Pages

Ads 468x60px

Text Widget

Recent Posts

Definition List

Download

Thursday, January 31, 2013

ఛార్మి కూడా 'రమ్' కొడుతుంది


మొత్తానికి చార్మి కూడా 'రమ్ 'కొడుతుంది. స్టార్ నిర్మతగా ఒక వెలుగు వెలిగి.. దర్శకుడిగా గజినీ ప్రయత్నాలు చేస్తున్న యం యస్ రాజు  తనలాగే ఫేమ్ అవుట్ ప్రమాదపుటంచుల్లో కొట్టుమిట్టాడుతున్నా తన పాత హీరోయిన్ లందరినీ ఒకచోటికి చేర్చి 'రమ్' తో మందు పార్టి ఏర్పాటు చేశాడు.  ముందు నుండి వినపడకపోయిన ఈ పార్టీలో సడెన్ గా స్థానం సంపాయించుకుంది ఛార్మి. 

Wednesday, January 30, 2013

కామెడీ బాయ్ టూ ప్లే బాయ్


కామెడీ బాయ్ గా మొదలు పెట్టి హీరోగా మారి కండల వీరుడిగా అవతారం ఎత్తిన సునీల్ ఇప్పుడు ప్లే బాయ్ అనిపించుకునే పనిలోపడ్డాడు. సినిమా సినిమాకి ఒక కొత్త విషయాన్నీ తనలో సృష్టించుకుంటూ పూర్తీ స్థాయి హీరోగా మారటానికి అంచలంచలా పరిణామా క్రమాన్ని కొనసాగిస్తున్నా సునీల్... మిస్టర్ పెళ్ళికొడుకు చిత్రంలో తనలో ఉన్న ప్లే బాయ్ లక్షణాలను ప్రదర్శించి లేడి ఫ్యాన్ బేస్ ను పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాడు.

లేటుగా మేల్కొన్నా మహేష్


సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఇచ్చిన కిక్ నుండి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాడు మహేష్. సినిమా తోలి వారం వసూళ్ళు ముఖ్యంగా అమెరిక కలక్షన్లు చూసి.. చేసిన సాహసం సఫలం అయ్యిందని సంతోషపడి ఆనందపారవశ్యంలో మునిగితేలుతున్నా మహేష్ రెండో వారం ముగియగానే.. వాస్తవాన్ని గ్రహించి ఒక్కసారే మేల్కొని సీతమ్మను ఒడ్దేక్కించే పనిలో పడ్డాడు. 

షాడో దర్శకుడి ట్రెండ్ సెట్టింగ్ కల..!


'కలలు కనండి.. వాటిని నిజం చేసుకోండి' అన్నారు అబ్దుల్ కలం. కానీ తీరని కలలు కని వాటి కోసం వృదా ప్రయాస పడటం తెలివిగల వాడి లక్షణం అనిపించుకోదు. అలాంటి తీరని కలలతోనే కష్టపడుతూ  తమ తెలివితేటలను నిరుపించుకోవాలనుకునే వారి  ఉదంతాలకు ఎవర్  గ్రీన్ ఉదాహరణ ఈ షాడో చిత్ర దర్శకుడు.

Monday, January 28, 2013

సమంతాతో చీప్ ట్రిక్


పెద్ద పెద్ద స్టార్లు, క్రేజీ కాంబినేషన్లు వగైరా వగైరాలు ఉన్నప్పటికీ ప్రచారానికి ఉపయోగపడుతుంది అనుకుంటే అది ఎంత చిన్న పోరపాటైనా అప్పనంగా వాడుకోవటం సినిమా వాళ్ళకు రివాజు. అలాంటి ఓ చీప్ ట్రిక్ కు తెలిసో.. తెలియకో సమంతా కారణమైంది.

జబర్దస్త్ నాటుగాడిగా సిద్దార్ధ


పరబాషపరుడైనా లవర్ బాయ్ గా తెలుగు ప్రేక్షకుల ఆమోదం పొంది టాలీవుడ్ లో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరుచుకున్నా తమిళ తంబి సిద్దార్ధ, మాస్ హీరో అనిపించుకోవాలని ఒకటిరెండు ప్రయత్నాలు చేశాడుకాని సఫలం కాలేదు. తన బాడీ లాంగ్వేజ్ కు అవారా, పోకిరి, ఇడియట్ వంటి లక్షణాలు తెచ్చిపెట్టుకున్నట్టు ఉంటాయి కాబట్టి ఒకే మాటా ఫై నిలబడి తెలుగు ఆడియన్స్ సిద్ధూను మాస్ హీరోగా తిరస్కరించారు. దాంతో సిద్దు కూడా లైట్ తీసుకుని రొమాంటిక్ సినిమాలే చేసుకుంటూ వస్తున్నాడు. కానీ ఇప్పుడు నందిని రెడ్డి పుణ్యమా అని మాస్ హీరో అనిపించుకునే అవకాశం సిద్దార్థ కు మళ్లీ వచ్చినట్టు కనిపిస్తుంది.

Sunday, January 27, 2013

Vishwaroopam Movie Review


చారిత్రాత్మక మార్పు కోసం ప్రయత్నించి.. వివాదాల విశ్వరూపాలను చవి చూసి... కాలం,మనుషులు కలిసి కల్పించిన విఘ్నాలను దాటుకుని మొత్తానికి ఈ వారం బయటకు వచ్చింది కమల్ హసన్ 'విశ్వరూపం'. 

Saturday, January 26, 2013

ఆ పాపం ఛార్మిదే..!


