కమిడియన్ గా ఉన్నప్పుడు అనుభవించు రాజా ...! అంటూ కులాసాగా కాలాన్ని ఎంజాయ్ చేసిన సునీల్ ఇప్పుడు హీరోగా మారి కొత్త టెన్షన్ లు పడుతున్నాడు. హీరోగా నిలదొక్కుకునే క్రమంలో టెన్షన్ లు కామనే.. కాకపోతే రేపు సినిమా విడుదల అంటే ఈ రోజు ఉండే టెన్షన్ చూడండి.... అబ్బో... పిచ్చేక్కించేస్తుందండి బాబు...! అంటున్నాడు ఈ భీమవరం చిన్నోడు.
Thursday, February 28, 2013
జబర్దస్త్ కు బ్యాండ్ బజ్ గయా ..!
విడుదల అయ్యి టాక్ బయటకు వచ్చాకా జబర్దస్త్ సినిమా గురించి రెండు రోజుల క్రితం వరకు హీరో సిద్దార్థ్ మినహా మిగత వాళ్ళు పెద్దగా స్పందించలేదు. ఇప్పుడు తన గురించి ఎవరు మాట్లాడుకోవటంలేదని తానే సొంతంగా కొన్ని వివాదాలను సృష్టించుకుని తన బ్యాండ్ ను తానే బజాయించుకుంటుంది ఆ సినిమా.
Wednesday, February 27, 2013
50 రోజుల 'నాయక్'
2103 సంవత్సరానికి గాను టాలీవుడ్ మొదటి బాక్స్ ఆఫీసు బ్లాక్ బాస్టర్ నాయక్ ఈ రోజుతో 50 రోజులను పూర్తిచేసుకుంది. మొహమాటాలతో సంబంధం లేకుండా ఈ సినిమా కోసం ప్రత్యక్షంగాను, పరోక్షంగాను పనిచేసిన వారందరికి సంతృప్తికరమైన లాభాలను తెచ్చిపెట్టిన చిత్రంగా నాయక్ వ్యాపార వర్గాల నుండి అభినందనలను అందుకుంటుంది.
Labels:
Nayak,
Nayak 50days,
News,
Ram Charan,
V V Vinayak
గుండెలను గల్లంతు చేస్తున్నా నితిన్
ఇష్క్ సినిమాతో దారిలో పడ్డా యువ హీరో నితిన్ ఆ జోరును కొనసాగించటానికి అందుబాటులో ఉన్నా అన్ని అవకాశాలను ఓ పద్దతిగా వాడుకుంటూ తనదైనా ముద్రను టాలీవుడ్ ఫై వేసేందుకు సమాయత్తం అవుతున్నాడు. యాక్షన్ హీరో ఇమేజ్ ను ప్రస్తుతానికి అటకఫై పెట్టి తెలుగు సినిమాలకు లవర్ బాయ్స్ కొరతను తీర్చే పనిలో నిమగ్నమైనా ఈ కుర్ర హీరో తన తరవాతి చిత్రంతో అమ్మాయిల గుండెలను గల్లంతు చేయటానికి అన్ని రకాల ఆయుధాలు సమకూర్చుకుంటున్నాడు.
ప్రభాస్ ఇక 40 కోట్ల హీరో...!
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ఇప్పటి పద్దతి ప్రకారం స్టార్ హీరోగా తన మార్కెట్ కు సరి కొత్త బెంచ్ మార్క్ ను సెట్ చేసి టాలీవుడ్ లో తన స్థానానికి సరి కొత్త నిర్వచనాన్ని ఇచ్చాడు. మిర్చి మూడు వారల వసూళ్ళు 40 కోట్లు దాటటంతో తెలుగు సినిమా పరిశ్రమలో 40 కోట్ల క్లబ్ లో చేరిన నాలుగో స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు.
Tuesday, February 26, 2013
ఎన్టీఆర్ ఫై కౌంటర్ కు కోన ఎన్ కౌంటర్
ఏదో వైపు నుండి రూమర్లు పుట్టటం, వాటి స్థాయిని బట్టి అవి సంచలనాలు సృష్టించటం అనేది సినిమా పరిశ్రమలో అతి సాదారణమైనా విషయం. వాటిని కొంతమంది పట్టించుకోరు, కొంతమంది ఖండిస్తారు, మరికొంతమంది వాటిని తప్పని నిరూపించే వరకు నిద్రపోరు. ప్రస్తుతం ఓ న్యూస్ చానల్ మొదలు పెట్టిన రూమర్ ను అసత్యం అని నిరూపించే పనిలో నిమగ్నమై ఉన్నాడు బాద్ షా రచయత కోన వెంకట్.
