Monday, December 31, 2012
NTR New Year Wishes to Fans
తన నటనతోనూ, డాన్సులతోను ప్రేక్షకులను కట్టిపడేసే నవతరం నాయకుడు యన్ టి అర్.. అవకాశం దొరికినప్పుడల్లా తన ఫై పరిమితిలేని ప్రేమను కురిపించే అభిమానులకు అభివందనాలు తెలియజేస్తూనే ఉంటాడు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని కొత్త సంవత్సరంలో తనను అభిమానించే వాళ్ళందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షను తెలియజేస్తూ, మంచి పాత్రలతో కొత్త సంవత్సరంలో మిమ్మల్ని అలరించబోతున్నాను ...ఆశీర్వదించండి అంటూ యంగ్ టైగర్ ఫాన్స్ కోసం ప్రత్యేకంగా ఓ గ్రీటింగ్ కార్డు ను విడుదల చేశాడు.
చరణ్ కు లైలా దాసోహం ..!
ఓ విషయంగా ఒక వ్యక్తీ ఎంత పనిమంతుడైనప్పటికి... ఓ సరైన పరీక్ష ఎదురైనప్పుడే తన పనిని లోకానికి చాటే అవకాశం అతనికి దొరుకుతుంది. అది కూడా అల్లాటప్పది కాకుండా బలమైన సవాల్ తారస పడితే ఆ పోటి మహా రంజుగా ఉంటుంది. యుక్తితో ముందుకెళ్తూ తన శక్తినంత కూడదీసుకుని జటిలమైన సవాల్ మెడలు వంచి లొంగదీసుకున్నప్పుడే ఊహించని పేరు, ప్రతిస్థ దక్కుతాయి. అక్కడితో ఆగకుండా ఎన్ని ఎక్కువ సవాళ్ళను ఎదుర్కుంటూ పోతుంటే అంత ఎత్తుకు ఎదుగుతారు. ఇప్పుడు ఈ విషయాన్నీ ఆచరణలో పెడుతూ శ్రద్దగా కృషి చేస్తున్నాడు చిరుతనయుడు.
Sunday, December 30, 2012
Ko Ante Koti Movie Review
శర్వానంద్ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు కాని.. హీరోగా పరిశ్రమలో నాటుకుపోవటానికి అవసరమైన సత్తా ఉన్నా సినిమా ఇంత వరకు పడలేదనే చెప్పాలి. తనకు ఉపయోగపడేలా ఉండే సినిమా కోసం వేచి ఉండటం కాకుండా తన రాతను తానే వ్రాసుకోవాలనే ఉద్దేశంతో నిర్మాతగా మారి 'కో అంటే కోటి' సినిమాను నటిస్తూ నిర్మించి ఈ వారం ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
Friday, December 28, 2012
Genius Movie Review
తెలుగు బుల్లి తెర ఫై రియాలిటీ షోల ఒరవడికి ఒక ఊపు తీసుకొచ్చి యాంకర్లకు స్టార్ డమ్ కట్టబెట్టిన ఓంకార్ ఇప్పుడు బిగ్ స్క్రీన్ మీద దర్శకుడిగా తన అదృష్టాన్ని పరీక్షించుకోవటానికి 'జీనియస్' చిత్రంతో ఈవారం దియేటర్లకు వచ్చాడు. జీనియస్ అనే టైటిల్ , చిన్ని కృష్ణ కధ , పరుచూరి బ్రదర్స్ మాటలు ఇలా కొన్ని వెయిట్ ఉన్న అంశాలు సినిమాకు ఉన్నప్పటికీ.. దర్శకుడిగా ఓంకార్ ఎలా చేశాడో... చూడాలన్నదే ఈ సినిమాకు సంబందించిన ప్రత్యేకమైన అంశంగా మారింది. ఇంతకు మునుపు కూడా చాలామంది టివి నేపద్యం నుండి వచ్చి వెండి తెర ఫై రాణించలేక వెనక్కి వెళ్ళిపోయారు. మరి ఈ బుల్లి తెర జీనియస్ సినిమాలలో రాణించటానికి ఆశపడుతూ వేసిన తోలి అడుగుతో ఎంతవరకు సఫలం అయ్యాడో మన సమీక్షలో చుద్దాం.