నాయక్ లో కనిపించి పేరు ఏమో కాని పాపం మూటగట్టుకుంది... తెలుగమ్మాయి అనిపించుకోవాలని తాపత్రేయపడే పంజాబీ బొద్దు బేబి ఛార్మి. సినిమాల్లో అవకాశాలు ఎప్పుడు అదృష్టన్నేకాదు కొన్ని కొన్ని సార్లు అపవాదులను  కూడా మీద పడేస్తాయి. టాలీవుడ్ లో నాగార్జున మినహా మరే పెద్ద హీరోకు  ఛార్మి టాలెంట్ అక్కరకు రాకుండా పోయిన తరుణంలో నాయక్ సినిమాలో మెరిసే అవకాశం రావటంతో  చార్మి కష్టం లేకుండానే ఎవరెస్ట్ శిఖరం ఎక్కికుర్చుంది. ఈ విషయాన్నీ పట్టుకుని విడుదలకు ముందు నిర్మాతలు కూడా చేయనంత పబ్లిసిటీ నాయక్ సినిమా కోసం చేసి పెట్టింది ఛార్మి. కాని విడుదల తరవాత నాయక్ గురించి కనీసం మాట్లాడాటానికి కూడా పెద్దగా ఆసక్తి చూపించపోవటానికి సహేతుకమైన కారణమే కనిపిస్తుంది.

గ్రీకువీరుడిగా మురిపిస్తున్నా నాగార్జున

 నిన్నే పెళ్ళాడుతా..! రోజులను వెనక్కు తెచ్చుకుని కెరీర్ ను మరింత 'సంతోషం'గా ఎంజాయ్ చేయటానికి 'గ్రీకువీరుడు' చిత్రంతో ప్లాన్ చేసుకుంటున్నాడు కింగ్ నాగార్జున. ఆంధ్రులా మన్మధుడిగా తెలుగు వెండి తెరఫై తీరుగులేని ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నా నాగ్ 'మన్మధుడు' తరవాత ఆ రేంజ్ క్లాస్ హిట్ ఇచ్చిందే లేదు. ఇప్పుడు ఆ కొరతను తీర్చుకోవటానికి నయనతారను జోడిగా చేసుకుని, సంతోషం దర్శకుడు దశరధ్ ను వెంట పెట్టుకుని ఈ గ్రీకువీరుడు రేపు రాబోయే వేసవికి బాక్స్ ఆఫీసు ఫై దండయాత్ర చేయనున్నాడు.

రవితేజకు బలుపు ఎక్కువ


ఎవడన్నా శృతి  మించి ప్రవర్తిస్తుంటే.. నీకు బాగా బలిసింది రా ..! అని వార్నింగ్ ఇస్తాం . కాని తిట్లను కూడా పొగడ్తలుగా మార్చేసి జనలా మీదకు విసిరేస్తున్నా మన తెలుగు సినిమా హీరోలు మాత్రం వారి బలుపును వాళ్ళే ప్రకటించుకుంటారు, అది ఎవరు పెట్టకపోయిన మనోళ్ళు తూచా తప్పకుండా ఫాలో అయ్యే రూలూ...! ఇడియట్ తో తిట్ల టైటిల్ సినిమాలకు ఆధ్యుడుగా పేరుగడించిన ఈ మాస్ మహారాజా ఇప్పుడు బూతులకు ఫేమ్ తెచ్చేపనిలో పడ్డాడు.

Friday, January 25, 2013

విశ్వరూపం ఫై నిషేధం ఎంతవరకు సమంజసం..?


కమల్ హసన్ ఒక సినిమా చేశాడు అంటే.. అయన నట వైదుష్యాన్ని పొగడటానికి ఎన్నో గొంతులు వరసలు కడతాయి. కాని అయన దర్శకత్వం వహిస్తే మాత్రం ప్రశంశించే స్వరాలూ పక్కకు వెళ్లి విమర్శించే గళాలు పెట్రేగిపోతాయి. గతంలో అయన నిర్దేశకత్వంలో వచ్చిన 'హే రామ్' 'పోతురాజు చెప్పినట్టు' చిత్రాలు కూడా వివాదాల నిరసనలను దాటుకునే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇప్పుడు విశ్వరూపం కూడా అదే పరంపరను కొనసాగించటం కొంత ఆశ్చర్యపరచినప్పటికి.. తానూ చెప్పాలనుకున్నా విషయాన్నీ జంకులేకుండా చెప్పగలిగే సత్తా ఉన్నా కమల్ వ్యక్తిత్వంలోని రాజీలేని దృడత్వానికి ఈ సినిమా కూడా ప్రతీక కావటం అయనను ఇష్ట పడేవాళ్ళను ఒకింత గర్వపడేలా చేస్తుంది.

Thursday, January 24, 2013

పల్నాటి వీరుడిగా ప్రభాస్


బాహుబలి అనే పేరుతొ రాజమౌళి దర్శకత్వాన సమరయోధుడిగా అలరించటానికి సిద్దం అవుతున్నా యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ అంతకంటే ముందు పల్నాటి వీరుడిగా తెలుగు ప్రేక్షకులను పలకరించనున్నాడు. ఇంతవరకు యాక్షన్ బ్యాక్ డ్రాపే కాని ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ ను పెద్దగా పట్టించుకోని ఈ కుర్ర రెబెల్ తొలిసారి తన అభిమానులకు పల్నాటి పౌరుషాన్ని రుచి చూపించనున్నాడు. 

