుకునేవి లక్కీ కి వినపడుతూ ఉంటాయి. దాంతో మొదట తత్తర పడతాడు తరవాత బోల్డంత ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఆ ఫై ఓ మానసిక వైద్యురాలి సహాయంతో అది తనకు దక్కిన వరం అని తెలుసుకుంటాడు. అప్పటివరుకు ఆడవాళ్ళను అసహ్యించుకున్న లక్కీ వారిని అర్ధం చేసుకునే ప్రయత్నం చేస్తాడు. దానిని ఆసరాగా చేసుకుని మంచి పనులు చేయటం మొదలు పెడతాడు. అలా మొదలైన ఆ పయనం లక్కీ ని ఏ తీరం చేర్చింది అన్నది మిగిలిన కధ.
విశ్లేషణ:
అవతలి వారి మనసులో మాటలు వినగలగటం అనే పాయింట్ ఇంతకు ముందు కొన్ని సినిమాల్లో చూసి ఉన్నాం. కాని ఈ లక్కీ లో హీరో ఆడవారి మనసును మాత్రమే వినగలుగుతాడు అని బేస్ చేసుకుని ప్రయత్నం చేశారు కాని సినిమాను ఆసక్తిగా చూపి రక్తికట్టించలేకపోయారు . పాయింట్ లో ఉన్న వైవిద్యంతో ఎన్నో అద్భుతాలు తెరమీద ఆవిష్కరించటానికి అవకాశం ఉంది. కాకపోతే పరిమిత బడ్జెట్ , పరిదిదాటని ఆలోచనలు లక్కీ ని అతి సాదారణ చిత్రంగా మర్చి వేశాయి .
సినిమాలో హీరో తనకు దక్కినది శాపం కాదు ఓ వరం అని రిలైజ్ అయినప్పుడు వచ్చే పాట మాత్రమే కొంత ఫ్రెష్ గా అనిపిస్తుంది. అది మినహా సినిమా మొత్తం స్టేజిషోలా అనిపిస్తుంది. అలానే ఇంతకు ముందెప్పుడో... వాడి పారేసిన కామెడీ బిట్స్ తో హాస్యం పండించాలని ప్రయత్నించి విఫలం అయ్యారు. సెంటిమెంట్ విషయంలో కూడా సినిమాటిక్ భావిద్వేగాల కంటే టివి సిరియల్ ఎపిసోడ్స్ నే ఎక్కువ తలపించాయి. మొత్తంగా ఈ సినిమా గురించి చెప్పాలంటే టివి సిరియల్ కు ఎక్కువ సినిమాకు తక్కువ అని చెప్పవచ్చు.
దర్శకుడు హారి ఓ పది పదిహేను సంవత్సరాల క్రితం తయారుచేసుకుని ఉంటాడు ఈ కధను ....! ఆ తరవాత ఎన్నో మార్పులు వచ్చేశాయి. కాని దర్శకుడు ఇప్పటి పరిస్థితులకు తగ్గట్టు ఫ్రెష్ వెర్షన్ వ్రాసుకోకుండా అప్పటి వెర్షన్ కే అతుక్కు పోయినట్టు ఉన్నాడు. దాంతో పది సంవత్సరాల క్రితం నాటి పరిస్థితుల మద్య ఇప్పటి మనుషులు గడుపుతున్నట్టుంటుంది సినిమాలో...!. అలా అని హరి లో టాలెంట్ లేదని కాదు ఓ రెండు మూడు సన్నివేశాలను మాత్రం చాల బాగా వర్క్ అవుట్ చేశాడు. ఇంటర్వెల్ ముందు వచ్చే ఎపిసోడ్ , హీరో రిలైజ్ అయినప్పుడు వచ్చే పాట దర్శకుడిగా అతని ప్రతిభకు కొలమానాలు. సగం ఉడికిన కధను సినిమాగా మలచటం అతను చేసిన పెద్ద తప్పు. కాకపోతే ఈ తప్పును సరిదిద్డుకునే అవకాశం అతనికి మళ్ళి దక్కుతుందో లేదో వేచి చూడాలి.
సాయి కార్తీక్ పాటలు సో ..సో.గా ఉన్నాయి. సినిమాటోగ్రాఫర్ గా పరవాలేదనిపించిన శ్రీనివాస రెడ్డి నిర్మాతగా మాత్రం విపరీతమైన పరిమితులు విధించి సినిమాలో గ్రాండియార్ అనేదే లేకుండా చేశారు. ఎదో కొద్ది మంది పేరున్నా ఆర్టిస్టుల కోసం తప్పించి మరే విషయంగాను అసలు ఖర్చు పెట్టినట్టే లేదు. చివరకు అరకును కూడా హైదరాబాద్ లోనే చూపించి జనాలని తరింప చేశారు. ఇక మిగత విభాగాలు పిండి కొద్ది రొట్టే అన్నా చందంగా మోతాదు ప్రకారం వాటి ప్రతిభను ప్రదర్శించాయి.