జబర్దస్త్ భ్రమలో సిద్దార్థ్
జబర్దస్త్ సినిమా జబర్దస్త్ గా హిట్ కొట్టిందని తన పిలుపు వినిపించేంత మేర అరిచి మరీ చాటింపెస్తున్నాడు అరవ సోదరుడు సిద్దార్థ్. నిర్మతలాగా లాజిక్ కు దూరంగా ఉన్న లెక్కలతో మ్యాజిక్ చెయ్యాలని చూస్తున్నా సిద్దు ప్రయత్నాన్ని ఎవరు పెద్దగా పట్టించుకోవటంలేదు కాని పట్టించుకున్న కొద్దిమంది మాత్రం ముక్కున వేలేసుకుంటున్నారు.
Monday, February 25, 2013
ఇంకా తీరని చిరంజీవి 'అభిలాష'
ఎంత సాదించినా, ఎంత ఎత్తుకు ఎదిగినా సంతృప్తి చెందకపోవటం అనేది మనిషి నైజం. ప్రతి కోరికకు సంబంధించి కేవలం ప్రయత్నం మాత్రమే మనిషిది, అది నెరవేరుతుందా..? లేదా..? అన్నది ఎవరి చేతుల్లోను లేని విషయం. మెగాస్టార్ గా ఎవరెస్ట్ శిఖరం అంత ఎత్తుకు ఎదిగిన చిరంజీవి కూడా ఈ సూత్రానికి అతీతుడు కారు. అయన జీవితంలో ఎన్నో కోరికలను జయించి ఉండవచ్చు.అలానే కొన్ని కోరికల ఆశయాలు ఇంకా నెరవేరక పోయి ఉండవచ్చు.
Sunday, February 24, 2013
పాత కృష్ణ వంశీ మళ్లీ వస్తున్నాడా...?
పాత కృష్ణ వంశీ మళ్లీ వస్తున్నాడా...? వస్తున్నాడనే అనిపిస్తుంది నానిని హీరోగా పెట్టుకుని ఆయన రూపొందిస్తున్నా 'పైసా' చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్స్ చూస్తుంటే...! ఈ రోజు నాని పుట్టిన రోజును పురస్కరించుకుని పైసా రూపకర్తలు బయటకు వదిలిన పోస్టర్స్ సర్వత్ర ఆసక్తిని కలిగిస్తున్నాయి.
శృతి మించిన 'నితినా'భిమానం
అభిమానం పలు రకాలు , అందునా సినిమా అభిమానం లెక్క లేనన్ని రకాలు..! వెర్రాభిమానం, వీరాభిమానం, భీభాత్సాభిమానం, పవనాభిమానం. ప్రత్యేకంగా పవనాభిమననేదే ఒక రకం.. ఎందుకంటే పవన్ ను అభిమానించటానికి కారణం అవసరం లేదు కటౌట్ ఉంటే చాలు. పవన్ కళ్యాణ్ కు ఉన్నటువంటి అభిమానులు ఇతర హీరోలకు ఉండటం చాలా అరుదు. అలాంటిది ఓ అరుదైనా అభిమానిని దక్కించుకున్నా నితిన్ బోర్డర్ దాటినా అభిమానం ఇచ్చే కిక్ ను ఎంజాయ్ చేస్తున్నాడు.
Saturday, February 23, 2013
వెరైటీ టైటిల్ తో పవన్ సంచనలం
పవన్ కళ్యాణ్ కు సంబందించినదిగా చెప్పుకుంటున్నా ఓ సినిమా టైటిల్ ప్రస్తుతం ఫిలిం నగర్ లో సంచలనం సృష్టిస్తుంది. ఓరినీ అసాద్యంకూల.. టైటిల్ కే సంచలనం ఏమిటి అని తీసి పారేయొద్దు.... మీరూ కూడా ఆ టైటిల్ వింటే ముందు బ్లాంక్ పేస్ పెడతారు తరవాత బుర్ర బద్దలు కొట్టేసుకుంటారు.
దెయ్యంగా మారిన ఐటెం బేబి
కెరీర్ మొదట్లో 6టీన్స్ , గర్ల్ ఫ్రెండ్ చిత్రాలలో ఐటెం గర్ల్ గా కనిపించి తెలుగు ప్రేక్షకులను అలరించిన రాఖి సావంత్ ఆ ఫై హిందీ చిత్ర పరిశ్రమలో తన ప్రవర్తనతో రెబెల్ ఐటెం గర్ల్ గా పేరు తెచ్చుకుని ప్రస్తుతం నేషనల్ ఫిగర్( అంటే రూపము అని మాత్రమే తెలుగు అర్ధం, అంతే కాని వేరే అర్ధాలను వెతకవద్దని మనవి) అయ్యి కూర్చుంది. వివాదాల వనితగా బాలీవుడ్ ఈమెను విస్మరించినా, హిందీ టెలివిజన్ పరిశ్రమ మాత్రం అమ్మడి వితండ పోకడను కమర్షియల్ చేసి క్యాష్ చేసుకుంటుంది. అందులో భాగమే ఈ దెయ్యం రూపం.