Wednesday, January 23, 2013

అక్కినేని వంశంలో తోలి విలన్


అక్కినేని వంశ చరిత్రలో మరో సంచలనానికి అవకాశం వచ్చింది. ఇప్పటివరకు హీరోలుగాను, సహాయనటులుగాను , మహా అయితే అతిది నటులుగాను సినిమాలలో కనిపించిన ఆ వంశీయుల నుండి తొలిసారి ఒక ప్రతినాయకుడు ఉద్భవించనున్నాడు. తెలుగు సినీ ప్రపంచానికి అపరిమిత సేవ చేస్తున్నా అక్కినేని వంశ కీర్తి కిరీటంలో ఈ కలికితు రాయిని చేర్చటానికి పూనుకుంది మరెవరో కాదు అక్కినేని వారి గారాల మేనల్లుడు సుమంత్ బాబు.

నన్ను చూసి చెడిపోవద్దంటున్నా రామ్


స్క్రీన్ ఫై అలుపెరగని హుషారు తో కనిపించే కుర్ర హీరో రామ్ కు మాత్రమే సొంతమైన కొలతలకందని ఎనర్జీ ఇప్పుడు టాక్ అఫ్ ది ఇండస్ట్రీ...! పొగరు, రోషం, అహంకారం వంటి విటమిన్స్ ఎంత ఎక్కువగా ఉంటే ఎనర్జీ అంత  ఎక్కువగా ఉంటుందనేది ఒక నానుడు. దేవదాసు సినిమాలోనూ.. తరవాత అటువంటి లక్షణాలు  కొన్ని రామ్ కనిపించాయి కూడా. కాని 'రెడీ' ఘన విజయం.. హీరోగా నిలబడాలంటే కావాల్సిన క్వాలిటిస్ ను అనుభవపూర్వకంగా అబ్బాయిగారికి నేర్పించినట్టుంది. ఫలితం పొగరు వగైరాలతో కూడిన ఎనర్జిని స్కీన్ వరుకే పరిమితం చేసి సహనం సహా మంచి లక్షణాలను రియల్ లైఫ్ లో అలవాటు చేసుకుని బాలన్సుడ్ గా కెరీర్ ను ముందుకురికిస్తున్నాడు ఈ చిచ్చర పిడుగు. 

సొంతగూటికి చేరిన DSP



ఎట్టకేలకు పంతాలు పక్కకెళ్ళి సంగీతరాక్షసుడు దేవి శ్రీ ప్రసాద్ తన సొంతగూటికి చేరుకున్నాడు. వివరాలలోకి వెళితే.. పిల్లాడిగా ఉన్నప్పుడే సంగీతం ఫై ప్రయోగాలూ చేస్తున్నా దేవి టాలెంట్ ను గుర్తించి సంగీత దర్శకుడిగా పిలిచిమరి అవకాశం ఇచ్చాడు ఒకప్పటి స్టార్ నిర్మాత యం యస్ రాజు. మొదటి సినిమా పేరునే తనపేరు ముందు పెట్టుకుని 'దేవి శ్రీ ప్రసాద్ అయ్యాడన్న సంగతి మనందరికీ తెలిసిందే..! మొదటి చాన్సే కాదు.. ఆనందం ఇచ్చిన గుర్తింపు తరవాత మంచి బ్రేక్ కోసం చూస్తున్న దేవికి 'వర్షం' చిత్రానికి పనిచేసే అవకాశం కల్పించి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ను చేసింది కూడా రాజు గారే..! 

Tuesday, January 22, 2013

శ్రేయ గురించి అపవిత్రంగా ఆలోచించవద్దు



అందాల నటి శ్రేయ తీరు, తెన్నూ.. వంపు,సోంపు ఇవన్నీ చూసి కుర్ర మనసున్నా ప్రతిఒక్కరు ఏం  ఊహిస్తారో.. ఏం  ఆశిస్తారో... ప్రత్యేకంగా చెప్పుకోనవసరంలేదు. అందులోను ఈ మద్య అవకాశాలు తగ్గేప్పటికి.. బూతుపాటలకు, ఎంగిలి ముద్దులకు సై  అంటున్న అమ్మడి మీద ఎవరికైనా ఎటువంటి అభిప్రాయం ఉంటుందో చెప్పండి..! ఆ కారణాల రిత్య శ్రేయ వేశ్యపాత్రలో నటిస్తుంది అంటే కుర్రాళ్ళు అందాల విందు చేసిందనుకుంటారు కాని కూర్చో పెట్టి మెసేజ్ లు దంచుతుందని ఊహిస్తారా....? 

Monday, January 21, 2013

అభిమానులను ఏడిపించిన మహేష్


 ఒక సినిమా సూపర్ హిట్ అనిపించుకున్న దానికంటే అందరి అభిమానాన్ని చూరగుని కల్తిలేని మెప్పును పొందుతున్నప్పుడు కలిగే ఆనందమే ఆ సినిమా రూపకర్తలకు ఎనలేని సంతృప్తినిస్తుంది. ఇప్పుడు ఆ మధురమైన అనుభూతిని మనస్పూర్తిగా ఆస్వాదిస్తున్నారు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు టీమ్. నిన్న సాయంకాలం శిల్పకళావేదికలో జరిగిన ఈ సినిమా  సరిగమల పండుగ సీతమ్మ కుటుంబ సభ్యుల ఆనందపరవశ్యాన్ని తెలుగు సినీ ప్రేమికులతో పంచుకునేందుకు వేదికగా మారింది. అందరికంటే సినిమాకు, అందులో తను చేసిన పాత్రకు దక్కుతున్నప్రశంశలు మహేష్ ను ఉద్విగ్నతకు పురికొల్పి కంట్రోల్ తప్పేలా చేశాయి. అదే నిన్నటి వేడుకకు ప్రత్యేకమైన ఆకర్షణ.