శ్రీకాంత్ బాగున్నాడు, చాలా బాగా నటించాడు కూడా..! వంద చిత్రలా ముందు కంటే ఆ తరవాత శ్రీకాంత్ నటనలో పరిణితి కనపడుతుంది. అలానే ఈ సినిమాలో లక్కీ పాత్రకు 100% న్యాయం చేశాడు . ఒక రకంగా ఇది శ్రీకాంత్ ఒన్ మాన్ షో. సినిమాను తన భుజలకేత్తుకుని నడిపించాడు.. కాని విషయం లేని కధను ఎంత మోస్తే మాత్రం ఏంటి ఫలితం..! హీరోయిన్ మేఘనకు నటించటానికి అవకాశం తక్కువ ఉన్నా పరవాలేదనిపించింది. రోజా ఆకట్టుకుంటుంది. బ్రమ్మి కామెడీ రొటీన్ గాను, రోతగాను అనిపిస్తుంది. ఎ వి యస్ , సన సహా మిగత నటులు వారి పాత్రాలకనుగుణంగా బాగానే నటించారు.
ప్లస్ పాయింట్స్:
శ్రీ కాంత్ నటన , ఓ రెండు సన్నివేశాలు
మైనస్ పాయింట్స్ :
ఆసక్తికరమే అయినప్పటికీ రొటీన్ కధ , అవసరం ఉన్నప్పటికీ ఆకట్టుకోలేని బోరింగ్ కధనం , చెత్త కామెడీ ప్రధానంగా ఈ సినిమాకు శత్రువులు.
కొసమెరుపు:
ఇప్పటి పరిస్థితుల్లో సినిమా విజయం సాదించటానికి అవసరమైన చాలా అంశాలను ఈ సినిమా మిస్ కొట్టింది. ఈ పరిస్థితిని పరిగణలోకి తీసుకుని 'ఈ లక్కీ సినిమా కూడా శ్రీకాంత్ లక్ ను వెక్కిరించింది అని నిర్ధారించవచ్చు.
మారుతీ టాకీస్ రేటింగ్ : 5 కి 2
'Dalam' Doing Some Promises
తోలి చూపులోనే ప్రేమ గురించి .... విని ఉంటాం... చూసి ఉంటాం..! 'దళం' ట్రైలర్ చూసిన తరవాత సినిమాలను ప్రేమించేవాడికి ఎవడికైనా అదే ఫెల్లింగ్ కలుగుతుంది ఇది నిజం. పేరు విని మాములు సినిమా ఏమో అనుకున్న వాళ్ళు కూడా ట్రైలర్ చూసి షాక్ అవుతారు. ఎక్కువ చెబుతున్నాను... అనిపిస్తే కింద ఉన్నా ట్రైలర్ చూడండి మీకే అర్ధం అవుతుంది.
దళం అని పేరు విని అందరు ఊహించుకునెట్టే ఇది... అన్నాల సినిమానే. ఓ మాజీ నక్సలైట్ల దళం జనజీవ స్రవంతిలో చేసే జీవన పోరాటంలా కనిపిస్తుంది. అలానే అందులోనే ఓ అందమైన ప్రేమ కధను చొప్పించినట్టు అర్ధంఅవుతుంది. అందాల రాక్షసి ఫేం నవీన్, రంగం ఫేం పియ బాజ్ పయ్, కిశోర్ , అభిమన్యు సింగ్ లతో సినిమాకు కట్టిన తార తోరణం ముచ్చటగానే ఉంది.
వీటిని పక్కన పెట్టి సినిమాలోని సాంకేతికత విషయానికి వస్తే అందులో ఉన్నఅసలు మ్యాజిక్ తెలుస్తుంది. ట్రైలర్ స్టార్టింగ్ లో విజిల్ తో చేసే హమ్మింగ్ ఊహించని విధంగా ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. ఆ తరవాత మొదలయ్యే డ్రమ్స్ బీట్ తో సినిమాలోని సీరియస్ నెస్ ను జేమ్స్ వసంతన్ ఎంతో అందంగా తెలియజేశాడు. లొకేషన్స్ , కధ వస్తువును తెలియచేసేలా ఉన్న వాతావరణం, వాటిని ఏంతో వైవిద్యంగా కెమెరా లో బందించిన సుధాకర్ ఎక్కంటి పనితనం, మధు చక్కటి కూర్పు వీటన్నిటిని అద్భుతంగా ఉపయోగించుకున్న నూతన దర్శకుడు జీవన్ రెడ్డి ప్రతిభ సినిమా మీద బోల్డన్ని ప్రోమిస్లు నెలకొల్పుతుంది. మరి ఆ ప్రామిస్లను ఈ దళం నిలుపుకుంటుందో... నీరుగారుస్తుందో... వేచి చూడాలి.
Nani Marriage Photos
ఘంటా నవీన్ అలియాస్ నాని వివాహం అక్టోబర్ నెల 27 వ తేదినా బందు మిత్రుల సమక్షంలో వైభవంగా జరిగింది. పండితులు నిర్ణయించిన శుభముహుర్తాన అంజనా ఎలవర్తి మెడలో మూడుముళ్ళు వేసి తనలో సగ భాగాన్ని నూరేళ్ళ పాటు ఆమెకు వీలు వ్రాసి ఇచ్చేశాడు కుర్ర హీరో.
ప్రచారాన్ని, మీడియానూ దూరంగా పెట్టడంతో పెళ్ళికి సంబందించిన మంచి క్వాలిటీ ఫోటోలు బయటకు రావటానికి కొంత టైం పట్టింది. దొరికినవి కొన్నే అయినప్పటికీ చూడటానికి బాగున్నాయి ఆస్వాదించండి... నూతన జంటను మనస్పూర్తిగా ఆశీర్వదించండి.
Subscribe to:
Comments (Atom)




