Thursday, December 27, 2012
Yamudiki Mogudu Movie Review
కామెడీ సినిమాలా హీరోగానే కాకుండా నాన్ స్టాప్ సినిమాలా హీరోగా కూడా నరేష్ కు టాలీవుడ్ లో పేరుంది. అంటే రెండు మూడు నెలల గ్యాప్ లో నరేష్ నటించిన సినిమా రావటం అనే తెలుగు సినీ పరిశ్రమలో ఒక ఆనవాయితీగా ఉంది. కాని ఈ సంవత్సరం నరేష్ ఈ పద్దతికి కొద్దిగా సడలింపు ఇచ్చాడు. కేవలం మూడు సినిమాలతోనే 2012 ను సాగనంపుతున్నాడు. ఈ ఏడాది ఇప్పటివరకు ఒక హిట్టు (సుడిగాడు) ఒక ఫట్టు (నువ్వా నేనా ) తో సమానంగా ఉన్న అల్లరి బాబు 2012 తనకు కలిసి వచ్చిందో... లేదో... తెలుసుకోవటానికి ఆఖరుగా 'యముడికి మొగుడు' చిత్రంతో ఈ వారం ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
Wednesday, December 26, 2012
జయమాలిని లోటు తీరినట్టేనా...?
ఎంత సర్దిచెప్పుకున్నా తెలుగు సినిమాకు జయమాలిని లాంటి హాట్ బాంబ్ లేని లోటు లోటే..! ఆమె శకం ముగిసిన తరవాత ఏంతో మంది వచ్చారు కాని ఎవరు కూడా ఆమెను తలపించలేకపోయారు ... ఆమెలా మురిపించలేకపోయారు. అందం, చందం... ఒంపు,సోంపు... ఆట, పాటా ... ఇలా అన్ని సమతూకంగా ఓ లెక్క ప్రకారం జయమాలినిలో కనిపించినట్టు మరే శృంగార తారలోను కనిపించవు. అందుకే తరాలు ఎన్ని మారుతున్నా... అన్ని తరాలకు కలిపి నెంబర్ వన్ ఐటెం గర్ల్ ను ఎంచుకోమంటే జయమాలినికే అగ్రతాంబలం దక్కుతుంది అని చెప్పటంలో ఎటువంటి సందేహము లేదు.....!
రెండో అడుగు రాజమౌళిది...!
పాతికేళ్ళ క్రితం ఆగిపోయిందనుకుంటున్నా మల్టి స్టారర్ సంస్కృతికి 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రంతో మళ్లీ జీవం పోస్తుంది తెలుగు సినీ పరిశ్రమ. వర్ధమాన దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల సంకల్పం , అభిరుచి గల నిర్మాత దిల్ రాజు నిబద్దత ఆ ప్రయత్నం తోలి అడుగు వేయటానికి దోహదపడ్డాయి. తెలుగు వాళ్ళకు పరిచయమే అయిన మరుగున పడిపోయిన ఈ కల్చర్ ను మరో అడుగు ముందుకు తీసుకువెళ్ళే భాద్యతను భుజానకెత్తుకునే పనిలో రాజమౌళి నిమగ్నమై ఉన్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.
Tuesday, December 25, 2012
మెగా అభిమానులకు వి'నాయక్' షాక్..!
నాయక్ సినిమా మొత్తానికే జబర్దస్త్ అనుకుంటున్నా 'లైలా ఓ లైలా' పాటా అనూహ్యంగా బయటకు వచ్చి చేస్తున్నా హాల్ చల్ ను చూసి గోరంత ఆనందం.. కొండంత విషాదంతో (సినిమా ఫై ఆసక్తిని తగ్గిస్తుందేమో అనే భయంతో..) తల్లడిల్లుతున్నా మెగా అభిమానులకు వినాయక్ మరో జేల్లకాయ కొట్టాడు. నాయక్ ఆల్బం కే టాప్ పాటగా మాస్ జనాలా నీరాజనాలు అందుకుంటున్నా "ఎవ్వరమంటే ... ఎలూరే .." మీద మెగా అభిమానులు బోల్డన్ని ఆశలు పెట్టుకున్నారు. అలాంటిది ఆ పాట కోసం అవుట్ డేటెడ్ హీరోయిన్ ను ఐటెం గర్ల్ గా ఎంపిక చేసుకోవటంతో వారికి నమ్మటానికి ఒప్పుకోబుద్దికానటువంటి షాక్ తగిలింది.
Monday, December 24, 2012
ఈసారి శ్రీనువైట్ల టార్గెట్ ఎవరో...?