Saturday, January 19, 2013

అగమ్యగోచరం ఆటోనగర్ సూర్య


కింగ్ నాగార్జున నటప్రస్థానాన్ని మొదలు పెట్టిన తరవాత 89 వ చిత్రం వరకు ఎటువంటి అననుకూల పరిస్థితులు ఎదుర్కోలేదు. కాని చినబాబు చైతుకు మాత్రం 6 వ చిత్రానికే చేదు అనుభవం  ఎదురవటం ఒకింత అక్కినేని అభిమానులను నిరాశపరుస్తుంది.  సినిమా షూటింగ్ దశలో ఆగిపోవటమో ... లేక విడుదల విషయంలో గందరగోళం వంటి పొరపాట్లు  తాతగారి హయంలో జరిగుంటాయిగాని... నాన్నగారి జాగ్రత్త, ప్లానింగ్ కారణంగా డమరుకం వరకు ఎలాంటి ఇబ్బందులు కలగలేదు. కెరిర్ తోలి దశలోనే ఎదురైనా ఈ ఆటోనగర్ సూర్య (షూటింగ్  చివరి దశలో నిలిచిపోయిన)   అనుభవం చైతుకు భవిష్యత్తులో బాగా ఉపయోగపడుతుంది అని శ్రేయోభిలాషులు అభిప్రాయపడుతున్నారు. మరో పక్క  సమస్యకు సంబంధించి ఎవరి కోణంలో వాళ్ళు విశ్లేషణలు, వివరణలు ఇస్తున్నారు కాని సినిమా భవిష్యత్తు గురించి మాత్రం ఎవరు నోరు మెదపటం లేదు. 

నాయక్ ఠాగూరే అంటున్నాపోలిక..!


 నాయక్ సినిమా చూసిన తరవాత ఠాగూర్ సినిమాను వి వి వినాయక్  రూపొందించాడు అన్నా పెద్ద పోలిక మిహన మరే విషయం మనకు ఠాగూర్ ను జ్ఞప్తికితేదు. నిజంగా పోల్చాలి అనుకుంటే సింహాద్రి, కృష్ణ,శివాజీ (పోసాని చాక్లెట్ ఎపిసోడ్ శివాజీలో ఆఫీసు రూమ్ ను తలపిస్తుంది.) వగైరా చిత్రాలు గుర్తుకొస్తాయి కాని ఠాగూర్ ఎక్కడ తగిలినట్టు అనిపించదు. కాని చిత్రంగా నాయక్ రూపకర్తలు ఆ సినిమాను ఠాగూర్ తో పోలుస్తూ ఒక ట్రైలర్ బయటకు వదిలారు. పెద్దగా పట్టించుకోనవసరంలేని విషయాలను పోలుస్తూ ఆ ట్రైలర్ ను తక్కువ చేస్తున్నారు కాని అసలు పట్టించుకోవాల్సిన విషయాన్నీ గుర్తించటంలేదని  విచారం వ్యక్తం చేస్తున్నారు కొందరు మేధావులు.

Wednesday, January 16, 2013

దూకుడు లైన్లోనే బాద్ షా


మొత్తానికి స్టార్ డైరెక్టర్ శ్రీను వైట్ల తనకొచ్చిన బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ ను సెంటిమెంట్ గా మార్చేసుకున్నాడు. దూకుడు మేనియా నుండి ఇంకా తేరుకోలేదో ... కలిసొచ్చిందని నమ్మకమో కాని దూకుడు సినిమాను డిజైన్ చేసినట్టుగానే బాద్ షా ను తీర్చిదిద్దుతున్నాడు శ్రీను వైట్ల. అందుకు నిదర్శనం తాజాగా బయటను వచ్చిన బాద్ షా పోస్టర్.

Tuesday, January 15, 2013

బాద్ షా లో కొత్త NTR


రాఖి సినిమా తరవాత 'యమదొంగ' విడుదలవుతుందనగా బయటకు వచ్చిన ఫోటోలలో NTR రూపురేఖలను చూసి నందమూరి అభిమానులే కాదు.. యావత్ తెలుగు సినేమాలోకమే ఆశ్చర్యపోయింది. మళ్లీ ఇప్పుడు  యమదొంగంత కాకపోయినా రేపు వేసవికి రానున్నా 'బాద్ షా 'లో  కనపడే తన రూపురేఖలతో కొంత ఆసక్తిని కలిగిస్తున్నాడు NTR.

సునీల్ కు బ్రమ్మి చెక్


తెలుగు సినిమాలలో విలన్లుగా నటించి హీరోలుగా స్థిరపడినవాళ్లు ఉన్నారు. విలన్లుగా  మొదలై కమీడియన్ గా స్థిరపడినవాళ్లు ఉన్నారు. కాని కమీడియన్ గా పేరు తెచ్చుకుని హీరోగా రాణించినవాళ్ళు అతి తక్కువ. అలాంటిది హాస్యనటుడిగా ఉన్నా బేస్ ను ఉపయోగించుకుని హీరోగా దాదాపు స్థిరపడిపోయాడు మన భీమవరం బుల్లోడు సునీల్. పెద్ద పెద్ద హాస్యనటులుకే సాద్యపడనిది సునీల్ కి పట్టుబడటానికి కారణం అతని డాన్సు. ఈ విషయాన్నీ లేటుగానే గుర్తించినా లేటెస్ట్ గా కౌంటర్ ఇచ్చి సునీల్ కు చెక్ చెప్పాడు బ్రమ్మి. 

Saturday, January 12, 2013

Prabhas - Rajamouli Movie Titled 'Baahubali'


దర్శకమగధీరుడు  శ్రీశైల శ్రీ రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించ తలపెట్టిన కొత్త చిత్రానికి పేరు పెట్టారు. చారిత్రాత్మక నేపద్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి 'బాహుబలి' అని నామకరణం చేశారు. ఈ విషయాన్నీ రాజమౌళియే స్వయంగా తెలియజేయటం విశేషం.