సునీల్ డాన్సుల పబ్లిసిటీ
ఒకప్పుడు సునీల్ కామెడీ బైట్స్ సినిమా ప్రచారానికి భలే ఉపయోగపడేవి. కాని ఇప్పుడు అతని డాన్సులు ప్రధానమైన ప్రచార అస్త్రాలుగా మారి సినిమాను నిలబెట్టే స్థాయికి ఎదిగాయి. ప్రస్తుతం సునీల్ డాన్సుల అంశాన్నే ప్రత్యేకంగా తీసుకుని సినిమాను గట్టేక్కించుకునే పనిలో పడ్డారు మిస్టర్ పెళ్లి కొడుకు సినిమా రూపకర్తలు.
జాక్సన్ కా బాప్ రామ్ చరణే ..!!!?
'జాక్సన్ కా బాప్ ' అమ్మో.. అంత పెద్దమాటే...! కనీసం జాక్సన్ తో పోల్చటానికే వెనుక ముందు ఆలోచిస్తూ ఉంటారు, చివరికి ప్రభుదేవా అంతటి డాన్సర్ నే ఇండియన్ మైఖేల్ జాక్సన్ అనే పదానికే పరిమితం చేశారు. అలాంటిది ఒక హీరోకు జాక్సన్ కా బాప్ అని కాంప్లిమెంట్ రావటం మామూలు విషయం కాదు. ఇంత పెద్ద ప్రశంశను దక్కించుకుని ప్రస్తుతం వార్తల్లో విహరిస్తున్నా వ్యక్తీ మరెవరో కాదు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.
Friday, February 22, 2013
Jabardasth Movie Review
Listen Voice Review
అలామొదదలైంది సినిమాను తన బ్రాండ్ నేమ్ గా మార్చేసుకున్న నందిని రెడ్డి తెలుగు సినిమా పరిశ్రమలో తరచుగా వినపడే ద్వితీయ విగ్నాన్ని దాటటానికి హిట్టుల కోసం విలవిల్లాడుతున్నా తమిళ తమ్ముడు సిద్దార్దను వెంటేసుకుని జబర్దస్త్ గా సందడి చేస్తానంటూ ఈ వారం సినిమా హాళ్ళకు వచ్చింది. సిద్దార్థ్ మినహా సినిమా దర్శకరాలు, నిర్మాత సురేష్, హీరోయిన్ సమంతా ప్రస్తుతం మంచి ఫామ్ ఉన్నారు, లక్ కిక్ ను ఎంజాయ్ చేస్తున్నారు. మరీ వీళ్ళందరూ కలిసి లక్ ను సిద్దార్థ్ కు అంటిస్తారో..... లేక సిద్దార్థ్ వీళ్ళందరికి తన బాడ్ లక్ ను అంటిస్తాడో ఈ సినిమా ఫలితం తెల్చేస్తుంది. ఇక లేటు ఎందుకు అసలు ఈ సినిమాలో జబర్దస్త్ అనిపించుకునే అంశాలు ఏమున్నాయో మన సమీక్షలో చూద్దాం పదండి...!
కొత్తగా ఆదరగోడతానంటున్నా మహేష్
మీరు గమనించారో... లేదో.. ఈ వేళ ఏదోటి ఆదరగోడదాం ..! అంటూ మహేష్ కనిపించే థమ్స్ అప్ టీవీ కమర్షియల్ ఈ మధ్య రావటంలేదు. దానికి బదులు సల్మాన్ దబాంగ్ కోటెడ్ కమర్షియల్ వస్తుంది. ఇలా జరగటానికి కారణం ఏమిటా అని కొందరు ఒత్సహికులు అరా తీస్తూ మహేష్ చేతి నుండి థమ్స్ అప్ బ్రాండ్ జరిపోయిందేమో అని అనుమానాలు వ్యక్తం చేశారు. కాని వాటిని ఒట్టి అనుమానాలగానే తెల్చేస్తూ మహేష్ కొత్తగా ఆదరగోడతానికి సరికొత్తగా వస్తున్నాడు.