దుబాయ్ శ్రీను చిత్రంలో ఫైర్ స్టార్ 'సల్మాన్ రాజు' గాను , 'దూకుడు' లో సినిమా హీరో కావాలనుకునే ఔత్సాహిక వృద్దుడిగా విభిన్నా గెట్ అప్స్ లో కనిపించి హస్యప్రియులను సమ్మోహన పరిచిన యం యస్ నారాయణ తాజాగా యన్ టి అర్ హీరోగా శ్రీను వైట్ల రూపొందిస్తున్నా' బాద్షా ' లో సినీరంగానికి చెందిన ఓ సుపరిచిత అవతారంలో కనిపించనున్నడని సమాచారం.
అచ్చ తెనుగు 'మిధునం' అద్భుతః !
నటుడిగా తనికెళ్ళ భరణి మనందరికీ సుపరిచితమే..! కాని చాలా మందికి పెద్దగా పరిచయం లేని కోణం అయన రచయత కావటం. అప్పుడెప్పుడో... వంశీ గారి సినిమాలకు మాటలు వ్రాసిన అయన తరవాత నటుడిగా బిజీ అయ్యాక తన రచనతత్వాన్ని మంది కోసం కాకుండా మనశ్శాంతి కోసమే పరిమితం చేసుకుని సన్నిహితుల వరకే వినిపిస్తూ వచ్చాడు. కుండలో ఉన్నంత వరుకే గుట్టు... ఒకసారి కుండ నిండి అందులోని పదార్ధం బయటకు ప్రవహించటం మొదలు పెట్టక ఎంత దాచాలనుకున్న ఆగకుండా నలుగురికి తెలిసిపోతుంది. ఇప్పుడు భరణి గారి విషయంలో మిధునం సినిమాకు సంబంధించి అదే జరుగుతుంది.
Friday, December 21, 2012
Raviteja Sarochharu Movie Review
సక్సెస్ తో సంబంధం లేకుండా స్టార్ డమ్ ను బేస్ చేసుకుని నిర్మాతలను లైన్ లో నిలబెట్టి దూకుడుగా సినిమాలు చేసుకుంటూపోతున్నా మాస్ మహారాజ రవితేజ ఈ సంవత్సరం ఇప్పటికే హ్యాట్రిక్ పరాజయలిచ్చి ఆఖరుగా ఓ విజయం కోసం 'సారోచ్చారు ' అంటూ ఈ వారం దియేటర్లలో సందడి మొదలుపెట్టాడు. మాస్ జనాలలో రవితేజకు ఉన్న క్రేజ్ ఆయన్ని మినిమమ్ గ్యారంటి హీరోగా చేసింది. అందుకనే పరాజయాల రికార్డ్ ఘనంగా ఉన్నా అతగాడి సినిమా ప్లాప్ అయితే వచ్చే నష్టం శాతం తక్కువ కాబట్టి ఈ మాస్ రాజా చుట్టూ నిర్మాతలు ఈగల్లా ముసురుతున్నారు.
Thursday, December 20, 2012
ఆంధ్రావాలను గుర్తుకుతెస్తున్నా యన్ టి అర్ కొత్త లుక్
ఫైన ఫోటోలో కనిపిస్తున్న యన్ టి అర్ కొత్త అవతారం బాద్షా సినిమాలో అతని న్యూ లుక్ గా చెబుతున్నారు. కాని ఆ లుక్ యన్ టి అర్ అభిమానులకు సుపరిచతమే...! మాములు పరిచితం కాదు... యన్ టి అర్ ను అభిమానించే వాళ్ళు ఓ పట్టాన మర్చిపోలేని రూపు అది. ఎందుకంటే 2004 వీపరితమైన అంచనాలతో విడుదలై యన్ టి అర్ అభిమానుల ఆశలను సునామిలా తుడిచి పెట్టేసిన ఆంధ్రావాలా చిత్రంలో ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే పెద్ద యన్ టి అర్ (జునియరే పెద్దోడిలా చేశాడు ) గెట్ అప్ ఇంచు మించు అలాగే ఉంటుంది. దాంతో గతం గుర్తొచ్చి కొద్దిగా భయపడాల్సిన పరిస్థితి నందమూరి అభిమానుల్లో నెలకుంది .
నిర్మాతగారు కాస్తా హుందాగా ఉండండి సార్ ...!
షాడో కుర్రాడి బడాయి బానే ఉంది...!