Friday, January 11, 2013

SVSC Movie Review


రొటీన్ కధలతోను, రోడ్డకోట్టుడు కాంబినేషన్లతోను చావా చచ్చిపోయిన తెలుగు సినిమా గతిని, స్థితిని మార్చటానికి జరిగిన ప్రయత్నంగా తెలుగు సినిమా అభిమానులు భావిస్తున్నా 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'  సినీ ప్రియుల నీరాజనాలు అందుకోవటానికి సంక్రాంతి కానుకగా ఈ వారం దియేటర్లకు వచ్చింది. బహుకధానాయకుల చిత్రం అనగానే 'కధ  కుదరాలి.. అప్పుడు చూద్దాం ... ' అంటూ గత 25 సంవత్సరాలుగా తప్పించుకుని తిరుగుతున్నారు తెలుగు స్టార్ హీరోలు. ఆ ఒరవడికి పులిస్టాప్ పెడుతూ మహేష్, వెంకటేష్ తీసుకున్న నిర్ణయం అభినందనియ్యం.

Thursday, January 10, 2013

అల్లు వారబ్బాయి పరిగెత్తుకు వస్తున్నాడు


అల్లు వారబ్బాయి పరిగెత్తుకు వస్తున్నాడు... రెడీగా ఉండండి...! అల్లు వారి కుటుంబ గౌరవంతో పాటు మెగా ఫ్యామిలీ పరువును మరింత పటిష్ట పరచటానికి అరవింద్ గారబ్బాయి... అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్ అనే మరో కుర్రాడు కంకణం కట్టుకున్నడన్నా సంగతి మనందరికీ తెలిసిందే..! అతను ఆ భాద్యతను సమర్ధవంతంగా నిర్వర్తించటానికి కష్టపడి 'గౌరవం' అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడని కూడా అందరికి తెలుసు..! కాని ఇప్పుడే తెలిసిన విషయం ఏమిటంటే సినిమా షూటింగ్ పూర్తిచేసుకుని విడుదలకు సిద్దం అయినా సందర్భంగా ఈ చిత్రానికి సంబందించిన తీజర్ ను బయటకు తీసుకువచ్చి నాయక్ సినిమా ప్రొమోషన్ లో బిజీగా ఉన్నా మెగా అభిమానులకు సంక్రాంతి స్పెషల్ ట్రీట్ ఇచ్చారు.

నోరురిస్తున్నా ముద్దపప్పు ...!


హీరోయిన్ గా పరాజయంతో 'బోణి ' కొట్టిన కన్నడ భామ కృతి కర్బందాతో తెలుగు సినిమా పరిశ్రమ ఓ చిన్నపాటి 20 20 క్రికెట్ మ్యాచ్ ఆడుకుంది. క్రికెట్ మ్యాచ్ లో ఎలాగైతే ఊహించని పరిణామాలు ఎదురై ఊహలకందని ఫలితాలు దక్కుతాయో... అలాగే కృతి కెరిర్ లో కూడా అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకుని ఊహించని అవకాశాలు దక్కుతున్నాయి.

Wednesday, January 9, 2013

సీతమ్మ భారాన్ని పెద్దమ్మ ఫై పెట్టిన రాజు


స్టార్ నిర్మాత దిల్ రాజు రెండురోజుల క్రితం పెద్దమ్మ గుడిలో మహాయాగం ,దోష నివారణ పూజలు చేయించాడు.అలానే తన తన తాజా చిత్రం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాకు సంబంధించి ఒక హెవీ పెయిడ్ ప్రిమియర్ ను మహేష్,వెంకటేష్ సమేతంగా చూసేందుకు వీలుగా విడుదలకు ముందు రోజు రాత్రి ప్లాన్ చేశాడు.ఆ షో ను చూడాలనుకుంటే 5000/- చెల్లించాల్సిఉంది. అలా వచ్చిన డబ్బును ఓ గుడి కట్టించటానికి విరాళంగా ఇస్తాడంటా..! అంతా బాగానే ఉంది కాని ఒక్కసారే ఇంత పెద్ద స్థాయిలో దైవకార్యాలు నిర్వర్తించటం ఏమిటా అని మందికి అనుమానం రాకుండా జనవరి 11 అమావాస్య కాబట్టి ఆ రోజు రిలీజ్ అవుతున్న సినిమా ఫై ఎటువంటి దోషం పడకుండా ఉండాలనే ఈ పూజలు,విరాళాలు అని కవర్ చేశాడు రాజు. కాని రాజు గారు దేవుడి సహాయం కోసం శరణు వేడటం వెనుక ఉన్నా అసలు విషయం నిన్న బయట పడింది.

Ram Charan Nayak Movie Review


క్రిందటి సంవత్సరం మెగా పవర్ స్టార్ రచ్చ తో మొదలు పెట్టిన హిట్ల పరంపరను మిగత మెగా హీరోలు కొనసాగించి 2012 ను మెగా ఫ్యామిలి నామ సంవత్సరంగా మార్చేసుకున్నారు. ఈ సంవత్సరం కూడా అదే ఆనవాయితిని కొనసాగించే ఉద్దేశంతో సంక్రాంతి పండక్కి పెద్ద పులిలా ఈ వారం దియేటర్లకు వచ్చాడు నాయక్. తన పేరా ఉన్నా రికార్డులను కాపాడుకోవటమే కాకుండా మెగా అభిమానులకు చిరంజీవి దూరమైనా లోటును కూడా తీర్చాల్సిన భాద్యత చెర్రి ఫై ఉంది. అందుకే ఏంతో మెలుకువగా రచ్చ విజయం ఇచ్చిన కిక్ ను ఆసరాగా చేసుకుని  చరణ్ రెట్టించిన ఉత్సాహంతో ఈ సినిమా కోసం కష్టపడ్డాడు. ఆ కష్టానికి తగ్గ ఫలితాన్ని తప్పక అందుకుంటాను అనే ధీమా రామ్ చరణ్లో కొట్టొచ్చినట్టు కనిపించింది. ఆ సానుకులతే సినిమాకు సంబందించిన ప్రచారంలో కొత్త ఉత్సాహాన్ని నింపింది.