Thursday, February 21, 2013
భాగ్యనగరం ఫై మరోసారి విషం కక్కిన ఉన్మాదం
హైదరాబాద్ నగరం ఫై పైశాచికత్వంతో పెట్రేగిపోతున్నా ఉగ్రవాద ఉన్మాదం మరో సారి విషం కక్కింది. 2007 గోకుల్ చాట్ పేలుళ్ళ తరవాత ఆరు సంవత్సరాల నుండి భద్రంగా ఉందనుకున్నా జంటనగరాల ప్రశాంతత ఫై బీభత్సం విరుచుకుపడింది. ఈ ఈరోజు సాయంత్రం దిల్ షుక్ నగర్ ప్రాంతంలో చోటు చేసుకున్న మూడు వరస బాంబు పేలుళ్లు 22 మంది హైదరాబాదిలను బలి తీసుకున్నాయి. మృతుల సంఖ్యా మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయని సమాచారం.
Jabardasth Movie preview
టాలీవుడ్ కు లేడి డైరెక్టర్ కొరతను తీర్చటానికి అలా మొదలైంది అంటూ కెరీర్ ను మొదలు పెట్టిన నందిని రెడ్డి దర్శకురాలిగా తన స్తానాన్నిఇక్కడ ఫిక్స్ చేసుకోవటానికి జబర్దస్త్ అంటూ రేపు అంధ్ర దేశమంతట సందడి చేయటానికి సిద్దంఅవుతుంది. అలా మొదలైంది సక్సెస్ ను దృష్టిలో పెట్టుకుని నందిని రెడ్డి ఫై పెట్టుకున్నా అంచనాల కంటే... పాటలు, ప్రచారాన్ని దృష్టిలో పెట్టుకుని పెరుగుతున్నా అంచనాలే సినిమా ఫై ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఆ ఆసక్తిని నిజం చేసే దిశగానే జబర్దస్త్ ప్రీ రిలీజ్ టాక్ సర్వత్ర పాజిటివ్ దారిలో సాగుతుంది .
టాలీవుడ్ వరస ముద్దుల వీరుడు
తెలుగు సినిమాలలో తారల ముద్దు ముచ్చట్లు ఈమధ్య కాలంలో బాగానే సాగుతున్నాయి. టాలీవుడ్ లో అధర చుంబనాలు అరుదుగా కనిపించే పోకడకు స్వస్తి పలుకుతూ, తరచుగా కనిపించటానికి మార్గాలను సుస్థిరం చేసుకుంటున్నాయి. అందుకు అనుగుణంగా లిప్ లాక్ సంస్కృతిని తెలుగు ప్రేక్షకులకు అలవాటు చేయటానికి తన వంతు కృషి చేస్తున్నాడు మన స్టైలిష్ స్టార్.
Wednesday, February 20, 2013
స్పెయిన్ లో బన్నిని పలకరించిన బాద్ షా
సీజన్ కు అనుగుణంగా ఏ దేశం బాగుంటుందో... ఆ దేశాన్ని వెతికి పట్టుకుని మరి స్పాట్ పెడతారు మన టాలీవుడ్ బ్యాచ్...! వేసవి తాపాన్ని తీర్చుకోవటానికి స్విడ్జర్ ల్యాండ్ ను ప్రముఖంగా ఎంచుకునే మనవాళ్ళు తాజాగా స్పెయిన్ మీద పడ్డారు. ప్రస్తుతం ఎన్టీఆర్, బన్ని జాయింట్ గా స్పెయిన్ ను ఒక చూపు చూస్తున్నారు.
శ్రీమతి ఫై కురిసిన 'చిరు' ప్రేమ
చిరంజీవి సినిమా ప్రియులకు మెగాస్టార్ కావొచ్చు, రాష్ట్ర ప్రజానికానికి రాజకీయనాయకుడు కావొచ్చు, దేశ ప్రజలకు కేంద్ర మంత్రి కావొచ్చుకాని కుటుంబం విషయానికి వస్తే అయన ఒక భాద్యతగల కుటుంబ పెద్ద. అంటే ఎన్ని ముఖ్యమైన పనులతో తలమునకలై ఉన్నప్పటికీ కుటుంబంలోని అందరితోను అన్యోన్యతను పంచుకోవాల్సిన భాద్యత ఉంటుంది. కాని ప్రతిరోజూ ఆ భాద్యతను నెరవేర్చటానికి కుదరకపోవచ్చు. అందుకని కొన్ని ప్రత్యేక సందర్భాలలో వాటిని పూర్తిచేస్తూ ఉంటారు. అందులో భాగంగానే తాజాగా అనురాగం ఆప్యాయత కలగలిసిన మనసున్నా భర్తగా భార్య పట్ల తనకున్న ప్రేమను చాటుకున్నారు.