ఒక్క హిట్ కూడా లేక పోయిన పెద్ద హీరోలతో తప్పా సినిమాలు చేయని దర్శకుడు మెహర్ రమేష్. ఆయన ఇప్పుడు వెంకటేష్ తో షాడో అనే యాక్షన్ కామెడీని రూపొందిస్తున్నాడు.ఫిబ్రవరిలో విడుదల అవుతుందనుకుంటున్నా ఈ సినిమా మీద బాలీవుడ్ కన్ను పడిందని సమాచారం. ఈ మధ్య తెలుగు సినిమాలను రీమేక్ చేసుకుని హిట్ల మీద హిట్లు కొడుతున్నా సల్మాన్ ఖాన్ , అజయ్ దేవగన్ లు ఈ సినిమా కోసం పోటి పడుతున్నారని నిన్న ఒక కధనం ప్రచారంలోకి వచ్చింది.
పాపులర్ అయిన రామ్ చరణ్ 'వెంట్రుక '
Wednesday, December 19, 2012
లారెన్స్ కొంప ముంచిన ప్రభాస్
దర్శకుడిగా అవతారం ప్రారంభించిన స్టార్ డాన్స్ మాస్టర్ లారెన్స్ తన తోలి చిత్రం పూర్తికాగానే తరవాతి సినిమా కోసం ప్రభాస్ ను టార్గెట్ చేసుకున్నాడు. ప్రభాస్ కూడా లారెన్స్ తో సినిమా చేయాలని ఉబలాట పడ్డాడు, కాని అప్పటి పరిస్థితులు అనుకూలించకపోవటంతో ఎప్పటికనే సినిమా చేస్తానని మాటిచ్చాడు. మరో పక్క అలాంటి మాటనే నిర్మాతలు పుల్లారావు, భగవాన్ లకు ఇచ్చాడు ప్రభాస్. అలా కొన్నాళ్ళకు లారెన్స్ , ఆ నిర్మాతల కాంబినేషన్లో 'రెబెల్' సినిమాకు శంకుస్థాపన చేశాడు ప్రభాస్. అంటే ఇప్పుడు జరుగుతున్నా రెబెల్ వివాదానికి నాటు వేసింది ప్రభాసే అని అర్ధం అవుతుంది.
Tuesday, December 18, 2012
మళ్లీ అదే తప్పు చేస్తున్నా బొమ్మరిల్లు బాబు
బొమ్మరిల్లు సినిమా విడుదల తరవాత ఓ పేరు ఆంధ్రప్రదేశ్ అంతటా మారు మొగిపోయింది. ఆ పేరు దర్శకుడు భాస్కర్ ది. ఆ సినిమా చూసి భాస్కర్ ను పొగడని వాళ్ళు దాదాపు లేరనే చెప్పాలి. ఆ సినిమా తరవాత మరో రెండు సినిమాలు చేసినాకూడా ఇప్పటికి అతని టాలెంట్ కు కొలమానంగా బొమ్మరిల్లు సినిమానే పరిగణిస్తూ బొమ్మరిల్లు భాస్కర్ గా అతన్ని పిలవటం పరిపాటి అయ్యింది. బొమ్మరిల్లు ఘన విజయం సాదించటానికి కానివ్వండి.. 'పరుగు' పరవాలేదనిపించటానికి కానివ్వండి... మొన్నిమద్యనే వచ్చిన 'ఆరెంజ్' పరాజయం పాలవ్వటానికి కానివ్వండి... భాస్కర్ లో ఉన్న ఒక ప్రత్యేకమైన గుణమే అందుకు కారణం.
సత్యభామలా కనిపిస్తున్నా సీత...!
నిన్న జరిగిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఆడియో వేడుకలో వెంకటేష్ కు జోడిగా నటిస్తున్నా అంజలి తానూ 'సీత' అనే పాత్రలో నటిస్తున్నానని వేదిక మీద ప్రకటించింది. దాంతో ఆమె పాత్ర గురించి పరిశ్రమలో కాస్తా వేడిగానే చర్చలు సాగుతున్నాయి. టైటిల్ లో ఉన్న సీత అనే పేరును అంజలి పాత్రకు పెట్టారంటే.. ఆమెదే ఈ సినిమాలో ప్రధానమైన పాత్ర అంటూ కొందరు వాదనలకు దిగుతున్నారు. అలానే ఎవరి ఊహ శక్తి ప్రకారం వాళ్ళు కధలు కూడా అల్లెస్తున్నారు. త్వరలోనే పుక్కిట కధలు కూడా బయటకు రావచ్చు.