Tuesday, January 8, 2013

నాయక్ కు సూపర్ హిట్ టాక్



నాయక్ కు సంబంధించి సూపర్ హిట్ టాక్ దావానంలా వ్యాపిస్తుంది. ఈ రోజు సాయంత్రం రామ్ చరణ్ కుటుంబసభ్యుల కోసం ప్రత్యేకంగా ఒక షో ప్రదర్శించారు. ఆ షో ను చూసిన కొందరు వ్యక్తులు చెబుతున్నా సమాచారం ప్రకారం నాయక్ ఈ సంక్రాంతి పండక్కి రుచికరమైన మాస్ మసాలా నాన్ వెజ్ ఫుల్ మీల్స్ అని తెలుస్తుంది.

హీరోయిజాన్ని స్వామికోదిలేసిన నిఖిల్



హ్యాపీ డేస్ హీరో అనే నానుడి నుండి బయట పడటానికి విశ్వప్రయత్నం చేస్తున్నా కుర్ర హీరో నిఖిల్ తనను సోలో హీరోగా నిలబెట్టే హిట్ కోసం 'స్వామి రా రా ' అంటూ దేవుడి వెనుక పడ్డాడు.అందుకోసం టాలీవుడ్ లో తెలుగు సినిమా హీరో అనిపించుకోవాలంటే  ఉండవలసిన ఏంతో ముఖ్యమైన అర్హతైనా హీరోయిజాన్నే దేవుడికి మొక్కుబడిగా చెల్లించుకున్నాడు.

నాయక్ మొదటాటకు బాద్ షా


నాయక్ సినిమాకు సంబంధించి అందులో రామ్ చరణ్ చేసిన మ్యాజిక్ గురించి, వినాయక్ సృష్టించిన వినోదం గురించి వినపడుతున్నా విశేషాల కంటే మరో అంశం మెగా అభిమానులు సహా సర్వత్ర వీపరితమైన ఆసక్తిని కలుగజేస్తుంది. ఎందుకంటే ఆ విషయంతో జూనియర్ చిరంజీవికి జూనియర్ యన్ టి అర్ కు లింక్ ఉంది కాబట్టి.

1210 తో మొదలుపెడుతున్నా నాయక్


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన 'నాయక్' విడుదలకు ముందే సంచలనాల మోత మొగించటం మొదలు పెట్టింది. అధికారికంగా నిర్మాతలు వెలువరించిన సమాచారం ప్రకారం నాయక్ తోలి రోజు అనగా జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా 1210 దియేటర్లలో సందడి చేయటానికి రంగం సిద్దం చేసుకున్నాడు.

Monday, January 7, 2013

బృందావనంలా అనిపిస్తున్నా మిర్చి



ఆడియో వేడుక తరవాత మిర్చి ఎలా ఉండబోతుంది అన్నా విషయం ఫై ఒక క్లారిటి దాదాపు వచ్చేసినట్టే...! సినిమాలో ప్రభాస్ పాత్ర ఎలా ఉంటుంది... మిగత పాత్రలు ఎలా ఉండొచ్చు అన్నా విషయం ఫై పాటల ప్రోమోస్ దియేటరికల్ ట్రైలర్ లో ఉన్న మేటర్ ను బట్టి వచ్చిన  స్పష్టమైన అంచన కొన్ని అనుమానాలకు తావిస్తుంది.

'నాయక్' పవర్ ప్యాక్డ్ ట్రైలర్


తెలుగు వాళ్ళకు సంక్రాంతి పండగను శోభాయమానం చేయటానికి తెలుగు సినీ పరిశ్రమ సిద్దం అవుతుంది. అందుకు తొలిగా రామ్ చరణ్ నటించిన 'నాయక్' పెద్ద పండగ సందడికి తెర లేపనుంది.  కొత్త సంవత్సరంలో విడుదలవుతున్నా మొదటి పెద్ద చిత్రంగా నాయక్ ఫై ప్రేక్షకులతో  పాటు పరిశ్రమలోనూ భారి అంచనాలు ఉన్నాయి. ఆ క్రమంలో ఈ సినిమాకు  సంబందించి బయటకు వస్తున్నా ప్రతి అంశం మెగా అభిమానులతో పాటు సామాన్య విక్షకులలోను సరి కొత్త ఆసక్తిని రేకెత్తిస్తుంది. తాజాగా నాయక్ చిత్రానికి సంబంధించి విడుదలైన కొత్త ట్రైలర్ సినిమా  ఫై అంచనాలను మరింత పటిష్టం చేస్తుంది.

నాయక్ 'యవ్వారం' ఏలూరుకే..!

 
కొన్ని కొన్ని సందర్భాలలో పాటలలోనో , డైలగులలోనో.. వినిపించే చిని చిన్ని మాటలు గమ్మత్తుగా భలే పాపులర్ అయ్యి  కూర్చుంటాయి. అందుకు తాజా నిదర్శనం 'నాయక్'  సినిమాలో ఐటెం పాట కోసం రచయత సాహితి గారు వాడిన 'యవ్వరమంటే...' పదం. పాటలో ఉన్నా ఊపు కారణంగా ఈ పదం జనాల నోళ్ళలో బాగా నానింది. కాని 'యవ్వరమంటే...' పదం బయట వినపడుతుంది కాని సినిమాలో మాత్రం సైలెంట్ అయిపోతుంది.