Tuesday, February 19, 2013
రాజమౌళి మాయాజాలానికి సాంపిల్
| Photo Shot By Senthil Kumar |
బాహుబలి చిత్రం కోసం అందమైన పరిసరాల వెతుకులాటలో ఉన్న రాజమౌళి అప్పుడే తన మాయాజాలాన్ని ప్రదర్శించటం మొదలుపెట్టాడు. ప్రస్తుతం రాజస్తాన్ లో ఉన్నా రాజమౌళి అండ్ టీమ్ అక్కడాషూటింగ్ కు అనుకూలమైన కోటలను పరిశీలిస్తున్నారు. అందులో భాగమే రాజమౌళి , సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ దృష్టి పదం నుండి జాలువారిన ఈ దృశ్య రమణియ్యాలు.
తనయుడి కోసం నడుంబిగించిన నాగార్జున
పరజయన్నైనా భరించవచ్చు కాని పరాభవాన్ని మాత్రం భరించటం కష్టం. సినిమా విడదలై విజయం సాదించకపోయినా పర్వాలేదుకాని అసలు షూటింగ్ పూర్తికాకుండా సినిమా నిలిచిపోయిందంటే మాత్రం పరాభవం క్రిందకే వస్తుంది.ఇప్పుడు అటువంటి విషమ పరిస్థితినే ఎదుర్కుంటుంది నాగచైతన్య కొత్త చిత్రం ఆటో నగర్ సూర్య. సినిమాను పూర్తిచేసి, విడుదల చేసే అవకాశాలు తక్కువుగా ఉన్నాయని నిర్మాతలు చేతులేత్తేయటంతో కొడుకును రక్షించేందుకు నాగార్జున నడుంబిగించారని సమాచారం అందుతుంది.
టాలీవుడ్ లో నెంబర్ ఒన్ లేడని తేల్చిన రెబెల్
అన్ని రంగాల కంటే సినిమారంగంలో నెంబర్ వన్ స్థానం గురించి ఎప్పుడూ ప్రత్యేకమైనా చర్చలు సాగుతూనే ఉంటాయి. పెద్ద రేంజ్ లో ఒక సినిమా హిట్ అయ్యిందంటే ఆ హీరోను నెంబర్ వన్ రేస్ లో నిలబెట్టి ఎవరకూ తోచినట్టు వాళ్ళు వివరణలు , విశ్లేషణలు చేసేస్తూ ఉంటారు. తాజాగా మిర్చి చిత్రం అందించిన విజయాన్ని మనస్పూర్తిగా ఆస్వాదిస్తున్నా ప్రభాస్ ను అలానే నెంబర్ రేస్ లో నిలబెట్టి టాలీవుడ్ లో అతని స్థానం గురించి వాడి వేడి చర్చలు జరుపుతున్నారు. ఈ క్రమంలో ప్రభాస్ నెంబర్ ఒన్ స్థానానికి సంబంధించి ఒక నిర్వచనాన్ని ప్రతిపాదించాడు.
Monday, February 18, 2013
రానా ఫై విక్రమ్ కు ఏడుపెందుకు ..?
దక్షిణ భారత దేశం గర్వించతగ్గ నటుడిగా మనమంతా ముచ్చట పడే తమిళ నటుడు విక్రమ్ తనలో అంతర్గతంగా ఉన్నఒక చీకటి కోణానికి ఓ జాతీయ పత్రిక వేదికగా తెర తీశాడు.నటుడిగా సకల కళలను పోషించాలన్నా రీతిగా నిజజీవితంలో అమాయకత్వం మాటున ఉన్నా ఆహాకారంతో కూడిన పొగరుబోతుతనానికి ఒక నిర్వచనాన్ని ఇచ్చి తనలో ఉన్నా కుంచిత మనస్థత్వన్ని నిరూపించుకున్నాడు. కాకపోతే అందుకు మన రానా దగ్గుబాటిని ఉదాహరణగా వాడుకోవటం మనసును భాధ పెట్టింది.
గాయని మాళవిక మనువాడెన్..!