Monday, December 17, 2012
తప్పు సరిదిద్దుకున్న నాయక్
'చరిత్ర నాయకులను సృష్టిస్తుంది. కాని ఒక నిజమైన చరిత్ర .... చరిత్రను తిరగ వ్రాస్తుంది..!' అని రెండు రోజుల క్రితం విడుదల చేసిన టీజర్ లో నాయక్ సినిమా గురించి బిల్డ్ అప్ ఇస్తూ ఇంగ్లీష్ లో చాలా స్టైల్ గా వేశారు. చరిత్ర చరిత్రను తిరగరాయటం ఏమిటా అని కొద్దిగా అనుమానం కలిగినప్పటికీ మెగా హీరో కదా మార్చిన మార్చి ఉంటాడులే అని సర్డుకుపోయాం. కాని ఈ రోజు ఆడియో విడుదల కార్యక్రమంలో తెలిసిందేమంటే ఆ కొటేషన్ లో ఓ పొరపాటు జరిగిందని...!
సంక్రాంతి పండగను కబ్జా చేస్తున్నా దిల్ రాజు
సంక్రాంతి పండగంటే తెలుగు వాళ్ళకు ఏంతో ప్రత్యేకం. సంక్రాంతి అనగానే హరిదాసులు , కోడిపందేలు, బోగి మంటలకు ఎంత ప్రాముఖ్యత ఉంటుందో... ఆ సీజన్ లో విడుదలయ్యే సినిమాలకు అంతే ప్రాముఖ్యత ఉంటుంది. ఇక మన హీరోలైతే కెరీర్ మొత్తంలో ఒక్కసారైనా సంక్రాంతి హీరో అని అనిపించుకుంటే స్టార్ గా ఒక పరిపూర్ణత సాదించినట్టు ఫీల్ అవుతారు. వాళ్ళ అభిమానులు కూడా ఈ పండగను సీరియస్ గానే తీసుకుంటారు. అలాంటి విశిష్టమైన సంక్రాంతి సందర్భాన్ని ఈ సంవత్సరం స్టార్ నిర్మాత దిల్ రాజు కబ్జా చేయనున్నాడు.
గోదారి తల్లికి మోక్షమెప్పుడో .....!
సెప్టెంబర్ నాటికే షూటింగ్ కు చెల్లు చీటీ వ్రాసిన 'గుండెల్లో గోదారి' సినిమా నవంబర్ లో విడుదల అవుతుందని అప్పట్లో ప్రచారం బాగానే జరిగింది. కాని నవంబర్ పూర్తయి డిసెంబర్ కూడా అయిపోవచ్చిందికాని సినిమా విడుదల గురించి ఇంకా ఒక స్పష్టత మాత్రం కనపడటంలేదు. మేడం మంచు లక్ష్మిగారేమో సినిమా సంగతి పక్కన పెట్టి సెంటు బుడ్డులు అమ్ముకుంటుంది. ఈ నెలలో కనుక సినిమా బయటకు రాలేదంటే ఫిబ్రవరి వరకు ఆగాల్సి వస్తుంది. కానీ పరిస్థితి చూస్తుంటే ఓ ప్రణాళిక ప్రకారమే మంచు ముత్యం విడుదలలో జాప్యం చేస్తుందని అర్ధం అవుతుంది.
Sunday, December 16, 2012
సీతమ్మ వాకిట్లో... పాటలు లక్షణంగా ఉన్నాయి
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు పాటలు.. టైటిల్ ట్రాక్ మినహా మిగతావి ఓ మాదిరిగా వినివిపిస్తున్నా.... చూడటానికి మాత్రం లక్షణంగానే కనిపిస్తున్నాయి. ఉన్న ఆరు పాటల్లో సందర్భానుసారంగా అనిపించే పాటలైతే పచ్చ తోరణాలతో, రంగుల లోగిళ్ళతో సంప్రదాయబద్దంగా ఏంతో ముచ్చట గొలుపుతున్నాయి. ఇక వెంకటేష్ మహేష్ గురించయితే చెప్పనే అవసరం లేదు.... వాళ్ళిద్దరూ కనిపిస్తున్నా ప్రతి ఫ్రేము కన్నుల పండవగా ఉంది.
ఆ ఇద్దరిని ముందు వరసలో నిలబెట్టిన దేవరాయ..!