కొత్త ప్రభాస్ రాజమౌళి కోసమే


మొన్న జరిగిన మిర్చి ఆడియో వేడుకలో కనిపించిన కొత్త ప్రభాస్ ను చూసి అందరు ఒకింత ఆశ్చర్యానికి.. మరింత ఆనందానికి లోనయ్యారు. ఎందుకంటే బాగా పెరిగిన గడ్డంతో ప్రభాస్ ను చూసి ఆశ్చర్యపడ్డారు.. అలానే రాజమౌళి దర్శకత్వంలో తెరకేక్కబోయే చిత్రంలో ప్రభాస్ ఈ గెట్ అప్ లోనే కనిపించబోతున్నాడని ఊహించుకుని ఆనందపడ్డారు. ఆ ఊహలను నిజం చేస్తూ ఈ గడ్డానికి కర్త రాజమౌళియే అని ప్రభాస్ ఒప్పుకుని వాళ్ళిద్దరి కలయికలో వస్తున్నా భారి చిత్రం ఫై అంచనాలకు నాంది పలికాడు.

Sunday, January 6, 2013

'పంజా' బాబు కొత్త సినిమా


'కర్మ' చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయి.. పవన్ కళ్యాణ్ పంజా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు విలక్షణ నటుడిగా తన ఉనికిని చాటిన అడివి శేష్ 'కిస్' అనే సినిమాతో మరోసారి తెలుగు తెరపై మెరవనున్నాడు. నటన ఫైనే కాకుండా దర్శకత్వం ఫై కూడా పట్టు సాదించిన శేష్ స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. 'కర్మ' చిత్రంతో థ్రిల్లర్ అనుభూతిని పంచిన శేష్ ఈ 'కిస్' చిత్రంలో రొమాంటిక్ కామెడీ ని రుచి చూపించనున్నాడు.

Saturday, January 5, 2013

నాయక్ ను కాపాడే ప్రయత్నంలో చిరు


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజా సంచలనం 'నాయక్'  మెగాస్టార్ నుండి ప్రశంశ పూర్వక మన్ననలు  దక్కించుకుంది. ఇదే ఈ సినిమాకు సంబంధించి ఫైనల్ స్టాంపింగ్ అనుకోవచ్చు. కాకపోతే ఈ విషయంలోనే ఓ ఆసక్తి కరమైన విషయం దాగుంది. అదేమంటే సెన్సార్  కార్యక్రమాలు పూర్తీ చేసుకుని 'ఎ' రేటింగ్ దక్కించుకున్నాడు నాయక్. అంటే సినిమాలో వయలెన్స్ కానివ్వండి.. వల్గారిటీ కానివ్వండి పరిమితికి మించి ఉన్నట్టే లెఖ్ఖ..! దాంతో ఈ సినిమా మాస్ ప్రేక్షకుల ఫ్రెండ్లీ అని ఇట్టే  అర్ధం అవుతుంది. ఈ విషయం తెలిసి మాస్ అభిమానులు ఆనందపడొచ్చు... కాని దీని ప్రభావం మిగత వర్గాలఫై పడకుండా చిరంజీవి చేసిన ప్రశంశల సహాయం తీసుకున్నారు నాయక్ రూపకర్తలు.

Friday, January 4, 2013

మిర్చి సందడి మొదలైంది..!

2013 కొత్త సంవత్సరానికిగాను తెలుగు సినిమా  పరిశ్రమలో తోలి ఆడియో వేడుకగా యంగ్ రెబెల్ స్టార్ నటించిన 'మిర్చి'  పాటల విడుదల కార్యక్రమం చరిత్రలో నిలిచిపోనుంది . రేపు అనగా జనవరి 5 న విడుదలకు రెడీ అయిన మిర్చి పాటలు అప్పుడే సందడి మొదలు పెట్టాయి. అర నిమిషం, ఒక నిమిషం నిడివితో బయటకు వచ్చిన నాలుగు ప్రోమో పాటలు సంగీత ప్రియులను, ప్రభాస్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.

Thursday, January 3, 2013

'పవిత్ర'oగా రెచ్చగొడుతున్నా శ్రేయ


పవిత్ర అని పేరుపెట్టుకుని పరమ పవిత్రంగా జనాలను రెచ్చగొడుతూ మహాజనానికి మరదలు పిల్లగా మనల్ని అలరించటానికి శ్రేయ సిద్దం అవుతుందని ఇంతకు మునుపే చెప్పుకున్నాం. ఈ వార్త తెలుసుకుని కుర్రోళ్ళు, కుర్ర మనసున్నా పెద్దోళ్ళు  శ్రేయ బోల్డ్ తత్వాన్ని గుర్తుకు తెచ్చుకుని సినిమా మీద బోల్డన్ని ఆశలు పెట్టుకున్నారు. అలా ఆశపడ్డ బావలందరిని మరదలు పిల్ల అలరించే సమయం దగ్గర పడిందని కొన్ని సంకేతాలు తెలియజేస్తున్నాయి.

రవితేజ పాత వేషానికి పది సినిమాలు..!