మా టివి సూపర్ సింగర్ కార్యక్రమంతో పాటు కొన్ని మంచి మంచి పాటలతో తెలుగు ప్రజలకు సుపరిచితమైనా గాయని మాళవిక, కృష్ణ చైతన్యతో కలిసి వివాహ జీవితంలోకి అడుగుపెట్టింది. గత శుక్రవారం హైదరాబాద్ లో బంధు మిత్రుల సమక్షంలో ఒక్కటైయ్యారు ఈ జంట. శనివారం జరిగిన పెళ్లి రిసెప్షన్ లో తెలుగు సినిమా పరిశ్రమలోని పలువురు పెద్దలు హాజరయ్యి నూతన వధువరులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
Sunday, February 17, 2013
బాహుబలి కోసం దర్శకధీరుడి కసరత్తు
'బహుబలి' చిత్రాన్ని బ్రహ్మాండం గుర్తించతగ్గ చిత్రంగా మలచటానికి దర్శకధీరుడి ప్రయత్నం మొదలైంది. ఏ పనిని మొదలు పెట్టినా భగీరదుడితో సమానంగా కృషి చేసే రాజమౌళి 'బహుబలి' చిత్రీకరణకు సంబంధించి అనువైనా లోకేషన్స్ కోసం యావత్భారత దేశాన్ని జల్లెడ పడుతున్నాడు. కర్ణాటకలో మొదలైనా ఈ అందమైనా ప్రాంతాల వేట కేరళ మీదుగా పయనించి ఇప్పుడు రాజస్తాన్ చేరుకుంది.
డాన్ శీను డైరెక్టర్ బాడీగార్డ్ అయిపోయాడు
డాన్ శీను దర్శకుడు గోపీచంద్ మలినేని శ్రీ సత్య అనే అమ్మాయికి జీవితాంతం బాడీగార్డ్ గా ఉండటానికి అధికారిక లాంచనాలు పూర్తిచేసుకున్నాడు. ప్రేమికుల దినోత్సవం రోజున శ్రీ సత్యకు జీవితాంతం తోడుగా ఉంటానని వేదమంత్రాల సాక్షిగా ప్రమాణం చేసి ఆమెను తన జీవితంలోకి ఆహ్వానించి కొత్త జీవితాన్ని ఆరంభించిన శుభ సందర్భంగా గోపీచంద్ కు శుభాకాంక్షలు.
Pizza Telugu Movie Review
సినిమాలలో కొత్త కొత్త పోకడలకు, రియాలిటీ తో కూడినా ఎంటర్ టైనర్స్ కు దక్షిణాది నుండి ప్రధాన వేదికగా నిలుస్తుంది తమిళ సినీ పరిశ్రమ. కొత్తదానాన్ని సృస్టించటంలోను, ఆస్వాదించటంలోను తమిళులు ఎప్పుడు ముందడుగులే వేస్తున్నారు. అలాంటి అడుగుల్లో మరో సరికొత్త అడుగే ఈ 'పిజ్జా'. తమిళ నాట విజయ దుందుభి మ్రోగించి 2012 లో విడుదలైనా చిత్రాలలో ఉన్నతమైనా చిత్రంగా ప్రశంశలందుకున్నా పిజ్జా ఈ వారం తెలుగు నాట అడుగు పెట్టింది.
Saturday, February 16, 2013
David Movie Review
కమల్ హసన్ తరవాత ప్రయోగాల మిషన్ గా పేరు సంపాయించుకుని జయాపజయాలను పట్టించుకోకుండా నటుడిగా తన జీవితాన్ని సార్ధకం చేసుకుంటున్నా చీయన్ విక్రం ఈ మారు 'డేవిడ్' అనే పేరును మన రంగం జీవాతో కలిసి పంచుకుంటూ ఈ వారం తెలుగు ప్రేక్షకులను పలకరించటానికి వచ్చాడు. రెండు వారల క్రితమే తమిళం, హిందీలలో విడుదలైనా ఈ సినిమా కళాత్మకమైనా సినిమాగా ప్రశంశలు అందుకుంటుందికాని కమర్షియల్ గా రెండు చోట్ల ముసుగుతన్నేసింది.
బెల్లంకొండ తనయుడు బెల్లంలానే ఉన్నాడు
చిన్న స్థాయి నుండి మొదలయ్యి తెలుగునాట అగ్ర నిర్మాతగా ఠీవి చెలాయిస్తున్నా బెల్లంకొండ సురేష్ స్టార్ హీరోను తనింట్లోనే మొలిపించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. తన పెద్ద కుమారుడు సాయి శ్రీనివాస్ ను హీరోగా పరిచయం చేయటానికి సమయత్తమైనా బెల్లంకొండ సంకల్పం చూస్తుంటే శ్రీనివాస్ ను మాస్ హీరోగా నిలబెట్టేందుకు సిద్దమైనట్టే కనిపిస్తుంది.