సినిమాలకు హిట్టు.. ఫట్టు ఉన్నట్టుగానే... సినిమాలలో పనిచేసే వాళ్ళకి పేరు రావటం, పేరు పోవటం అనే సంగతులు ఉంటాయి. వాటిని బట్టే వారి భవిష్యత్తు స్లో గానో , ఫాస్ట్ గానో... మూవ్ అవ్వటమో లేదా ఆగిపోవటమో ... జరుగుతుంది. కాని సినిమాకు పనిచేసే అందరికి అలాంటి పరిస్థితి ఎదురవుతుందని చెప్పలేం..! మహా అయితే ఓ సినిమాలో ఇద్దరికో.. ముగ్గిరికో ఆ అదృష్టం దక్కే అవకాశం ఉంది. ఈ మధ్యే విడుదలైన దేవరాయ చిత్రం తో సంగీత దర్శకుడు చక్రి, హీరోయిన్ మీనాక్షి దీక్షిత్ ఓ ఘనతను దక్కించుకుని ముందు వరసలో నిలుచున్నారు.
Saturday, December 15, 2012
ఇది సీతమ్మ వాకిట్లో మాత్రమే సాధ్యం..!
అద్భుతాలను అన్ని చోట్ల చూడలేం. కానీ సినిమా అంటేనే ప్రపంచానికి సంబంధించి అద్భుతలకే అద్భుతం. ప్రేమలోనూ, యుద్ధంలోను అన్ని చెల్లుతాయి అన్న మాటా సినిమాలకు వర్తిస్తుంది. కాని ఇప్పుడున్నా పరిస్థితులకు అనుగుణంగా కొన్ని సంగతులను తెలుగు సినిమాల్లో ఊహించలేం...! కాని మన ఊహలకందని విషయం ఏమిటంటే ఆ పరిస్థితుల్లో కూడా మార్పు మొదలయ్యింది.
Friday, December 14, 2012
ట్రైలర్ : చరిత్ర తిరగరాయటానికి వస్తున్నా ....నాయక్!
'చరిత్ర నాయకులను సృష్టిస్తుంది. కాని ఒక నిజమైన చరిత్ర .... చరిత్రను తిరగ వ్రాస్తుంది..!' అంటూ ఫస్ట్ లుక్ టీజర్ తో ఘనంగా తన ఉనికిని పరిశ్రమకు, అభిమానులకు చాటుతున్నాడు 'నాయక్'. వి వి వినాయక్ దర్శకత్వంతో రామ్ చరణ్ ఎలా ఉండాలని మెగా అభిమానులు అంచనాలు కడుతున్నారో... వాటికీ ఒక్క పొల్లు బీరు పోకుండా ఈ టీజర్ లో మెగా పవర్ స్టార్ కనిపించాడు .
Yeto Vellipoyindi Mansu Movie Review
'ఈగ' సినిమాలో ముచ్చటగా కనిపించిన నాని, సమంతాలా యువ జంటకు మంచి మార్కులే పడ్డాయి, కాని కధ ఆడిన వింత నాటకం కారణంగా వారిద్దరూ ఆ సినిమాలో రొమాన్స్ పండించలేకపోయారు. అందుకని ఇప్పుడు ఆ కొరతను తీర్చటానికి 'ఏటో వెళ్లి పోయింది మనసు' అంటూ ఈ వారం సినిమా హాళ్ళకు వచ్చారు. ఇళయరాజా అందించిన ఒక్క పాటతోనే మంచి ఓపెనింగ్స్ రాబట్టగలిగేంత ప్రచారాన్ని సంపాయించుకుంది ఈ సినిమా. దానికి తోడూ గౌతమ్ మీనన్ బ్రాండ్ మార్క్ రొమాన్స్ , ఆసక్తిగా కనిపిస్తున్న నాని సమంతాలా పాత్రలు ప్రధానంగా యువతను విపరీతంగా ఆకర్షించాయి. పబ్లిసిటీ కూడా వినూత్నంగా సాగటం ఈ సినిమాకు చాలా కలిసొచ్చింది.
రెహమాన్ గుంజుకుంటాడు ...... జాగ్రత్త !
గుంజుకుపోతారు.. జాగ్రత్త! శ్రద్ధ గా వింటే మనసును .. మైమపిరిచిపొతే మొత్తంగా మనిషినే గుంజుకుపోతారు. మణిరత్నం, రెహమాన్,శక్తిశ్రీ గోపాలన్ , సాహిత్యం ఈ నలుగురు నిర్దాక్షణ్యంగా సున్నితమైన మనసును గుంజుకు పోవాలని డిసైడయ్యారు. 'నిన్జుకుల్లె..' అంటూ తమిళనాట స్లో పాయిజన్ అయ్యి కూర్చున్న ఈ పాట 'గుంజుకున్నా ..' అంటూ తెలుగు వాళ్ళను వేటాడటం ఖాయంగా కనిపిస్తుంది. పాట విన్నా తరవాత బాబోయ్ ఇదేం పాటండి... బాబు! అని అనకుండా ఉండలేం..!