 సినిమాలలోకొచ్చిన కొత్తలో మీడియంగా పెంచుకున్న గడ్డంతోనే కనిపిస్తూవచ్చిన రవితేజ హీరోగా మారిన తరవాతే షేవ్ చేసుకుని కనపడటం మొదలు పెట్టాడు. ఇడియట్ తోనే హిరో నుండి స్టార్ గా రూపుదాల్చినప్పటికి అడపాదడప గడ్డంతో కనిపించేవాడు. కానీ 2008 లో 'కిక్' సక్సెస్ తరవాత ఇప్పటివరకు రవి పది సినిమాలకు ఫైనే చేసినప్పటికీ ఏ  సినిమాలో కూడా గడ్డంతో కనిపించలేదు. అదేం చిత్రమో ఆ పది సినిమాలలో ఒక్క 'మిరపకాయ్' మినహా మిగత సినిమాలన్నీ రవితేజ స్టార్ హోదాను ప్రశ్నించినవే..! మరీ 'వీర' మొదలుకుని నిన్నటి 'సారోచ్చారు' వరకు లేటెస్ట్ గా చెప్పుకునే ఐదు సినిమాలైతే డిజాస్టర్ కు ఎక్కువగాను,  ఏవరేజ్ కు తక్కువగాను నడిచి ఏకంగా మాస్ మహారాజ కెరీర్ కే ఎసరు తెచ్చే పరిస్థితి కల్పించాయి. 

సుబ్బరాజు ..బాగా చెప్పావ్..!


దేశ రాజధాని ఢిల్లీ లో సభ్య సమాజం సిగ్గుపడేలా నిర్భయ అనే ఆబాల ఫై జరిగిన అమనవియ్య దుశ్చర్యను దేశం మొత్తం ఏకతాటి ఫై  కొచ్చి ముక్త కంఠం తో ఖండించింది. కానీ చాల వరకు ఆ ఖండనలలో ఆవేశం శాతమే ఎక్కువ కనిపించింది. ఎందుకంటే అందరు తక్షణ పరిష్కారాన్ని కోరుకుంటున్నారు. కానీ తక్షణ పరిష్కారం వ్యక్తిని శిక్షిస్తుంది కాని సమస్యను కాదు. సమస్యను నిర్ములించాలంటే ముందు మూలాలు వెదకాలి... అప్పుడే సమస్యను శాశ్వతంగా నిర్ములించగలం.  సమస్య మూలాలను వెదికి సరిదిద్దే భాద్యత సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరి ఫైన ఉంది. ఈ కోణంలో ఆలోచిస్తూ అతి తక్కువ మంది తమ నిరసనలను తెలియజేశారు. ఆ కొద్ది మందిలో నటుడు సుబ్బరాజు ఉండటం ముదావాహం.

ప్రభాస్ 'మిర్చి' : ఫైకి బెంగళురు.. లోన గుంటూరు..!


కూరగాయలకు సంబంధించి 'హైబ్రిడ్' అనేది ఇప్పుడు సాదారణమైపోయింది. అంటే ఒకే జాతికి చెందిన రెండు రకాల మొక్కలలో ఉన్నా ప్రత్యేకమైన లక్షణాలను జన్యుపరంగా అనుసందానించి ఒకే మొక్కలో అన్ని ప్రత్యేకతలు వచ్చేలా రూపొందించిన దానినే 'హైబిడ్' అని పిలుస్తాం. ఇప్పుడు తన తరవాతి సినిమాలో కొత్తగా కనిపిస్తున్నా ప్రభాస్ లో ఈ హైబిడ్ లక్షణాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.

Wednesday, January 2, 2013

నాయక్ క్వాలిటీ చెకింగ్ పూర్తీ...!


వినాయక్  దర్శకత్వంలో  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తోలిసారి నటించిన ' నాయక్' చిత్రానికి సంబందించిన క్వాలిటీ చెకింగ్ కార్యక్రమం అత్యంత గుట్టుగా నిన్న హైదరాబాద్లో ముగిసింది. నూతన సంవత్సర ప్రారంభాన్ని పురస్కరించుకుని పూర్తీ పరమైన మెగా ఫ్యామిలీ వ్యక్తిగత కార్యక్రమంగా జరిగిన ఈ వేడుకుకలో చరణ్ తండ్రి గారు మాన్య శ్రీ కేంద్ర మంత్రి శ్రీ మెగాస్టార్ చిరంజీవి గారు ముఖ్య అతిధిగా పాల్గొన్నారని అధికారిక సమాచారం. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని మెగాస్టార్ యూనిట్ సభ్యులతో కలిసి ఆసక్తిగా నాయక్ సినిమాను పూర్తిగా తిలకించి... పులకించిపోయారని వినికిడి.

Tuesday, January 1, 2013

బాపు మనసు గెలిచిన 'మిధునం'



బాపు గారు తెలుగు జాతి గర్వించతగ్గ చిత్రకారుడు, సినిమా దర్శకుడు మాత్రమే కాదు.... మంచి అభిరుచి కలిగిన తెలుగు చలన చిత్ర ఉత్తమ ప్రేక్షకుడు కూడా..! గతంలో అయన తన చేతి గీతలతో తెలుగు సినిమాలకు సంబందించి సద్మిమర్శలు, ప్రశంశలు చేసేవారు. కాని ఈ మద్య కాలంలో అయన స్పందనకు అర్హత కలిగిన సినిమాలు అరుదైపోయాయి. దాంతో నూటికో.. కోటికో.. ఒక చిన్నపాటి విమర్శ తప్ప నేటి సినిమా గురించి అయన చిత్రాలు మాట్లాడటమే మానేసశాయి. అలాంటిది ఆయన  ఇప్పుడు ఒక తెలుగు సినిమాకు తన మనః పూర్వకమైన అభినందన తెలియజేసారు. 

HAPPY NEW YEAR - 2013


     

     May This New Year Bring Many Opportunities Your Way.
     Explore every Joy of life and be happy.
     May your resolutions for the days ahead stay firm,
     turning all your dreams into reality and all your efforts into great achievements.
     We Maruthi Talkies.Com wish you and your loved ones
     a healthy, prosperous and 

                                          Very Happy New Year !