Chammaku Chello Movie Review
ఈమద్య మరీ నల్లపూసైపోయినా కుర్ర హీరో వరుణ్ సందేశ్ తన ఉనికిని తెలియచేయటానికి 'చమ్మకు చెల్లో .." అంటూ ఈ వారం దియేటర్లకు వచ్చాడు. విజయాల లెక్కల్లో వెనక పడ్డాడుకాని చేతిలో ఉన్నా సినిమాలా లెక్కల్లో మాత్రం ఘనంగానే ఉన్నా వరుణ్ హిట్ కోసం మొహంవాచిపోయిన్నాడు. ప్రయోగాలతో విమర్శకుల ప్రశంశాలే కాని ప్రేక్షకుల చప్పట్లు కొట్టించుకోవటంలో కాస్తా దూరాన్ని మైంటైన్ చేస్తున్నా నీలకంఠ ఈసారైనా కోలుకుని వరుణ్ కు హిటానందాన్ని అందించగలిగాడో..? లేదో..? మన సమీక్షలో చూద్దాం.
Friday, February 15, 2013
Thursday, February 14, 2013
Okkadine Movie Review
Listen Okkadine Voice Review
హీరోగా కంటికి అనీ అననట్టు కనిపించే నందమూరి వారి చిటికిన వేలు చుట్టం రోహిత్ తెలుగులో హీరోగా స్థిరపడటానికి పడుతున్నా శ్రమలో భాగంగా 'ఒక్కడినే' అంటూ ఈ వారం దియేటర్లకు వచ్చాడు. 'సోలో' ను హిట్ సినిమానే అనిపించుకున్నా నారా వారబ్బాయి ఇప్పుడు మార్కెట్ క్రియేట్ చేసుకునే ప్రయత్నంలో మాస్ సినిమాల భరతం పట్టే పనిలో పడ్డాడు. అందుకు తోలి అడుగు ఈ చిత్రం అనే అంశం మినహా ఈ ఒక్కడినే గురించి ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి కనబరచిన దాఖలాలు లేవు. ఆ కోణాన్ని పరిశీలనలోకి తీసుకుని ఈ 'ఒక్కడినే' రోహిత్ కెరీర్ కు ఎంతవరకు తోడ్పాటు నిస్తుందో మన సమీక్షలో చూద్దాం.
హీరోగా కంటికి అనీ అననట్టు కనిపించే నందమూరి వారి చిటికిన వేలు చుట్టం రోహిత్ తెలుగులో హీరోగా స్థిరపడటానికి పడుతున్నా శ్రమలో భాగంగా 'ఒక్కడినే' అంటూ ఈ వారం దియేటర్లకు వచ్చాడు. 'సోలో' ను హిట్ సినిమానే అనిపించుకున్నా నారా వారబ్బాయి ఇప్పుడు మార్కెట్ క్రియేట్ చేసుకునే ప్రయత్నంలో మాస్ సినిమాల భరతం పట్టే పనిలో పడ్డాడు. అందుకు తోలి అడుగు ఈ చిత్రం అనే అంశం మినహా ఈ ఒక్కడినే గురించి ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి కనబరచిన దాఖలాలు లేవు. ఆ కోణాన్ని పరిశీలనలోకి తీసుకుని ఈ 'ఒక్కడినే' రోహిత్ కెరీర్ కు ఎంతవరకు తోడ్పాటు నిస్తుందో మన సమీక్షలో చూద్దాం.
Wednesday, February 13, 2013
హిట్ సినిమాకు బూతు పరీక్ష
సెన్సార్ బోర్డ్ తో కలిసి ప్రభుత్వం కొత్తగా తీసుకుచ్చిన కొన్ని మార్పులు గీత దాటుతున్నా సినిమాలకు పరీక్షలు పెడుతున్నాయి. 'ఎ' రేటింగ్ సినిమాలకు దియేటర్లలో పిల్లలకు ప్రవేశం లేదని చెప్పటమే కాకుండా ఆ రెంటింగ్ సినిమాలు టివి లో కనిపించాలంటే అభ్యంతరకర సన్నివేశాలు తొలగించి ప్రదర్శించాలంటుంది చట్టం. ఈ పాయింట్ ను పట్టించు కోకుండా పరిది మీరిన సినిమాలు శాటిలైట్ హక్కులు అనబడే కష్టం లేని రాబడిని వదులుకునే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. తాజగా ఈ సంకట స్థితిని ఎదుర్కుంటుంది 'బస్ స్టాప్ ' సినిమా.