ప్రివ్యూ : ముక్కెర చూడు.. ముక్కందం చూడు..!
ఈ ముక్కేవరిదా ... అని ఆలోచించే ప్రయత్నం చేయకండి. ఎందుకంటే ఇక్కడ మేటర్ ముక్కు కాదు.....ముక్కెర ..! ఇక పొతే ఆ కనిపించే సట్టి ముక్కు మన పొట్టి పిల్లా సమంతాది. ఈ తమిళ పొన్ను బుజ్జి మ్కుక్కేసుకుని బానే ఉంటుంది. ఆ బుల్లి ముక్కుకు ముక్కెర పెట్టేప్పటికి ఎంతందం వచ్చిందో.. గమనించండి. 'ముక్కుకు ముక్కెర అందం..అని ఏదో పాటలో విన్నట్టు గుర్తు ..! ఎదో.. ఎక్కడో... అన్నట్టుగానే మన సినిమాల్లో ముక్కు పుడకతో కనిపించే హీరోయిన్ పాత్రలు చాలా అరుదుగా వస్తుంటాయి.
Thursday, December 13, 2012
కొసరుకే ఇంత హడావిడైతే.... ఇక అసలుకు ఎంతో ...?
ఈ యేడాది మొదట్లో బీభత్సమైన రచ్చ చేసి మెగా అభిమానులను ఉత్సాహపరిచిన చిరుతనయుడు రామ్ చరణ్ వచ్చే యేడాదిని కూడా అంతే ఘనంగా ప్రారంభించటానికి ఈ సంక్రాంతికి నాయక్ చిత్రంతో సిద్దం అవుతున్నాడు. అంటే దానర్ధం మెగా కొలువులో అలుపెరగని సందడికి నగారా మ్రోగినట్టే..! ఈ సందడికి అంకురార్పణగా ఈ నెల 17 న పాటలను విడుదల చేయటానికి సిద్దం అయ్యారు 'నాయక్' రూపకర్తలు. ఈ లోపే ఆ అల్బుమ్ కు సంబందించిన రెండు పాటల ప్రోమోస్ బయటకు వచ్చాయి. వాటిని విని మెగా అభిమానులు వేస్తున్నా చిందులు వర్ణనకు అందటం లేదు.
ఆ ముద్దులకు ఈ సినిమాలో చోటు లేదా..?
'ఏం మాయ చేసావే' చిత్రంతో వెండి తెరకు పరిచయం అయ్యి నాన్ - స్టాప్ గా దూసుకుపోతున్నా తెలుగు మూలలున్నా తమిళ అమ్మాయి సమంతా ఆ సినిమాలో తడి ముద్దులకు అడ్డు చెప్పకుండా కుర్రకారును తృప్తి పరిచింది. ఆ తరవాత కూడా అవసరం ఉన్న చోట సై అంటూనే ఉంది. కాని మొదటి సినిమాలో ఉన్నంత బోల్డ్ గా అయితే మరో సినిమాలో లేదనే చెప్పాలి. మళ్లీ ఇప్పుడు తన గురువు గౌతమ్ మీనన్ కోసం 'ఏటో వెళ్లి పోయింది మనసు' సినిమాలో మనసు విశాలం చేసుకుందని తెలిసింది.
Simple and Super : Venky's B'day Spl SVSC Wallpaper
52 వసంతాలు పూర్తీ చేసుకున్నా విక్టరీ వెంకటేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమా యూనిట్ విడుదల చేసిన తాజా పోస్టర్ తెలుగు సినీ ప్రియులను విశేషంగా ఆకర్షిస్తుంది. అన్నదమ్ముల్లా ఒకే చోటా మహేష్ వెంకటేష్ లను చూడటం కన్నుల పండగగా ఉంది. వాళ్ళిద్దరిని అలా చూస్తుంటే...నటన అని అనాలనిపించదు... నిజమైన అన్నదమ్ములే అని నమ్మాలనిపిస్తుంది.
Wednesday, December 12, 2012
Sitamma vakitlo sirimalle chettu (SVSC) New Teaser
Venkatesh and Mahesh Starer Sitamma vakitlo Sirimalle Chettu New Teaser is out and creating ripples around. This teaser is on behalf of Venky's Birthday treat to his fans and movie lovers. SVSC Audio is set to release on December 16th and Movie would release on January 11th as pongal special
Lets have alook on Teaser ...
Tuesday, December 11, 2012
Monday, December 10, 2012
దియేటర్లకు స్పాట్ పెట్టిన లోకనాయకుడు...!
లోక నాయకుడు కమలహాసన్ ఏది చేసిన సంచలనమే..! అది నటన కానివ్వండి...యవ్వారం కానివ్వండి. బాలచందర్,కె విశ్వనాధ్ వంటి ఉద్దండ దర్శకుల తరవాత తనలోని నటనా ప్రతిభను వాడుకోగల దర్శకులు దొరక్క అవసరాన్ని బట్టి దర్శకుడిగా మారి తన కళాతృష్ణను తీర్చుకుంటున్నాడు కమల్. అలా ఆయన దర్శకత్వంలో వచ్చిన 'హే రామ్' , పోతురాజు చెప్పినట్టు' చిత్రాలు కొన్ని వివాదాలను మూటాగట్టుకున్నాయి. తాజాగా కథక్ నాట్యకారుడిగా నటిస్తూ.. తీవ్రవాదాన్ని చర్చిస్తూ... అయన రూపొందించిన 'విశ్వరూపం' చిత్రంతో తమిళనాట సరి కొత్త వివాదానికి తెర తీశాడు.
సిరిమల్లి నీడలో చిన్నోడు, పెద్దోడు
సహజంగా మన రాష్ట్రంలో చాలా కుటుంబాలలో ఇద్దరు మగపిల్లలు ఉంటే వారిలో పెద్దవాణ్ణి పెద్దోడా .. అని, చిన్నవాణ్ణి చిన్నోడా.. అని పిలవటం పరిపాటి. కుటుంబ సభ్యులే కాకుండా చుట్టాలు,పక్కాలు ,తెలిసినోళ్ళు అందరు అలానే పిలుస్తారు. ఇక వాళ్ళుండేది పల్లెటూరు అనుకోండి అక్కడుండే వాళ్ళు పలానవాళ్ళ చిన్నోడు.. పెద్దోడు అనే కానిచ్చేస్తారు.. అసలు పేర్లతో పని లేకుండా.. ! ఇప్పుడు ఈ సంగతిని ఏంతో ఆత్మీయంగా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రానికి ఆపాదించాడు దర్శకుడు శ్రీకాంత్ అడ్డలా..!
Saturday, December 8, 2012
దేవరాయ రివ్యూ : సి. అ. కా. దే. ది. రా. ...!
శతాదిక చిత్రాల నటుడు అన్నా పేరు మినహా మిగత ప్రత్యేకతలను పక్కన పెట్టి నిస్సారంగా నట జీవితాన్ని తోసుకెళ్తున్నా శ్రీకాంత్ ను తాజాగా 'దేవరాయ' రూపంలో మరో పరాజయం వెక్కిరించటానికి ఖాయం అయ్యింది. ఈ రోజు విడుదలైన ఈ సినిమా కు సంబంధించి అన్నివైపులనుండి నెగిటివ్ రిపోర్ట్స్ నమోదవుతున్నాయి. ఇక విశ్లేషకులైతే కోమలత్వాన్ని వదిలి కసాయి వాళ్ళలా కత్తులకు, కండలకు పనిచెబుతున్నారు. అవును మరీ..! ఈ సినిమాలో కనిపించే తప్పులను ఖైమా కొట్టడానికి ఆ మాత్రం కసరత్తు అవసరమే..!
Friday, December 7, 2012
ఆ టైటిల్ కు అంత డప్పు అవసరమా..?
తెలుగులో 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' చిత్రంతో దర్శకుడిగా పయనాన్ని మొదలు పెట్టిన ఇండియన్ మైకేల్ జాక్సన్ ప్రభుదేవా ఆ తరవాత తమిళనాడు మీదుగా పయనించి ఇప్పుడు బాలీవుడ్ లో తీస్టేసుకుని కూర్చున్నాడు. వాంటెడ్, రౌడీ రాథోడ్ చిత్రాలతో దక్షిణాది మాస్ మసాలా టేస్ట్ ను బాలీవుడ్ జనాలకి రుచి చూపించి మెప్పించిన ప్రభు ఇప్పుడు రొమాంటిక్ లవ్ స్టొరీ తో వారిని కట్టి పడేయటానికి సిద్దం అవుతున్నాడు.
Subscribe to:
Comments (Atom)







































.jpg)

.jpg)