'మిర్చి' చేసిన స్టార్
ఖడ్గం సినిమాలో కృష్ణ వంశీ చెప్పించినట్టు 'ఒక్క ఛాన్స్..ఒకే ఒక్కచాన్సు .." అన్నా మాటకు నిజజీవితంలో ఏంతో ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా సినీ ప్రపంచంలో ఒక్క ఛాన్స్ ..! ఎన్నో జీవితాలను మార్చేసింది. అప్పటి వరకు అతను ఎవరో కూడా సరిగా తెలియని వ్యక్తీ సరైనా ఛాన్స్ ఒకటి తగిలి రాత్రికి రాత్రే పెద్ద స్టార్ గా ఎదిగిపోయినా సంఘటనలు ఈ రంగుల ప్రపంచంలో కోకొల్లలు. తాజాగా ఒక్క ఛాన్స్ ప్రభావంతో ఆంద్ర రాష్ట్రమంతట పాపులారిటి సంపాయించుకున్నా పేరు 'కొరటాల శివ'.
నమ్మండి ప్లీజ్..! అంటున్నా పవన్ కళ్యాణ్ నిర్మాత
నమ్మండి ప్లీజ్ అని అర్ధం వచ్చేలా పవన్ కళ్యాణ్ ప్రాణం పోసిన నిర్మాత బండ్ల గణేష్ చేసిన వేదన భరిత విజ్ఞప్తిని చదువుతుంటే మనసు మంచులా కరిగిపోతుంది. సినిమా పరిశ్రమ అంటే కష్టాలుంటాయి.. ఫేమ్ వస్తే మ్యాజిక్ లు జరుగుతాయి.. ఉన్నపళంగా కోట్లకు పడగలెత్తుతారు. ఇది జగమెరిగిన సత్యం. ఇలా అన్ని తెలిసి కూడా వేదనలకు దిగటం భాద కలిగిస్తుందని గణేష్ బాబు కలవరపడుతున్నాడు.
Tuesday, February 12, 2013
పవర్ స్టార్ ను హైజాక్ చేస్తున్న తమిళ పవర్ స్టార్
ఇప్పటివరకు పవర్ స్టార్ అంటే ఇండియా మొత్తానికి, దాదాపు ప్రపంచం మొత్తానికి ఒకే ఒక్కడు కనిపించేవాడు. అది మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. కన్నడలో కూడా ఓ పవర్ స్టార్ ఉన్నాడుకాని ఎప్పుడు పవన్ కళ్యాణ్ క్రేజ్ ను డామినేట్ చేసిందే లేదు. కాని ఇప్పుడు పవర్ స్టార్ అనే బిరుదును మొత్తంగా కొట్టేయటానికి ఒక సునామి తమిళనాడు నుండి సూపర్ ఫాస్ట్ గా దూసుకొస్తుంది.
రానా రగిల్చిన చిచ్చు
కాలక్రమేణ వచ్చే మార్పులను దగ్గుబాటి వారి కుటుంబం అందిపుచ్చుకుంటున్నంత త్వరగా తెలుగు సినీ పరిశ్రమలో మిగత వాళ్ళు అందుకోలేకపోతున్నరనే చెప్పాలి. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంతో అంతరించి పోయిందనుకున్నా స్టార్ హీరోలా మల్టీస్టారర్ సినిమాలకు మళ్లీ శంకుస్థాపన చేసి ముందడుగు వేసిన ఘనత వెంకటేష్ బాబుకే దక్కుతుంది. ఒక్కడుగుతోనే వదిలేయకుండా వరసెంబడి బహు కధానాయకుల సినిమాలు చేయటానికి ఉత్సాహాన్ని కనబరుస్తూ మిగత వారికి ఆసక్తి కలిగిస్తున్నారు వెంకీ. అదే క్రమంలో దగ్గుబాటి వారి యువతరం వారసుడు రానా మరో మార్పుకు స్వాగతం పలుకుతూ టాలీవుడ్ లో బాలీవుడ్ ఒరవడికి శ్రీకారం చుడుతున్నాడు.
Monday, February 11, 2013
మెగా హీరో ఎంట్రీకి 'గొల్లభామ'..?
మెగా సంస్థానం నుండి మరో యువ మెగాస్టార్ ఎంట్రీకి పావులు కదుల్తున్నా సంగతి తెలుగు సినిమాతో పరిచయం ఉన్నా వారందరికి తెలిసిందే..! మెగా తమ్ముడు నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ అరంగేట్రానికి శుభ ఘడియలు దగ్గర పడ్డాయనే సంకేతాలు ఈ మద్యనే సూచనా ప్రాయంగా బయటకు వచ్చాయి. ఇప్పుడు ఆ సినిమా టైటిలే అంటూ బయటకు వచ్చిన 'గొల్లభామ' కొత్త సంచలనాలకు అవకాశం ఇస్తుంది.
Subscribe to:
Comments (Atom)



























